Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలంటే ఇంటిలో బీరువా ఏ దిక్కులో ఉంచాలి? Where to place Beeruva at Home | Vastu Tips

ధనంను నిల్వ చేసుకునే బీరువాను ఇంటిలో ఎటు వైపు ఉంచుకోవాలన్న అంశంపై వాస్తు నిపుణులు ఇలా చెబుతున్నారు.

వాస్తు శాస్త్రం ప్రకారం గది లో బీరువా వంటి ముఖ్యమైన వస్తువులు ఏవి ఎక్కడ ఉండాలో మన పూర్వీకులు నిర్ణయించారు. ఆ ప్రకారంగా ఇంటిలో నైరుతి భాగంలోనే బరువును అనగా బీరువాను పెట్టాలని చాలా మంది భావిస్తుంటారు. నిజానికి ఈ దిక్కున పెట్టకూడదట. బీరువాను ఉత్తర వాయువ్యంలో ఉంచాలి. ఎందుకంటే వాయువ్యం చంద్రునిది. చంద్రుడు ధన ప్రవాహానికి అధిపతి. కనుక వాస్తు సూచనలను అనుసరించి, డబ్బు నగలు భద్రపరచుకునే బీరువా ఉత్తర వాయువ్యంలో (అంటే పశ్చిమానికి – ఉత్తరానికి మధ్య ఉండే మూలలో) ఉంచాలని వాస్తు శాస్త్రం చెపుతోంది.అయితే నైరుతి పక్క కూడా బీరువా పెట్టుకోవచ్చు కానీ దానిలో బట్టలు మాత్రమే ఉంచాలి. నగలు ధనం ఉంచకూడదు.

అందుకని బీరువా దక్షిణ దిక్కు చేసి పెట్టాలి. అంటే మనం బీరువా తెరిచినపుడు మనం ఉత్తరం వెపు చూస్తుండేలా ఉండాలి. ఈ సూచన పాటించినట్లయితే డబ్బు నష్టం జరగదు. ధన ప్రవాహానికి ఆటంకం కలగకుండా వస్తూ ఉంటుంది.

అలా కుదరని పక్షంలో ఉత్తర దిక్కుకు బుద్ధుడు అధిపతి. బుద్ధుడు సంపదలకు అధిపతి కనుక బీరువాను ఉత్తర దిక్కు మధ్యభాగంలో ఉంచినా కూడా మంచిదే. బీరువా మాత్రం దక్షిణ ముఖమే చూస్తూ ఉండాలి.

ఎట్టి పరిస్థితుతుల్లోనూ బీరువా నైరుతి మూలలో ఉంచొద్దు. అలా చేస్తే మనకు ఎంత డబ్బు వచ్చినా అది చాలదు. వచ్చింది వచ్చినట్టే పోతుంటుంది.కాబట్టి మీరు ఇలా ఉత్తరవాయువ్యంలో బీరువా ఉంచుకొని ధనం, నగలు పెట్టుకుంటే అవి ఖర్చు కాకుండా ,ఇంకా అభివృద్ధిని తెచ్చిపెడుతాయి అంటున్నారు వాస్తు సస్త్ర నిపుణులు.

Famous Posts:

స్త్రీల గూర్చి పురుషులు, పురుషుల గూర్చి స్త్రీలు తెలుసుకోవాల్సినవి?


సూర్యుడి అనుగ్రహాన్ని కోరుతూ ఆదివారాల నోము


శనేశ్వరుడు శనివారాల నోము


శుక్రవారాల నోముకి ఎంతో ప్రాధాన్యత


శివదేవుని సోమవారపు నోము కథ


తీర్థం తీసుకున్న తర్వాత చేతిని తలపై రాసుకుంటే ఏంమవుతుంది?

beeruva vastu tips, vastu for beeruva in telugu, beeruva vastu in english, bed position as per vastu in telugu, best direction to keep beeruva, which direction should almirah face, beeruva vastu in kannada, beeruva in telugu

Comments