Drop Down Menus

తిరువణ్ణామలై క్షేత్రం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు | Some important facts about Tiruvannamalai Kshetra

తిరువణ్ణామలై క్షేత్రం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు

మహిమాన్విత క్షేత్రం అరుణాచలం

పరమేశ్వరుడు అగ్నిలింగ రూపంలో వెలసిన అతి మహిమాన్విత క్షేత్రం తిరువణ్ణామలై అనబడే అరుణాచలం. అనేక మహిమలు కలిగిన అరుణాచల  గిరిని ప్రదక్షిణం చేయడం వలన కలిగే శుభ ఫలితాలు అనేకం.

సోమవారంనాడు ప్రదక్షిణలు చేస్తే లోకాలను ఏలే  శక్తి లభిస్తుంది.

మంగళవారం ప్రదక్షిణం చేస్తే పేదరికం తొలగిపోతుంది. సుభిక్షంగా వుంటారు. జనన మరణాల చక్రం నుండి విముక్తి లభిస్తుంది. మహాత్ములు శేషాద్రి స్వాములు వంటి సిధ్ధులు మంగళవారంనాడే గిరి ప్రదిక్షణలు చేసేవారు.

బుధవారం   గిరిప్రదక్షిణం చేస్తే  లలితకళలలో రాణింపు, విజయం లభిస్తుంది.

గురువారం గురువారం ప్రదక్షిణం చేస్తే ఆత్మజ్ఞానం ప్రాప్తిస్తుంది.

ప్రతి శుక్రవారం గిరి ప్రదక్షిణం చేస్తే వైకుంఠ ప్రాప్తి చేకూరుతుంది.

శనివారాలలో గిరి ప్రదక్షిణం చేస్తే నవగ్రహాల కటాక్షం సిధ్ధిస్తుంది.

ఆదివారం నాడు అరుణాచలగిరి ప్రదిక్షణలు చేస్తే కైలాసప్రాప్తి కలుగుతుంది.

సంతానహీనులైన భార్యాభర్తలు 48 రోజులపాటు భక్తితో గిరి ప్రదక్షిణలు చేస్తే సంతానభాగ్యం కలుగుతుంది.

గిరిని ప్రదక్షిణం చేయడానికి వేసే మొదటి అడుగుతోనే ముల్లోకాలు చుట్టివచ్చిన పుణ్య ఫలం లభిస్తుంది.

రెండవ అడుగులో పవిత్ర  తీర్ధాలలో స్నానం చేసిన పుణ్యఫలం లభిస్తుంది.

మూడవ అడుగు వేయగానే అశ్వమేధ యాగం చేసిన పుణ్యం లభిస్తుంది.

నాలుగవ అడుగు వేయగానే అష్టాంగ యోగం  చేసిన ఫలితం లభిస్తుంది.

తిరువణ్ణామలైలో  జరిగే కార్తీక దీపోత్సవం నాడు ఐదు సార్లు గిరికి ప్రదక్షిణలు చేసి వస్తే పాప విమోచనం లభిస్తుంది.

భరణీ దీపం  రోజున ప్రాతఃకాలమున మూడున్నర ఘంటలకు ఒక సారి, ఏడు గంటలకు ఒకసారి, పగలు 11 గంటలకు ఒకసారి సాయంకాలం దీపదర్శన  సమయాన  ఒకసారి రాత్రి 11గం.లకు ఒకసారి అని ఐదు సార్లు గిరి ప్రదక్షిణలు చేస్తే ఘోర పాపాలన్నీ హరిస్తాయి.

గిరి ప్రదక్షిణం చేసి రాగానే స్నానం చేయడమో.. నిద్రపోవడమో చేయకూడదు.

వాటివల్ల పుణ్యఫలం  తగ్గి పాపం ఫలం కలుగుతుంది. భగవన్నామ స్మరణలోనే గడపాలి.

*యే మనుష్యః మాం ఆశ్రతః!

*తాన్ సర్వేస్యః కర్మ వినాశనః లభై!!

Famous Posts:

అరుణాచలం కొత్తగా వెళ్లేవారికి సూచనలు | గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి? ఎక్కడ నుండి మొదలు పెట్టాలి?

అరుణాచలం వెళ్ళిన వారు, వెళ్లబోయే వారు  తప్పక తెలుసుకోవలసిన కధ ఇది.

అరుణాచలంలో గిరి ప్రదక్షణం చేసేటప్పుడు తిస్కోవాల్సిన జాగ్రత్తలు.

అరుణాచలంలో శివలింగానికి దగ్గరగా ఉంటే ఏమి జరుగుతుందో తెలుసా..?

అరుణాచలంలో ఈ నాలుగు తప్పులూ చేయకండి.

అరుణాచలం, Arunachalam, Tiruvannamalai, Giri Pradakshina, arunachalam giri pradakshina time, arunachalam giri pradakshina benefits, arunachalam giri pradakshina route

ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

ఎక్కువమంది చదివినవి

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.