ధనుర్మాస వ్రతం..ధనుర్మాస పూజా విధానం..
తిరు అంటే శ్రీ, పావై అంటే వ్రతం, తిరుప్పావై అంటే శ్రీవ్రతం. అన్ని సంపదలను ఇచ్చేది సిరి నోము దీనినే ధనుర్మాస వ్రతం అంటాం.చాంద్ర మానం ని బట్టి మార్గశీర్శమైతె సౌరమానాన్ని బట్టి ధనుర్మాసం అవుతుంది. "మాసానాం మార్గశీర్షోహం" , మాసములలో ఉత్తమమైన మార్గాశీర్శమును నేనే అన్న ఆ కృష్ణ పరమాత్మకు మార్గశిరం లో ప్రారంభమయ్యే ధనుర్మాసమంటే ఇష్టమట.
మార్గశిర పున్నమి నుండి పుష్య పున్నమి వరకు శ్రీవ్రత మాసం. తొలి పున్నమి నాటికి చంద్రుడుంటాడు, మలిపున్నామి నాటికి నిండు చంద్రుడే. ఈ నడుమ తరుగుతాడు, పెరుగుతాడు, ఇదే మన జీవితం! ఎప్పుడూ భగవంతునితో కలిసి వుంది, ఇహ పరములలో మనకు కావలిసినన్నీ పొందడానికి ఈ సిరినోము చెయ్యాలట.
ఈ ధనుర్మాస వ్రతాన్ని ద్వాపర యుగంలో వ్రేపల్లె లో గోపికలు కృష్ణున్ని పొందాలని కోరి కాత్యాయిని వ్రతం గా చేశారు. తర్వాత కలియుగం లో శ్రీవిల్లిపుత్తూర్ లో గోదా దేవి అచటి అర్చామూర్తి శ్రీ వటపత్రశాయిని సాక్షాత్ శ్రీకృష్ణ భగవానునిగా. వారి ఆలయాన్ని నందగోప భవనంగా, తన తోటి చెలికత్తేలన్దరినీ గోపికలుగా, తనూ ఒక గోపికగా త్రికరణ శుద్దిగా విశ్వసించి ఈ వ్రతం చేసింది. శ్రీ రంగ నాథున్ని పొందింది.
శ్రీ గోదాదేవి శ్రీ విష్ణుచిత్తుల వారికి, పుబ్బ నక్షత్రం లో తులసి వనం లో లభించింది. శ్రీ విష్ణు చిత్తులు (పెరియాళ్వార్) ఆ బాలిక ను అల్లారుముద్దుగా పెంచిరి. వటపత్రశాయికి నిత్యమూ పుష్పమాలికలు కట్టి సమర్పించు తమకు భగవంతునికి భోగ్యమయిన ఇంకొక పూలదండ దొరికింది అన్న సంతోషంతో ఆమెకు "కొదై " (పూలదండ) అని పేరు పెట్టారు. ఆమెకే "గోదా"అని పేరు వచ్చినది. ఆమె తండ్రి తో బాటే మాలలు కట్టి, అవి తానూ ముందు ధరించి తరువాత స్వామికి ఇచ్చేది.తండ్రి అపచారమని మన్దలించినా, స్వామి ఆమె ముడిచి విడచి ఇచ్చిన మాలలే నాకు ఇష్టం అని ప్రీతితో స్వీకరించాడు. అందుకే ఆమెను "ఆముక్త మాల్యద" అని తమిళంలో "శూడి కొడుథ్థ నాచ్చియార్"అని అంటారు. పాశురములను పాడి ఇచ్చిన అమ్మ కాబట్టి " పాడి కొడుత్త నాచ్చియార్" అని కూడా అంటారు. "తిరుప్పావై" ప్రబందమును పాడి వ్రతమును ఆచరించి మనకు దారి చూపేది తల్లి ఆండాళ్. అండాళ్ అనగా కాపాడే తల్లి , రక్షకురాలు. ఆ తల్లి ముప్పై రోజులు ముప్పై పాశురాలతో ఆ రంగ నాథున్నికొలిచినది . రంగనాథ స్వామి కి విరుల సౌరభాల కన్నా, గోదాదేవి కురుల పరిమళమె నచ్చింది. విష్ణు చిత్తుడి కి కలలో కనిపించి గోదా కల్యాణానికి ఆనతిచ్చాడు.ఆండాళమ్మ ఆ అనంత కోటి బ్రహ్మాండ నాయకుడిలో ఐక్యమై పోయింది . పన్నిద్దరు ఆళ్వార్లలో ఏకైక మహిళ ఆండాళ్!
భక్తులు సూర్యోదయానికి ముందే ఆరాధన మొదలు నివేదన దాకా అన్నీ పూర్తిచేసుకుంటారు. గోదా దేవి పాడు కున్న 30 పాశురాల్ని రోజుకొక్కటి చొప్పున ఆలపిస్తారు.వయో లింగ భేదం లేకుండా ఎవరయినా ఈ వ్రతం జరుపుకోవచ్చు అంటారు.ఓ వైపు వణికించే చలి, వెచ్చగా దుప్పటి కప్పుకొని పడుకోవాలనిపిస్తుంది. ఆ మత్తును జయించి, తెల్లవారుజామునే మేల్కొనాలి.ఆహార మియమాల్ని పాటించాలి. మిత భాషణ, ప్రియ భాషణ కూడా అవసరమే.దాన ధర్మాలకు ప్రాదాన్యం ఇవ్వాలి.భోగాలకు దూరంగా ఉండాలి.ఈ తరహా ధార్మిక జీవన విధానమే ఆధ్యాత్మికోన్నతికి సోపానం.
ఆ బ్రహ్మాండ నాయకుని చేరిన ఆండాళ్ కోరిన కోరిక ఇది "సర్వ విధముల నీకే చెంది, నీదే అయిన ఈ ఆత్మ అనర్థము నందకుండా కాపాడుము. ఈ ఆత్మ స్వరూపమునకు తగినట్లుగా నీ అంతరంగ కైంకర్యము చేయు భాగ్యమ్ము నిమ్ము. ఈ ఆత్మ ఉన్నంత కాలము నీ సేవ చేయునట్లు అనుగ్రహింపుము"...ఇదే తిరుప్పావై సారం, ఇక ధనుర్మాస పూజా విధానం తెలుసుకుందాం.
ధనుర్మాస పూజా విధానము
ఓం శ్రీ గోదాయై నమః రామానుజాయ నమః
స్నానానంతరం పరిశుద్ధ వస్త్రములు ధరించి ఊర్ధ్వపుండ్రాన్ని పెట్టుకొని గురుపరంపరను అనుసంధించుకొని, పెరుమాళ్ళ సన్నిధి చేరి సాష్టాంగ నమస్కారం చేసి క్రింది శ్లోకములను అనుసంధించాలి.
అమర్యాదః క్షుద్రశ్చలమతిరసూయా ప్రసవభూః
కృతఘ్నో దుర్మానీ స్మర పరవశో వంచన పరః |
నృశంసః పాపిష్ఠః కథ మహమితో దుఃఖజలధేః
అపారాత్ ఉత్తీర్ణః తవ పరిచరేయం చరణయోః ||
నమో నమో వాఙ్మనసాతి భూమయే
నమో నమో వాఙ్మనసైక భూమయే |
నమో నమోనంత మహావిభూతయే
నమో నమోనంత దయైక సింధవే ||
న ధర్మ నిష్ఠోస్మి నచాత్మవేదీ
న భక్తి మాన్ త్వహ్చరణారవిందే |
అంకిచనో నన్యగతిశ్శరణ్యః
త్వ త్పాద మూలం శరణం ప్రపద్యే ||
కౌసల్యా సుప్రజా రామ! పూర్వా సంధ్యా ప్రవర్తతే |ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం ||
ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ |
ఉత్తిష్ఠ కమలా కాన్త త్రైలోక్యం మంగళం కురు ||
తతోఖిల జగత్పద్మ భోధాయాచ్యుత భానునా |
దేవకీ పూర్వ సంధ్యాయాం ఆవిర్భూతం మహాత్మనా ||
ఇతి కర తాళత్రయేన భగవంతం ప్రభోధ్య, కవాటం విముచ్య
(3 సార్లు చప్పట్లు చరిచి, ద్వారములు తీసి పెరుమాళ్ళను మేల్కొలపాలి)
నిర్మాల్యము తొలగించి, మనసులో చేయదలచిన ఆరాధనను ఒకసారి పరిపూర్ణముగా భావించి, పంచపాత్రలలో పరిమళ తీర్థమును నింపి, తులసీదలము వేసి అష్టాక్షరీ మంత్రముతో అభిమంత్రించవలెను.
ముందుగా మనసులో ఆచార్యారాధన చేసుకొని
స్వాచార్య శ్రీహస్తేన ఆరాధనాభిముఖో భవేయం ( అని పెరుమాళ్ళతో విన్నవించి)
స్వ శేష భూతేన మయా స్వీయైః సర్వ పరిచ్ఛదైః |
విధాతుం ప్రీత మాత్మానం దేవః ప్రక్రమతే స్వయం ||
భగవన్! పుండరీకాక్ష! హృద్యాగంతు మయాకృతం |
ఆత్మ సాత్కురు దేవేశ! బాహ్యే త్వాం సమ్యగర్భయే ||
(అని ప్రార్థించి పాదముల చెంత తులసిని అర్పించాలి)
1. ధ్యానము
కూర్మాదీన్ దివ్యలోకాన్, తదను మణిమయం
మంటపం తత్రశేషం |
తస్మిన్ ధర్మాది పీఠం, తదుపరి కమలం
చామర గ్రాహిణీశ్చ |
విష్ణుం దేవీర్విభూషాయుధగణ, మురగం
పాదుకే వైన తేయం
సేనేశం ద్వార పాలాన్ కుముదముఖ గణాన్
విష్ణు భక్తాన్ ప్రపద్యే
సవ్యం పాదం ప్రసార్య, ఆశ్రిత దురిత హరం
దక్షిణం కుంచయిత్వా
జానున్యాధాయ సవ్యేతర మితరభుజం
నాగ భోగే నిధాయ |
పశ్చాద్భాహుద్వయేన ప్రతిభట శమనే
ధారయన్ శంఖ చక్రే |
దేవీ భూషాది జుష్టో జనయతు
జగతాం శర్మ వైకుంఠ నాథః
(శ్రీ గోదాదేవి రంగనాథులను ఎదురుగా యుంచి మనస్సులో కూడా వారిని నిలుపుకొంటూ)
సమస్త పరివారాయ సర్వ దివ్యమంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః
శ్రీ-భూ-నీళా-గోదాది దేవిభ్యో నమ
అనంత గరుడ విష్వక్సేనాది నిత్య సూరి గణేభ్యో నమః
శ్రీపరాంకుశ పరకాల యతివర వరవర మున్యాది ఆళ్వారాచార్యేభ్యో నమః
ఓం సర్వాన్ ధ్యాయామి
2. స్వాగతం
(నమస్కారం చేస్తూ స్వాగతం చెప్పండి)
ఆవాహయామి (స్వాగత ముద్ర చూపాలి)
3.సింహాసనం
( మన ఆరాధన అందుకోవడానికి మూర్తి ఉన్న స్థానంలో కూర్చోమని చెప్పండి)
రత్న సింహాసనం సమర్పయామి (పుష్పాన్ని సమర్పించండి)
4. అర్ఘ్యం
హస్తయోః అర్ఘ్యం సమర్పయామి
(అర్ఘ్య పాత్ర నుండి పెరుమాళ్ళ చేతికి ఒక సారి నీటిని అందించి తీర్థ పాత్రలో వేయాలి)
5. పాద్యం
పాదయోః పాద్యం సమర్పయామి (పాదాలకు రెండు సార్లు నీటిని అందించాలి)
(పాద్య పాత్ర నుండి పెరుమాళ్ళ పాదాలకి ఒక సారి నీటిని అందించి తీర్థ పాత్రలో వేయాలి)
6. ఆచమనీయం
ముఖే ఆచమనీయం సమర్పయామి ( నోటికి మూడు సార్లు నీటిని అందించాలి)
(ఆచమాన పాత్ర నుండి పెరుమాళ్ళకు మూడు సార్లు నీటిని అందించి తీర్థ పాత్రలో వేయాలి)
దంత కాష్ఠ జిహ్వా నిర్లేఖన గండూషణ
ముఖ ప్రక్షాళన తాంబూల తైలాభ్యంజన
అంగోద్వర్తన ఆమలకతోయ హరిద్రాలేపన
స్నాన కూర్చ ప్రసారణాని సమర్పయామి
7. పవిత్ర స్నానం
స్నానం సమర్పయామి
(స్నాన పాత్ర నుండి పెరుమాళ్ళకు మూడు సార్లు నీటిని అందించి తీర్థ పాత్రలో వేయాలి)
స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి
ప్లోత వస్త్రం సమర్పయామి ( పూల రెక్కతో తడి ఆరునట్లు అద్దాలి)
8. వస్త్ర యుగ్మం
వస్త్ర యుగ్మం సమర్పయామి (నూతన పట్టు వస్త్రాలు/ పుష్పాన్ని సమర్పించండి)
9. ఊర్ధ్వ పుణ్డ్రం
ఊర్ధ్వ పుణ్డ్రాన్ సమర్పయామి ( తిరునామము/శ్రీచూర్ణం సమర్పించండి)
10. యజ్ఞోపవీతం
యజ్ఞోపవీతం సమర్పయామి (పుష్పాన్ని సమర్పించండి
11. చందనం
దివ్య శ్రీ చందనం సమర్పయామి (చందనం సమర్పించండి)
12. ఆభరణములతో అలంకారం
సర్వాభరణాలంకారాన్ సమర్పయామి (పుష్పాన్ని సమర్పించండి)
(ఈ విధముగనే పరివారమునకందరకూ అలంకరణ పర్యంతము చేసి)
సమస్త పరివారాయ సర్వ దివ్యమంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః
13. నామావళి
ఓం శ్రీరంగనాయక్యై నమః
తులసీ దళైః పుష్పైశ్చ పూజయామి
(తులసీ దళములు, పుష్పములతో కృష్ణాష్టోత్తర, గోదాష్టోత్తర శతనామములు చెప్పుచూ హృదయమునకు పుష్పాన్ని చూపిస్తూ దానియంది మన ప్రేమని నింపి అర్చన చేయాలి)
01 ఓం కేశవాయ నమః
02 ఓం నారాయణాయ నమః
03 ఓం మాధవాయ నమః
04 ఓం గోవిందాయ నమః
05 ఓం విష్ణవే నమః
06 ఓం మధుసూదనాయ నమః
07 ఓం త్రివిక్రమాయ నమః
08 ఓం వామనాయ నమః
09 ఓం శ్రీధరాయ నమః
10 ఓం హృషీకేశాయ నమః
11 ఓం పద్మనాభాయ నమః
12 ఓం దామోదరాయ నమః
13 ఓం సంకర్షణాయ నమః
14 ఓం వాసుదేవాయ నమః
15 ఓం ప్రద్యుమ్నాయ నమః
16 ఓం అనిరుద్ధాయ నమః
17 ఓం పురుషోత్తమాయ నమః
18 ఓం అధోక్షజాయ నమః
19 ఓం నారసింహాయ నమః
20 ఓం అచ్యుతాయ నమః
21 ఓం జనార్దనాయ నమః
22 ఓం ఉపేంద్రాయ నమః
23 ఓం హరయే నమః
24 ఓం శ్రీకృష్ణాయ నమః
శ్రీకృష్ణ అష్టోత్తర శతనామావళి
01 ఓం శ్రీకృష్ణాయ నమః
02 ఓం కమలానాథాయ నమః03 ఓం వాసుదేవాయ నమః
04 ఓం సనాతనాయ నమః
05 ఓం వసుదేవాత్మజాయ నమః
06 ఓం పుణ్యాయ నమః
07 ఓం లీలామానుషవిగ్రహాయ నమః
08 ఓం శ్రీవత్సకౌస్తుభధరాయ నమః
09 ఓం యశోదావత్సలాయ నమః
10 ఓం హరయే నమః
11 ఓం చతుర్భుజాత్తచక్రాసిగదాశార్ ఙ్గద్యాయుధాయ నమః
12 ఓం దేవకీనందనాయ నమః
13 ఓం శ్రీశాయ నమః
14 ఓం నందగోపప్రియాత్మజాయ నమః
15 ఓం యమునావేగ సంహారిణే నమః
16 ఓం బలభద్రప్రియానుజాయ నమః
17 ఓం పూతనాజీవిత హరాయ నమః
18 ఓం శకటాసురభంజనాయ నమః
19 ఓం నందవ్రజ జనానందినే నమః
10 ఓం సచ్చిదానందవిగ్రహాయ నమః
21 ఓం నవనీత విలిప్తాంగాయ నమః
22 ఓం నవనీతనటాయ నమః
23 ఓం అనఘాయ నమః
24 ఓం నవనీతనవాహారాయ నమః
25 ఓం ముచికుందప్రసాదకాయ నమః
26 ఓం షోడశస్త్రీసహస్రేశాయ నమః
27 ఓం త్రిభంగినే నమః
28 ఓం మధురాకృతయే నమః
29 ఓం శుకవాగమృతాబ్దీందవే నమః
30 ఓం గోవిందాయ నమః
31 ఓం యోగినాంపతయే నమః
32 ఓం వత్సవాటచరాయ నమః
33 ఓం అనంతాయ నమః
34 ఓం ధేనుకాసురభంజనాయ నమః
35 ఓం తృణీకృతతృణావర్తాయ నమః
36 ఓం యమళార్జునభంజనాయ నమః
37 ఓం ఉత్తాలతాలభేత్రే నమః
38 ఓం తమాలశ్యామలాకృతయే నమః
39 ఓం గోపగోపీశ్వరాయ నమః
40 ఓం యోగినే నమః
41 ఓం కోటీసూర్యసమప్రభాయ నమః
42 ఓం ఇలాపతయే నమః
43 ఓం పరంజ్యోతిషే నమః
44 ఓం యాదవేంద్రాయ నమః
45 ఓం యదూద్వహాయ నమః
46 ఓం వనమాలినే నమః
47 ఓం పీతవాససే నమః
48 ఓం పారిజాతాపహారకాయ నమః
49 ఓం గోవర్దనాచలోద్ధర్త్రే నమః
50 ఓం గోపాలాయ నమః
51 ఓం సర్వపాలకాయ నమః
52 ఓం అజాయ నమః
53 ఓం నిరంజనాయ నమః
54 ఓం కామజనకాయ నమః
55 ఓం కంజలోచనాయ నమః
56 ఓం మధుఘ్నే నమః
57 ఓం మధురానాధాయ నమః
58 ఓం ద్వారకానాయకాయ నమః
59 ఓం బలినే నమః
60 ఓం బృదావనాంత సంచారిణే నమః
61 ఓం తులసీదామభూషణాయ నమః
62 ఓం శమంతకమణేర్హర్త్రే నమః
63 ఓం నరనారాయణాత్మకాయ నమః
64 ఓం కుబ్జాకృష్టాంబరధరాయ నమః
65 ఓం మాయినే నమః
66 ఓం పురమపురుషాయ నమః
67 ఓం ముష్టికాసుర చాణుర మల్ల యుద్ధ విశారదాయ నమః
68 ఓం సంసారవైరిణే నమః
69 ఓం కంసారయే నమః
70 ఓం మురారయే నమః
71 ఓం నరకాంతకాయ నమః
72 ఓం అనాదిబ్రహ్మచారిణే నమః
73 ఓం కృష్ణావ్యసనకర్శకాయ నమః
74 ఓం శిశుపాలశిరశ్ఛేత్రే నమః
75 ఓం దుర్యోధన కులాంతకాయ నమః
76 ఓం విదురాక్రూరవరదాయ నమః
77 ఓం విశ్వరూప ప్రదర్శకాయ నమః
78 ఓం సత్యవాచే నమః
79 ఓం సత్యసంకల్పాయ నమః
80 ఓం సత్యభామారతాయ నమః
81 ఓం జయినే నమః
82 ఓం సుభద్రాపూర్వజాయ నమః
83 ఓం విష్ణవే నమః
84 ఓం భీష్మముక్తిప్రదాయకాయ నమః
85 ఓం జగద్గురవే నమః
86 ఓం జగన్నాథాయ నమః
87 ఓం వేణూనాదవిశారదాయ నమః
88 ఓం వృషభాసుర విధ్వంసినే నమః
89 ఓం బాణాసుర కరాంతకాయ నమః
90 ఓం యుధిష్ఠిర ప్రతిష్ఠాత్రే నమః
91 ఓం బల్హి బర్హావ తంసకాయ నమః
92 ఓం పార్థసారథయే నమః
93 ఓం అవ్యక్తాయ నమః
94 ఓం గీతామృతమహోదధయే నమః
95 ఓం కాళీయ ఫణిమాణిక్య రంజిత శ్రీపదాంబుజాయ నమః
96 ఓం దామోదరాయ నమః
97 ఓం యజ్ఞభోక్త్రే నమః
98 ఓం దానవేంద్రవినాశకాయ నమః
99 ఓం నారాయణాయ నమః
100 ఓం పరస్మై బ్రహ్మణే నమః
101 ఓం పన్నగాశనవాహనాయ నమః
102 ఓం జలక్రీడాసమా సక్తగోపీ వస్త్రాపహారకాయ నమః
103 ఓం పుణ్యశ్లోకాయ నమః
104 ఓం తీర్థపాదాయ నమః
105 ఓం వేదవేద్యాయ నమః
106 ఓం దయానిధయే నమః
107 ఓం సర్వతీర్ధాత్మకాయ నమః
108 ఓం సర్వ గ్రహరూపిణే నమః
109 ఓం పరాత్పరాయ నమః
శ్రీగోదా అష్టోత్తర శతనామావళి
01 ఓం శ్రీరంగనాయక్యై నమః
02 ఓం గోదాయై నమః
03 ఓం విష్ణుచిత్తాత్మజాయై నమః
04 ఓం సత్యై నమః
05 ఓం గోపీవేషధరాయై నమః
06 ఓం దేవ్యై నమః
07 ఓం భూసుతాయై నమః
08 ఓం భోగశాలిన్యై నమః
09 ఓం తులసీకాననోద్భుతాయై నమః
10 ఓం శ్రీయై నమః
11 ఓం ధన్విపురవాసిన్యై నమః
12 ఓం భట్టనాధ ప్రియకర్యై నమః
13 ఓం శ్రీకృష్ణ హితభోగిన్యై నమః
14 ఓం అమూక్త మాల్యదాయై నమః
15 ఓం బాలాయై నమః
16 ఓం రంగనాథ ప్రియాయై నమః
17 ఓం పరాయై నమః
18 ఓం విశ్వంభరాయై నమః
19 ఓం కలాలాపాయై నమః
20 ఓం యతిరాజసహోదర్యై నమః
21 ఓం కృష్ణానురక్తాయై నమః
22 ఓం సుభగాయై నమః
23 ఓం సులభశ్రియై నమః
24 ఓం సలక్షణాయై నమః
25 ఓం లక్ష్మీప్రియసఖ్యై నమః
26 ఓం శ్యామాయై నమః
27 ఓం దయాంచిత దృగంచలాయై నమః
28 ఓం ఫల్గున్యావిర్భవాయై నమః
29 ఓం రమ్యాయై నమః
30 ఓం ధనుర్మాసకృత వ్రతాయై నమః
31 ఓం చంపకాశోకపున్నాగమాలతీవిలసత్కచాయై మనః
32 ఓం ఆకారత్రయసంపన్నాయై మనః
33 ఓం నారాయణసమాశ్రితాయై మనః
34 ఓం శ్రీమదష్టాక్షరీమంత్రరాజస్థితమనోరథాయై మనః
35 ఓం మోక్షప్రదాననిపుణాయై మనః
36 ఓం మంత్రరత్నాధిదేవతాయై మనః
37 ఓం బ్రహ్మణ్యాయై మనః
38 ఓం లోకజనన్యై మనః
39 ఓం లీలామానుషరూపిణ్యై మనః
40 ఓం బ్రహ్మజ్ఞాయై మనః
41 ఓం అనుగ్రహాయై నమః
42 ఓం మాయాయై నమః
43 ఓం సచ్చిదానందవిగ్రహాయై నమః
44 ఓం మహాపతివ్రతాయై నమః
45 ఓం విష్ణుగుణకీర్తనలోలుపాయై నమః
46 ఓం ప్రపన్నార్తిహరాయై నమః
47 ఓం నిత్యాయై నమః
48 ఓం వేదసౌధవిహారిణ్యై నమః
49 ఓం శ్రీరంగనాధమాణిక్యమంజర్యై నమః
50 ఓం మంజుభాషిణ్యై నమః
51 ఓం సుగంధార్థ గ్రంధకర్యై నమః
52 ఓం రంగమంగళ దీపికాయై నమః
53 ఓం ధ్వజవజ్రాంకుశాబ్జాంకమృదుపాదతలాంచితాయై నమః
54 ఓం తారకాకారనఖరాయై నమః
55 ఓం ప్రవాళమృదులాంగుళ్యై నమః
56 ఓం కూర్మోపమేయపాదోర్ధ్వభాగాయై నమః
57 ఓం శోభనపార్షికాయై నమః
58 ఓం వేదార్థభావవిదిత తత్వభోధాంఘ్రి పంకజాయై నమః
59 ఓం ఆనందబుద్భుదాకార సుగుల్భాయై నమః
60 ఓం పరమాయై నమః
61 ఓం అణుకాయై నమః
62 ఓం తేజశ్శ్రియోజ్జ్వలధృతపాదాంగుళి సుభూషితాయై నమః
63 ఓం మీన కేతనతూణీర చారుజంఘావిరాజితాయై నమః
64 ఓం కకుద్వజ్జానుయుగ్మాఢ్యాయై నమః
65 ఓం స్వర్ణ రంభాభ సక్థికాయై నమః
66 ఓం విశాలజఘనాయై నమః
67 ఓం పీనసుశ్రోణ్యై నమః
68 ఓం మణిమేఖలాయై నమః
69 ఓం ఆనందసాగరావర్త గంభీరాంభోజనాభికాయై నమః
70 ఓం భాస్వద్వళిత్రికాయై నమః
71 ఓం చారుజగత్పూర్ణమహోదర్యై నమః
72 ఓం నవమల్లీరోమరాజ్యై నమః
73 ఓం సుధాకుంభాయితస్తన్యై నమః
74 ఓం కల్పమాలానిభభుజాయై నమః
75 ఓం చంద్రఖండనఖాంచితాయై నమః
76 ఓం సుప్రవాళాహ్నాంగులి న్యస్త మహారత్నాంగుళీయకాయై నమః
77 ఓం నవారుణ ప్రవాళాభపాణిదేశ సమంచితాయై మనః
78 ఓం కంబుకంఠ్యై మనః
79 ఓం సుచుబుకాయై మనః
80 ఓం బింబోష్ఠ్యై మనః
81 ఓం కుందదంతయుజే నమః
82 ఓం కారుణ్యరసనిష్యంది నేత్రద్వయ సుశోభితాయై నమః
83 ఓం ముక్తాశుచిస్మితాయై నమః
84 ఓం చారుచాంపేయనిభనాస్తికాయై నమః
85 ఓం దర్పణాకార విపుల కపోల ద్వితయాంచితాయై నమః
86 ఓం అనంతార్క ప్రకాశోద్యన్మణితాటంకశోభితాయై నమః
87 ఓం కోటి సూర్యాగ్ని సంకాశ నానాభూషణ భూషితాయై నమః
88 ఓం సుగంధ వదనాయై నమః
89 ఓం సుభ్రువే నమః
90 ఓం అర్థచంద్రలలాటికాయై నమః
91 ఓం పూర్ణచంద్రాననాయై నమః
92 ఓం నీలకుటిలాలక శోభితాయై నమః
93 ఓం సౌందర్యసీమాయై నమః
94 ఓం విలసత్కస్తూరీ తిలకోజ్జ్వలాయై నమః
95 ఓం ధగధ్ధగాయమానోద్యన్మణిసీమంత భూషణాయై నమః
96 ఓం జజ్జ్వల్యమానసద్రత్న దివ్యచూడావతంసకాయై నమః
97 ఓం సూర్యార్థచంద్రవిలసద్భూషణాంచిత వేణికాయై నమః
98 ఓం అత్యర్కానలతేజోధిమణికంచుకధారిణ్యై నమః
99 ఓం నిగన్నిగద్రత్నపుంజ ప్రాంతస్వర్ణ నిచోళికాయై నమః
100 ఓం సద్రత్నాంచితవిద్యోతవిద్యుత్కుంజాభ శాటికాయై నమః
101 ఓం నానామణిగణాకీర్ణ హేమాంగద సుభూషితాయై నమః
102 ఓం కుంకుమాగరు కస్తూరీ దివ్యచందన చర్చితాయై నమః
103 ఓం స్వోచితౌజ్జ్వల్య వివిధ విచిత్ర మణిహారిణ్యై నమః
104 ఓం అసంఖ్యేయసుఖస్పర్శ సర్వాతిశయ భూషణాయై నమః
105 ఓం మల్లికాపారిజాతాది దివ్యపుష్పస్రగంచితాయై నమః
106 ఓం శ్రీరంగనిలయాయై నమః
107 ఓం పూజ్యాయై నమః
108 ఓం దివ్యదేశ సుశోభితాయై నమః
01 ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః
02 ఓం శ్రీ భూదేవ్యై నమః
03 ఓం శ్రీ నీళాదేవ్యై నమః
04 ఓం శ్రీ గోదాదేవ్యై నమః
05 ఓం శ్రీ అనంతాయ నమః
06 ఓం శ్రీ గరుడాయ నమః
07 ఓం శ్రీ విష్వక్సేనాయ నమః
08 ఓం శ్రీ పరాంకుశాయ నమః
09 ఓం శ్రీమతే రామానుజాయ నమః
10 ఓం శ్రీమద్వరవరమునయే నమః
11 ఓం స్వాచార్యేభ్యో నమః
12 ఓం పూర్వాచార్యేభ్యో నమః
సమస్త పరివారాయ సర్వ దివ్యమంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః
14. ధూప పరిమళం
ధూపమాఘ్రాపయామి
15. దీపం
దీపం సందర్శయామి
ధూప దీప అనంతరం శుద్ద ఆచమనీయం సమర్పయామి ( నోటికి మూడు సార్లు నీటిని అందించండి)
16 నైవేద్యం
నైవేద్యం సమర్పయామి
(పొంగలిని ప్రోక్షించి మృగముద్రతో ఆరగింపు చేయండి)
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి
హస్తౌ ప్రక్షాళయామి
పాదౌ ప్రక్షాళయామి
గండూషణం సమర్పయామి
17 మంగళాశాసనం
మంగళ నీరాజనం సమర్పయామి ( నిలుచుని హారతి వెలిగించి చూపండి)
లక్ష్మీచరణ లాక్షాంక సాక్షి శ్రీవత్సవక్షసే |
క్షేమం కరాయ సర్వేషాం శ్రీరంగేశాయ మంగళమ్ ||
స్వోచ్ఛిష్ట మాలికా బంధ గంధబంధుర జిష్ణవే |
విష్ణుచిత్త తనూజాయై గోదాయై నిత్యమంగళమ్ ||
18. సేవాకాలం
గురుపరంపర, తిరుప్పళ్లియొళుచ్చి, తిరుప్పావై 28 వ పాశురం వరకు చదవండి
19 నైవేద్యం
అర్ఘ్యం సమర్పయామి
పాద్యం సమర్పయామి
ఆచమనీయం సమర్పయామి
నైవేద్యం సమర్పయామి
(స్థలమును శుద్ధి చేసి ప్రసాదము, ఫలాదులను అన్నింటినీ యుంచి, ప్రోక్షించి, తులసి యుంచి, సురభి ముద్రను చూపి, మృగముద్రతో ఆరగింపు చేయాలి.)
పాయసాన్నం గూడాన్నంచ ముగ్దాన్నం శుద్ధమోదనం
దధి క్షీరాజ్య సంయుక్తం నానాశాక ఫలాన్వితం ||
అపూపాన్ వివిధాన్ స్వాదూన్ శాలిపిష్టోపపాదితాన్
పృథుకాన్ గూడసమ్మిశ్రాన్ సజీరక మరీచికాన్ ||
అన్నం చతుర్విధం జ్ఞేయం క్షీరాన్నం ఘృత శర్కరం
పంచధా షడ్రసోపేతం గృహాణ మధుసూదన ||
'ఓం ఓం ఓం'
(అనుచు స్వామికి చూపండి)
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి
హస్తౌ ప్రక్షాళయామి
పాదౌ ప్రక్షాళయామి
గండూషణం సమర్పయామి
తాంబూలం సమర్పయామి (తమలపాకు వక్కలు అందించండి)
సమస్త పరివారాయ సర్వ దివ్యమంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః
20 మంగళాశాసనం
మంగళ నీరాజనం సమర్పయామి ( నిలుచుని హారతి వెలిగించి చూపండి)
తిరుప్పావై 24 వ పాశురమం చదవండి
శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిథయేర్థినామ్ |
శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్ ||
లక్ష్మీచరణ లాక్షాంక సాక్షి శ్రీవత్సవక్షసే |
క్షేమం కరాయ సర్వేషాం శ్రీరంగేశాయ మంగళమ్ ||
అస్తు శ్రీస్తన కస్తూరీ వాసనా వాసితోరసే |
శ్రీహస్తిగిరి నాథాయ దేవరాజాయ మంగళమ్ ||
కమలా కుచ కస్తూరీ కర్ద మాంకిత వక్షసే |
యాదవాద్రి నివాసాయ సంపత్ పుత్రాయ మంగళమ్ ||
నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మెనే |
సుభద్రా ప్రాణనాథాయ జగన్నాథాయ మంగళమ్ ||
స్వోచ్ఛిష్ట మాలికా బంధ గంధబంధుర జిష్ణవే |
విష్ణుచిత్త తనూజాయై గోదాయై నిత్యమంగళమ్ ||
శ్రీనగర్యాం మహాపుర్యాం తామ్రపర్ణ్యుత్తరే తటే|
శ్రీ తింత్రిణీ మూలధామ్నే శఠకోపాయ మంగళమ్ ||
శేషో వా సైన్యనాథోవా శ్రీపతిర్వేతి సాత్వికైః|
వితర్క్యాయ మహాప్రాజ్ఞైః భాష్యకారాయ మంగళమ్ ||
తులా మూలావతీర్ణాయ తోషితాఖిల సూరయే
సౌమ్యజామాతృ మునయే శేషాంశాయాస్తు మంగళమ్ ||
మంగళాశాసనపరైః మదాచార్య పురోగమైః |
సర్వైశ్చ పూర్వై రాచార్యైః సత్కృతాయాస్తు మంగళమ్ ||
సమస్త పరివారాయ సర్వ దివ్యమంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః
సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి
సమస్త పరివారాయ సర్వ దివ్యమంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః
21 చామరోపచారం
చామరోపచారం సమర్పయామి
చామరమును వీచుచు తిరుప్పావై 29, 30 వ పాశురములను ఒక్కొక్కటి రెండు సార్లు అనుసంధించాలి.
ఇచ్చట ఆనాటి పాశురమును హారతినిస్తూ రెండుసార్లు విన్నపం చేయాలి
కర్కటే పూర్వఫల్గున్యాం తులసికాననోద్భవామ్ |
పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీమ్||
నీళాతుంగ స్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం
పారార్థ్యం స్వం శ్రుతి శత శిర సిద్ధ మధ్యాపయంతీ
స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యా బలాత్కృత్య భూంక్తే
గోదా తస్యై నమ ఇద మిదం భూయ ఏవాస్తు భూయః
Tags: తిరుప్పావై (ధనుర్మాస వ్రతం), dhanurmasam, Dhanurmasa Vratam telugu, Thiruppavai, dhanurmasa pooja, dhanurmasam marriages, dhanurmasam 2021-22, Significance of Dhanurmas