Drop Down Menus

శివుడు పార్వతికి చెప్పిన 5 మరణ రహస్యాలు....| 5 death secrets told by Lord Shiva to Parvati

శివుడు పార్వతికి చెప్పిన 5 మరణ రహస్యాలు....

‘చావు నుంచి ఎవరూ తప్పించుకోలేరు. కాలుడి (యముడు) దృష్టిలో ధనవంతుడైనా, బీదవాడైనా, ఎవరైనా ఒక్కటే...

పాపం చేస్తే అందుకు శిక్ష అనుభవించక తప్పదు.’ ఇదే కాదు, ఓ వ్యక్తి చనిపోయిన తరువాత ఏం జరుగుతుంది? చావు రహస్యం ఏమిటి? ఇత్యాది విషయాలన్నీ కేదార్నాథ్కు వెళ్లే దారిలో శివుడు పార్వతికి చెప్పినట్టుగా, వాటిని యమధర్మ రాజు ఉద్ఘాటించినట్టుగా హిందూ ధర్మం ప్రకారం పురాణాల్లో చెప్పబడింది. అయితే ప్రస్తుత సమాజంలో పాపభీతిని మరిచిన వారు తప్పులు చేస్తూనే పోతున్నారు. కానీ కర్మ సిద్ధాంతం వారిని వెంటాడుతూనే ఉంటుంది. మనుషులంతా ఆధిపత్య, నియంతృత్వ ధోరణులను వదిలి ఇతరులకు సహాయం చేయాలని ఈ సిద్ధాంతం చెబుతోంది. దీని సంగతి పక్కన పెడితే మనిషికి చెందిన 5 చావు రహస్యాలను యమధర్మరాజు చిన్నారి నచికేతకు చెప్పినట్టుగా పురాణాల ప్రకారం తెలుస్తోంది. ఆ రహస్యాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

1. ఓం (ఓంకారం) పరమాత్మ స్వరూపం. మనిషి హృదయంలో బ్రహ్మ నివసిస్తాడు.

2. యమధర్మ రాజు చెప్పిన ప్రకారం మనిషి చనిపోయినా అతని ఆత్మ చావదు. దేహాన్ని ఏం చేసినా కూడా ఆత్మ అందుకు ఏమీ చేయలేదు.

3. ఆత్మకు జననం, మరణం లేదు.

4. మనిషి చనిపోయాడంటే అతని పుట్టుక, చావు అనే చక్రం పూర్తయినట్టే. ఇక అతనికి పుట్టుక, చావుల చక్రంతో సంబంధం ఉండదు. అతను బ్రహ్మతో సమానం.

5. యమధర్మ రాజు చెప్పిన దాని ప్రకారం దేవున్ని నమ్మని మనుషులు చావు తర్వాత ఆత్మగా మారి ప్రశాంతత కోసం చూస్తారు.

ఆత్మల గురించిన ప్రస్తావన….

భగవద్గీత లో.

శ్రీకృష్ణ భగవానుడు, భగవద్గీతలో, ఆత్మ సిద్ధాంతాన్ని వివరించాడు. ఆత్మ నాశనం కానిది, శస్త్రం ఏదీ ఛేదించలేనిది, అగ్ని దహించలేనిది, నీరు తడపలేనిది, వాయువు ఆర్పలేనిది అని వివరించాడు. ఇంతేకాక “అహం బ్రహ్మస్మి” నీలో ఉన్న ఆత్మ భగవంతుని అంశే కనుక ఆవిషయాన్ని తెలుసుకోమని చెబుతున్నాయి.

Famous Posts:

ఈ రాశులవారు జీవితంలో డబ్బు హోదాలతో ఉన్నత స్థితిలో ఉంటారు


ఈ ఉంగరం ధరిస్తే అన్ని శుభాలే


అదృష్టాన్ని తెచ్చి పెట్టే నవబ్రహ్మ ఆలయం


> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి


100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం


> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం


అందరు తప్పక చదవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం

Shiva parvathi, lord shiva, goddess parvathi, devotional news, shiva stotrams

ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.