బుధవారం అరుణాచల గిరి ప్రదక్షిణ ఫలితాలు..
బుధవారంనాడు తిరుఅణ్ణామలైని గిరి ప్రదక్షిణ చేయాలనుకునేవారు రెట్టయ్ పిళ్లయార్ గుడి సమీపంలోని శ్రీభూతనారాయణ సన్నిధిలో ప్రారంభించి పద్ధతిగా గిరి ప్రదక్షిణ చేసి మళ్లీ శ్రీభూతనారాయణ సన్నిధికి చేరుకుని ప్రదక్షిణ ముగించాలి.
దేవతలు, గంధర్వులు, పితృలు, దైవాలు వంటి ఉన్నత స్థితిని కలిగినవారే సులువుగా గిరి ప్రదక్షిణ చేసి పూజించలేని తిరుఅణ్ణామలైని ఏ అర్హతలు లేని నాకు గిరి ప్రదక్షిణ చేసే భాగ్యం ప్రసాదించు స్వామీ!' అంటూ వేడుకుని శ్రీభూత నారాయణ పెరుమాళ్‌ను మొక్కిన తర్వాత గిరి ప్రదక్షిణ ప్రారంభించాలి. అప్పుడే భూతనారాయణ పెరుమాళ్ ఏదో ఒక రూపంలో వచ్చి మార్గదర్శనం చేస్తాడు. ఇది ఎంతటి భాగ్యం!
బాణ లింగ దర్శనం
శ్రీభూత నారాయణుని దర్శించిన తర్వాత ఉత్తర గోపుర ద్వారం వద్దకు వెళ్లి అక్కడి నుండి తిరుఅణ్ణామలై ఈశ్వరుడిని దర్శించడమే బాణ లింగ దర్శనం. ఈ ప్రాంతంలో పాయసం దానం చేయడం మంచిది.
1. భార్యను వేధించడం
2. పర స్త్రీలను కామ దృష్టితో చూడటం
3. మహిళల జీవితాలను నాశనం చేయడం
పైన పేర్కొన్న తప్పిదాలకు చింతించి, మళ్లీ అలాంటి తప్పిదాలకు పాల్పడకుండా ప్రాయశ్చిత్తం ప్రసాదించే పవిత్రమైన దర్శనమిదే!
ఈ దర్శనం తర్వాత దక్షిణ ద్వారం గుండా వెలుపలికి వచ్చి గిరి ప్రదక్షిణను ప్రారంభించాలి.
ఆకాశ లింగ మూర్తి దర్శనం
గిరిప్రదక్షిణను ప్రారంభించేటప్పుడు శ్రీశేషాద్రి స్వామి జీవసమాధి ప్రాంతం నుండి తిరుఅణ్ణామలైవాసుడిని దర్శిస్తే పర్వత శిఖరాగ్రాన కాస్త పైదిశగా ఆకాశాన లభించే దర్శనమిది. దీనికి 'ఆకాశ లింగమూర్తి దర్శనం' అని పేరు. ప్రతి మానవుడు తన జీవితంలో తెలిసో తెలియకో పలు నిరాశలకు లోనవుతాడు. వాటి వల్ల కలిగే దోషాలను పటాపంచలు చేసే దర్శనం ఇదే. ఇక్కడ తిరుఅణ్ణామలై వాసుడిని సాష్టాంగంగా నమస్కరించాలి. అహంభావంతో పలు కుటుంబాలకు చేసిన కష్టాలను తగ్గించే దర్శనం ఇది.
శివపాద దర్శనం
ఇక రెండు పర్వతాల నడుమ లభించేదే శివపాద దర్శనం. సంతాన భాగ్యానికి నోచుకోనివారికి సంతాన ప్రాప్తి లభిస్తుంది.
ప్రత్యక్షదైవాలైన తల్లిదండ్రులకు, పెద్దలకు ప్రతినిత్యం పాదపూజ చేయాల్సిన బాధ్యత ప్రతిమానవుడికి ఉంది. వీరికి నిత్యపూజలు చేస్తేచాలును. తల్లిదండ్రులు, పెద్దల ఆశీస్సుల ద్వారా కష్టాలనుండి బయటపడగలరు. సందర్భవశాన ఈ పూజలను చేయలేనివారు మానసికంగానైనా ప్రతిరోజూ ఈ పూజను చేయాలి. మానసికమైన ప్రార్థన అంత సులువైన విషయం కాదు. గురుముఖంగా ఈ పూజా పద్ధతులను తెలుసుకోండి.
శివపాద పూజ
ప్రతి శివాలయంలోనూ ప్రతి రాత్రీ శివస్వర్ణపాదాలను మోస్తూ ఆలయ ప్రదక్షిణ చేసిన తర్వాత వాటిని శయనమండపానికి చేరుస్తారు. గర్భిణీ మహిళలు ఈ శివపాద పూజలలో పాల్గొని నైవేద్యమిచ్చిన పాలను సేవిస్తే సుఖ ప్రసవం జరుగుతుంది. ఈ మహిళలకు శివపాద పూజ నైవేద్యానికి పాలను ఇవ్వడం, నైవేద్యంగా ఇచ్చిన పాలను నిరుపదేల పిల్లలకు దానం ఇవ్వడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.
అన్నాభిషేక దర్శనం
చెంగం రోడ్డులో అరుదుగా లభించే దర్శనం అన్నాభిషేక దర్శనం. మంచు మేఘాలు తిరుఅణ్ణామలైపై కప్పబడినట్లుగా కనిపించే అద్భుత దృశ్యం! అన్ని సమయాల్లోనూ ఈ దర్శనం లభించదు. పూర్వజన్మ సుకృతం ఉన్నవారికే లభిస్తుంది.
ఈ అరుదైన దర్శన భాగ్యానికి నోచుకునేవారు జీవిత పర్యంతమూ ఎన్నడూ 'అన్న ద్వేషం' (ఆహారంపై ద్వేషం) కలుగదు. వీరికి రోగాలతో పడకపైనే మృతి చెందే పరిస్థితి ఏర్పడదు. ఈ దర్శనం తర్వాత ఐదేళ్లపాటు (1825 సార్లు గిరి ప్రదక్షిణ చేయాలి.) గిరి ప్రదక్షిణం కొనసాగించాలి.
సప్త ముఖ దర్శనం
అన్నాభిషేకం దర్శనం తర్వాత గిరి ప్రదక్షిణ మార్గంలో కుడివైపు తిరిగే చోటు వద్ద నంది దర్శనాలు, తీర్థరహస్యాలు ఉన్నాయి. వాటిని గురించి తెలుసుకుంటూ పోతే పెద్ద పురాణమే అవుతుంది.
ఓ నిర్ణీత ప్రాంతంలో తిరుఅణ్ణామలైని దర్శించేటప్పుడు ఏడు ముఖాలతో దర్శనమిస్తారు. ఆ సప్త ముఖాలు సప్త స్వరాలను తలపిస్తాయి. సంగీత కళాకారులు ఈ దర్శనం పొందితే కీర్తి ప్రతిష్టలు పొందగలుగుతారు. సంగీత విభాగంలో ప్రవేశించిన వారికి ప్రవేశించదలిచేవారికి మంచి ఫలితాలు ఇచ్చే దర్శనమిది.
కామక్రోధ దర్శనం
కామం అంటే స్త్రీపురుషుల మధ్య గల ఇచ్చ మాతమ్రే కాదు. ధనం తదితర ఐహిక వస్తువులపై పేరాశను కలిగి ఉండటం కూడా కామమే అవుతుంది. తాను అనుకున్నది పొందలేకపోయినప్పుడు కామం క్రోధంగా మారి మనిషిని దుర్మార్గుడిగా మార్చుతుంది.
తిరుఅణ్ణామలైవాసుని బుధవారం గిరి ప్రదక్షిణం చేయునపుడు కామకోడు ప్రాంతం నుండి పొందే దర్శనానికే 'కామ క్రోధ దర్శనం' అని పేరు. ఈ దర్శనం వల్ల కామ, క్రోధ మదమాశ్చర్యాలు తొలగిపోతాయి.
గిరి ప్రదక్షిణ ప్రారంభించడానికి ముందు ఈ చోట మూత్ర విసర్జన చేయాలి. మూత్రవిసర్జన చేస్తే మనలోని కామ క్రోధాలను భూదేవి స్వీకరించి త్యాగదేవిగా అనుగ్రహిస్తుంది. ఈ దర్శనం తీవ్రమైన మూత్రాశయ రోగానలు నయం చేయగలదు.
నాగ వల్మీకం
ఈ ప్రాంతంలో రహదారికి ఎడమవైపు పలు నాగుపాములు వాటి శక్తి ద్వారా రూపొందించిన నిలువెత్తు వల్మీకాలు (పుట్టలు) చాలా ఉంటాయి. నాగలోక దేవతలు ఈ చోటుకు వచ్చి ఏదో ఒక రూపంలో తిరుఅణ్ణామలైని గిరి ప్రదక్షిణ చేసి తమ లోకానికి వెళుతుంటాయి. ఈ నాగపాము పుట్టకు నిత్యం పూజలు చేస్తే సంతాన భాగ్యం కలుగుతుంది.
పాలాయి లింగమూర్తి దర్శనం
గిరి ప్రదక్షిణ మార్గంలో కుడివైపున ఉన్న జ్యోతి వినాయకుడి గుడి సమీపంలోని తీర్థకొలను గట్టు వద్ద లభించేదే 'పాలాయి లింగమూర్తి దర్శనం' ఇక్కడున్న నందుల కొమ్ముల మధ్య తిరుఅణ్ణామలైని దర్శనం చేయడం విశేషమైనది. పలు సమయాలలో చెట్ల ఆకులు ఈ దర్శనానికి అడ్డుపడుతుంటాయి. భాగ్యవంతులే ఈ దర్శనం పొందగలరు.
జంధ్యం ధరించనివారు, జంధ్యం ధరించినా గాయత్రి జపం, సంధ్యావందనం తదితర పూజలు చేయనివారు ఈ దర్శనం పొందిన తర్వాత ఆ పూజలన్నింటినీ సక్రమంగా చేయాల్సి ఉంటుంది. జంధ్యమంటే పంచభూత శక్తులను తనలో ఇముడ్చుకుని వేద, మంత్రాల శబ్దాలను గ్రహించి ధరించినవారికి కవచంగా ఉంటూ కష్టాలనుండి కాపాడుతుంది. జంధ్యాన్ని అలంకార వస్తువుగా భావించకూడదు. జంధ్యంలో తాళపు చెవిని ముడివేసి పెట్టరాదు. కనుక జంధ్యం వేసుకున్నవారిని హేళనగా మాట్లాడం పాపం. అలా హేళనచేసి జంధ్యం ధరించినవారి మనస్సును కష్టపెట్టి వుంటే వాటి వల్ల కలిగిన పాపాలను ఈ దర్శనం తొలగించగలదు. ఇక ఇలాంటి తప్పులను మళ్లీ చేయకూడదు. ఈ దర్శనం వల్ల ప్రాయశ్చిత్తం కలుగుతుంది. ఈ దర్శనం వల్ల న్యాయమైన పదోన్నతి కలగుతుంది. అప్పులు తీర్చగలుగుతారు. మహిళలకు ధనభాగ్యం కలుగుతుంది. తల్లి ఆశీస్సులు లభింపజేస్తుంది.
స్తంభ దీప దర్శనం
బుధవారం గిరిప్రదక్షిణలో తర్వాత అడిఅణ్ణామలై ప్రాంతం నుండి పొందే దర్శనానికి స్తంభ దీప దర్శనం అని పేరు
స్తంభ దీపంలో మూడు బాగాలు ఉంటాయి. స్తంభ దీపపు అడుగుభాగం బ్రహ్మ, నడిమధ్య భాగం విష్ణువు, పై భాగం- శివుడు. (దీపం వెలిగించే పద్ధతి, దీప పూజ దీప ఫలితాల వంటి వివరణలు మా ఆశ్రమ ప్రచురణ అయిన 'శుభ మంగళ దీప మహిమ' అనే గ్రంథంలో చూడండి)
సకల సౌభాగ్యాలు ముఖ్యంగా మహిళలకు దీర్ఘ సుమంగళ సౌభాగ్యాన్ని అందించే దర్శనమిది. దీని తర్వాత షణ్ముఖ దర్శనం, సప్తముఖ దర్శనం, పాద సరాసరి దర్శనం వంటి పలు దర్శన పద్ధతులు ఉన్నాయి. తగిన సద్గురువు అనుగ్రహంతో గిరి ప్రదక్షిణ చేస్తే వీటిని గురించి తెలుసుకోగలము.
ఆ తర్వాత గిరి ప్రదక్షిణ మార్గం కాంచీ రహదారి కలిసే స్థలానికి కుడివైపు వెళితే శ్రీ-ల-శ్రీ లోబామాత అగస్త్య ఆశమ్రాన్ని చేరుకోగలం.
శివశక్తి ఐక్య స్వరూప దర్శనం
ముందువైపున్న పర్వతశిఖరం అంబికాదేవి రూపంలోను వెనుక కాస్త ఎత్తయిన స్థితిలో ఉండే పర్వతం ఈశ్వర స్వరూపంగాను లభించే దర్శనమే శివశక్తి ఐక్య స్వరూప దర్శనం. రెండు కొండలూ ఒకే రేఖపై అమరికతో శివశక్తి ఐక్యమైన రీతిలో రెండూ ఒకటే. శక్తిలో శివం, శివంలో శక్తి ఒకదానికొకటి ఐక్యం అనే అద్భుత తత్త్వాన్ని వివరిస్తుంది.
గిరి ప్రదక్షిణ మార్గంలో మరెక్కడా అణ్ణామలై మహేశ్వరుడు ఇంతటి పరిపూర్ణంగా కనిపించరు. చాలా చాలా అపూర్వమైన దర్శనం!
ఈ అద్భుత దర్శన ప్రాంతంలోనే తిరుఅణ్ణామలై జ్యోతి అలంకార పీఠాధిపతి శక్తి శ్రీఅంకాళపరమేశ్వరి భక్తుడు శ్రీ-ల-శ్రీ వెంకటరామన్‌గారు అణ్ణామలైవాసుడి అనుగ్రహంతో నిర్మించి శ్రీ-ల-శ్రీ లోబామాత అగస్త్య ఆశమ్రం ఉంది. ప్రతి నెలా పౌర్ణమికి తిరుఅణ్ణామలైలో గిరి ప్రదక్షిణకు వచ్చే భక్తులు కాస్త భగవత్ ప్రసాదం, దాహార్తిని నివారించేందుకు తియ్యటి జలాలను అందించే సేవా కార్యక్రమాలు క్రమం తప్పకుండా నిర్వహిస్తుంటారు. పైగా భక్తుల ఆధ్యాత్మిక ఆరాటాన్ని తీర్చేలా పలు దైవీక ప్రచురణలు, 'శ్రీఅగస్త్య విజయం' పేరుతో ఆధ్యాత్మిక మాసపత్రికను వెలువరిస్తున్నారు.
జీవితంలో మీరెక్కడా వినలేని కనలేని పలు అద్భుత దైవీక విషయాలు, దైవ రహస్యాలు కలిగిన ఆశమ్ర ప్రచురణలను మీరు కొని చదివి లబ్దిపొందండంటూ గిరి ప్రదక్షిణ భక్తులను వేడుకుంటున్నాము.
అధికార నంది
గిరి ప్రదక్షిణ మార్గంలో ఆ తర్వాత మనం దర్శించనున్నది శ్రీ అధికార నందీశ్వరుడు. ప్రదోష కాలంలో ఈ చోట తిరుఅణ్ణామలైవాసుడిని దర్శించి పలు ఆలయాలలో అధికార నందితో కూడిన ఆలయాల్లో ప్రదోష పూజల వల్ల కలిగే ఫలితాలను పొందగలం.
పలు యుగాలుగా తిరుఅణ్ణామలైలో గిరి ప్రదక్షిణ చేసిన నంది భగవానుడు ఈ చోట తిరుఅణ్ణామలై వాసుని దర్శనం చేసిన మీదటే అధికార నందీశ్వరుడిగా ఉన్నత స్థితిని సంపాదించుకోగలిగాడు. కనుక ఉద్యోగంలో ఉన్నత పదవులు ఆశించేవారు, న్యాయంగా లభించాల్సిన పదవోన్నతి లభించకుండా చింతించేవారు దానధర్మాలు చేసి ఈ దర్శనం పొందటం వల్ల సత్ఫలితాలను పొందగలుగుతారు.
ఇడుక్కు పిళ్లయార్ సన్నిధి
ఇక కుబేర లింగాన్ని దర్శించిన తర్వాత కాస్త దూరం వెళితే కుడివైపున ఇడుక్కు పిళ్ళయార్ సన్నిధిని చూడగలం.
శ్రీఅరుణాచలేశ్వరుడు ఆలయంలోని మూలమూర్తి ఇడైక్కాట్టు సిద్ధపురుషుడు జీవసమాధి పైన కొలువై అనుగ్రహిస్తున్నాడు. ఇడైక్కాటు సిద్ధుడు తాను జీవ సమాధి పొందటానికి ముందు ఇడుక్కు పిళ్ళయార్ సన్నిధిలో మూడు యంత్రాలను ప్రతిష్టించారు.
ఇడుక్కు పిళ్ళయార్ సన్నిధిలో మనం పడుకున్న స్థితిలో తల నుండి పాదాల దాకా దోగాడుతూ వెళ్ళవలసి ఉండటంతో ఇడైకాట్టు సిద్ధపురుషుడి యంత్రాల నుండి ఆకర్షణ శక్తి మన దేహమంతటా ప్రసారమై నరాల వ్యాధులు, గర్భాశ్రయ సమస్యలు నయమవుతాయి.
ఈ మండపంలో అరుణాచలేశ్వరుడిని చూస్తూ దోగాడుతూ లోపలికి వెళ్లి వెలుపలికి వచ్చినప్పుడు కూడా అరుణాచలేశ్వరుడినే చూస్తూ రావాలి. అంటే ఉత్తరం నుండి దక్షిణ దిశ వరకూ అరుణాచలేశ్వరుడిని దర్శిస్తూ బయటపడటం సరైన పద్ధతి. ఓ భక్తుడు తన జీవిత పర్యంతమూ ఎన్నిమార్లు తిరుఅణ్ణామలైని గిరి ప్రదక్షిణలు చేసి, ఇడుక్కు పిళ్ళయార్‌ను దర్శించి, లోపలకు దోగాడుతూ వెళ్లి తిరిగి వస్తాడో అన్ని జన్మలు తగ్గుతాయి. గర్భవాసాన్ని తగ్గించే శక్తి వంతమైనది ఈ ఇరుకైన మార్గం!
సుష్వాట దర్శనం
ఆ తర్వాత వేలూరు రహదారిలో కుడివైపు తిరిగి కొంత దూరం పోయాక పచ్చయమ్మన్ గుడి దగ్గరు తిరుఅణ్ణామలైని దర్శనం చేస్తే అదియే సుష్వాట దర్శనం అవుతుంది. ఇతరులలోని తప్పులెంచనివారెవరూ ఉండరు. అలా తప్పులెంచటం, చాడీలు చెప్పటం, ఇతరులకు హాని కలిగించటం వంటి కర్మలకు పరిహారాన్ని ఇచ్చే దర్శనమే సుష్వాట దర్శనం. అందరూ పొందాల్సిన దర్శనమిది!
చివరగా శ్రీభూతనారాయణుని సన్నిధిలో ఎలాంటి ఆటంకాలు లేకుండా గిరి ప్రదక్షిణం చేయడానికి అనుగ్రహించిన శ్రీభూతనారాయణ పెరుమాళ్‌కు కృతజ్ఞతలు తెలుపుకుని గిరి ప్రదక్షిణను ముగించాలి.
Famous Posts:
> ఆదివారం అరుణాచల గిరి ప్రదక్షిణ ఫలితాలు.
> సోమవారం అరుణాచల గిరి ప్రదక్షిణ ఫలితాలు.
> మంగళవారం అరుణాచల గిరి ప్రదక్షిణ ఫలితాలు.
> బుధవారం అరుణాచల గిరి ప్రదక్షిణ ఫలితాలు.
> గురువారం అరుణాచల గిరి ప్రదక్షిణ ఫలితాలు.
> శుక్రవారం అరుణాచల గిరి ప్రదక్షిణ ఫలితాలు.
> శనివారం అరుణాచల గిరి ప్రదక్షిణ ఫలితాలు.
arunachalam, giri pradakshina, arunachalam temple giri pradakshina dates, arunachalam temple, arunachalam temple giri, arunachalam temple giri pradakshina images, arunachalam giri pradakshina starting point, arunachalam giri pradakshina benefits, arunachalam temple giri pradakshina in telugu