గురువారం అరుణాచల గిరి ప్రదక్షిణ ఫలితాలు...
గురువారం గిరి ప్రదక్షిణను ఆలయంలోని శ్రీఅరుణాచలేశ్వరస్వామివారి సన్నిధి నుండి తొలి ప్రాకారంలో కన్ని మూలగా కొలువై ఉన్న శ్రీదుర్వాసమహర్షిని దర్శించిన తర్వాత అక్కడి నుండి ప్రారంభించాలి.
సుందర రూప దర్శనం
గిరి ప్రదక్షిణను ప్రారంభించే చోటు నుండే సంస్కృతం, తమిళంలో వేదం, దేవారమ్, తిరువాసగం, దివ్య ప్రబంధం, రుగ్, యజుర్వేద, సామ వేదాలను, మంత్రాలను స్తుతిస్తూ ప్రారంభించడం మంచిది. బయలుదేరి మూలవర్లు మరియు పలు దైవ మూర్తులను దర్శనాలు పొందుతూ మొదటి గోపురాన్ని దాటుకుని ఏనుగు ఘట్టానికి చేరుకుని అక్కడి నుండి తిరుఅణ్ణామలై ఈశ్వరుడిని దర్శిస్తే అదే సుందర రూప దర్శనం! నాలుగు వేదాలలో దేవపురుషుడైన 'సహస్ర శీర్ష పురుషుడు' అనే వేదవాక్యానికి తగ్గట్లు సహస్రవదనాలతో దర్శనమిస్తారు.
కొత్తగా వేదం పఠించాలనుకునేవారు, వేదాలపై పరిశోధన చేసేవారు, వేద పాఠాలలో కొత్త పాఠాలను ప్రారంభించేవారికి దోహదపడేదే సుందర రూప దర్శనం.
వేదం పఠించేటప్పుడు అక్షరదోషాలు, ఉచ్చారణలోపం, దైవీక మనోభావం లేకుండటం వంటి దోషాలకు ప్రాయశ్చిత్తంగా సుగంధ ద్రవ్యాలను వెలిగించి ఈ దర్శనం పొందడం విశేషదాయకం.
నంది సేవక మహాలింగ దర్శనం
కుతూహల నందీశ్వరుడిని దాటుకుని కంబత్తు ఇళయనార్ సన్నిధి నుండి తిరుఅణ్ణామలేశుడిని దర్శించడాన్నే నంది సేవక మహాలింగ దర్శనం అని అంటారు.
వాక్‌శక్తి లింగ దర్శనం
ఆ తదుపరి అక్కడి తూర్పు గోపురం మీదుగా రథం వీథికి చేరుకుని 'పినాక మురళీధర ముఖ లింగం' అనే పిలువబడే ఇంద్రలింగాన్ని దర్శించాలి. ఈ దర్శనం వల్ల ఉద్యోగంలో, పదవిలో ఎలాంటి తప్పిదాలు, అపవాదాలు కలుగకుండా రక్షిస్తుంది.
ఆ తర్వాత దక్షిణ గోపురం సమీపాన తిరుమంజన వీథిలోని శ్రీకర్పగ వినాయకుడి ఆలయం నుండి తిరుఅణ్ణామలైవాసుడిని దర్శిస్తే అదే వాక్‌శక్తి లింగ దర్శనం అవుతుంది. వాక్‌పటిమను పెంచేందుకు ఈ దర్శనం దోహదపడుతుంది.
వాక్ చాతుర్యం, ప్రజలను దైవీక అనుగ్రహం ద్వారా అయస్కాంతంలా ఆకర్షించే శక్తి కలుగటానికి, చదువుల్లో ఏర్పడే ఆటంకాలు తొలగిపోయేందుకు వాక్‌శక్తి లింగ దర్శనం తోడ్పడుతుంది.
బుద్ధి పూర్వ లింగ దర్శనం
గురువారం గిరిప్రదక్షిణలో వాక్‌శక్తి లింగ దర్శనం తర్వాత శ్రీశేషాద్రిస్వాముల ఆశ్రమం సమీపం నుండి పొందే దర్శనాన్నే 'బుద్ధి పూర్వలింగ దర్శనం' అని పిలుస్తారు. వర్తమాన పరిస్థితులలో పలువురు తప్పిదాలు చేయడానికి దుష్టశక్తులే కారణం. అలా చెడు స్నేహం వల్ల బుద్ధి మారి పలు తప్పిదాలు చేసి ఉంటే, వాటికి ప్రాయశ్చిత్తం కలిగించే దర్శనమిది! ఈ దర్శనం తర్వాత చెడు స్నేహితులకు దూరమై సత్సంగంలో చేరి శివ సేవలను నిర్వహించడమే చాలా మంచిది
గ్రహణ పంచముఖ దర్శనం
శ్రీశేషాద్రి స్వాములు జీవసమాధి పొందిన ఆశ్రమం నుండి లభించే బుద్ధి పూర్వలింగ దర్శనం తర్వాత శ్రీరమణాశ్రమం సరిహద్దు నుండి లభించే దర్శనమే గ్రహణ పంచముఖ దర్శనం. సూర్య చంద్ర గ్రహణ కాలాల్లో చేయాల్సిన పూజలు, తర్పణాలు ఇవ్వడం వంటి కార్యాలను మరచినవారికి ప్రాయశ్చిత్తంగా ఈ దర్శనం ఉంటుంది.
గోముఖ దర్శనం
ఇక సెంగం రహదారిలో కాస్తా దూరం వెళ్లాక మురుగన్ ఆలయం దాటుకుంటే కుడివైపున సింహ ముఖ తీర్థం కనిపిస్తుంది. ఈ తీర్థంలో స్నానమాచరించిన తర్వాత, లేక ఆ తీర్థపు జలాలను శిరస్సుపై చల్లుకున్న తర్వాతే అణ్ణామలైని దర్శిస్తే గోముఖ ఆకారంలో కనిపిస్తారు. ఈ దర్శనమే గోముఖ దర్శనం.
పశువులను కాలితో తన్నటం, కొట్టడం, దూడకు పాలివ్వకుండా పాలను పూర్తిగా సేకరించడం (దీనివల్ల పాలవాడు, ఆ పాలను సేవించే ఇరువురికి దోషమేర్పడుతుంది) వంటి పశు హింసా దోషాలకు పరిహారం ఇచ్చే దర్శనమే గోముఖ దర్శనం. కనుక పశువులను మృదువుగా తట్టి నడిపించడమే మంచిది. రోజూ పశువులకు ఏదైనా ఆహారపదార్థాన్ని ఇవ్వడమే తాము నిదురనుండి లేచిన తర్వత చేయవలసిన మొదటి మంచి కార్యమని సంకల్పించుకోవడం మంచిది.
బాల శిక్షా లింగ దర్శనం
గిరి ప్రదక్షిణ మార్గంలో మరికాస్త దూరం పోయాక తిరుఅణ్ణామలై దిక్‌దర్శన ఆలయం, అప్పు నందిని దాటుకుంటే వచ్చే జ్యోతి వినాయకుడి గుడి వద్ద ఉన్న తీర్థమే శివరాజ సింగ తీర్థం. ప్రస్తుతం 'సోణా నంది తీర్థం' అని పిలువబడుతోంది.
ఇక్కడి నుండి తిరుఅణ్ణామలై మహేశ్వరుడిని దర్శించటాన్నే బాల శిక్ష లింగ దర్శనం అని పిలుస్తారు. ఈ చోట సంస్కృతం, తమిళ మంత్రోచ్ఛాటనల మధ్య దర్శించడం శ్రేయోదాయకం.
ప్రతి మనిషీ చిరు ప్రాయంలో నేర్వాల్సిన సంస్కృతం, తమిళ స్తోత్రాలు ఎన్నో ఉన్నాయి. చిన్నప్పుడు చేయాల్సిన పూజా పద్ధతులు కూడా ఉన్నాయి. వీటిని చేయనివారికి పరిహారంగా వేద, తమిళ స్తోత్రాలు పఠిస్తూ దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. చిన్నప్పుడు పెద్దలకు కలిగించిన క్లేశాలకు, మనోవేదనలకు పరిహారంగా ఉంటుందీ దర్శనం. ఈ దర్శనం తర్వాత వృద్ధాశ్రమాలకు వెళ్లి పెద్దలకు సేవలు చేయడం చాలామంచిది.
పినాకి దర్శనం
గురువారం గిరి ప్రదక్షిణలో కామక్కాడు ప్రాంతం నుండి తిరుఅణ్ణామలైవాసుడిని దర్శించటాన్నే పినాకీ దర్శనం అని అంటారు. పాము పడగెత్తినట్లు దర్శనమిచ్చే ఈ దర్శనానికి మన మనస్సుల్లో చెలరేగే దుర్గుణాలను తొలగిస్తుంది ఈ దర్శనం
అసుర సమన లింగ దర్శనం
కామక్కాడు ప్రాంతం దాటాక మరొక సింహ ముఖ తీర్థం ఉంటుంది. ప్రస్తుతం అది చాలా దుస్థితిలో ఉంది.
మన జీవితంలో మంచి చెడులు అనే విచక్షణ లేకుండా యోచించకుండా పలు కార్యాలను చేస్తాము. వాటి వల్ల మనమే కాకుండా మన కుటుంబీకులకు హాని కలుగుతుంది. వాటిని గురించి తెలుపకపోయినా వారిలో ఏర్పడే మనో వేదనలు మనల్ని బాధిస్తాయి. ఈ కారణంగానే మనకు శిరోభారం, వంటి నొప్పులు, కడుపునొప్పి వంటి బాధలు కలుగుతాయి. వీటికి పరిష్కారం లభింపజేసే దర్శనమే అసుర సమన లింగ దర్శనం
పాప నివృత్తి సూక్ష్మ లింగ దర్శనం
ఆ తర్వాత అడిఅణ్ణామలై నుంచి పొందే దర్శనం. దీనిని పాప నివృత్తి లింగం దర్శనం అని శ్రీఅగస్త్య గ్రంథాలు జెబుతాయి.
అవాంఛనీయ పరిస్థితులలో అకారణంగా కలిగే కోపం, ద్వేషం వల్ల ఇతరులకు కలిగే కష్టాలను రూపుమాపి వారితో సఖ్యత ఏర్పడేలా చేస్తుందీ దర్శనం.
అసాధ్య వాక్‌విమోచన లింగ దర్శనం
అడిఅణ్ణామలై ఆలయ గోపురంతోపాటు అరుణాచలేశ్వరుడిని దర్శించడమే అసాధ్య వాక్ విమోచన లింగ దర్శనం. జీవితంలో ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా సందర్భవశాత్తూ తెలిసో తెలియకో అసత్యమాడే పరిస్థితులు కలుగుతాయి. అలా అసత్యమాడినందుకు పరిహారం ఇచ్చేదే ఈ దర్శనం. ఈ దర్శనం తర్వాత మళ్లీ అసత్యమాడని శివభక్తులకు దైవానుగ్రహం లభిస్తుంది.
తీర్థ స్నాన దర్శనం
గిరి ప్రదక్షిణ మార్గంలో కాంచి రహదారితో కలిసి చోట మంగళ తీర్థం ఒకటి ఉంది. గురువారం గిరి ప్రదక్షిణ చేస్తూ వస్తే ఈ తీర్థంలో స్నానమాచరించడం, తీర్థంలో జలాలు తక్కువగా ఉన్నప్పుడు శిరస్సుపై తీర్థ జలాలను చల్లుకున్న తర్వాత లభించే దర్శనమే తీర్థస్నాన దర్శనం. ఇక్కడ స్నానమాచరించి తడిబట్టలతో తిరుఅణ్ణామలై మహేశ్వరుడిని దర్శించడం శ్రేయోదాయకం.
ఆ తర్వాత శ్రీకుబేర లింగాన్ని శ్రీలక్ష్మీ స్తోత్రాలను పారాయణం చేస్తూ మొక్కిన తర్వాత తడిబట్టలను మార్చుకుని కొత్త దుస్తులు ధరించి తిరుఅణ్ణామలై గిరి ప్రదక్షిణను కొనసాగించాలి.
కూట్టు లింగ దర్శనం
తడి బట్టలు బాగా ఆరిన తర్వాత గిరిప్రదక్షిణ మార్గంలోనే వాటిని దానం చేయాలి. గిరి ప్రదక్షిణను కొనసాగించేందుకు వేలూరు రహదారి విడిపోయే చోట ఉన్న శ్మశానం నుండి తిరుఅణ్ణామలైవాసుని దర్శించి నమస్కరిస్తే అదే కూట్టు లింగ దర్శనమవుతుంది.
శ్మశానం, శ్మశాన స్థలాను చూస్తే కలిగే భయాలను పోగొడుతుందీ దర్శనం. శ్మశానికి వెళ్లి మృతులకు అంత్యకియ్రలు చేయనివారికి ప్రాయశ్చిత్త దర్శనమే ఇది. ఆ తర్వాత దుర్గమ్మ గుడి వద్ద సాష్టాంగ నమస్కరించి శయనస్థితిలోనే అణ్ణామలైవాసుని దర్శించాలి. దీని వల్ల విష్ణుమాయ తత్త్వాన్ని తెలుసుకోగలుగుతాము. గురువారం రాహుకాల సమయంలో (మధ్యాహ్నం 1.30 - 3) ఇలా దర్శించిన తర్వాత నిమ్మపులుసు ప్రసాదం దానమిస్తే వివాహ దోషాలు తొలగిపోతాయి. అవివాహితులకు వివాహ యోగం లభిస్తుంది.
చివరగా శ్రీభూత నారాయణ స్వామి ఆలయంలో లభించే భూతనారాయణ దర్శనంతో గురువారం నాటి గిరి ప్రదక్షిణ ముగుస్తుంది.
Famous Posts:
> ఆదివారం అరుణాచల గిరి ప్రదక్షిణ ఫలితాలు.
> సోమవారం అరుణాచల గిరి ప్రదక్షిణ ఫలితాలు.
> మంగళవారం అరుణాచల గిరి ప్రదక్షిణ ఫలితాలు.
> బుధవారం అరుణాచల గిరి ప్రదక్షిణ ఫలితాలు.
> గురువారం అరుణాచల గిరి ప్రదక్షిణ ఫలితాలు.
> శుక్రవారం అరుణాచల గిరి ప్రదక్షిణ ఫలితాలు.
> శనివారం అరుణాచల గిరి ప్రదక్షిణ ఫలితాలు.
arunachalam, giri pradakshina, arunachalam temple giri pradakshina dates, arunachalam temple, arunachalam temple giri, arunachalam temple giri pradakshina images, arunachalam giri pradakshina starting point, arunachalam giri pradakshina benefits, arunachalam temple giri pradakshina in telugu