ఉన్నత విద్య కోసం:
పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ వారు విద్యాబ్యాసం చేసే పుస్తకాలను దేవుడి ముందు పెట్టి బెల్లం ముక్క నైవేద్యం పెట్టి భక్తిగా ఈ క్రింది శ్లోకాలను పఠించి హారతి ఇవ్వాలి..
వినాయక పూజ:
1.శ్లోకం:
తొండము నేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్
మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపుల మందహాసమున్.
కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై
యుండెడి పార్వతీ తనయ ఓయి గణాధిప నీకు మొక్కెదన్.
2.ఇంకొక శ్లోకం కూడా విద్యార్థులకు మంచిది:
తొలుత నవిఘ్నమస్తనుచు ధూర్జటీ నందన నీకు మ్రొక్కెదన్
ఫలితము సేయవయ్య నిని ప్రార్థన సేసెద నేకదంత నా
వలపటి చేతి ఘంటమున వాక్కున నెపుడు బాయకుండుమీ
తలపున నిన్ను వేడెదను దైవగణాధిప లోక నాయకా!
హాయగ్రీవ ఆరాధన
శ్లోకం: జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిమ్ ఆధారం సర్వ విద్యానం హాయగ్రీవ ముపాస్మహే
ఈ శ్లోకం చదువుకునే పిల్లలు రోజుకు 3 టైమ్స్ చదవాలి, తల్లిదండ్రులు పుల్లల కోసం ఈ మంత్రం 108 సార్లు జపించాలి అప్పుడు విద్యలు వాళ్లకు ఏ ఆటంకమ్ లేకుండా భగవంతుడు , తల్లిదండ్రులు ఆశీర్వాదం తో అభివృద్ధి లోకి వస్తారు.
సరస్వతి శ్లోకం
సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ |
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా ||
యా కుందేందు తుషార హార ధవళా, యా శుభ్ర వస్త్రావృతా |
యా వీణా వరదండ మండిత కరా, యా శ్వేత పద్మాసనా |
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్-దేవైః సదా పూజితా |
సా మామ్ పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా |
పిల్లలు బుద్ది మంతులుగా ఎదగాలి అంటే
దక్షిణామూర్తి శ్లోకం
గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం |
నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః ||
Famous Posts:
> సూర్యుడి అనుగ్రహాన్ని కోరుతూ ఆదివారాల నోము
> శుక్రవారాల నోముకి ఎంతో ప్రాధాన్యత
> తీర్థం తీసుకున్న తర్వాత చేతిని తలపై రాసుకుంటే ఏంమవుతుంది?
> సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఇన్ని లాభాలు
విద్య కోసం శ్లోకాలు, Slokas for Kids in Telugu, Slokas for Kids, telugu bhakti slokas, telugu slokas for children's pdf