Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

ఆలయానికి వెళ్ళినప్పుడు దేవుని ప్రసాదం ఎలా తినాలి? How to eat God's offerings when going to the temple? Dharma Sandehalu

ఆలయాలకు వెళ్తాము కానీ అక్కడ ఇచ్చే దేవుడి ప్రసాదాలను ఎలా తినాలో చాలా మందికి తెలియదు.

శివయ్య గుడిలో బిల్వ తీర్థం ఇస్తే

వెంకయ్య గుడిలో తులసిదళం తీర్థం ఇస్తారు.

కొంతమంది స్వయంగా చేతిలో తీసుకుంటారు ఇంకొంతమంది వేరొకరి చేతి నుండి వారి చేతుల్లోకి ఒంపుకుంటారు 

అలాగే గుడిలో చక్కరపొంగళి పులిహోర లాంటివి ఇచ్చినప్పుడు కూడా తినేప్పుడు పొరపాట్లు ఎన్నో జరుగుతుంటాయి 

తీర్థం తీసుకోవాలి అంటే ఎడమచేతి పైన కుడిచేతిని పెట్టి తీర్థం తీసుకుని రెండు కళ్ళకు మొక్కుకుని ఆ తరువాత తాగాలి 

తాగేసాక ఆ అరచేతిని తలపైన తుడుచుకుంటారు. అలా చేయకండి

రెండు చేతులలోకి తుడుచుకోండి. 

స్త్రీలు తీర్థం ప్రసాదం గుడిలో తీసుకునేప్పుడు వారి పైట కొంగును చేతులతో పట్టుకుని.

పూలు అయితే పైటకొంగులోనే  తీసుకోవాలి. 

అలాగే చక్కర పొంగలి లాంటివి ఇచ్చినప్పుడు కుడిచేత్తో తీసుకుని అలాగే నోట్లో వేసేసుకుంటుంటారు కొందరు 

పక్షులకు చేతులు లేవు కనుక అవి అలా తింటాయి మనకు దేవుడు రెండు చేతులు ఇచ్చాడు.

కుడి చేత్తో ప్రసాదాన్ని తీసుకుని ఎడమచేతిలోకి మార్చుకుని కుడిచేత్తో కొద్దికొద్దిగా తీసుకుని తినాలి.

అలా కాకుండా కుడిచేతిలోకి తీసుకుని ఒకేసారి నోటితో కొరికారంటే మరుజన్మలో పక్షులై పుడతారని చెబుతారు. 

మన అరచేతిలో ముక్కోటి దేవతలు నివాసం ఉంటారని అందుకే నిద్ర లేవగానే అరచేతిని మొదటగా చూడమని మన పెద్దలు చెప్పారు.

అదే శాస్త్రం కూడా చెబుతున్నది..

తెలియని వారు ఇప్పుడైనా తెలుసుకుని నడుచుకుంటారుగా 

దేవుడి ప్రసాదం తీసుకుని ఎలా తినాలో తెలుసుకున్నారుగా..

Famous Posts:

సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఇన్ని లాభాలు


ఈ రాశులవారు జీవితంలో డబ్బు హోదాలతో ఉన్నత స్థితిలో ఉంటారు


ఈ ఉంగరం ధరిస్తే అన్ని శుభాలే


అదృష్టాన్ని తెచ్చి పెట్టే నవబ్రహ్మ ఆలయం


> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి


100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం


> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం


అందరు తప్పక చదవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం


ఏలినాటి శని బాధలు తప్పించే సూర్యదేవాలయం ఇదే


గోవుతో గృహప్రవేశం ఎందుకు చేయిస్తారో తెలుసా?

Dharma Sandehalu, how to offer naivedyam to god, food offering to god, how to offer prasad to god, Prasadam, god prasadam, hindu temples

Comments