Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

పుట్టిన తేదీ లేని జాతకులు ఏమి చేస్తే గ్రహ బాధలు తొలగుతాయి? Graha Dosha Nivarana - Dharma Sandehalu

పుట్టిన తేదీ లేని జాతకులు ఏమి చేస్తే గ్రహ బాధలు తొలగుతాయి?

కొందరికి జన్మించిన తేదీ, సమయం తెలియదు. వారి పెద్దలు చెప్పే కొండ గుర్తుల ద్వారా కొంతవరకు సంవత్సరం, తేదీ, నక్షత్రం వంటివి నిర్ధారించవచ్చు. 

అయితే, జన్మ కుండలి వేయడం దీనివల్ల సాధ్యం కాదు. కేవలం రాశి ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు. జాతకం లేని వారికి శాంతులు అంటే జన్మించిన సమయం లేని వారికి. అయితే జాతకం ఉన్న వాళ్ళుకూడా చేసుకోవచ్చును.

ఆదిత్య హృదయం: 

ఇది సూర్యునికి సంబంధించినది. ఈ ఆదిత్య హృదయం రామ రావణ యుద్ధ సమయంలో అగస్త్య మహర్షి రామునికి ఉపదేసించినాడు. దీనిని రోజూ ప్రాతః సమయమున పటించుట వలన ఆయురారోగ్యాలను, అష్ట ఐశ్వర్యాలను పొందుతారు. ఇంకా.. మనిషిలో దాగిఉన్న కామ,క్రోధాది అంతః శత్రువులను నాశనం చేస్తుంది. పాపాలను నాశనం చేస్తుంది. చింతల నుంచి, దుఃఖముల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ప్రతి నిత్యం జపిస్తే విజయం తప్పక లభిస్తుంది. ఇది పఠించిన పిదపనే రాముడు, రావణుని పై విజయం సాధించాడు. గోధుమలతో చేసిన పదార్ధములు, క్యారెట్, రాగి చెంబులో నీళ్లు తాగడం వలన కూడా సూర్య గ్రహా దోషాలు తొలుగుతాయి.

రుణ విమోచక అంగారక(కుజ) స్తోత్రం: 

జీవితంలో మనకు ఎదురైనా అనేక ఇబ్బందులకు అప్పులు చేస్తూ ఉంటారు. వాటిని తీర్చలేక ఇబ్బందులు పడుతుంటే "రుణ విమోచక అంగారక(కుజ) స్తోత్రం" 41 రోజులు పారాయణ చేస్తూ , నవగ్రహాలకు రోజూ 27 ప్రదక్షిణలు చేయాలి. చివరి రోజు కందులు, ఎర్ర గుడ్డ, ధనము దక్షిణగా పెట్టి,కుజునకు మీ పేరు మీద అష్టోత్తరం చేయించండి. మీ అప్పులు తప్పక తీరు తాయి.

ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్నారా? 

మీరు "విష్ణు సహస్ర నామ స్తోత్రం" 41 రోజులు పారాయణ చేయండి. సాయంత్రం వేళ రోజూ చేస్తే ఇంకా మంచిది. చివరి రోజు విష్ణు ఆలయానికి వెళ్లి గోత్ర నామాలతో స్వామికి అష్టోత్తరం చేఇంచండి. మీ బాధలు తగ్గి వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. 

మీకు వివాహమై ఎంతో కాలమైనా సంతానము లేదా? 

మీరు ఒకసారి కాళహస్తి వెళ్లి రాహు,కేతు,కుజ గ్రహాలకు "సర్ప దోష నివారణ పూజ" చేయించండి. తర్వాత ఎక్కడైనా నాగ ప్రతిష్ట చేయించండి. కర్నాటక రాష్ట్రంలో నున్న విదురాస్వద్ధలో చేయిస్తే ఇంకా మంచిది. లేదా" సంతాన గోపాలకృష్ణ వ్రతం" నియమ నిబంధనలతో ఒకసారి మీ ఇంటిలో చేయండి. వీలుంటే రెండు శాంతి ప్రక్రియలు చేస్తే ఇంకా మంచిది. తప్పక సంతానం కలుగుతుంది.

వివాహం ఆలస్య మవుతోందా? 

మీరు "రుక్మిణి కల్యాణం" పారాయణ చేయండి. లేదా 41రోజులు , రోజుకి 41 ప్రదక్షిణలు నవగ్రహాలకు చేసి, చివరి రోజు నవగ్రహాలకు పూజ చేయండి. అయితే నవగ్రహాలకు తిరిగే మొదటిరోజు మీ కోరిక చెప్పుకొని మొదలు పెట్టండి. తప్పక వివాహము జరుగుతుంది.

ధనమునకు ఇబ్బంది పడుతున్నారా? 

ధన కారకుడైన సాయి బాబా పారాయణ 41 రోజులు చేస్తూ, ప్రతిరోజూ సాయిబాబా మందిరమునకు వెళ్లి, ఆలయమును శుబ్రపరుస్తూ(అంటే భక్తులు పారవేసిన టెంకాయ చిప్పలు, అరటి తొక్కలు, ప్రసాదం తిన్న ఆకులు) బాబాని దర్శించుకోవాలి. 41వ రోజు బూంది ఒక కిలో పావుకిలో బాబాకి నైవేద్యం పెట్టి, పేదలకు పంచండి. మీ ఇబ్బందులు తగ్గిపోతాయి. 

డబ్బు ఇబ్బందులకు ఇంకొక శాంతి ప్రక్రియ:

ప్రతి నెలలో ఒక మాస శివరాత్రి వస్తుంది. ఆ మాస శివరాత్రి రోజున శివునకు "ఏకన్యాస రుద్రాభిషేకం" చేయండి. అలాగా 8 మాస శివరాత్రులు శివునకు రుద్రాభిషేకాలు చేయించండి. మీ ధన ఇబ్బందులు తప్పక తొలిగి పోతాయి. ధనము బాగా సంపాదించాలి అనుకున్న నిత్యమూ "శ్రీ సూక్తము" పారాయణ చేయవలెను.

హనుమాన్ చాలీసా:

హనుమంతుడు కల్పవృక్షం లాంటి వాడు. కల్పవృక్షాన్ని ఆశ్రయించిన అన్ని కోరికలు క్షణంలో నెరవేరుతవి. అటువంటి కల్పవృక్షం దరికి చేర్చగల చక్కని సులభమైన మార్గం "హనుమాన్ చాలీసా". ఈ హనుమాన్ చాలీసాను దినమునకు 11 పర్యాయములు చొప్పున మండలం(40 రోజులు) పారాయణం చేసిన సర్వ కార్యసిద్ధి కలుగును. ఒకే ఆసనమున కూర్చుని 108 పర్యాయములు పఠించిన విశేష కార్యసిద్ధి కలుగును. 

నిత్యమూ 3 వేళలా ఒక పర్యాయము చదివిన వారి యోగక్షేమములు భక్త రక్షకుడగు శ్రీ హనుమంతునికృపచే శుభములు కలుగును. సమస్త గ్రహదోషాలు పోవాలి అంటే ప్రతిరోజు రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయాలి.

రక్త హస్తాలతో ( కాళీ చేతులతో ) గుడికి వెళ్లవద్దు.

నిష్ఠతో చేస్తే తప్పక శుభాలు కలుగుతాయి జై శ్రీమన్నారాయణ.

Famous Posts:

కొత్త కోడలు రాగానే సత్యనారాయణ వ్రతం ఎందుకు చేయిస్తారు?

మంగళ, శుక్రవారాల్లో ఎవరికీ డబ్బు ఇవ్వకూడదా? 

భర్త భార్య మాట వినాలంటే ఏమి చేయాలి ? 

వాస్తు ప్రకారం ఈ మార్పులు చేసుకుంటే సంపదలు పెరుగుతాయి.

శివుడు చెప్పిన ‘ఆదివిద్య’లు

శివ గుణాలు లోకానికి సందేశాలు

భార్యలు భర్తల కాళ్లను వత్తాలట ఎందుకో మీకు తెలుసా ?

కూతురా కోడలా ఎవరు ప్రధానం...?

గ్రహ దోషాలు, birth remedies, graha dosha nivarana mantra, doshalu in telugu, graha dosha by date of birth, shanti nakshatra list in telugu, Venus Malefic Effects

Comments

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు