Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

సాయిబాబా వారు స్వయంగా మరాఠీ లో తెలియచేసిన ఏకాదశ సూత్రాలు - Shirdi Sai Ekadasa Sutralu | Baba Vachanalu In Telugu

షిరిడి సాయిబాబా వారు స్వయంగా మరాఠీ లో చెప్పిన ఏకాదశ సూత్రాలు..

శ్రీ సాయినాధ్ మహరాజ్ వారి ఏకాదశ సూత్రాలు 

సాయి హారతులలో ’అనంతా తులాతే కసేరే స్తవావే’ అన్న నమస్కారాష్టకాన్ని వ్రాసిన శ్రీ మోహినీ రాజ్ పండిట్ అభంగ రూపంలో వ్రాసారు.

ఆరతి తర్వాత షిరిడీ సంస్థానంలో ఆ అభంగాన్ని వినిపిస్తూ వుంటారు. 

అయితే సాయి ఏకాదశ సూత్రాల పేరిట ప్రాచుర్యంలో వున్న సూత్రాలకివి భిన్నంగా వుంటాయి. 

సాయి భక్తుల సౌకర్యార్దం శ్రీ మోహినీ రాజ్ పండిత్ వ్రాసిన మరాఠీ అభంగాన్ని దానికి శ్రీ స్వామి అచలానంద సరస్వతి చేసిన తెలుగు అనువాదాన్ని ఇక్కడ..

సాయి ఏకాదశ సూత్రాలు.

మరాఠీ మూలం:  శ్రీ మోహినీ రాజ్ పండిత్

తెలుగు సేత: స్వామి అచలానంద సరస్వతి

శిరిడీస్ జ్యాచే లాగతీళ్ పాయ్!

టకతీ అపాయ్ సర్వ త్యాంచే!! 1

1.శిరిడీలో అడుగు పెట్టిన తక్షణమే!

తొలగిపోవును భక్తుల సర్వ అపాయాలు!!

మాఝ్యా సమాధీచీ పాయరీ చఢేల్!

దుఃఖ్ హేఁ – హఠేల్ నర్వ త్యాంచే 2

2.నా సమాధి వేదికను ఎక్కిన వెనువెంటనే!

హరియించును భక్తుల సర్వ దుఖాలు!!

జరీ హేఁ శరీర్ గేలోఁ మీ టాకూన్!

తరీ మీ దాఁవేన్ భక్తాం సాఠీం!! 3

3.ఈ శరీరాన్ని నేను వదిలి వెళ్ళిపోయినా!

వస్తాను పరుగు పరుగున భక్తుల హితం కోసం!!

నవసాన్ మాఝీ పావేల్ సమాధీ!

ధరా ధృఢ్ బుద్ధీ మాఝ్యాఠాయాం!! 4

4.ప్రాప్తిస్తాయి నా సమాధిలో మీ కోరికలన్నీ కూడా!

ఉంచండి నా యందు మీ ధృఢ విశ్వాసం!!

నిత్య మీ జీవంత, జాణా హేఁచి సత్య!

నిత్య గ్యా ప్రచీత అనుభవే!! 5

5.నిత్యం జీవించే వుంటాను నేను ఇది పరమ సత్యం!

స్వానుభవంతో తెలుసుకోండి ఇదే సత్యమని నిత్యం!!

శరణ్ మజ్ ఆలా, ఆణి వాయాం గేలా!

దాఖ్ వా దాఖ్ వా ఐసా కోణీ!! 6

6.నన్ను శరణ కోరి నిరాశులై మరలిన వారిని!

ఒక్కరిని ఒక్కరినైనా ఎవరైనా నాకు చూపండి!!

జోజో, మజ్ భజే, జైశా జైశా భావేఁ!

తైసా తైసా పావేఁ, మీహీ త్యాసీ!! 7

7.ఎవరెవరు నన్ను ఏలా ఏలా భావించి భజిస్తారో!

వారి వారికి నేను అలా అలానే ప్రాప్తిస్తాను!!

తుమ్ చా మీ భార్ వాహీన్ సర్వధా!

నన్హే హేఁ  అన్యధా వచన్ మా ఝే!!  8

8.మీ భారాన్ని నేను వహిస్తాను సర్వధా!

ఈ నామాట కానే కాదు ఎప్పుడూ అన్యధా!!

జాణా ఏథేఁ ఆగ్/ఎ సాహాయ్య సర్వాంస!

మాగే జేజే త్యాస తేఁ తేఁ లాభే!! 9

9.అందరికీ లభిస్తుంది ఇక్కడ నా సహాయం!

ఎవరెవరికి ఏమేమి కావాలోఅవన్నీ దొరుకుతాయి!!

మాఝా జో జాహ్ లా కాయావాచామనీఁ!

తయాచా మీ ఋణీ సర్వకాళ్!! 10

10.కాయా వాచా మనసుతో నాకంకితమైన వారికి!

ఎల్లప్పటికీనేను ఋణపడి వుంటాను!!

సాయీఁ మ్హణే తోచి తోచి ఝాలా ధన్య్!

ఝాలా జో అనన్య మాఝ్యా పాయీఁ!!

11.నా చరణాల్లో అనన్య భక్తితో అంకితమైన వారు!

వారే సుమా ధన్యులు ఇదే నా వచనం!!

ఓం శ్రీ సాయిరామ్..!

Famous Posts:

భర్త భార్య మాట వినాలంటే ఏమి చేయాలి ? 

వాస్తు ప్రకారం ఈ మార్పులు చేసుకుంటే సంపదలు పెరుగుతాయి.

శివుడు చెప్పిన ‘ఆదివిద్య’లు

శివ గుణాలు లోకానికి సందేశాలు

భార్యలు భర్తల కాళ్లను వత్తాలట ఎందుకో మీకు తెలుసా ?

కూతురా కోడలా ఎవరు ప్రధానం...? 

సాంబ్రాణి ధూపం వేయడం వల్ల కలిగే లాభాలు?

కాకికి అన్నం ఎందుకు పెట్టడం ?

సాయిబాబా, shirdi sai baba open or not, shirdi sai baba song, shirdi sai baba pooja, shirdi sai baba live, shirdi sai baba temple, shirdi sai baba mandir timing, shirdi sai baba answers, shirdi sai baba miracles, sai baba, shirdi

Comments

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు