ఆదివారం అరుణాచలం లో గిరిప్రదక్షిణ చేస్తే ఏ ఫలితం ఉంటుంది...| Results of Arunachal Giri Pradakshina on Sunday
ఆదివారం అరుణాచల గిరి ప్రదక్షిణ ఫలితాలు..
ప్రపంచములో అనేక కోటి సూర్యులు కలవు. ఇన్ని కోట్ల సూర్యులు కూడా వారికి అవసరమైన అగ్ని శక్తిని పంచ భూత లింగాలలో ఒకటి అయిన అగ్ని లింగముగా కొలువై ఉన్న తిరుఅణ్ణామలై నుండే పొందుచున్నవి. వాటన్నింటికీ శ్రీ సూర్య నారాయణ స్వామివారే ఆధిపత్యం వహిస్తున్నారు. ప్రతి ఆదివారమునాడు శ్రీ సూర్య భగవానుడే భూ లోకానికి విచ్చేసి ఏదో ఒక రూపములో తిరుఅణ్ణామలైని గిరి ప్రదక్షిణము చేస్తూ వస్తున్నారు.
ఈ నాటికీ తిరుఅణ్ణామలై పుణ్య క్షేత్రములో సూర్యుడు తిరుఅణ్ణామలైని అడ్డంగా దాటకుండా చుట్టుకొని వచ్చి వెళ్ళుట చూడ గలము. ప్రపంచములో వేరే ఎక్కడా కూడా చూడ వీల్లేని అద్భుతం ఇది ! ఎటువంటి విజ్ఞాన శాస్త్రం కూడా వివరణ ఇవ్వలేని ఒక విచిత్రం ఇది ! ‘సూర్యుని పాదములు పడకుండా కిరణాలు నమస్కరించి వెళ్ళే తిరుఅణ్ణామలై’ యని శ్రీ అగస్త్యుని తాళ పత్ర గ్రంథాలు పొగిడే అద్భుత దృశ్యాన్ని మీరుకూడా వెళ్ళి దర్శించి జన్మ తరింప చేసుకోండి !
శ్రీ సూర్య భగవానుడు స్వీకరించిన గిరి ప్రదక్షిణం
సిమ్హ తీర్థం తిరుఅణ్ణామలై
శ్రీ సూర్య భగవానుడు ‘సమ్జ్ఞై’ యని పిలువబడు స్వర్చలా దేవిని పరిణయం చేసుకున్నప్పుడు, ఆయన తన అగ్ని రూపాన్ని ఓర్చుకోలేక కృశించిపోయిన స్వర్చలా దేవి తన నీడను సూర్య సవితా మండలములో ఆపి ఉంచి తన తండ్రి ద్వష్టా దగ్గరకు వెళ్ళి శరణ్యం తీసుకొనెను. ఆ ఛాయా దేవే శ్రీ శనీశ్వర భగవానునికి జన్మనిచ్చిన ఛాయా దేవి!
తనను వదలి వీడి పోయిన స్వర్చలా దేవిని మరల పొందుటకు ఇష్టపడ్డ శ్రీ సూర్య భగవానుడు తిరుఅణ్ణామలై వచ్చి చేరి తపస్సు చేసెను. కానీ ఎన్నో చతుర్యుగములు తపస్సు చేసినను అతనికి తిరుఅణ్ణామలై స్వామివారి దర్శనము లభించలేదు.
శ్రీ సూర్య భగవానుని తపస్సుని చూచి హృదయానందం పొందిన శ్రీ అంబికా ఉణ్ణాములైఅమ్మవారు, “భాస్కరా ! దంపతి సమేతముగ విచ్చేసి తనని నమస్కరించాలన్నదే శ్రీ అరుణాచలేశ్వరుని కోరిక. కానీ నీవో విడిపోయిన భార్యను మరల పొందుటకై తపస్సు చేయుచుంటివి !
నీ అగ్ని రూపాన్ని తాళ లేక స్వర్చలా దేవి విడి పోయినందున నీవు నీ అగ్నిని శాంతింపచేయమని వేడ్కొని తిరుఅణ్ణామలైని గిరి ప్రదక్షిణం చేయుము. అదే సమయములో, నీ భార్య కూడా నీ అగ్ని రూపాన్ని భరించే శక్తిని కోరుకొని గిరి ప్రదక్షిణము చేయవలెను !” యని వరమొసగెను.
అదే సమయములో కురుక్షేత్రం వెళ్ళి తపస్సు చేయుచున్న స్వర్చలా దేవికికూడ, “నీ తపస్సు ఇచ్చట పరిపూర్ణమైనదె. దాని ఫలాలను తిరుఅణ్ణామలైయందు పొంది పరవశించెదవుగాక !” యని అశరీరవాణి లభించెను.
ఈ విధముగ శ్రీ అంబికయొక్క దివ్య వాక్కు ప్రకారము శ్రీ సూర్య భగవానుడు, స్వర్చలాంబ దేవి కలిసి తిరుఅణ్ణామలైని గిరి ప్రదక్షిణం చేసిన రోజే ఆదివారమగును. శ్రీ సూర్య భగవానుడు ముందు పోవ, కాస్త దూరముగ అతని అగ్ని కిరణాలను భరించదగ్గ దూరములో స్వర్చలాంబ దేవి శివ ధ్యానములో మునిగిపోయి గిరి ప్రదక్షిణం చేసిరి.
శ్రీ పృథ్వీ నంది తిరుఅణ్ణమలై
శ్రీ అరుణాచలేశ్వరుడు ఇరువురికీ అగ్ని జ్యోతి లింగముగ దర్శనమిచ్చి, “సూర్యా! స్వర్చలాంబ దేవికి నీ దేహ కాంతిని భరించే శక్తిని ప్రసాదించే ముందు, నీ అగ్ని కిరణాల భారమును ఆమె కోరుకున్నట్లు సేవించుటకుగాను, అగ్ని కిరణములలోని కొన్నింటిని అమృత కిరణములుగ మార్చి వాటిని అనేక కళలను కోల్పోయి వాడిపోవుచున్న చంద్రునికి ఇస్తున్నాను. వేరు అనేక కిరణాలను వేర్వేరు ఆయుధాలుగ మార్చి, దివ్య శక్తి కలిగిన ఆయుధాలను కోరి తిరుఅణ్ణామలైయందు తపస్సు చేయుచున్న దేవతలకు ప్రసాదించుచున్నాను. ఇంకా ఇన్నో కిరణాలను అనేక రకముల వస్తువులుగాను, జీవరాసులుగాను మార్చి శృష్టించుచున్నాను” యని వరమిచ్చెను. రాత్రి పూట మెరిసే పువ్వులు, క్రిములు, పాదరసం, గుడగూబ, పిల్లి, కుక్క వంటి జీవరాసుల రాత్రి పూట మెరిసే కనులు మొదలగునవి ఈ విధముగానే సృష్టింపబడినవి. దేని తరువాత ముప్పై ముక్కోటి దేవతలూ పూజ చేయుటకు శ్రీ సూర్య భగవానుడు తన భార్యయైన స్వర్చలా దేవితో ఏకమయ్యెను.
అందుకనే పలు విధాల కారణాల వలన విడి పోయి బ్రతుకుతున్న దంపతులు కలిసి కట్టుగా జీవించుటకు ఆదివారం నాడు గిరి ప్రదక్షిణం అత్యంత ప్రాధాన్యమైనది. ఆదివారం సూర్య హోరై సమయములో (ఉదయం 6-7, మధ్యాహ్నం 1-2, రాత్రి 8-9, అర్థ రాత్రి 3-4) గిరి ప్రదక్షిణాన్ని ప్రారంభించుట అద్భుతమైన ఫలితాలను సమకూర్చెను. దానితోనే కాకుండా ‘భర్త తన వెంట గిరి ప్రదక్షిణం చేయలేదే’ యని బాధ పడే భార్యామణులు సూర్య హోహై సమయములో మగ బిడ్డలకు చక్కెర పొంగలి దానము చేసి గిరి ప్రదక్షిణము ప్రారంభించినచో వారి కోర్కెను అరుణాచలం తెలుసుకుని కటాక్షిస్తారు.
ఆదివార గిరి ప్రదక్షిణము కటాక్షించెటి దివ్య శక్తి
కలియుగమునందు ఒక మానవుడు దేవుని వైపు గట్టిగా సమేకమై ఉన్నత స్థాయిని అందుకోవాలంటే మంచి విషయముల వైపే మొగ్గు చూపాలి. మంచి ఆలోచనలలోనే మనసు పెట్టాలి; శుభ కార్యాలలోనే ఎల్లప్పుడూ భాగం పంచుకొంటుండాలి. దానికి తగినట్లుగ మన బుధ్ధిని తీర్చి దిద్దుటయే ఆదివారపు గిరి ప్రదక్షిణము అనబడుతుంది.
బుధ్ధియొక్క ఎనిమిది విధముల కార్య కలాపాలు
మానవుని బుధ్ధియైనది ఎనిమిది విధముల క్రియాకలాపాలను గల్గి యుండును. అవి ఏమిటనగ
1. శ్రవణం
2. దానం
3. స్మరణం
4. ప్రవచనం
5. వ్యూహం
6. అవపోశనం
7. అంతర్ ధ్యానం
8. తత్వ జ్ఞానం
శ్రవణం (వినికిడి)
ప్రస్తుత పరిస్థితుల్లో మనం వేలాది విషయాలను వినవలసిన నిర్బంధంలో ఉన్నాము. ఆదివారం నాడు తిరుఅణ్ణామలైని గిరి ప్రదక్షిణము చేయుట వలన, కొండ పైన ఉన్న అద్భుతమైన దివ్య శిలలయొక్క ప్రకాశవంతమైన వెలుగు రవ్వలు మనకు వినిపించెటి మాటలలోనుండి మంచి విషయాలను మాత్రమే చెవి ద్వారములలోనికి వెళ్ళనిచ్చెటి దివ్య శక్తిని ప్రసాదిస్తాయి. చెవులకు ఎరుపు రంగు (మాణిక్యం) దిద్దులను ధరించి గిరి ప్రదక్షిణం చేస్తే సత్ఫలితాలను పెంచుతుంది.
దానం
ఒక్క మంచి విషయాలను మాత్రమే వినుట చాలదు. వాటిని మనస్సులో పదిల పరుచుకొనవలయును. తిరుఅణ్ణామలైయొక్క పవిత్రమైన వాయుమండల గాలి (తిరుఅణ్ణామలైని తాకి నెమ్మదిగ వచ్చే గాలిని సాధారణ గాలిగా భావించరు. ‘మణముగిళ్ అలైవాయ్’ యని పిలుస్తారు.) ఇందు కోసం బుధ్ధి నాళాళను పవిత్రం చేసి కావలసినంత తేజస్సును ప్రసాదిస్తుంది. దానివల్ల ధర్మపరమైన ఆలోచన గల్గి, తన మనస్సును దాన ధర్మాలలో పాలుపంచుకునేటట్లు మళ్ళిస్తుంది.
స్మరణం
బుధ్ధిలో నిలిచిపోయిన మంచి విషయాలు కావలసినప్పుడు గుర్తుకు రావలయును. ఆదివారం నాడు గిరి ప్రదక్షిణం చేయుట వలన తిరుఅణ్ణామలైలో ఉన్న అద్భుతమైన మూలికల శక్తి ఈ తెలివిని ప్రసాదిస్తుంది.
ప్రవచనం
గుర్తుకొచ్చే మంచి విషయములను ఇతరులకు కూడా చెప్పి వినిపించటం శ్రేష్టమైనది. ఆదివారపు గిరి ప్రదక్షిణములో తిరుఅణ్ణామలై గిరి ప్రదక్షిణ దారిలో ఉన్న తీర్థాల దర్శనం, వాటిలో స్నానమాడుట లేదా తల మీద జల్లుకొనుట వంటివి బుధ్ధికి ఈ తెలివిని ఇస్తుంది.
వ్యూహం
దివ్య జీవితంలో మనకు లభించేటి మంచి అనుభవాలను పెద్దవారితో పంచుకోవటం వల్ల అనుభవ పరిపక్వత ఏర్పడుతుంది. ఆదివారంనాడు శారీరికంగానో, మానసికంగానో గిరి ప్రదక్షిణం చేసే కోట్లాది మహానుభావులు, సిధ్ధ పురుషులయొక్క పవిత్ర పాదాలను తాకిన మన్ను, ధూళి వంటివి గిరి ప్రదక్షిణం చేసెటి ఇతరుల మీద పడి ఈ శక్తిని వారికి ప్రసాదిస్తుంది.
అవపోశనం
“ధాటిగా మాట్లాడు” అనేది పూర్వీకుల మాట. దేన్ని, ఎక్కడ, ఎప్పుడు, ఏ విధంగ మాట్లాడవలె అనేదే వాక్ ధాటి. ఆదివారం నాడు గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు మనకు లభించేటి అనేక నందులయొక్క దర్శనం ఇటువంటి వాక్ ధాటిని ప్రసాదిస్తుంది.
అంతర్ – ధ్యానం
దేన్ని, ఎక్కడ, ఎప్పుడు, ఏ విధంగ చెప్ప కూడదు అనేదే మౌన శక్తి అనబడుతుంది. మౌనం అనే దానికి అర్థం ‘మాట్లాడకుండా ఉండటం’ అని మాత్రమే కాదు. కావలసినపుడు మాట్లాడి, అక్కర్లేని లేదా చీడు చేసే విషయాలను మాట్లాడకుండా ఉండటము, మనస్సులో పెట్టుకోకుండా ఉండటము వంటిది కూడా మౌనమే. “అనవసర మాటలు ఎందుకు” అనేది పెద్దల వాక్కు. ఆదివారపు గిరి ప్రదక్షిణములో అష్ట దిక్కుల లింగాలయొక్క ఆకర్షణా శక్తి పైన చెప్పబడిన దివ్య శక్తిని ఇచ్చి కటాక్షిస్తుంది.
తత్వ జ్ఞానం
పైన చెప్పబడిన ఏడు దివ్య శక్తులను పొందినవారికే “అంతా దేవుడు సృష్టించినదే” అను నిజమైన జ్ఞానం ఏర్పడుతోంది. తిరుఅణ్ణామలైని దర్శించుకుంటూ చేసే ఆదివారపు గిరి ప్రదక్షిణములో ఒక్కొక్క విధముగ కనబడుతున్న వేలాది దర్శనములే నిజమైన జ్ఞానాన్ని పొందే తెలివిని మనకు అందిస్తున్నాయి.
చూశారా, ఆదివారం నాడు తిరుఅణ్ణామలై గిరి ప్రదక్షిణం చేయు ప్రత్యేకతని ! ఎన్నో జన్మలెత్తి పొందే దివ్య శక్తిని, ఆదివారం నాడు పధ్ధతి ప్రకారం చేసే తిరుఅణ్ణామలై గిరి ప్రదక్షిణం అందిస్తోంది.
ఆదివారం గిరి ప్రదక్షిణ పధ్ధతి
ఆదివార గిరి ప్రదక్షిణాన్ని శ్రీ అరుణాచలేశ్వర ఆలయం యొక్క తూర్పు గోపుర ద్వారములో ఉన్న శ్రీ లక్షణ వినాయకుడిని నమస్కరించుకొని ప్రారంభించవలెను. మనకి ఈ మానవ శరీరాన్ని ప్రసాదించి, గిరి ప్రదక్షిణము చేయుటకు దయ బూనినవారు సృష్టికర్తయిన శ్రీ బ్రహ్మ దేవుడే. అందుకనే, ఆయనకి కృతజ్ఞత తెలిపే విధముగా తరువాత దక్షిణ ద్వారం వెళ్ళి అక్కడ ఉన్న బ్రహ్మ లింగాన్ని నమస్కరించ వలెను.
సర్ప పడగేశ్వర లింగముఖ దర్శనం
గిరి ప్రదక్షిణం చేసేటపుడు సుగంధంతో కూడిన అగర్ బత్తీలను వెలిగించి వాటిని గుండకు ఎదురుగా చేతిలో పట్టుకుని ఉంచుకొంటూ ప్రదక్షిణము చేయుట శ్రేష్టమైనది. ఆలయముయొక్క దక్షిణ గోపురము నుండి సాంబ్రాణి కడ్డీ నుండి వెలువడే దివ్యమైన ప్రొగ వెంటే తిరు అణ్ణామలైని దర్శించటాన్ని సర్ప పడగేశ్వర లింగముఖ దర్శనం అని అంటారు.
అగర్ బత్తీలను పట్టుకుని ఉంచుకుంటూనే వెళ్ళి తిరుమంజన వీధిలో ఉన్న శ్రీ కర్పక వినాయక ఆలయములో వాటిని సమర్పించి మరల వేరే అగర్ బత్తీలను వెలిగించి ఉంచుకుంటూనే గిరి ప్రదక్షిణాన్ని ప్రారంభించవలెను. ఈ సర్ప పడగేశ్వర లింగ ముఖ దర్శనము వలన ‘నేను’ అనే అహంకారాన్ని తగ్గించుకునే మార్గం ఉన్నది.‘తిరు అరుణాచలా ! సర్వం నీవే’ అనే భావన పెరుగుటకు మార్గం చూపే దర్శనం ఇది.
పంచాయతన పంచముఖ దర్శనం
గిరి ప్రదక్షిణ మార్గములోనే ముందుకు నడిచేటప్పుడు శ్రీ రమణాశ్రమం దాటి కాస్త దూరములో తిరు అణ్ణామలై స్వామివారు ఐదు ముఖములతో కనబడుతూ ఉంటారు. ఈ దర్శనానికి ‘పంచాయతన పంచముఖ దర్శనం’ అని అంటారు. శాళగ్రామ పూజ చేసేవారికి చాలా తగిన దర్శనం. పంచాయతన పూజని పధ్ధతిగా చేయని అపరాధానికి కూడా ఈ దర్శనం శ్రేష్టమైన పరిష్కారముగా నిలుస్తున్నది.
శ్రీ ఉణ్ణాములై అమ్మవారి మండపం
పదాది కరన్యాస దర్శనం
పృథ్వి నంది వైపు నుండి అణ్ణామలేశుడిని తిలకించే దర్శనమే పదాతి కరన్యాస దర్శనం. కుడి కాలుని కుడి భుజం దాకా పైకెత్తి, కుడి కాలుని చుట్టి కుడి చేతిని శిరస్సుదాకా పైకెత్తి ఎడమచేతిని చేర్చి శిరస్సుమీద నమస్కరించడాన్ని (దాదాపుగా ఊర్థ్వ తాండవ రూపంగా కనబడుతుంది) పదాది కర సహిత దర్శనం అని పేరు. ఈ దర్శనం వల్ల పలు ఫలితాలు లభించినా ముఖ్యంగా ఇతరులను పాదాలతో తన్నడం వల్ల వచ్చే పాద క్రమణం అనే దోషం తొలగుతుంది.
అడుగడుగునా అర్ధనారీశ్వరుడి లింగాల రూపంలో వ్యాపించి ఉంటాడన్న అగస్త్యమహర్షి వాక్కుననుసరించి తిరువణ్ణామలై క్షేత్రమంతటా కోటానుకోట్ల సంఖ్యలో లింగాలు వ్యాపించి ఉంటాయి గనుక మన పాదాలు ఏ లింగమూర్తిపైన పడుతుందేమో నన్న భయంతో గిరి ప్రదక్షిణం చేయాలి.
దీని తర్వాత 'మాయ సంచల దర్శనం', 'చతురాది అశ్విని దేవ దర్శనం' 'వాయుపుత్ర హనుమంత దర్శనం' వంటి పలు దర్శనాలు ఉన్నాయి. మంచి గురువును ఆశ్రయించి తగు వివరణలు పొందాలి.
పాసత్రియాంకు దర్శనం
శ్రీగౌతముడి ఆశమ్రం సమీపాన లభించే ఈ దర్శనం వలన మధుమేహ రోగులు (ఈరిబిలీలిశిరిబీ ఆబిశిరిలిదీశిరీ) స్వస్థత చెందుతారు. ఈ ప్రాంతంలో నిరుపేదలకు తీపి పదార్థాలు దానం చేస్తే మంచి ఫలితాలు త్వరగా లభిస్తాయి. ఈ చోట తిరువణ్ణామలైకి అభిముఖంగా గాలి వీస్తుండటాన్ని గమనించగలం. ఆ గాలినే అభిముఖ పంచోన్నతశిఖర వాయువు అని పెద్దలు చెబుతారు.
రెండు కొండల దర్శనం
అణ్ణామలై దిగువ ప్రాంతంలో లభించే దర్శనమిది. ఈ ప్రాంతంలో అరుణాచలేశ్వరుడే రెండు చిన్న కొండలుగా దర్శనమిస్తున్నారు. భార్యాభర్తల నడుమ అన్యోనత ప్రాప్తించేందుకు ఈ దర్శనం దోహదపడుతుంది.
త్రిశూల దర్శనం
పరమేశ్వరుడి తన నంది వాహనాన్ని పిలిచినప్పుడల్లా నందీశ్వరుడు తిరుఅణ్ణామలైని ప్రదక్షిణ చేసి నమస్కరించి 'త్రిశూల దర్శనం' అనే అద్భుతమైన దర్శనం సిద్దించిన తర్వాతే దేవ వాహన విధులను ప్రారంభిస్తాడు.
ఓ సారి పరమేశ్వరుడు పిలువగానే నందీశ్వరుడు ఆగమేఘాలపై వెళ్లాడు. మహేశుడు నందీశ్వరుడిని పరిశీలనగా చూసి ఉలుకుపలుకు లేకుండా అక్కడి నుండి వెళ్లిపోయాడు. మహేశుడి వైఖరిపట్ల దిగులు చెందిన నందీశ్వరుడు ఆయనను వెంబడించి కారణమడిగాడు.
'నందీశ్వరా రోజూ నీ వాహన సేవను ప్రారంభించే సమయంలో ఏం చేస్తుంటావు?' అని ప్రశ్నించాడు.
'స్వామీ! తిరుఅణ్ణామలైకి వెళ్లి త్రిశూల దర్శనం చేసుకుని వస్తుంటాను' సమాధానం చెప్పాడు నందీశ్వరుడు.
'నందీశ్వరా! రోజూ నువ్వు త్రిశూల దర్శనం చేసిన తర్వాత నీ వీపుపై మూడు త్రిశూల రేఖలు కనిపించేవి. ఈ రోజు ఆ రేఖలు కనిపించకపోవడంతో తిరిగి వెళుతున్నాను' అన్నాడు మహేశుడు.
శ్రీ అరుణాచలేశ్వరుడి పాదాలు
తాను ఆ దినం తిరుఅణ్ణామలై దర్శించలేదనే విషయం నందీశ్వరుడికి అప్పటికిగాని తెలియలేదు. పశ్చాత్తాపం చెందాడు. త్రిశూల దర్శనం గొప్పదనాన్ని లోకానికి ఎలుగెత్తి చాటాడు. ఈ దర్శనం వలన పెద్దలను, ఆపదల సమయంలో ఆదుకున్నవారిని అవమానించడంవల్ల కలిగే దోషాలు నివృత్తి అవుతాయి. పెద్దలను, సాయపడినవారిని మళ్లీ కలుసుకుని వారికి సహాయపడాలి.
నంది అపసవ్య ముఖ దర్శనం
అణ్ణామలై దిగువ ఆలయం చేరువగా అరుణాచలేశ్వరుడిని దర్శించేందుకు నందీశ్వరుడు తన శిరస్సును కాస్త వెనుకవైపు తిప్పినట్లుగా లభించే దర్శనమిది. దీనికి నంది అపసవ్యముఖ దర్శనం అని పేరు.
ఈ దర్శనం వల్ల వాహన యోగాలు కలుగుతాయి. తరచూ విమానాల్లో ప్రయాణించేవారికి, తరచూ ఊర్లకు వెళ్లేవారికి ఈ దర్శనం ఎలాంటి ఆపదలు రాకుండా కాపాడుతుంది.
కల్పగ పూర్ణ దర్శనం
అడిఅణ్ణామలై ఆలయ తీర్థకొలను సమీపం నుండి చూస్తే లభించేది కల్పగ పూర్ణ దర్శనం.
ఈ చోట సాంబ్రాణి పొగలు వేయడం శ్రేయస్కరం. దీనివల్ల ఆస్తమా, T.B., శ్వాస ఇబ్బందులు వంటి శ్వాస సంబంధిత రోగాలు నయమవుతాయి.
సత్సంగంలా పలువురు కలిసి మంచుమేఘాల్లా సాంబ్రాణి పొగలు వేసి గిరి ప్రదక్షిణ చేస్తే శుభ ఫలితాలను ఇస్తుంది.
దూర్వా కాష్ట తర్పణం
దశముఖ దర్శన ప్రాంతంలో అభయమండపం సమీపంలో ఓ తీర్థం ఉంది. అక్కడ 'దూర్వా కాష్ట' పద్ధతిన తర్పణం ఇస్తే పితృదేవత శాపాలు తొలగి సంతాన భాగ్యం కలుగుతుంది.
ఓ వస్త్రంలో పచ్చిబియ్యం పరచి దానిపై దర్భలను గుండ్రంగా అమర్చి తర్పణం ఇవ్వాలి. ఆతర్వాత ఆ వస్త్రాన్ని, బియ్యాన్ని దానంగా ఇవ్వాలి. పితృదేవతలకు తర్పణాలను తీసుకువెళ్లే స్వతాదేవి మండలంలో ఉండే విఘ్ననాసిని అనే దేవత ఆ తీర్థకొలనులో ఉంటుంది. ఆ తీర్థకొలను గట్టున తర్పణం ఇచ్చేవారికి అనుగహ్రాలను ప్రసాదిస్తుంది.
పురుష వీర్యకణాల కొరత, గర్భసంచి కుంచించుకుపోవడం వంటి వైద్య సంబంధిత లోపాలతో బాధపడేవారు తమ సమస్యలు తీరేందుకు ఈ తీర్థపు గట్టున పచ్చిబియ్యాన్ని పరచి, రెండు జీడిమామిడి పప్పులకు పసుపు పూసి ఓ తమలపాకుపై పెట్టి, దానిపై దర్భపు చదరాలను చేసి పితృ తర్పణం ఇవ్వాలి. దీనినే 'పూజ్య తంత్ర తర్పణం' లేదా 'వీర్య ప్రసాదిత తర్పణం' అని అంటారు.
శ్రీ బ్రహ్మ లింగం తిరుఅణ్ణామలై
(తర్పణపు మంత్రాలు, తర్పణమిచ్చే పద్ధతులు గురించి మేము ప్రచురించిన 'సులువైన తర్పణ పద్ధతులు' అనే పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు)
ఇక మన శ్రీలశ్రీ లోబామాత అగస్త్య ఆశ్రమం ఏర్పాటై ఉన్న ప్రాంతంలో కొంతసేపు ధ్యానం చేసిన మీదట, వీలయినంత దాన ధర్మాలు చేస్తే దూర్వా కాష్ట తర్పణ ఫలితాలు పరిపూర్ణంగా లభిస్తాయి
అవధూత సిద్ధపురుషుడైన శ్రీ దక్షిణామూర్తి తల్లిదండ్రులు పైన పేర్కొన్న రీతిలో ఇక్కడ బసచేసి భగవంతుని ప్రార్థించిన మీదట వారికి కలలో శ్రీదక్షిణామూర్తి స్వాముల దైవీక జననం గురించి బోధపడింది.
కోటి శ్మశాన లింగ దర్శనం
తదుపరి కుబేరలింగం, పంచముఖ లింగం, ఇడుక్కు పిళ్ళయార్ సన్నిది వంటి దర్శనాలు చేసుకున్న తర్వాత వేలూరు రహదారి విడిపోవు స్థలంలో ఉన్న శ్మశాన భూమి నుండి పొందే దర్శనానికి 'కోటి శ్మశాన లింగ దర్శనం' అని పేరు. అనువుకాని ఆశలు, దురాశలను తొలగించే అద్భుత దర్శనమిది.
మాయా నివృత్తి దర్శనం
ఆదివారాల్లో గిరిప్రదక్షిణలో శ్రీదుర్గ అమ్మవారి ఆలయ సమీపంలో మనం పొందేది మాయా మాన్విత దర్శనం. మానవుడిని వేధించే మాయలను శ్రీ దుర్గాశక్తి ద్వారా సంహరింపబడి మంచి మార్గాన్ని చూపునదే ఈ దర్శనభాగ్యంలోని విశేషం. రాత్రి పూట ఈ దర్శనం పొందటాన్ని 'మాయా నివృత్తి దర్శనం' అని పిలుస్తారు.
అపసవ్య కామం వల్ల చేయబడే అన్ని రకాల తప్పిదాలను రూపుమాపి మంచి మార్గాన్ని అందించే దర్శనం. అలాంటి పాపాలను చేసినవారు తిరుఅణ్ణామలైలో గిరి ప్రదక్షిణ చేసి, శ్రీ దుర్గాదేవి ఆలయం సమీపంలో మాయా మాన్విత దర్శనం పొంది, 9 గజాల చీరను వస్త్రదానంగా, అరటి కాయల బజ్జీలను దానమిచ్చి ప్రాయశ్చిత్తం పొందే మంచి పద్దతులను తెలుసుకోగలం.
మానవ దేహాన్ని ఎల్లవేళలా కాపాడే శ్రీభూతనారాయణ పెరుమాళ్ దర్శనంతో గురు కృప ద్వారా ఆదివారపు గిరి ప్రదక్షిణ సంపూర్ణమవుతుంది.
Famous Posts:
> ఆదివారం అరుణాచల గిరి ప్రదక్షిణ ఫలితాలు.
> సోమవారం అరుణాచల గిరి ప్రదక్షిణ ఫలితాలు.
> మంగళవారం అరుణాచల గిరి ప్రదక్షిణ ఫలితాలు.
> బుధవారం అరుణాచల గిరి ప్రదక్షిణ ఫలితాలు.
> గురువారం అరుణాచల గిరి ప్రదక్షిణ ఫలితాలు.
> శుక్రవారం అరుణాచల గిరి ప్రదక్షిణ ఫలితాలు.
> శనివారం అరుణాచల గిరి ప్రదక్షిణ ఫలితాలు.
arunachalam, giri pradakshina, arunachalam temple giri pradakshina dates, arunachalam temple, arunachalam temple giri, arunachalam temple giri pradakshina images, arunachalam giri pradakshina starting point, arunachalam giri pradakshina benefits, arunachalam temple giri pradakshina in telugu
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment