శ్రీ అనంత పద్మనాభస్వామి వ్రత విశిష్ఠత | Anantha Padmanabha Swamy Vratham Pooja Procedure

అనంత పద్మనాభ చతుర్దశి , వ్రతం

అనంత పద్మనాభ చతుర్దశి అనగా భాద్రపద శుక్ల చతుర్దశినాడు జరుపుకొనే వ్రతం అనంత చతుర్దశి వ్రతం లేదా అనంత పద్మనాభ వ్రతం. ఇది హిందూ సంప్రదాయంలో ఉన్న కామ్య వ్రతాలలో ప్రధానమైనదని వ్రత గ్రంథాలు పేర్కొంటున్నాయి. కష్టాలలో మునిగి ఉన్నప్పుడు బయటపడటానికి  ఉత్తమ సాధనంగా ఈ వ్రతాన్ని భావించటం తరతరాలుగా వస్తోంది.

పూర్వ కాలం నుంచి ఈ వ్రత ప్రస్తావన భారతావనిలో కనిపిస్తుండటం విశేషం. పాండవులు వనవాసం సమయంలో కష్టాలను అనుభవిస్తున్న ధర్మరాజు శ్రీకృష్ణుడిని వాటి నుంచి గట్టెక్కేందుకు ఏదైనా వ్రతం ఉంటే చెప్పమన్నాడు. అప్పుడు కృష్ణుడు అనంతపద్మనాభ వ్రతాన్ని *భాద్రపద శుక్ల చతుర్దశి నాడు* చేయమని చెప్పాడట. అనంతుడన్నా , అనంతపద్మనాభస్వామి అన్నా సాక్షాత్తూ కాలమే అన్నాడు. యుగ , సంవత్సర , మాస తదితర కాలం అంతా తన స్వరూపమన్నాడు. అనంతపద్మనాభుడంటే కాల స్వరూపుడైన వైకుంఠవాసుడి అవతారమే శ్రీకృష్ణుడు. పాల కడలిలో శేషశయ్య మీద పవళించి ఉండి బొడ్డు పద్మంలో బ్రహ్మదేవుడు కూర్చొని లక్ష్మీదేవి పాదాలొత్తుతున్న ఆ దివ్య స్వరూపమే అనంతపద్మనాభుడు. ఈ వ్రతమహిమతో కృతయుగంలో సుశీల - కౌండిన్య దంపతులు సకల సంపదలు , సుఖసంతోషాలతో జీవించినట్లు పురాణాలు చెబుతున్నాయి.

ఈ వ్రతంలో భూభారాన్ని వహిస్తున్న అనంతుడిని , ఆ ఆదిశేషుడిని శయ్యగా చేసుకొని పవళించి ఉన్న శ్రీమహావిష్ణువును పూజించటం కనిపిస్తుంది. వ్రత సంబంధమైన పూజను గమనిస్తే అనంతపద్మనాభ అవతారం కళ్ల ముందు మెదలాడుతుంది. వ్రతాచరణ కోసం పిండితో ఏడు పడగల పామును చిత్రిస్తారు. దర్భలతో పాము బొమ్మను చేసి పూజించటం కనిపిస్తుంది. దర్భలతో చేసిన పామును మూతపెట్టిన కలశం మీద ఉంచి పూజిస్తారు. ఈ మొత్తంలోనూ శేషశయనుడి రూప భావన కనిపిస్తుంది. వ్రతంలో ఉంచటం కోసం సిద్ధం చేసుకొన్న కలశంలో పవిత్ర జలాలను ఉంచుతారు. ఆ నీటిలో కొద్దిగా పాలు , ఒక పోకచెక్క , ఓ వెండి నాణెం వేస్తుంటారు. కలశంలోని నీటిలోకి యమునా నదిని ఆవాహన చేస్తుంటారు. అనంతపద్మనాభస్వామి పూజలో పద్నాలుగు సంఖ్యకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపిస్తుంది. పద్నాలుగు లోకాలను ఏలే ఆ స్వామి పూజ అనే భావన కలిగేందుకు ఆనాడు పూజించే సర్పాకృతికి పద్నాలుగులో సగమైన ఏడు సంఖ్యలో పడగలను పెట్టడం , పద్నాలుగుకు రెండింతలైన ఇరవై ఎనిమిది సంఖ్యలో గోధుమ పిండితో పిండి వంటలు చేసి పద్నాలుగేళ్ల కొకసారి వ్రతానికి సంబంధించిన ఉద్యాపన చేయటం కనిపిస్తుంది. ఈ వ్రతంలో ప్రధానాంశమైన చేతికి ధరించే ఎర్రటి తోరానికి 14 ముడులుంటాయి. మరి కొందరు నైవేద్యానికి 14 రకాల పండ్లు , పిండి వంటలు , పూజ కోసం పత్రిని వాడుతుంటారు. ఇదంతా ఏడేడు పద్నాలుగు లోకాలను ఏలే కాలస్వరూపుడైన ఆ దివ్య మంగళ స్వరూపుడిని తలచుకోవటం కోసం.

ఈ వ్రతంలో కలశాన్ని పెట్టి పూజ చేయటాన్ని పురోహితుడి సాయంతో చేసుకోవటం మేలని వ్రత గ్రంథాలు పేర్కొంటున్నాయి. ఈ రోజు వ్రతాన్ని చేసే దంపతులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసముంటుంటారు.

వ్రతానికి సంబంధించి కథను పరిశీలిస్తే అంతా సత్యం , ధర్మం మీద ఆధారపడి ఉన్నట్లు కనిపిస్తుంది. సత్యధర్మాలను అనుసరించేవారు దైవకృపకు పాత్రులవుతారని , వాటిని విస్మరించినవారు జన్మజన్మలకూ కష్టాలు అనుభవిస్తూనే ఉండాల్సి వస్తుందన్న హెచ్చరిక కనిపిస్తుంది. తనను తినబోయిన పులికి ఓ ఆవు కాసేపు ఆగమని , ఇంటికి వెళ్లి తన లేగదూడకు పాలిచ్చి వస్తానని చెప్పి ఆడిన మాటను నిలబెట్టుకొని పులి దగ్గరకు వెళ్లి సత్యవ్రతాచరణను చాటిన కథను ఈ వ్రత సందర్భంగా చెప్పుకొంటుంటారు. ఆనాడు ఆ ఆవు తన ప్రాణాల కన్నా సత్యమే మిన్న అని భావించింది. తన లేగదూడకు కడుపునిండా పాలుపట్టి ధర్మాన్ని బోధించింది. అలాంటి దర్శ జీవన విధానాన్ని ఈ వ్రత సందర్భంగా తలచుకుంటారు.

*వ్రతవిధానము...*

శుచిగా స్నానమాచరించి , గృహాన్ని , పూజామందిరాన్ని శుభ్రపరుచుకోవాలి. పూజామందిరము నందు అష్టదశ పద్మాన్ని తీర్చిదిద్దాలి. ఆ పద్మం చుట్టూ రంగవల్లికలతో అలంకరించుకోవాలి. దానికి దక్షణ భాగంలో నీరు నింపిన కలశం ఉంచాలి.

ముందుగా ఓ మండపాన్ని ఏర్పాటుచేసుకోవాలి . అందులో పధ్నాలుగు పడగలు గల అనంతుడుని తయారుచేసి ప్రతిస్ఠించాలి. సామాన్యముగా దర్బలను ఉపయొగించి అనంతుణ్ణి తయారుచేస్తారు. ముందుగా గణపతిని , నవగ్రహాలను పూజించిన తరువాత *' యమునా పూజ '* చేయాలి. యమునా పూజ అంటే నీటిని పూజించాలి. బిందెతో నీటిని తెచ్చుకొని , ఆ నీటిలోకి యమునను ఆవాహనం చేసి పూజించాలి. తరువాత అనంతుడుని షోడశోపచారాలతో పూజించి , బెల్లము తో చేసిన ఇరవై ఎనిమిది అరిసెలను నైవేద్యముగా పెట్టాలి. వ్రతకథ చెప్పుకొని అనంతపద్మనాభస్వామికి నమస్కరించి అక్షతలు తలపై చల్లుకోవాలి. వ్రతముతో తోరమును కట్టుకోవాలి. ఎరుపు రంగులో పద్నాలుగు పోచలతో తయారైన తోరాన్ని ధరించాలి.

*శ్రీ అనంత పద్మనాభ అష్టోత్తర శతనామావళి*

☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️

ఓం శ్రీ అనంతాయ నమః

ఓం పద్మనాభాయ నమః

ఓం శేషాయ నమః

ఓం సప్త ఫణాన్వితాయ నమః

ఓం తల్పాత్మకాయ నమః

ఓం పద్మ కారాయ నమః

ఓం పింగాప్రసన్నలోచనాయ నమః

ఓం గదాధరాయ నమః

ఓం చతుర్భాహవే నమః

ఓం శంఖచక్రధరాయ నమః

ఓం అవ్యయాయ నమః

ఓం నవామ్రపల్లవాభాపాయ నమః

ఓం బ్రహ్మసూత్రవిరాజితాయ నమః

ఓం శిలాసుపూజితాయ నమః

ఓం దేవాయ నమః

ఓం కౌండిన్యవ్రతతోషితాయ నమః

ఓం నభస్యసుక్లస్తచతుర్ధశీ పూజ్యాయ నమః

ఓం ఫణేశ్వరాయ నమః

ఓం సంఘర్షణాయ నమః

ఓం చిత్ స్వరూపాయ నమః

ఓం సూత్రగ్రంధి సుసంస్తితాయ నమః

ఓం కౌండిన్యవరదాయ నమః

ఓం పృథ్విధారిణీ నమః

ఓం పాతాళనాయకాయ నమః

ఓం సహస్రాక్షాయ నమః

ఓం అఖిలాధరాయ నమః

ఓం సర్వయోగికృపాకరాయ నమః

ఓం సహస్రపద్మసంపూజ్యాయ నమః

ఓం కేతకీకుసుమప్రియాయ నమః

ఓం సహస్రబాహవే నమః

ఓం సహస్రశిరసే నమః

ఓం శ్రితజన ప్రియాయ నమః

ఓం భక్తదుఃఖహరాయ నమః

ఓం శ్రీ మతే నమః

ఓం భవసాగరతారకాయ నమః

ఓం యమునాతీరసదృస్టాయ నమః

ఓం సర్వనాగేంద్రవందితాయ నమః

ఓం యమునారాధ్యాపాదాబ్జాయ నమః

ఓం యుదిష్టిరసుపూజితాయ నమః

ఓం ధ్యేయాయ నమః

ఓం విష్ణుపర్యంకాయ నమః

ఓం చక్షుశ్రవణవల్లభాయ నమః

ఓం సర్వకామప్రదాయ నమః

ఓం సేవ్యాయ నమః

ఓం భీమ సేనామృత ప్రదాయ నమః

ఓం సురాసురేంద్రసంపూజ్యాయ నమః

ఓం ఫణామణివిభూషితాయ నమః

ఓం సత్యమూర్తయే నమః

ఓం శుక్లతనవే నమః

ఓం నీలవాససే నమః

ఓం జగత్ గురవే నమః

ఓం అవ్యక్త పాదాయ నమః

ఓం బ్రహ్మణ్యాయ నమః

ఓం సుబ్రహ్మణ్యనివాసభువే నమః

ఓం అనంత భోగశయనాయ నమః

ఓం దివాకర ము నీడతాయై నమః

ఓం మధుక పృక్షసంస్తానాయ నమః

ఓం దివాకర వరప్రదాయ నమః

ఓం దక్షహస్తసదాపూజ్యాయ నమః

ఓం శివలింగనివష్ఠధియే నమః

ఓం తిప్రతీహారసందృశ్యాయ నమః

ఓం ముఖధాపిపదాంభుజాయ నమః

ఓం నృసింహక్షేత్ర నిలయాయ నమః

ఓం దుర్గా సమన్వితాయ నమః

ఓం మత్స్యతీర్ధ విహారిణే నమః

ఓం ధర్మాధర్మాదిరూపవతే నమః

ఓం మహా రోగాయుధాయ నమః

ఓం వార్ధితీరస్తాయ నమః

ఓం కరుణానిధయే నమః

ఓం తామ్రపర్నీపార్శ్వవర్తినే నమః

ఓం ధర్మపరాయణాయ నమః

ఓం మహాకాష్య ప్రణేత్రే నమః

ఓం నాగాలోకేశ్వరాయ నమః

ఓం స్వభువే నమః

ఓం రత్నసింహాసనాసీనాయ నమః

ఓం స్పరన్మకరకుండలాయ నమః

ఓం సహస్రాదిత్య సంకాశాయ నమః

ఓం పురాణ పురుషాయ నమః

ఓం జ్వలత్ రత్నకిరీటాడ్యాయ నమః

ఓం సర్వాభరణ భూషితాయ నమః

ఓం నాగాకన్యాప్రద్తత ప్రాంతాయ నమః

ఓం దిక్పాలక పరిపూజితాయ నమః

ఓం గంధర్వగాన సంతుష్టాయ నమః

ఓం యోగశాస్త్ర ప్రవర్తకాయ నమః

ఓం దేవ వైణికసంపూజ్యాయ నమః

ఓం  వైకుంటాయ నమః

ఓం సర్వతోముఖాయ నమః

ఓం రత్నాంగదలసద్భాహవే నమః

ఓం బలబద్రాయ నమః

ఓం ప్రలంభఘ్నే నమః

ఓం కాంతీ కర్షనాయ నమః

ఓం భాక్తవత్సలాయ నమః

ఓం రేవతీ ప్రియాయ నమః

ఓం నిరాధారాయ నమః

ఓం కపిలాయ నమః

ఓం కామపాలాయ నమః

ఓం అచ్యుతాగ్రజాయ నమః

ఓం అవ్యగ్రాయ నమః

ఓం బలదేవాయ నమః

ఓం మహాబలాయ నమః

ఓం అజాయ నమః

ఓం వాతాశనాధీశాయ నమః

ఓం మహాతేజసే నమః

ఓం నిరంజనాయ నమః

ఓం సర్వలోక ప్రతాపనాయ నమః

ఓం సజ్వాలప్రళయాగ్నిముఖే నమః

ఓం సర్వలోకైక సంమార్త్రే నమః

ఓం సర్వేష్టార్దప్రదాయకాయ నమః

ఇతి శ్రీ అనంత పద్మనాభ స్వామి అష్టోత్తర శతనామావళి సంపూర్ణం.

Famous Posts:

ఈ రాశులవారు జీవితంలో డబ్బు హోదాలతో ఉన్నత స్థితిలో ఉంటారు

ఈ ఉంగరం ధరిస్తే అన్ని శుభాలే

అదృష్టాన్ని తెచ్చి పెట్టే నవబ్రహ్మ ఆలయం

> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి

100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం

> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం

అందరు తప్పక చదవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం

ఏలినాటి శని బాధలు తప్పించే సూర్యదేవాలయం ఇదే

గోవుతో గృహప్రవేశం ఎందుకు చేయిస్తారో తెలుసా?

అనంత పద్మనాభ వ్రతం,  Anantha Padmanabha Swamy Vratham, Anantha Padmanabha Swamy VrathamPooja Procedure, Anantha Padmanabha Swamy, anantha padmanabha swamy vratham telugu pdf, anantha padmanabha swamy stotram in telugu, anantha vratham 2021

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS