కొత్త అమావాస్య ,కొత్త అమావాస్య రోజున ఏమి చేయాలి...?
*'కొత్త అమావాస్య'* అనగానే దీని ప్రత్యేకతపై అందరూ దృష్టి పెడతారు. ఈ రోజున ఏం చేయాలనే విషయాన్ని గురించి , ఏం చేస్తే బాగుంటుందనే విషయాన్ని గురించి సందేహాలను వ్యక్తం చేస్తుంటారు.
సరైన సమాధానం లభించక సతమతమైపోతుంటారు. అయితే శాస్త్రాన్ని అనుసరించి నడచుకునే వాళ్లకి దీని గురించి ఎంతో కొంత తెలిసి ఉంటుంది.
*'ఫాల్గుణ బహుళ అమావాస్య'ని* కొత్త అమావాస్యగా భావిస్తూ ఉంటారు. ఇది చాంద్రమాన సంవత్సరంలో వచ్చే చివరి అమావాస్య. దీని తరువాత నూతన తెలుగు సంవత్సరాది ఆరంభమవుతుంది.
ఇక ఈ కొత్త అమావాస్య రోజున ఏ దైవాన్ని పూజించాలి ? ఎలాంటి కార్యక్రమాలని నిర్వహించాలనే విషయంలో తర్జనభర్జనలు పడుతుంటారు.
ఈ రోజున ఒక పూట ఉపవాసం చేస్తూ పరమశివుడిని ఆరాధించాలని శాస్త్రం చెబుతోంది.
సాధారణంగా ప్రతి నెలలోను అమావాస్య రోజున పితృదేవతలకు పిండప్రదానం చేయడం , తర్పణాలు వదలడం వంటివి చేస్తుంటారు.
అలాంటిది విశిష్టమైనటువంటి ఈ అమావాస్య రోజున ఈ విధమైన కార్యక్రమాలు చేయడం వలన పితృదేవతలకు ఎంతో సంతృప్తిని కలిగించినట్టు అవుతుందని శాస్త్రం స్పష్టం చేస్తోంది.
ఇక ఈ కార్యక్రమాలు ఆయా పుణ్యతీర్థాలలో నిర్వహించడం వలన ఉత్తమగతులు లభిస్తాయని చెప్పబడుతోంది.
కొత్త అమావాస్య, ugadi date, telugu ugadi 2022, ugadi story, amavasya, kotha amavasya