నవ గ్రహాలు అనుకూలించాలి అంటే ఏమి చేయాలి?....What does it mean to adapt to the new planets

నవ గ్రహాలు అనుకూలించాలి అంటే  ఏమి చేయాలి ....

నవ గ్రహాలు అనుకూలించాలి అంటే పరిహార ప్రక్రియలు చేసుకోలేని వారికి ఈ విధంగా చేస్తే కొంత వరకు గ్రహాలు అనుకూలంగా అవుతాయి.

రవిచంద్రులు అనుకూలించాలి అంటే తల్లిదండ్రుల్ని గౌరవించాలి. తల్లిదండ్రులును బాగా చూసుకోవాలి. తల్లిదండ్రులకు సేవ చేసుకోవాలి.

గురు బలం కావాలంటే ఇంటికి వచ్చిన అతిథులను గౌరవించాలి.లేదా  రోజు పసుపును పాలతో కలిపి నుదుటన బొట్టు పెట్టుకోవాలి. ఆడవారు అయితే ముఖానికి పసుపు రాసుకోవాలి.

శుక్ర గ్రహం అనుకూలించాలి అంటే ఇంటి ఆడ పిల్లలను గౌరవించాలి. ఆదరించాలి అలా చేస్తే శుక్ర గ్రహము అనుగ్రహం ఇస్తుంది. ఒకవేళ ఇంటిలో ఆడపిల్లలు లేకుంటే మేనత్తను గౌరవించాలి. అత్త కూడా లేకుంటే కన్నతల్లిని గౌరవించాలి. కన్నతల్లి కి శుక్రవారం రోజు తాంబూలం ఇచ్చి పాద నమస్కారం చేసుకోవాలి.

కుజుడు అనుగ్రహం కొరకు  సోదర వర్గాన్ని ఆదరించాలి. సోదరిని బాగా చూసుకోవాలి. కార్తీకమాసం వచ్చిన భగినీహస్తభోజనం శుద్ధ విదియ నాడు వస్తుంది. ఆడపిల్ల ఇంటికి వెళ్ళి  భోజనం చేసి బట్టలు పెట్టి రావాలి.

శని గ్రహం అనుకూలించాలి అంటే ఇంట్లో పని మనుషులను చికాకు పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. పనివారి కి తగినంత జీతం ఇవ్వాలి. ఇంట్లో పని వారు లేకుంటే బీద సాదలను వికలాంగులను ఆదరించాలి.

బుధుడు అనుగ్రహించాలంటే మేనమామను ఆదరించాలి. యోగక్షేమములు  చూసుకోవాలి.లగ్న కుండలి ఆధారంగా కొందరు జాతకులు  అన్నదానం చేయరాదు.ఒకవేళ అన్నదానం చేసినట్లయితే అన్నం తిన్న వారు తిరిగి యజమానికి ద్రోహం చేస్తారు.ఇటువంటి సంఘటనలు మనం అప్పుడప్పుడు చూస్తాము. బంధువులు వీరి ఇంటికి వచ్చి కొంతకాలం ఉండి వీళ్లని మోసం చేయడం గమనిస్తూ ఉంటాం.వెంట తిరుగుతూ వీరి వెంట ఉంటూ వీరినే మోసం చేయడం చూస్తుంటాం.శని భగవానుని యొక్క స్థితిని బట్టి ఈ విధమైన  సంఘటనలు జరుగుతాయి.

రవి యొక్క స్థితిని అనుసరించి కొందరు ఎవరి నుంచి ఏ వస్తువు ఉచితంగా తీసుకోకూడదు.చంద్రుడు యొక్క స్థితిని ఆధారంగా కొందరు పాలు నీరు ఎవరికీ ఉచితంగా ఇవ్వకూడదు. మాంసాహారం తినరాదు.

కుజుడు యొక్క స్థితిని ఆధారంగా కొందరు చక్కెర వ్యాపారం చేయరాదు మరియు వికలాంగులకు దూరంగా ఉండాలి.

బుధుడు యొక్క స్థితిని ఆధారంగా  మాంసాహారం గుడ్లు చేపలు తినరాదు.ఆకుపచ్చ దుస్తులు ధరించరాదు.

గురువు యొక్క స్థానాన్ని ఆధారంగా కొందరు సాధువులకు సన్యాసులకు సహాయం చేయరాదు. వస్త్రాలను దానంగా ఇవ్వరాదు.

శుక్ర గ్రహం యొక్క స్థితిని ఆధారంగా కొందరు ఎక్కువ శబ్దంతో సంగీతం వినరాదు. అదే విధంగా డాన్స్ చేయరాదు.

శని భగవానుని స్థితి ఆధారంగా కొందరు గంగా భాగీరధులకు దూరంగా ఉండాలి.పర స్ర్తి సాంగత్యం చేయరాదు.

రాహు యొక్క స్థితిని ఆధారంగా కొందరు బ్లూ కలర్ బ్లాక్ కలర్ బట్టలు వేసుకో రాదు.కుక్కను పెంచరాదు.

కేతువు యొక్క స్థితి ఆధారంగా కొందరు తప్పుడు వాగ్దానాలు చేయరాదు. సంతానం లేని వారి నుండి భూమిని కొనరాదు.

Famous Posts:

ఎంతటి కష్టాన్ని అయిన పోగొట్టే అత్యంత శక్తివంతమైన హనుమ లాంగూల స్తోత్రమ్ 


మీ పుట్టిన తేది ప్రకారం ఈ వస్తువులు మీ ఇంట్లో ఉంచితే శుభం 


ఈ రూల్స్ తప్పక పాటించండి 


కొత్త కోడలు రాగానే సత్యనారాయణ వ్రతం ఎందుకు చేయిస్తారు?


మంగళ, శుక్రవారాల్లో ఎవరికీ డబ్బు ఇవ్వకూడదా?

నవగ్రహాలు, planets, Navagrahalu, Navagrahalu in telugu, Navagraha Pradakshina

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS