ప్రముఖ యంత్రములు – వాటి ఫలితాలు....!!
1. శ్రీ పూర్ణ శ్రీ చక్ర మహామేర మహా యంత్రం : చుట్టుపక్కల పరిస్థితులను దైవశక్తితో కలుపుతూ పరిపూర్ణ ఆధ్యాత్మిక, ఆనందంతో పాటు అద్వితీయ మనశ్శాంతిని ప్రసాదించి, ఆజ్ఞానంను తొలగించి జ్ఞానశక్తిని పెంపొందించుచూ, పునఃజన్మలేకుండా చేయును. ప్రతీ ఇంటి దైవమందిరంలో వుండవలసిన యంత్రరాజం.
2. శ్రీ మహాగణపతి మహా యంత్రం : సర్వకార్యసాఫల్యత, ఆటంక దోషాలు తొలగుట, సంతోషము, ఐశ్వర్యం, ఈతిభాదలు నుండి విముక్తి, ఆలోచనాశక్తి పెరిగి, బుద్ధిశక్తితో ఏ కార్యమునైనను సర్వసిద్ధి సాధించగల ఏకైక యంత్రం.
3. శ్రీ చక్రం యంత్రం : మనశ్శాంతి, ఆకర్షణాశక్తి, సంఘంలో గౌరవ మర్యాదలు పెంపొందించుటలో సహాయపడగల మహాయంత్రం. ముఖవర్చస్సు పెరిగి సర్వజన వశీకరణ కలిగించే యంత్రం.
4. సర్వజన మన, ధన, ఆకర్షణ సామ్రాజ్య లక్ష్మీ మహా యంత్రం శ్రీ మహాసుదర్శన యంత్రం : ఇది మూడు యంత్రాలు కలిగిన యంత్రం. వ్యాపార అభివృద్ధి, సమస్త కార్య, వ్యవహార జయం, సమస్త శత్రునాశనం, వాస్తు భూదోష నివృత్తి, అఖండ కీర్తి, అఖండ వ్యాపార దినదినాభివృద్ధి కలిగించే ఏకైక యంత్రం.
5. శ్రీ శూలినీ శరభేశ్వర ప్రత్యంఘీరా యంత్రం రాజం : సర్వశత్రు నివారణ, సర్వ రోగనివారణ, చేతబడులు, బాణామతి, వశీకరణ, సకల తాంత్రిక బాధల నుండి పూర్తి విముక్తి కలిగించి, మనశ్శాంతి కలిగించును. ప్రయోగము చేసిన వారి ప్రయోగమునకు తిరిగి వారి వద్దకే పంపించగల మహిమాన్విత యంత్రం.
6. సమస్త వాస్తు దోష పరిహార యంత్రం : అన్ని రకాల వాస్తు దోషాల నుండి గృహమును కాపాడి, భూమిలో వుండే దోషం కూడా ప్రారద్రోలి, గృహమునకు వైభవం తీసుకురాగల మహిమాన్విత వాస్తు యంత్రం. వీధి దోషాలు, శూల దోషాలు, గర్భదోషాలు ద్వారా దోషాలు నివృత్తి చేయగల యంత్రం.
7. సంతానగోపాల యంత్రం : శ్రీ కృష్ణుణ్ణి యొక్క తేజఃపూర్ణ యంత్రరాజం, స్త్రీ గర్భస్థ సంతాన దోషాలు, పురుష వీర్య దోషాలను పారద్రోలి ఎటువంటి జాతక దోషాలు వున్నను నివారించి సంతానప్రాప్తి అందించగల ఏకైక యంత్రం.
8. శత్రు జయ యంత్రం : మనచుట్టు వుండి మనము చేసిన పనులు కనిబెడుతూ మనకు ద్రోహం చేసిన లేదా చేయాలని తలపెట్టిన వారిని మట్టుపెట్టి శత్రు సంహారంగావించి అజాతశత్రువుగా కీర్తిప్రతిష్టలు పెంపొందించే మహిమాన్విత యంత్రం.
9. వివాహ సౌభాగ్య యంత్రం : సమస్త కుజదోషాలను, నాగదోషాలను, కాలసర్ప దోషాలను, పారద్రోలి ఆలస్య వివాహమును త్వరితగతిన చేయగల సమస్త వివాహ దోష పరిహర యంత్రం.
10. ధనాకర్షణ యంత్రం : ఐశ్వర్యప్రాప్తి, ధనయోగం కలిగించును. వ్యక్తిగతంగా చేయు పనుల యందు విజయాలను కలుగజేయును.
11. మహామత్స్య యంత్రం : వాస్తుదోషాలను తొలగించి, గృహమునకు పునర్జీవనం కలుగజేయును. గృహంలో సకల శుభాలు, సకల మంగళములను, సర్వాభిష్ఠసిద్ధిని కలుగజేయును.
12. లక్ష్మీ కుభేర యంత్రం : సమస్త వ్యాపార ఆర్ధిక, సమస్యలను సరిచేసి నిత్యం వ్యాపారంలో ధనలాభం కలిగేలా చేసి వ్యాపార సంబంధిత సమస్త బాధలను తీర్చగల మహాయంత్రం. వ్యాపార అభివృద్ధికి సంపూర్ణ తోడ్పాటు కలిగించి, వ్యాపారంలో ఉన్నత స్థాయికి చేర్చి చాలా మందికి ఉపాధి కలిగించే స్థాయి కలుగజేయును.
13. సకల ఐశ్వర్య సామ్రాజ్య లక్ష్మీ కటాక్ష మహాయంత్రం : నాలుగైదు రకాలుగా పనిచేయగల యంత్రం. శత్రు సంహారం, ధనము, ధాన్యము, వాహనము, సువర్ణ మాణిమయ మాణిక్యాదులు, పుత్రులు సేవక దాసీ జనము, బంధువులు అనేడి అష్ఠ ఐశ్వర్యాలు కలుగజేయగల వర్ణణాతీత మహిమాన్విత యంత్రం.
14. దశమహావిద్య మహాయంత్రం : పది యంత్రాలు దశమహాశక్తి దేవీ దేవతల యొక్క శక్తి స్వరూపమైన మహిమాన్విత యంత్రం. కాళీ, తార, భగలాముఖి, రాజమాతంగి, త్రిపురసుందరీ, భువనేశ్వరి, చిన్మయ, కమలాశిష్ఠ, దుర్మావతి దేవీల యొక్క పది రకాల ప్రయోజనాలు కలిగించే అద్భుత యంత్రం.
15. సకల రోగ నివారణ యంత్రం : వాత, పిత్త, కప, జ్వర, పాండు, వ్రణ, చర్మ, గర్భ, నేత్ర, కర్ణ, నాసిక, హస్తి సంబంధ సకల రోగ నివారణ యంత్రం.
16. సర్వరక్షాకర మహాయంత్రం : పూర్ణ కుటుంబానికి రక్షణ కల్పించి శత్రువులను లేకుండా చేసి ఊహించని ఉపద్రవాలను ఉపఘాతాలను తొలగించి ఉద్యోగముల రిత్యా భార్యభర్తలు వేరువేరుగా వున్నవారికి ఎవరికి ఆపదలు కలగకుండా రక్షించగల మహా యంత్రం. వాహనాల ప్రమాదాల నుండి రక్షణ కల్పించే యంత్రం.
17. లక్ష్మీ నారాయణ యంత్రం : సంతోషం, సత్‌ప్రవర్తన కలిగించి ఇచ్చిన మాటలను నిలుపుకునే శక్తిని కలిగించి పరువు ప్రతిష్ఠలను పెంచుతూ కుటుంబంలో వున్నవారికి వర్చస్సును శ్రేయస్సును కలిగించి నిరంతరం సంతోషం ఆనందాలను కలిగించే మహామాన్విత యంత్రం.
18. సర్వాభీష్ఠ సిద్ధి యంత్రం : కుటుంబంలో వున్న వారి అందరి కోరికలను నెరవేరుస్తూ సకల దోషాలను పోగొట్టి గృహమునకు వైభవం కలిగించి మహాలక్ష్మీ అనుగ్రహంను, పూర్తిగా ఇంటిలో వున్నవారికి కుభేర అనుగ్రహంను కలిగించి, మనస్సులో వున్న ధర్మబద్దమైన కోరికలను నేరవేర్చుకోగలిగిన శక్తిని పూర్తిగా అందించే అనుగ్రహ యంత్రం.
19. దృష్టినివారణ యంత్రం : నరఘోషను పొగొట్టును, చెడు దృష్టిని పొగొట్టును, కుటుంబంలో వున్నవారికి మనస్పర్థలు తొలగించి ఐశ్వర్యంకలిగించి గృహంలో వున్నవారికి సుఖసంతోషాలు అందించును.
20. అమృతవర్షిణి మహా యంత్రం : దర్శన మాత్రముచే సకల అభిష్టములు సిద్ధింపచేసి, ఆవిచ్చిన సంతతని కలిగించి కుటుంబ శ్రేయస్సును కలిగించి నిత్యసంతోషాలను కలిగించి ఇంద్రాద్రి అష్టదిక్పాలక అనుగ్రహముచే అజేయసిద్ధి కలుగజేయగల కుటుంబ క్షేమకర యంత్రం.
21. సర్వకావ్యసిద్ధి యంత్రం : ధారణశక్తిని పెంపొందించి, విశేష జ్ఞాపకశక్తిని అందించి కావ్య, నాటక అలంకార న్యాయ వైశేషిక పూర్ణప్రజ్ఞను అందించి స్థిర కీర్తి ప్రతిష్ఠలను అందించగల యంత్రం. శ్రద్ధ, ఆసక్తిని అనురక్తిని అందించగల యంత్రం. శ్రీవిద్య పరావిద్యాలను అందించగల అద్వితీయ యంత్రరాజం.
22. ధన్వంతరీ మహాయంత్రం : వైద్యులు ఉంచుకోదగ్గ మహిమాన్విత యంత్రం. ఈ యంత్రం వున్నచోట సమస్త వ్యాధులు దూరంగా పారిపోవును. ధన్వంతరీ అనుగ్రహంచే మందులు వాడవలసిన పనిలేకుండానే వ్యాధులు నశించును. వైద్యులు వైద్యాలయాలలో, గృహంలో వుంచుకొన్న వారు చేయు వైద్యం ఫలించి పరిపూర్ణ సంతృప్తి కలిగి తద్వారా ఐశ్వర్యసిద్ధి కలుగును.
23. మంగళమూర్తి మహా యంత్రం : వంశపారంపర్యంగా రావాల్సినఆస్తిపాస్తులను రప్పించి న్యాయస్థాన తగువులను మనకు అనుకూలంగా తీర్చు వచ్చినట్లు చేసి అన్నదమ్ముల, అక్కాచెల్లెళ్ల, తల్లిదండ్రుల, భార్యభర్తల బంధములను కాపాడుతూ కుటుంబంలో వున్నవారందరికీ ఐశ్వర్యవృద్ధిని కలిగించి వంశకీర్తిప్రతిష్టలను నలుదిక్కుల చాటింపచేసి, రాజకీయ లబ్ధిని నూతన వ్యాపార లబ్ధిని కలుగజేసి, కీర్తిప్రతిష్ఠలు కలుగచేయగల అద్భుత మహాయంత్రం.
24. కుటుంబ క్షేమకర యంత్రం : రాధాకృష్ణుల భీజసంపుటిత వైభవం యంత్రం. కుటుంబంలో మనస్పర్థలు తొలగించి, భార్యభర్తలకు అన్యోన్యత కలిగించి మంచి సంతానం పొందుటకు కుటుంబం క్షేమంగా వుండుటకు, వంశాభివృద్ధి కొరకు, పిల్లల అభివృద్ధి కొరకు, గృహములో వుంచుకోదగ్గ వలసిన మహిమాన్విత యంత్రం.
25. నవావరణ యంత్రం : లలితా త్రిపుర సుందరి దేవి యొక్క స్వరూపమైన ఈ యంత్ర మహిమను వర్ణించుటకు సాధ్యముకాదు. అమ్మవారి లలితా ఉపాసకులకు పూర్ణంగా ఉపయోగపడే అద్భుత యంత్రం. ఉపాసకుల వాక్‌సిద్ధి ఫలించే మహిమాన్విత యంత్రం. అమ్మవారి ఉపాసకులు నోటి నుంచి వచ్చే ప్రతీ మాట వాస్తవరూపం దాల్చును.
26. శ్రీ సుబ్రమణ్య సడాక్షర యంత్రం : యంత్రము, నాగదోషములు, కాలసర్పదోషాలు నివారించి వివాహం త్వరగా జరుగును. మేధాశక్తి పెంపొందించి, జ్ఞాన శక్తిని కలిగించును. సకల విద్యాప్రాప్తి కలిగించును.
27. పంచముఖి ఆంజనేయ యంత్రం : భూత, ప్రేత పిశాచ బాధ నివారణ కలిగించి, కీర్తి, వాక్ ప్రతిభ బుద్ధి యశస్సు, ధైర్యం, జ్ఞానం కలిగించి గృహానికి రక్షణ కవచంగా వుండును. మనలో వుండే భయాలు, భ్రాంతులను తొలగించే దివ్య యంత్రం.
28. మహామృత్యుంజయ యంత్రం : మృత్యుభయాన్ని దూరం చేసి వ్యాధులను నాశనం చేసి దీర్ఘకాలం ఆయురారోగ్య ఐశ్వర్యంతో జీవించునటు్ల చేసి సుఖమయ జీవనంను నిర్భయ సుఖమును నిశ్చల భక్తిని సునాయాశ మరణంనుకలుగచేయును. మనలో భయాన్ని తొలగించి ధైర్యాన్ని నింపే మహా యంత్రం.
29. కాలభైరవ యంత్రం : మృత్యుభయాన్ని తొలగించును. సకల భయాలను తొలగించి, పీడ పరిహారదోషాలను తొలగించును. శత్రుభయం, అపమృత్యుభయంను తొలగించును.
30. సామ్రాజ్య విజయలక్ష్మీ యంత్రం : గృహంలో పూర్ణ మనశ్శాంతినికలుగజేసి, ఇంటిలో ప్రతీ మూలను కూడా ప్రశాంతతను నింపి,మనస్సునకు శాంతిని చేకూర్చును. స్త్రీ, పురుషుల వియోగ దోషాలను పారద్రోలి సౌభాగ్యసిద్ధిని కలుగజేయును. చేయవలసిన కార్యములలో విజయం సాధిస్తారు.
Famous Posts:
> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి
> 100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం
> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం
> అందరు తప్పక చదవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం
> ఏలినాటి శని బాధలు తప్పించే సూర్యదేవాలయం ఇదే
> గోవుతో గృహప్రవేశం ఎందుకు చేయిస్తారో తెలుసా?
> శుక్రవారం ఈ పనులు తప్పకుండ చేయాలి
యంత్రములు - ఫలితాలు, yantralu phalithalu, yantra - results, Astrology In telugu
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment