Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడానికి కేవలం మానవ సంకల్పం సరిపోదు | Sri Kanchi Kamakshi Amman Temple

ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడానికి కేవలం మానవ సంకల్పం సరిపోదు తల్లి సంకల్పమే ప్రధానం - దర్శనంతోనే కష్టాలను తీర్చే అమ్మవారు..

హిందూ ధర్మంలో శివకేశవులతో సమానంగా అమ్మవారు కూడా వివిధ రూపాయల్లో పూజలను అందుకుంటుంది. తనను నమ్మి కోరి కొలిచిన భక్తులపై కరుణ చూపిస్తూ.. కాపాడుతుందని భక్తుల నమ్మకం.

కాంచీపురంలో వెలిసిన  కామక్షి తల్లిని దర్శించుకోవడానికి ఎన్ని సార్లు భక్తులు సంకల్పించుకున్నా.. వెళ్లలేరని.. కంచి కామక్షి తల్లిని దర్శించుకోవడానికి కేవలం మానవ సంకల్పం సరిపోదు తల్లి సంకల్పమే ప్రధానం. ఇది గొప్ప విశేషం.

సమస్త భూమండలానికి నాభి స్థానమే కాంచీపురం. మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు మన నాభినుండే తల్లి పోషిస్తుంది. అందుకే కామక్షి తల్లిని దర్శించుకున్న వారిని కష్టం లేకుండా పోషిస్తుంది.

ప్రపంచంలో ఎక్కడా దర్శించలేని విధంగా అమ్మను ఇక్కడ "సుగంధ కుంతలాంబ" అవతారంలో దర్శించవచ్చు.

(ముత్తైదువులకు అఖండ సౌభాగ్యం లభిస్తుంది. )

ప్రపంచంలో ఎక్కడా దర్శించలేని విధంగా ఇక్కడ "ఢంకా

వినాయకుడు" దర్శనమిస్తాడు.

(ఏకాంబరేశ్వర,సుగంధ కుంతలాంబ కళ్యాణ మహోత్సవాన్ని ఢంకా భజాయింపుతో అందరికీ తెలియజేస్తాడు)

కామాక్షి తల్లి ఆలయంలో "అరూప లక్ష్మి" దేవి దర్శనమిస్తుంది. కామాక్షితల్లిని అర్చించిన తరువాత పూజారి మనకిచ్చిన కుంకుమ ప్రసాదాన్ని అరూప లక్ష్మి తల్లికి ఇచ్చి దాన్నే ప్రసాదంగా తీసుకుంటే భర్తను నిందించిన దోషం పొతుంది , మరియు స్త్రీపురుషులు ఎవరైనా సరే ఇక్కడ అరూప లక్ష్మి తల్లిని దర్శించుకుంటే తప్పకుండా శాపవిమోచనం అవుతుంది.

కాత్యాయనీ దేవి పరమేశ్వరుణ్ణి భర్తగా పొందడానికి తపస్సు చేసిన క్షేత్రం కాంచిపురం. తపస్సులో భాగంగా శివకల్పితమైన గంగా ప్రవాహాన్ని తట్టుకొని సైకతలింగాన్ని రక్షించుకునే ప్రయత్నంలో లింగాన్ని తన ఆలింగనంతో(కౌగిలితో) కాపాడుకుంటుంది . అలా ఆలింగనం చేసుకున్నప్పుడు అమ్మ గాజుల మరియు కుచముల ముద్రలు ఇప్పటికీ అక్కడ శివలింగం పై అగుపిస్తాయి.

కామాక్షిదేవి ప్రధాన ఆలయానికి ప్రక్కనే ఉన్న ఉత్సవ కామక్షి తల్లికి ఎదురుగా ఉన్న గోడలో తుండిర మహారాజు, శివుడి నంది ఎలాగో అమ్మకు అలా ఎదురుగా ఉంటాడు. (తనను నమ్మినవారికి ఎంతటి మహోన్నత స్థానాన్నైనా అనుగ్రహించగలదు కామక్షి)

అమ్మధ్యానంలో, "శోకాపహంత్రీ సతాం" అనే దివ్య వాక్కు

గురించి వర్ణణ ఉంది. ఎవరైతే సతతం మనః శుద్ధితో అమ్మను ధ్యానించే సత్పురుషులు ఉంటారో, అలాంటి వారి దుఃఖాన్ని పోగొట్టడానికి తల్లి ఎల్లపుడు సిద్ధంగా ఉంటుంది . తనయొక్క కరుణను కురిపించి ఆదుకుంటుంది , భుజం తట్టి నేనున్నాని ధైర్యం చెబుతుంది.

కావున భక్తులెల్లరు కామాక్షితల్లిని దర్శించి పునీతులు కాగలరని మనవి..

Famous Posts:

సాంబ్రాణి ధూపం వేయడం వల్ల కలిగే లాభాలు?

కాకికి అన్నం ఎందుకు పెట్టడం ?

మీకు ఏదైనా సమస్య ఉందా అయితే వెంటనే ఈ స్వామి వారికి ఉత్తరం రాయండి 

సంతానం కోరుకునే వారికీ కచ్చితమైన పరిష్కార మార్గం 

మీరు చేసే పూజకు రెట్టింపు ఫలితం రావాలంటే ఇలా చేయండి.

భస్మధారణ అంటే ఏమిటి? దాని వల్ల కలిగే లాభాలు ఏంటి?

మహాభారతం నుండి నేరచుకోవలసిన 12 ముఖ్యమైన విషయాలు.

భారతీయులు ప్రతి ఒక్కరూ  తెలుసుకోదగినవి అద్భుతమైన దేవాలయలు

కంచి కామాక్షీ, విష్ణు కంచి, Kanchi temple, తమిళనాడు దేవాలయాలు, Kanchipuram temple,  kanchi kamakshi story, kanchi kamakshi miracles, Kanchi

Comments