Drop Down Menus

గోత్రం అంటే ఏమిటి ? మీ గోత్రం ఎలా వచ్చిందో మీకు తెలుసా? What Is Gotram And What Is Its Significance?

గోత్రం అంటే ఏమిటి?

సైన్సు ప్రకారము  మన పూర్వీకులు గోత్ర విధానాన్ని ఎలా ఏర్పాటు చేశారో గమనించండి.

మీరు పూజలో కూర్చున్న ప్రతిసారీ, పూజారి మీ గోత్రం గురించి ఎందుకు అడుగుతారో మీకు తెలుసా? మీకు తెలీదు కాబట్టి అది చాదస్తం అనుకుంటున్నారు??

గోత్రం వెనుక ఉన్న శాస్త్రం మరేమిటో కాదు- 

*జీన్-మ్యాపింగ్* అని ఈమధ్య కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన అధునాతన శాస్త్రమే!

గోత్రం వ్యవస్థ అంటే ఏమిటి ?

మనకు ఈ వ్యవస్థ ఎందుకు ఉంది? 

వివాహాలకు ఇది చాలా ముఖ్యమైనదిగా మనము ఎందుకు భావిస్తాము? 

కొడుకులకు ఈ గోత్రం  ఎందుకు వారసత్వంగా వస్తుంది మరి కుమార్తెలు ఎందుకు రాదు?

వివాహం తర్వాత కుమార్తె గోత్రం ఎలా / ఎందుకు మారాలి? తర్కం ఏమిటి?

ఇది మనము అనుసరించే అద్భుతమైన జన్యు శాస్త్రం. మన గోత్ర వ్యవస్థ వెనుక జన్యుశాస్త్ర వ్యవస్థ ఎలా పనిచేస్తుందో చూద్దాం!

గోత్రమ్ అనే పదం రెండు సంస్కృత పదాల నుండి ఏర్పడింది. మొదటి పదం 'గౌ'- అంటే ఆవు, రెండవ పదం 'త్రాహి' అంటే కొట్టం

గోత్రం అంటే 'గోశాల' అని అర్ధం.

జీవశాస్త్రపరంగా, మానవ శరీరంలో  23 జతల క్రోమోజోములు ఉన్నాయి, వీటిల్లో సెక్స్ క్రోమోజోములు (తండ్రి నుండి ఒకటి మరియు తల్లి నుండి ఒకటి) అని పిలువబడే ఒక జత ఉంది. ఇది వ్యక్తి(ఫలిత కణం) యొక్క లింగాన్ని (gender) నిర్ణయిస్తుంది.

గర్భధారణ సమయంలో ఫలిత కణం XX క్రోమోజోములు అయితే అమ్మాయి అవుతుంది, అదే XY అయితే అబ్బాయి అవుతాడు.

XY లో - X తల్లి నుండి  మరియు Y తండ్రి నుండి తీసుకుంటుంది.

ఈ Y ప్రత్యేకమైనది మరియు అది X లో కలవదు.  కాబట్టి XY లో, Y X ని అణచివేస్తుంది , అందుకే కొడుకు Y క్రోమోజోమ్‌లను పొందుతాడు. ఇది మగ వంశం మధ్య మాత్రమే వెళుతుంది. (తండ్రి నుండి కొడుకు మరియు మనవడు ముని మనవడు .. అలా..).

మహిళలు ఎప్పటికీ Y ను పొందరు. అందువల్ల వంశవృక్షాన్ని గుర్తించడంలో జన్యుశాస్త్రంలో Y కీలక పాత్ర పోషిస్తుంది. స్త్రీలు ఎప్పటికీ Y ను పొందరు కాబట్టి స్త్రీ గోత్రం తన భర్తకు చెందినది అవుతుంది. అలా తన కూతురి గోత్రం వివాహం తరువాత మార్పు చెందుతుంది. 

ఒకే గోత్రీకుల మధ్య వివాహాలు జన్యుపరమైన రుగ్మతలను కలిగించే ప్రమాదాన్ని పెంచుతాయి..

గోత్రం ప్రకారం సంక్రమించిన Y క్రోమోజోమ్‌లు ఒకటిగా  ఉండకూడదు. ఎందుకంటే అది లోపభూయిష్టమైన ఫలిత కణాలను సక్రియం చేస్తుంది.

ఇదే కొనసాగితే, ఇది పురుషుల సృష్టికి కీలకమైన Y క్రోమోజోమ్ పరిమాణం మరియు బలాన్ని తగ్గిస్తుంది. కొన్ని సందర్భాలలో నశింపజేస్తాయి.

ఈ ప్రపంచంలో Y క్రోమోజోమ్ లేనట్లయితే, మగజాతే అంతరించిపోయేలా చేస్తుంది.

కాబట్టి గోత్రవ్యవస్థ జన్యుపరమైన లోపాలను నివారించడానికి మరియు Y క్రోమోజోమ్‌ను రక్షించడానికి ప్రయత్నించే ఒక పద్ధతే స్వగోత్రం. అందుకనే స్వగోత్రీకుల మధ్య వివాహం నిషేధించారు...

మన మహాఋషులచే సృష్టించబడ్డ అద్భుతమైన బయోసైన్స్ గోత్రం. ఇది మన భారతీయ వారసత్వ సంపద అని నిస్సందేహంగా చెప్పవచ్చు.

మన ఋషులు వేలాది సంవత్సరాల క్రితమే _ "GENE MAPPING" _ క్రమబద్ధీకరించారు.

అందుకనే ఈసారి ఎవరైనా గోత్రమని అంటే చాదస్తం అని కొట్టి పడేయకండి.

ఇలా వివరణతో సహా చెప్పండి. షేర్ చేయండి..

Related Posts:

2022-2023 రాశి ఫలితాలు : మీ రాశి పై క్లిక్ చేసి ఫలితాలు తెలుసుకోండి 

మేష రాశి :

http://www.hindutemplesguide.com/2021/12/2022-2023-mesha-rasi-rasi-2022-2023.html

వృషభ రాశి :

http://www.hindutemplesguide.com/2021/12/2022-2023-vrushaba-rasi-2022-2023.html

మిథున రాశి :

http://www.hindutemplesguide.com/2021/12/2022-2023-mithuna-rasi-2022-2023-telugu.html

కర్కాటక రాశి :

http://www.hindutemplesguide.com/2021/12/2022-2023-karkataka-rasi-2022-2023.html

సింహరాశి :

http://www.hindutemplesguide.com/2021/12/2022-2023-simha-rasi-phalalu-2022-2023.html

కన్యారాశి :

http://www.hindutemplesguide.com/2021/12/2022-2023-kanya-rasi-phalalu-2022-2023.html

తులారాశి :

http://www.hindutemplesguide.com/2021/12/2022-2023-tula-rasi-phalalu-2022-2023.html

వృశ్చిక రాశి :

http://www.hindutemplesguide.com/2021/12/2022-2023-dhannus-rasi-phalalu-2022_27.html

మకర రాశి :

http://www.hindutemplesguide.com/2021/12/2022-2023-makara-rasi-phalalu-2022-2023.html

ధనుస్సు రాశి :

http://www.hindutemplesguide.com/2021/12/2022-2023-dhannus-rasi-phalalu-2022.html

కుంభరాశి :

http://www.hindutemplesguide.com/2021/12/2022-2023-kumbha-rasi-phalalu-2022-2023.html

మీన రాశి :

http://www.hindutemplesguide.com/2021/12/2022-2023-meena-rasi-phalalu-2022-2023.html

గోత్రం అంటే ఏమిటి?, telugu gothram list, gotra list with surnames telugu, hindu gotra list how to know gotra by caste, gothram meaning, all gotra list, brahmin gotra list with surnames, list of gotras in andhrapradesh

ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.