Today Tirumala Darshan Information:

నమస్కారం హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం. టెంపుల్స్ గైడ్ కాల్ సెంటర్. కాల్ సెంటర్ వారికి జీతాలు ఇవ్వాలి కాబట్టి టెంపుల్స్ గైడ్ సభ్యత్వం ఉన్న వారికి మాత్రమే కాల్ చేసే అవకాశం ఉంటుంది. జీవితకాల సభ్యత్వం 100 రూపాయలు మాత్రమే. 8247325819 ఈ నంబర్ కు gpay లేదా ఫోన్ పే చేయగలరు.

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***అరుణాచలంలో కార్తీక మహా దీపం డిసెంబర్ 6న గురువారం సాయంత్రం 4 గంటలకు వెలిగిస్తారు.**చార్ ధామ్ యాత్ర 2022 సమాచారం : అక్టోబర్ 26న గంగోత్రి , 27న కేదార్నాథ్ మరియు గంగోత్రి ఆలయాలు మూసివేస్తారు . చివరిగా బద్రీనాథ్ ఆలయాన్ని నవంబర్ 19న మూసివేస్తారు మరల 6 నెలల తరువాత అక్షయ తృతీయ నాడు చార్ ధామ్ యాత్ర ప్రారంభం అవుతుంది. ** కాణిపాకం ఆలయ నిర్మాణం పూర్తీ అయింది దర్శనాలు జరుగుతున్నాయి.** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు . ** అరుణాచలంలో కార్తీక దీపోత్సవం 10 రోజులు జరుగుతుంది నవంబర్ 27వ తేదీ నుంచి డిసెంబర్ 6వ వరకు. మహాదీపం డిసెంబర్ 6న పెడతారు** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారు శివరాత్రి నాడు భక్తుల రద్దీ అధికంగా ఉండటం వలన ఆ రోజు చెయ్యరు. రాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

మీరు మీ పుట్టినరోజుని అర్ధరాత్రి 12 గంటలకు జరుపుకుంటున్నారా ?? Are you celebrating your birthday at 12 midnight ?

మీరు మీ పుట్టినరోజుని అర్ధరాత్రి 12 గంటలకు జరుపుకుంటున్నారా ??? ఐతే తస్మాత్ జాగ్రత్త!

ఈ మధ్యకాలంలో సమాజంలో ఓ "వింత పోకడ /సాధనను" మనం గమనిస్తున్నాము. అదేమిటంటే అర్ధరాత్రి 12 గంటలకు పుట్టినరోజు వేడుకలు, కానీ పెళ్ళిరోజు వేడుకలు  ఇది ఎంత తప్పో మీకు తెలుసా ..?

హైందవ గ్రంథాల ప్రకారము ఇది తప్పు!

ఔను ఈ విధంగా అర్ధరాత్రి వేడుక ఎంత తప్పో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను.

ఈ మధ్య కాలంలో నేటి సమాజంలో ఎవరిదైనా పుట్టినరోజు కానీ, పెళ్లిరోజు కానీ మరే ఇతర వేడుకైన గాని రాత్రి 12 గంటలకు జరుపుకోవడం ఫాషన్ గా మారిపోయింది. జనాలు కూడా ఈ విధంగా రాత్రి వేడుకలో కేకులు కోస్తూ సంబరాలు జరుపు కోవడంలో ఆనందాన్ని వెతుకుతున్నారు.

కానీ హైందవ గ్రంథాలు రాత్రి 12 గంటల సమయంను "నిషిద్ధ" కాలంగా అభివర్ణించాయి.

ఔను మధ్య రాత్రి 12 గంటల నుంచి వేకువ ఝాము 3 గంటల వరకు హైందవ శాస్త్ర ప్రకారం "నిషిద్ధ ఘడియలు".

అనగా అర్ధ రాత్రి 12 గంటలు సమయంలో జరిగే సంబరాలు మనం నిషిద్ధ కాలంలో జరుపుకొంటున్నాము. కానీ హైందవ గ్రంథల ప్రకారం ఈ నిషిద్ధ సమయంలో మానవ నేత్రాలకు కనబడని ఎన్నో దుష్ట శక్తులు, దయ్యాలు, రక్త పిశాచాలు సంచరిస్తుంటాయి. ఈ  నిషిద్ధ సమయంలో వాటి శక్తులు కూడా పెరుగుతాయి.

మనం జీవించే ఈ భూమండలంలో అలాంటి శక్తులు చాలానే ఉన్నాయి. అవి మన కంటికి కనబడవు, కానీ వాటి వల్ల మానవ జీవితాలకు ఎన్నో భయానక మరియు చెడు ఫలితాలు గోచరిస్తాయి. వీటి చెడు  ప్రభావములచే మానవ జీవితం అపసవ్య మార్గoలో పయనించును.

ఈ నిషిద్ధ కాలంలో జరుపుకొనే వేడుకల వల్ల ఈ దుష్టశక్తులు మన ఆయువుని హరిస్తాయి. అంతేగాక వారి భవిష్యత్తు అగమ్య గోచరంగా మారి, దురదృష్టం ఇంటి తలుపు తడుతుంది. కేవలం ఒక సంవత్సరంలో 4 పండుగలు. అవి దీపావళి, నవరాత్రులు, జన్మాష్టమి మరియు శివరాత్రి రోజులలో మాత్రమే ఈ నిషిద్ధ కాలం పుణ్య ఫలితాలను ఇస్తుంది, అది ఎందుచేతనంటే ఈ సమయాలలో నిషిద్ధ కాలం, మహా నిషిద్ధ కాలంగా గోచరించబడుతుంది.

పైన తెలిపిన నాలుగు పండుగలు మినహా అన్ని రోజులు నిషిద్ధ కాలములే..

హైందవ గ్రంధాల ప్రకారం సూర్యోదయం తోనే రోజు మొదలౌతుంది. అంతే గాక ఎందరో ఋషులు మరియు మునులు / సన్యాసులు ప్రకారం సూర్యోదయం పుణ్యకాలం.

ఈ సమయంలో వాతావరణం చాలా శుద్ధిగా, ప్రతికూలతలు లేనిదై ఉండును. హైందవ సంప్రదాయం ప్రకారం సూర్యోదయం తర్వాత మాత్రమే పుట్టినరోజు వేడుక జరుపుకోవాలి. ఎందుకంటే మధ్య రాత్రిలో "రజో" మరియు "తమో" గుణాలు వాతావరణంలో మెండుగా ఉండి, ఆ సమయంలో తెలియజేయు అభినందనలు శుభ ఫలాలు ఇవ్వకపోగా వ్యతిరేక ఫలితాలు ఇచ్చును. ఏదిఏమైనా హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం కేకులు కోయడం మన సంప్రదాయం కాదు.

మన హిందూ ధర్మం ఏంతో శాస్త్రీయతతో కూడుకున్నది. కావున హిందూ ధర్మాలలో పొందుపరిచిన మార్గాలనే మనం ఎంచుకొందాం/ఆచరణలో పెడదాం..

Famous Posts:

స్త్రీల గూర్చి పురుషులు, పురుషుల గూర్చి స్త్రీలు తెలుసుకోవాల్సినవి?


సూర్యుడి అనుగ్రహాన్ని కోరుతూ ఆదివారాల నోము


శనేశ్వరుడు శనివారాల నోము


శుక్రవారాల నోముకి ఎంతో ప్రాధాన్యత


శివదేవుని సోమవారపు నోము కథ

తీర్థం తీసుకున్న తర్వాత చేతిని తలపై రాసుకుంటే ఏంమవుతుంది?

birthday celebration for kids, birthday celebration quotes, birthday celebration meaning, birthday celebration ideas, birthday celebration wishes, birthday celebration ideas at home, how celebrate birthday telugu

Comments

Popular Posts