Drop Down Menus

ఉగాది నాడు ప్రతీ ఒక్కరూ ఈ ఐదు విధులను తప్పకుండా పాటించాలి - On Ugadi, everyone must perform these five duties

ఆచరణ విధానం
ఉగాది పర్వాన్ని ఆచరించే విధానాన్ని ‘దర్మసింధు’ అనే గ్రంధం, 
ఐదు విధి విధానాలు నిర్వహిస్తే పూర్తి అవుతుంది, అని చెప్తోంది.
ప్రతీ ఒక్కరూ ఈ ఐదు విధులను చక్కగా నిర్వర్తించాలి,
అనే ఉద్దేశ్యం తోనే ఉగాదికి కొంచం ముందుగా మీ అందరికీ తెలియజేయడం జరుగుతోంది.
మీరు తెలుసుకొని, మీకు ముఖ్యం అయిన వాళ్ళకి కూడా, తెలియజేసి, కావలసిన పదార్థాలు, వస్తువులు సమకూర్చుకొని, పర్వదినం చక్కగా శాస్త్రబద్ధంగా చేసుకోండి.
సనాతనధర్మం ఆచరించండి, హైందవ సంస్కృతిని పరిరక్షించండి. భావి తరాలు కి అందించండి.
ఇక, ఐదు విధుల గురించి వివరంగా క్రింద పొందు పరుస్తున్నాను.
1. తైలాభ్యంగనం,
2. నూతన సంవత్సరాది స్తోత్రం, (ప్రతీ సంవత్సరం పురుషునకు ఒక శ్లోకం ఉంటుంది)
3. నింబ కుసుమ భక్షణం (ఉగాది పచ్చడి సేవనం),
4. ధ్వజారోహణం (పూర్ణకుంభ దానం),
5. పంచాంగ శ్రవణం
ఈ పైన తెలియజేసిన విధులను ప్రతీ ఒక్కరూ చేయాలని,
ఉగాది వ్రత గ్రంధం తెలియజేస్తూఉంది.
1. తైలాభ్యంగనం
తైలాభ్యంగనం అంటే నువ్వులనూనె తో తలంటి పోసుకోవడం ప్రధమ విధి.
ఉగాది వంటి శుభ దినాలలో సూర్యోదయాని కి పూర్వము మాత్రమే, మహాలక్ష్మి నూనెలోను, గంగాదేవి నీటిలోను, ఆవహించి ఉంటారు అని ఋషుల మాట.
కావున నూనెతో తలంటుకుని, అభ్యంగన స్నానం చేసిన, 
లక్ష్మిదేవి, గంగా మాత అనుగ్రహాన్ని పొందగలుగుతారు.
అభ్యంగం కారయోన్నిత్యం సర్వేష్వంగేషు పుష్ఠినం
అంటే,
అభ్యంగన స్నానం, అన్ని అవయవాలకు పుష్టి దాయకం అని అర్థం. (శరీర అవయవాలు గట్టి పడతాయి)
ఆరోగ్య రీత్యా, ఆధ్యాత్మిక రీత్యా తైలాభ్యంగన స్నానం కు విశేష ప్రాధాన్యత ఉన్నది.
2. నూతన సంవత్సర స్తోత్రం
అభ్యంగ స్నానానంతరం,
సూర్యునికి, ఆర్ఘ్య, దీప, ధూపాధికాలు,
పుణ్యకాలానుష్టానం ఆచరించాలి.
తరువాత, మామిడిఆకుల తోరణాలతో, పూల తోరణాలతో, దేవుని గదిలో మంటపాన్ని నిర్మించి, అందు నూతన సంవత్సర పంచాంగాన్ని ఉంచాలి.
సంవత్సరాది దేవతను, ఇష్ట దేవతారాధన ను, మరియు పంచాంగాన్ని కూడా ఉంచి, పూజించి, ఉగాది ప్రసాదాన్ని (ఉగాది పచ్చడి) నివేదించాలి.
3. ఉగాది పచ్చడి తినటం
ఉగాది రోజున, ఉగాది పచ్చడి తినడం చాలా ముఖ్యం.
వేప పువ్వులు, కొత్త చింతపండు, కొత్త బెల్లం, ఉప్పు, మామిడి పిందెలు, కారం కలిసిన షడ్రుచుల రసాయనాన్నే ఉగాది పచ్చడి అంటాం!
అబ్దాదౌ నింబకుసుమం శర్కరామ్ల ఘృతైర్యుతమ్‌ భక్షితం పూర్వయామేతు తద్వర్షే సౌఖ్య దాయకమ్‌
అని ధర్మసింధు గ్రంధం చెబుతున్నది.
ఈ ఉగాది పచ్చడి ని ఇంట్లో అందరూ పరగడుపున (ఖాళీ కడుపుతో) సేవించవలెను.
ఉగాది పచ్చడి సేవించడం వల్ల, సంవత్సరమంతా సౌఖ్యదాయకం అని ఈ శ్లోకము యొక్క భావం.
షడ్రుచుల మేళవింపు అయిన ఉగాది పచ్చడి, కేవలం రుచిగా ఉండటమే కాకుండా, ఔషద గుణాలు తో, మరెన్నో విషయాలు మనకు తెలియజేస్తూ ఉంది.
తీపి, చేదు, పులుపు, వగరు, ఉప్పు, కారం అనే ఆరురుచులు జీవితములో సుఖాలు, కష్టాలు, జీవితంలో అన్ని  అనుభూతులు కి తార్కాణం (symbolic) గా నిలుస్తూ ఉన్నాయి.
సుఖాలకు పొంగి పోవద్దు, 
దుఃఖానికి కృంగి పోవద్దు,
సుఖదుఃఖాలు సమభావం తో స్వీకరించు అనే సందేశాన్ని ఈ పచ్చడి మనకి ఇస్తూ ఉంది.
అంతే కాకుండా, ఈ పచ్చడి తినటం వలన, వివిధ అనారోగ్య స్థితులు పరిహరించబడి, రోగశాంతి, ఆరోగ్యపుష్టి కూడా చేకూరుతుంది.
4. పూర్ణకుంభ దానం
ఉగాది నాడు ఇంద్రధ్వజ, బ్రహ్మధ్వజ ప్రతిష్టాపన ఆచారం గా ఉన్నది.
ఒక పట్టు వస్త్రాన్ని, 
ఒక వెదురుగడకు పతాకం వలె కట్టి, 
దానిపై కొబ్బరిబొండం తో కలశాన్ని వుంచి,
ఆ కర్రకు మామిడి ఆకులు, నింబ పత్రాలు, పూల తోరణాలు కట్టి,
ఇంటి ప్రాంగణంలో ప్రతిష్టించి ఆరాధించడం ధ్వజావరోహణం అంటారు.
యధా శక్తి, రాగి, వెండి, పంచలోహాలు లేదా మట్టితో చేసిన కొత్తకుండ ను కలశంలా చేసి రంగులతో అలంకరించి అందులో పంచపల్లవాలు (మామిడి, అశోక, నేరేడు, మోదుగ మరియు వేప చిగుళ్ళు), సుగంధ చందనం కలిపి పుష్పాక్షతలు వేసి ఆవాహనం చేయాలి.
పూజించిన కలశానికి, 
ఒక నూతన వస్త్రాన్ని చుట్టి,
కలశంపై, పసుపు కుంకుమ చందనం, పసుపుదారాలతో, 
అలంకరించిన కొబ్బరిబొండం ను ఉంచి పూజించాలి.
పురోహితునకు గాని, గురుతుల్యులకు గానీ, 
పూర్ణకుంభ దానము ఇచ్చి,
వారి ఆశీస్సులు పొందడం వల్ల, 
సంవత్సరం పొడవునా విశేషఫలితం లభిస్తుందని ప్రతీతి.
5. పంచాంగ శ్రవణం
తిధి, వార, నక్షత్ర, యోగ, కరణములు అనే పంచఅంగాల సమన్వితం పంచాంగం. 
ఉగాది నాడు దేవాలయంలో గాని, 
గ్రామ కూడలి ప్రదేశాల్లో గాని,
పండితుల, సిద్థాంతుల సమక్షంలో,
కందాయఫలాలు స్థూలంగా తెలుసుకోవాలి.
చెప్పిన దాని అనుగుణం గా, సంవత్సరం పొడవునా నడచుకొవాలో,
ఉగాది రోజున మన మనసులలో అంకురార్పణం చేసుకోవాలి.
ఉగాది నాటి పంచాంగశ్రవణం వల్ల,
గంగానదీ స్నానఫలితం లభిస్తుంది.
ఉగాది నాడు పంచాంగశ్రవణం చేసేవారికి,
సూర్యుడు శౌర్యాన్ని,
చంద్రుడు ఇంద్రసమాన వైభవాన్ని,
కుజుడు శుభాన్ని,
శని ఐశ్వర్యాన్ని,
రాహువు బాహుబలాన్ని,
కేతువు కులాధిక్యతను, కలుగచేస్తారు అని చెప్పబడినది.
‘బ్రహ్మ ప్రళయం’ పూర్తి అయిన తరువాత, తిరిగి సృష్టి ప్రారంభించు సమయాన్ని, ‘బ్రహ్మ కల్పం’ అంటారు.
ఇలా ప్రతీ కల్పం లోను మొదట వచ్చే యుగాదిని,
యుగానికి ఆదిగా,
ప్రారంభ సమయమును,
ఉగాది అని వ్యవహరిస్తూ ఉంటారు.
ఈ ‘ఉగాది’ పర్వదినం మనకు చైత్రమాసంలో ప్రారంభము అవడం వల్ల,
ఆ రోజు నుండి మన తెలుగుసంవత్సర ఆరంభదినంగా పరిగణించి,
లెక్కించుటకు వీలుగా ఉండేందుకే, ఉగాది పండుగను మనకు ఋషిపుంగవులు ఏర్పాటు చేశారు.
లక్ష్మీ ప్రాప్తికి, విజయసాధనకు చైతన్యం కావాలి.
జీవునకు చైతన్యం కలిగించేది కాలం. ఆ కాలాన్ని నిర్వచించేది పంచాంగ శ్రవణం,
ముఖ్యంగా, ఉగాది సమయం లో ఇవన్నీ వినటం దేనికి? అనే అనుమానం కలుగుతుంది మనకి,
మనకి అందరి జీవులకు, కాల స్వరూపము రాబోయే సంవత్సరం, అందులో
గంటలు, రోజులు, వారాలు, పక్షాలు, నెలలు, ఋతువులు, ఆయనాలు, నివసిస్తున్నాయి.
దేనిలో ఏమిటి చేయవచ్చు, ఏది చేయకూడదు, అనే విషయాలు మనం తెలుసుకొని, మన యొక్క జీవితంలో ఆచరణ లోనికి తీసుకొని వచ్చే కార్యక్రమాల ఆలోచనలు చేయవచ్చు.
ఆవిధంగా ప్రవర్తించినట్లు అయితే, రాబోయే కొత్తసంవత్సరం కి పూలబాట దైవసన్నిధిలో (ఇక్కడ కాల స్వరూపము దైవం) ఏర్పరచుకున్నట్లూ కూడా అవుతుంది.
మన జీవితం సాఫీగా జరగడానికి, ఆలోచించు కోవడానికి, మన ఋషులు ఏర్పరచిన బంగారుబాట పంచాంగశ్రవణం.
అన్ని తెలుసుకోండి, ఒకటికి పదిసార్లు చదివి ధర్మాన్ని ఆచరించండి.
ధర్మమే మనలను కాపాడుతుంది.
ముందుగా అందరికీ కూడా ఉగాది మీకు చక్కని ఆరభం కావాలి అని ఆశిస్తూ...

తెలుగు రాశిఫలాలు 2023-2024

Tags: ఉగాది, ugadi 2023, when is ugadi in 2022 in india, telugu ugadi 2022, when is ugadi in 2022, kannada ugadi 2022, ugadi story, how to celebrate ugadi in telugu
ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.