Drop Down Menus

గర్భం దాల్చిన వాళ్లకి చక్కని ప్రసవం, సంతాన భాగ్యం కోసం గర్భ రక్షాంభిక స్తోత్రం | Garbha Rakshambika Stotram - Mantra for Safe Pregnancy

గర్భరక్షాంభికా స్తోత్రం..

గర్భరక్షాంబికా అంటే గర్భములో ఉన్న శిశువును, ఆ గర్భం దాల్చిన తల్లిని కాపాడే అమ్మలగన్న యమ్మ చాల పెద్దమ్మ. పార్వతీ మాతయే గర్భారక్షాంబికా అమ్మగా పిలవబడుతోంది. అమ్మ వారు కేవలం గర్భం దాల్చిన వారికే కాకుండా, సంతానము లేని దంపతులకు కూడా సత్సంతానము కటాక్షిస్తుంది.

పూర్వం ఇక్కడ నిధ్రువ అనే ఒక మహర్షి ఆయన ధర్మ పత్ని వేదిక తో కలిసి ఒక ఆశ్రమం లో నివసించేవారు. వాళ్ళు ఎప్పుడూ ఈశ్వరుని పూజిస్తూ విహిత కర్మాచరణ చేస్తూ ఆ దంపతులు ఇద్దరు ఆనందంగా కాలం గడిపేవారు. అయితే వారికి ఉన్న ఒకే సమస్య సంతానము కలుగక పోవడం. సంతానము కొఱకై ఈ దంపతులు అమ్మ వారిని, తండ్రి శంకరుడిని విశేష ఆరాధన చేశారు. ఒక మంచి రోజు ఆ తల్లి గర్భం దాల్చింది. ఇలా గర్భం దాల్చిన తర్వాత, ఒక రోజు నిధ్రువ మహర్షి వరుణుడిని కలుసుకోవడానికి బయటకి వెళతారు. అప్పుడు వేదిక మూడవ త్రైమాసికం లో ఉన్నది, కొద్ది రోజులలో ప్రసవం జరగాల్సి ఉంది.

నిధ్రువ మహర్షి బయటకి వెళ్ళిన సమయంలో ఊర్ధ్వపాదుడు అనే మహర్షి ఆశ్రమమునకు వచ్చారు. అప్పటికే ఇంటి పనులలో అలసిపోయిన వేదిక విశ్రాంతి తీసుకుంటోంది, దాంతో వచ్చిన మహర్షికి అతిథి మర్యాదలు చేయలేదు, ఆయన వచ్చారని తెలియదు. ఆగ్రహం చెందిన ఊర్ధ్వ పాదుడు, ఆమె గర్భం ధరించి ఉంది అని తెలియక ఆమెను శపిస్తారు. ఆయన శాప ఫలితంగా వేదిక ఒక వింత వ్యాధితో బాధపడడం మొదలు అవుతుంది. తత్ఫలితంగా ఆమె శరీరంలోని భాగాలే కాకుండా, గర్భంలో ఉన్న శిశువు కూడా తినివేయబడడం మొదలు అయ్యింది. వెంటనే ఆమె ఎంతో ఆర్తితో బాధ పడుతూ సర్వ మంగళ స్వరూపమైన ఆ పార్వతీ మాతను ప్రార్ధిస్తుంది.

అవ్యాజకరుణామూర్తి అయిన అమ్మవారు వెంటనే ప్రత్యక్షం అయ్యి ఆ గర్భస్థ పిండమును ఒక పవిత్రమైన కుండలో ఉంచి రక్షిస్తుంది. ఈ విధం గా రక్షింపబడిన శిశువు ఆ కుండలో పెరిగి చక్కని మగ పిల్లవాడు పుడతాడు. వాడికి నైధ్రువన్ అని పేరు పెడతారు. అప్పుడే పుటిన ఈ శిశువు కి కామధేనువు తన పాలిచ్చి ఆకలి తీరుస్తుంది. ఈలోగా ఆశ్రమం చేరుకున్న నిధ్రువ మహర్షి విషయం తెలుసుకుని ఎంతో సంతోషించి శివ పార్వతులను ఇక్కడే ఉండి రాబోయే తరాలలో కూడా మిమ్మల్ని ఆశ్రయించే వాళ్లకి గర్భ రక్ష కలుగజేయమని ప్రార్ధిస్తారు.

ముఖ్యవిషయం:

1.ఈ స్తోత్రాన్ని మధ్యలో ఆపివేయకూడదు.

2.మైలు సమయంలో చదవకూడదు.

3.ప్రతిరోజు ఉదయం,సాయంత్ర సమయంలో చదవడం మంచిది.

4.నియమంగా కనీసం 108 రోజులుకంటే ఎక్కువ చేయాలి.

శౌనక మహర్షి విరచిత శ్రీ గర్భరక్షా స్తోత్రం:

ఓం శ్రీ గణేశాయ నమః

ఓం శ్రీమాత్రే నమః

ఏహ్యేహి భగవాన్ బ్రహ్మన్

ప్రజా కర్తా, ప్రజా పతే

ప్రగృహ్షీణివ బలిం చ ఇమం


ఆపత్యాం రక్ష గర్భిణీమ్. ||1||

అశ్వినీ దేవ దేవేసౌ

ప్రగృహ్ణీతమ్ బలిం ద్విమం

సాపత్యాం గర్భిణీమ్ చ ఇమం

చ రక్షతాం పూజ యనయా ||2||

రుద్రాశ్చ ఏకాదశ ప్రోక్తా

ప్రగృహనంతు బలిం ద్విమం

యుష్మాకం ప్రీతయే వృతం

నిత్యం రక్షతు గర్భిణీమ్. ||3||

ఆదిత్య ద్వాదశ ప్రోక్తా

ప్రగ్రహ్ణీత్వం బలిం ద్విమం

యుష్మాగం తేజసాం వృధ్య

నిత్యం రక్షత గర్భిణీమ్. ||4||

వినాయక గణాధ్యక్షా

శివ పుత్రా మహా బల

ప్రగ్రహ్ణీష్వ బలిం చ ఇమం

సపత్యాం రక్ష గర్భిణీమ్. ||5||

స్కంద షణ్ముఖ దేవేశా

పుత్ర ప్రీతి వివర్ధన

ప్రగ్రహ్ణీష్వ బలిం చ ఇమం

సపత్యాం రక్ష గర్భిణీమ్. ||6||

ప్రభాస, ప్రభవశ్శ్యామా

ప్రత్యూషో మరుత నల

దృవూ ధురా ధురశ్చైవ

వసవోష్టౌ ప్రకీర్తితా

ప్రగ్రహ్ణీత్వం బలిం చ ఇమం

నిత్యం రక్ష గర్భిణీమ్. ||7||

పితుర్ దేవీ పితుశ్రేష్టే

బహు పుత్రీ మహా బలే

భూత శ్రేష్టే, నిశావాసే

నిర్వృతే, శౌనక ప్రియే

ప్రగ్రహ్ణీష్వ బలిం చ ఇమం

సపత్యాం రక్ష గర్భిణీమ్. ||8||

రక్ష రక్ష మహాదేవ,

భక్తానుగ్రహకారక

పక్షి వాహన గోవిందా

సపత్యాం రక్ష గర్భిణీమ్. ||9||

పై స్తోత్రమును ప్రతీ రోజూ పూజా మందిరంలో, అమ్మ వారికి కొంచెం పళ్ళు, పాలు లేదా ఏదైనా పదార్ధం నివేదన చేసి, ఈ గర్భరక్షా స్తోత్రం చదువుకోవాలి. 

పిల్లలు లేని వారికి గర్భం దాల్చడం జరుగుతుంది. గర్భం దాల్చిన వాళ్లకి చక్కని ప్రసవం అవుతుంది.ఎప్పుడూ ఎవరికీ గర్భస్రావం కావడం, పిల్లలు కలుగక పోవడం అనే సమస్య లేదు.

Famous Posts:

అదృష్టాన్ని తెచ్చి పెట్టే నవబ్రహ్మ ఆలయం

> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి

100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం

> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం

అందరు తప్పక చదవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం

ఏలినాటి శని బాధలు తప్పించే సూర్యదేవాలయం ఇదే

గోవుతో గృహప్రవేశం ఎందుకు చేయిస్తారో తెలుసా?

శుక్రవారం ఈ పనులు తప్పకుండ చేయాలి

గర్భరక్షాంభికా స్తోత్రం, Pregnancy, Garbha Raksha Stotram, garbha rakshambika stotram month wise in telugu, garbha raksha mantra for pregnancy lyrics, garbha rakshambika stotram lyrics in telugu, garbha raksha mantra download, garbha raksha mantra for pregnancy in telugu, garbha raksha mantra for pregnancy in telugu

ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON