ఆదిత్యుని అనుగ్రహం పొందడానికి తేలికైన మార్గాలు ఏవి..!!
> ఆదిత్యుని అనుగ్రహం పొందడానికి శాస్త్రాలు చాలా మార్గాలు చెప్పాయి. తేలికైన మార్గాలతోనే సూర్యానుగ్రహం పొందవచ్చు.
> ప్రతీరోజు సూర్యోదయాత్ పూర్వమే స్నానాదులు పూర్తిచేసుకుని సూర్యునికి నమస్కారం చేసుకోవడం ప్రతీవారి విధి.
> సూర్యానుగ్రహం పొందాలనుకునే వారు ముఖ్యంగా ఈ విధిని ఆచరించాలి. సూర్యానుగ్రహం పొందడానికి శాస్త్రాలు చాలా మార్గాలు చెప్పాయి. బ్రహ్మ పురాణంలో చెప్పిన కొన్ని మార్గాలు .
> మాఘశుద్ధ షష్టి లేదా సప్తమి నాడైనా ఏక భుక్తంతో వ్రతనియమాలను పాటిస్తూ సూర్యుని పూజించినవారు అశ్వమేధ యాగం చేసిన ఫలితాన్ని పొందుతారు.
> సప్తమినాడు ఉపవాస నియమంతో భాస్కరుని పూజించినవారు పరమోత్కృష్ట గతులను పొందుతారు.
> శుక్లసప్తమినాడు ఉపవాసం చేసి తెల్లని రంగు ద్రవ్యాలతో సూర్యుని పూజించినవారు సకలపాపములనుండి విడివడినవారై సూర్యలోకాన్ని చేరుకుంటారు.
> శుక్లసప్తమి ఆదివారం కలిసివస్తే దానికి విజయాసప్తమి అని పేరు. ఆ రోజు చేసిన స్నాన, దాన, తప, హోమ, ఉపవాసాదులు మహాపాతకాలను సైతం నశింపజేస్తాయి.
> చిత్రభానుని అనేకరంగుల సువాసన కలిగిన పువ్వులతో ఉపవాసము చేస్తూ పూజించినవారు అభీష్టసిద్ధులు నెరవేర్చుకోగలరు.
> ఒక నియమంగా నేతితో లేదా నువ్వులనూనెతో దీపాన్ని వెలిగించి ఆదిత్యుని పూజించినవారికి కంటికి సంబంధించిన అనారోగ్యం కలగదు.
> ప్రతిరోజు క్రమం తప్పకుండా సూర్యునికి దీపాన్ని సమర్పించినవారు జ్ఞానదీపంతో ప్రకాశిస్తారు.
> ఎర్రచందనంతో కలిపిన ఎర్రటి పుష్పాలతో సూర్యోదయ సమయంలో అర్ఘ్యాన్ని సమర్పించేవారు ఏడాదిలోగా సూర్యానుగ్రహ సిద్ధిని పొందగలరు.
> పాయసములు, అప్పములు, పండ్లు, కందమూలములు, నేతితో చేసిన వంటకాలు సూర్యునికి అర్పించినవారు అన్ని కోరికలను సాఫల్యం చేసుకోగలరు.
> సూర్యునికై ధ్వజం, ఛత్రం, చామరాలు, జెండాలు శ్రద్ధగా సమర్పించేవారు ఉత్తమగతులను పొందగలరు.
> సూర్యునికై నేతితో తర్పణాలు ఇస్తే సర్వసిద్ధులు కలుగుతాయి. పాలతో తర్పణాలు చేస్తే మానసికతాపములనుండి విముక్తులవుతారు. పెరుగుతో తర్పణాలు ఆచరిస్తే తలచిన పనులు నెరవేరుతాయి.
> ఆదిత్యునికై భక్తిగా ఏ ఏ ద్రవ్యాలను సమర్పిస్తారో అవన్నీ అసంఖ్యాక పదార్థాలుగా తిరిగి వారికి లభిస్తాయి.
> నియమాచారాలకు భావశుద్ధి కూడా చాలా ప్రధానం. భావశుద్ధితో చేసిన అర్చనాదులకు సరైన ఫలం లభిస్తుంది.
> తల భూమిని తాకే విధంగా సూర్యునికై నమస్కారం చేసేవారి సకలపాపాలు ఆ క్షణంలోనే నశిస్తాయనడంలో సందేహం లేదు.
> భక్తిప్రపత్తులతో (ఆత్మ)ప్రదక్షిణ చేసేవారు సప్తద్వీపములతో కూడిన భూమి చుట్టూ ప్రదక్షిణ చేసిన ఫలాన్ని పొందుతారు....స్వస్తో...
Famous Posts:
> అదృష్టాన్ని తెచ్చి పెట్టే నవబ్రహ్మ ఆలయం
> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి
> 100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం
> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం
> అందరు తప్పక చదవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం
> ఏలినాటి శని బాధలు తప్పించే సూర్యదేవాలయం ఇదే
> గోవుతో గృహప్రవేశం ఎందుకు చేయిస్తారో తెలుసా?
surya bhagavan in telugu, surya bhagavan temple, surya bhagavan statue, surya bhagavan mantra, surya bhagavan wife, aditya hrudayam telugu, aditya stotram
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment