లక్ష్మి దేవి అనుగ్రహనికి పంచకగవ్య దీపం ఋణ సమస్యలు తొలగుతాయి - Panchagavya - Uses, Benefits

పంచగవ్య దీపం..

లక్ష్మి దేవి అనుగ్రహనికి పంచకగవ్య దీపం వెలిగించి ఆరాధించడం వలన ఋణ సమస్యలు తొలగుతాయి.

ఎవరైతే జాతకరీత్యా, గోచారరీత్యా గ్రహ దోషాలు ఉంటాయో వారు ఈ దీపంతో ప్రతి నిత్యం దీపారాధన చేయడంవలన దోష నివృత్తి కలుగుతుంది.

యత్త్వగస్ధి గతం పాపం దేహే తిష్టతి మామకే!

ప్రాశనం పంచగవ్యస్య దంహాత్యగ్నిరివేంధనమ్!!

అంటే, మన శరీరాన్ని ఎముకలను, అంటి పెట్టుకొని ఉన్న ఏ దోషమైనా , పంచగవ్యాలను ఆస్వాదించుట వల్ల అగ్నిచే కట్టెలు దహింపబడినట్లు నశించి పోతుందని అర్థం.

పంచగవ్య దీపం మీ ఇంట్లో ఒక మండలము (48 రోజులు) వెలిగించటవలన యజ్ఞ ఫలితాలను పొందుతారు.

గోక్షీరము - ఆవు పాలు

గోఘ్రుతము - ఆవు నెయ్యి

గోదధి - ఆవు పెరుగు

గోమూత్రము - ఆవు మూత్రము

గోమయము - ఆవు పేడ

1) పచ్చి పాలలో చంద్రుడు,

2) పెరుగు లో వాయు దేవుడు,

3) గో మూత్రం లో వరుణుడు,

4)గోమయము లో అగ్ని దేవుడు,

5)ఆవు నెయ్యిలో సూర్యుడు నివసిస్తారు.

ఇవన్నీ దేవాలయాల ప్రతిష్ట, అభిషేకం,గృహప్రవేశ సమయాలు నందు ఉపయోగిస్తారు. చాలా ప్రత్యేకమైన ఈ పంచగవ్య వస్తువులతో తయారు చేసిన ఈ పంచగవ్య దీపం వెలిగించి ఇంట్లో పూజ చేయడం చాలా ఉత్తమము.

ఈ పంచగవ్య దీపం ఇంట్లో వెలిగించినప్పుడు, దాని నుండి వచ్చే పొగ మొత్తం ఇంటిని దైవత్వంతో నింపుతుంది, లోపాలను,దోషాలను తొలగిస్తుంది మరియు ఇంట్లో ఉన్నవారి మనస్సులను ,శరీర వ్యాధులను తొలగిస్తుంది.

ఈ పంచగవ్య దీపం మీ ఇంట్లో ఒక మండలము (48 రోజులు) వెలిగించటవలన యజ్ఞ ఫలితాలను పొందుతారు.

దీనిని మీరు ప్రతిరోజు ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య ఆవు నేతి తోగాని నువ్వులు నూనె తో వెలిగించండి. లక్ష్మి దేవి పూజలో అనుగ్రహనికి పంచకగవ్య దీపం వెలిగించి ఆరాధించడం వలన ఋణ సమస్యలు తొలగుతాయి.

Famous Posts:

హనుమ నామస్మరణం సర్వపాప నివారణం


స్త్రీల గూర్చి పురుషులు, పురుషుల గూర్చి స్త్రీలు తెలుసుకోవాల్సినవి?


సూర్యుడి అనుగ్రహాన్ని కోరుతూ ఆదివారాల నోము


శనేశ్వరుడు శనివారాల నోము


శుక్రవారాల నోముకి ఎంతో ప్రాధాన్యత

పంచగవ్య దీపం, panchagavya deepam benefits, panchagavya lamp benefits, panchagavya diya wholesale, panchagavya benefits Telugu, panchagavya diya price, panchagavya vilakku benefits, panchagavya diya benefits, panchagavya vilakku online

Comments