Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

లోకంలో మరే ఇతర గ్రంధాలకి లేని విశిష్టత ఒక్క 'భగవద్గీత' కు మాత్రమే ఉంది. ఏమిటా విశిష్టత? The importance of the Bhagavad-Gita

లోకంలో మరే ఇతర గ్రంధాలకి లేని విశిష్టత ఒక్క 'భగవద్గీత' కు మాత్రమే ఉంది.

1) ఏమిటా విశిష్టత.

అవతారమూర్తులు,మహర్షులు,మహానుభావులు జన్మించినప్పుడు వారివల్ల లోకానికి మహోపకారం కలుగుతుంది. ఆ మహానుభావులు  లోకానికి చేసిన మహోపకారానికి కృతజ్ఞత గా వారి జన్మదినాన్ని 'జయంతి' గా జరుపుకుంటారు.

అలాగే భగవద్గీత వల్ల లోకానికి చేకూరిన మహోపకారం వల్ల 'గీతాజయంతి' ని జరుపుకుంటారు. ప్రపంచం లో ఏ ఒక్క ఇతర గ్రంధానికి కూడా జయంతి లేదు.

2)ఏమిటి భగవద్గీత వల్ల లోకానికి కలిగిన ప్రయోజనం.

సుమారు 5200 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుని మహానిర్వాణం సమీపిస్తున్న సమయంలో..

కలియుగం కారుమేఘం లాంటి అజ్ఞనం తో ప్రవేశిస్తున్న తరుణంలో..ఆ అజ్ఞనపు గాఢాంధకారాన్ని చీల్చుకుంటూ..మానవజాతి పై వెలుగులు విరజిమ్ముతూ  భగవద్గీత ఉదయించింది.

3) ఏముంటుంది ఈ భగవద్గీత లో.

ఏది తెలిస్తే మానవుడికి  ఇంక మరేదీ తెలియాల్సిన అవసరం లేదో...ఏది ఆత్మ, పరమాత్మ ల తత్వాన్ని సమగ్రంగా వివరించగలదో..ఏది మనిషిని ముక్తి మార్గం వైపుకి నడిపించగలదో..అదే ఉంటుంది.

నూనె రాస్తే రోగాలు పోతాయి..దయ్యాలు వదిలిపోతాయి లాంటి మూఢనమ్మకాలు ఉండవు.

నన్ను నమ్మని వాన్ని చంపండి అనే ఉన్మాదం ఉండదు. నన్ను దేవుడిగా ఒప్పుకోనివాన్ని నరకంలో వేసి కాలుస్తా అనే పైశాచికత్వం ఉండదు.

4) భగవద్గీత చదివితే వైరాగ్యం కలిగి జీవితం పై ఆసక్తి పోతుందా.

భగవద్గీత విన్న అర్జునుడు అడవులకి పోలేదు..

గాంఢీవాన్ని ధరించి కదనక్షేత్రానికి వెళ్లాడు.

భగవద్గీత కర్తవ్య విముఖుడు ఐనవాడిని   కర్తవ్యోన్ముఖుడిని చేస్తుంది.

5)భగవద్గీత  శాస్త్రీయ గ్రంధమా.

ప్రపంచం లో ఉన్న ప్రముఖ శాస్త్రవేత్తలందరూ భగవద్గీత ని కోట్ చేసినవాళ్ళే..భగవద్గీత ని మొదటిసారి  చదివిన రోజు నా జీవితంలో అత్యంత అమూల్యమైన రోజు  అని బహిరంగంగా ప్రకటించిన వాళ్ళే.

6) ఇంత ఉన్నతంగా ఉంటే భగవద్గీతే  ప్రపంచం లో మొదటి స్థానం లో ఉండాలి కదా..ఇతర మత గ్రంధాలు ముందు వరసలో ఉన్నాయని అంటున్నారు...?

కలియుగం లో అజ్ఞనానికి ఆదరణ ఎక్కువ ఉండటం సహజం.విదేశీయుల్లా కత్తి పట్టుకుని,రక్తపాతం సృష్టించి భారతీయులు భగవద్గీతని ప్రచారం చేయలేదు.

బ్రిటిష్ వాళ్లు, మొహమ్మదీయులు మతవ్యాప్తి కోసం ప్రపంచం పై చేసిన దండయాత్రలు, తద్వారా జరిగిన విద్వంసం ..చరిత్రలో సజీవ సాక్ష్యాలుగా నిలిచే ఉన్నాయి.

వారు కొన్ని  వందల సంవత్సరాల పాటు  భారతదేశం పై దాడులు చేసి, దురాక్రమణలు చేసి, ప్రలోభపెట్టినా చేయలేని పనిని..ఇస్కాన్ వారు అతి తక్కువ కాలంలోనే భగవద్గీత ని ప్రచారం చేయడం ద్వారా  కొన్ని కోట్లమంది పాశ్చాత్యులని  కృష్ణభక్తులుగా మార్చారు.

ప్రపంచం ఇప్పుడు భగవద్గీత వైపు మనోవేగం తో పరుగులు తీస్తుందనడానికి ఇదే నిదర్శనం.

Famous Posts:

సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఇన్ని లాభాలు

ఈ రాశులవారు జీవితంలో డబ్బు హోదాలతో ఉన్నత స్థితిలో ఉంటారు

ఈ ఉంగరం ధరిస్తే అన్ని శుభాలే

అదృష్టాన్ని తెచ్చి పెట్టే నవబ్రహ్మ ఆలయం

> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి

100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం

> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం

అందరు తప్పక చదవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం

Bhagavad-Gita, bhagavad gita importance in telugu, importance of bhagavad gita in daily life iskcon, relevance of bhagavad gita, importance of bhagavad gita in hinduism, bhagavad gita slokas

Comments

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు