శని అమావాస్య- పరిహారములు:
ఈ నెల 30 వ తేదీన అనగా 30-04-2022 శనివారం నాడు అమావాస్య రోజున ఈ క్రింది పరిహారములు పాటించి, శని దోషములు, పితృ దోషములు తొలగించుకొండి.
● శని అమావాస్య రోజున పిత్రు దేవతలకు తర్పణం, క్రతువులను ఆచరించి, శక్తికొలది దానం చేయడం వల్ల పితృ దోషములు తొలగి, సంతాన సమస్యలు, వివాహ సమస్యలు నివారణ అగును.
● ఈ శని అమావాస్య నాడు శనీశ్వర ఆరాధన మంచి శుభ ఫలితములను ఇచ్చును, ఈ రొజు శనీశ్వర స్వామికి తైలాభిషెకం చేసి, నల్ల నువ్వులు, ఆవాల నూనె, నీలి రంగు లేదా నల్ల వస్త్రం సమర్పించండి.
● శనీశ్వరుని స్తోత్రం, శ్లోకం, మంత్రం, మొ. పారాయణ చేసి, శని దోషం తగ్గించుకోండి.
● పేదలకు, యాచకులకు, నిస్సహాయులకు ఆహారం అందించండి.
● శనీశ్వర అమావాస్య రోజున ఆవనూనె దీపం వెలిగించి కుటుంబ సభ్యులు అందరూ హనుమాన్ చాలీషా పారాయణ చెయ్యండీ.
● ఈ శని అమావాస్య రోజున శనీశ్వర ఆరాధన వలన ఉద్యోగస్తుల సమస్యలు తొలగి, వారి హోదా, ప్రతిష్ట పెరుగును.
శని అమావాస్య, shani amavasya, shani amavasya in telugu, amavasya today, shani amavasya significance