Today Tirumala Darshan Information:

నమస్కారం హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం. టెంపుల్స్ గైడ్ కాల్ సెంటర్. కాల్ సెంటర్ వారికి జీతాలు ఇవ్వాలి కాబట్టి టెంపుల్స్ గైడ్ సభ్యత్వం ఉన్న వారికి మాత్రమే కాల్ చేసే అవకాశం ఉంటుంది. జీవితకాల సభ్యత్వం 100 రూపాయలు మాత్రమే. 8247325819 ఈ నంబర్ కు gpay లేదా ఫోన్ పే చేయగలరు.

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***అరుణాచలంలో కార్తీక మహా దీపం డిసెంబర్ 6న గురువారం సాయంత్రం 4 గంటలకు వెలిగిస్తారు.**చార్ ధామ్ యాత్ర 2022 సమాచారం : అక్టోబర్ 26న గంగోత్రి , 27న కేదార్నాథ్ మరియు గంగోత్రి ఆలయాలు మూసివేస్తారు . చివరిగా బద్రీనాథ్ ఆలయాన్ని నవంబర్ 19న మూసివేస్తారు మరల 6 నెలల తరువాత అక్షయ తృతీయ నాడు చార్ ధామ్ యాత్ర ప్రారంభం అవుతుంది. ** కాణిపాకం ఆలయ నిర్మాణం పూర్తీ అయింది దర్శనాలు జరుగుతున్నాయి.** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు . ** అరుణాచలంలో కార్తీక దీపోత్సవం 10 రోజులు జరుగుతుంది నవంబర్ 27వ తేదీ నుంచి డిసెంబర్ 6వ వరకు. మహాదీపం డిసెంబర్ 6న పెడతారు** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారు శివరాత్రి నాడు భక్తుల రద్దీ అధికంగా ఉండటం వలన ఆ రోజు చెయ్యరు. రాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

సృష్టికి మూలం స్త్రీ శక్తి ఆ శక్తి యందు ఇమిడియున్న దివ్యవిగ్రహాలు రెండు | Sri Lalitha Sahasranama Bhashyam

లలితా సహస్రనామ భాష్యము

"అనేక కోటి బ్రహ్మాండ జననీ దివ్య విగ్రహా"

సృష్టికి మూలం స్త్రీ శక్తి 

ఆ శక్తి యందు ఇమిడియున్న 

దివ్యవిగ్రహాలు రెండు:-

1.అమ్మవారు

2. జన్మనిచ్చిన తల్లి 

బ్రహ్మాండములు అమ్మవారి యోని నుండీ

జన్మిస్తాయి 

పరమాత్మ నుండి పరాశక్తి 

పరాశక్తి నుండి ప్రకృతి 

అనగా 

పంచభూతములు 

ఆకాశము నుండి వాయువు 

వాయువు నుండి అగ్ని

 అగ్ని నుండి జలము

 జలము నుండి పృథ్వీ

ఆవిర్భవించి ప్రకృతి నిర్మాణం జరిగింది 

ఈ పంచ భూతములె పంచ ముఖములు గాయత్రి 

ఈ ప్రకృతిలో

పిండాండములు స్త్రీ యోని నుండి జన్మిస్తాయి .

ముందుగా బ్రహ్మాండ జనన క్రమాన్ని పరిశీలిస్తే ఈ యొక్క పాంచభౌతిక ప్రకృతి స్వరూపిణీ (పంచభూతేశి) యగు జగన్మాతకు 6 ఋతువులు .. బ్రహ్మాండములన్నియు జగద్యోని స్వరూపిణీ జగన్మాత యోని నుండి జన్మించినవి.

పిండాండ జనన క్రమాన్ని పరిశీలిస్తే పాంచభౌతిక దేహానికి 12 ఋతువులు. దీనినే రుతుచక్రం అంటారు.

పిండాండములు మానవ దేహం నందు రజోబిందు శ్వేత బిందు కలయిక వలన పిండంగా ఏర్పడి రుతుక్రమం స్తంభించి నవమాసములు తల్లియొక్క గర్భాలయం నందు నవ దేవీ నిర్మిత నవ ఆవరణ 

పురి 

ఈ శరీరం  (శరీరమే శ్రీ చక్రం) గా రూపుదిద్దుకుంటుంది

*దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతనః*

ఇట్టి దైవీ స్వరూపమైన దేహం నందు ఏర్పడిన రుతుక్రమం

స్తంభించనిదే ఈ దేహం నిర్మాణం కాదు 

 సభ్య సమాజంలో

రుతు సమయాన్ని

ముట్టు అంటు అనే ఏహ్యమైన ప్రక్రియగా చూస్తున్నారు

 అనాచార సంస్కృతి ప్రభలి 

స్త్రీని రుతు సమయంలో ముట్టుకోకుండా దూరంగా ఉంచే విధానం కొనసాగుతుంది.

దానిని విచారించి చూస్తే  మానవ దేహం (నవమాసముల రుతు రక్తము మల మూత్రము) యందు కదా నిర్మాణము జరిగిది . 

ఈ శరీరము ఏ విధంగా దైవీ ఆరాధనకు 

పూజలకు యజ్ఞయాగాది క్రతువులకు నోము లకు వ్రతాలు చేయడానికి  అర్హమవుతుంది.?

పూర్వ ఆమ్నాయ గ్రంథాలు ఏం చెబుతున్నాయి?

 ఋతుక్రమమును ఒక యజ్ఞంగా చెబుతున్నాయి శాస్త్రాలు.

స్త్రీ ఋతుక్రమం 4వ రోజు నుండి దేహం అనూతన అండములను నిర్మాణము చేస్తుంది . అట్టి అండములు సంతానొత్పత్తి కొరకు 16 దినములు స్త్రీ దేహములో సిద్దంగా ఉంటాయి. రజోబిందు శ్వేత బిందు (శుక్రకణాలు) కలయికతో పిండంగా మారుతుంది. ఈ క్రమములో గర్భం ధరించని యెడల ఋతువు ఏర్పడి 3 దినములు రజస్సును ప్రకృతికి ఇవ్వడం జరుగుతుంది .

ఈ ప్రక్రియ స్త్రీ దేహమునందుదేవతలు సృష్టించినది కాదా

వేదములు ఋషి ప్రోక్త ములు 

పూర్వకాలము నందు ఋషి కన్యలు అనగా స్త్రీలు కూడా 

వేద అధ్యయనం చేసేవారు 

కాలక్రమంలో స్త్రీలను 

వేద అధ్యయనానికి 

 దూరం చేసినారు 

ఆమ్నాయములు తంత్రములు శివ పార్వతి సంవాదం శివునిచే పార్వతికి చెప్పబడినవి 

ఊర్ధ్వ ఆమ్నాయము నుండి విరచితమైన 

కులార్ణవ తంత్రం 

జ్ఞానార్ణవ తంత్రం

 రుతుక్రమాన్ని ఒక యజ్ఞముగా చెప్తుంది.

 దేహమునందుజరుగు ఉచ్వాస నిశ్వాస మొదలు స్త్రీ పురుష సంగమం మరియూ రుతుక్రమాన్ని కూడా ఒక యజ్ఞంగా చెప్పింది శాస్త్రం 

స్త్రీ యొక్క  రుతుక్రమ సమయాన్ని అంటరానితనంగా చూసే  మానసిక దుర్భరత్వ స్థితి నుండి మేల్కొని స్త్రీ ఋతు సమయాన్ని పవిత్ర భావనతో ఆచరించనివ్వండి.. 

 దక్షయజ్ఞమునందు యోగాగ్నిలో శరీరాన్ని చాలించిన సతీదేవి శరీర భాగాలు పడిన

స్థలములే  శక్తి పీఠాలు

 అట్టి పీఠాలలో ప్రధాన శక్తిపీఠం అస్సాం లోఉంది కామాఖ్య శక్తిపీఠం . 

సతీదేవి  శరీర భాగముల లో (యోని) (భగము) పడిన స్థానము

 ఇప్పటికీ అమ్మవారి యోని భాగమునే  ఆరాధిస్తారు  

సతీ దేవి యోని భాగం

ఈరోజు వరకు

ప్రతి సంవత్సరం రుతుక్రమం జరుగుతూ ఉంటుంది. 

అట్టి సమయాన్ని అక్కడ అర్చకులు మహా పర్వదినములుగా ఆచరిస్తారు. 

కామాఖ్య అమ్మవారు  రహోయాగ క్రమారాధనలో ఉంటుంది అని 

ఈ ప్రకృతికి సమస్తానికి సృష్టి స్థానంగా

భావిస్తారు 

కామాఖ్య దేవి ప్రకృతికి

సృజనాత్మక శక్తిని  ప్రసాదిస్తుంది అని నమ్ముతారు. 

ఆ పర్వదినాలలో విశేషంగా మంత్ర,,యంత్ర ,తంత్ర, జప, తప ,యజ్ఞ ,యోగ, సాధనలు చేస్తారు. 

వేదమాత, ప్రకృతి శక్తి ,గాయత్రి ,గీతామాత, నదీమ తల్లి ,గోమాత , భూమాత అని  

చివరికి ద్విజులు ధరించే గాయత్రి కూడా స్త్రీ శక్తి రూప  నిర్మితమై ఉంది 

సర్వత్రా స్త్రీ రూపంలో దేవతలను ఆరాధించే సంస్కృతిలో జన్మించిన

మనము  స్త్రీ విలువను తెలుసుకుందాం 

యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితాః

 సర్వభూతములు మాతృత్వాన్ని సంతరించుకున్నాయి అని మంత్రాలు చెబుతున్నాయి

స్త్రీ ని అంటరానిదానిగా చూస్తున్న ఓ సభ్యసమాజమా మేలుకో.. 

స్త్రీ లేనిదే సృష్టి లేదు.నీవు లేవు..నేను లేను..ఏదీ లేదు 

స్త్రీ విలాస వస్తువు కాదు. పరాశక్తి.

*స్త్రీ యోని నుంచి జన్మించిన జీవుడు 

భగవతి యోనిలో ప్రవేశించడమే మోక్షం* 

స్త్రీ నీ పూజిద్దాం.. స్త్రీ ని గౌరవిద్దాం..

(స్త్రీ శరీరంలో అవయవాలను చూసినపుడు 

స్తనాలు నీకు పాలిచ్చి పోషించిన అమృతభాండములని ,

 నాభిస్థానం నీ శరీర నిర్మాణము జరిగిన గర్భాలయ స్థానమని, 

నడుము నీ బాల్యదశలో పారాడి అధిష్టించిన  సింహాసనమని, 

యోని నీ జన్మస్థానం అని ఆలోచిస్తే

 ప్రతి స్త్రీలో ను

ఆ జగన్మాత  మాతృ మూర్తి కనపడుతుంది..

అపుడు స్త్రీల మీద  ఎటువంటి అఘాయిత్యాలు జరగవు..

 యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమ:

సమస్త సన్మంగళాని భవంతు 

.. స్వస్తి.!!

Famous Posts:

> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం


అందరు తప్పక చదవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం


ఏలినాటి శని బాధలు తప్పించే సూర్యదేవాలయం ఇదే


గోవుతో గృహప్రవేశం ఎందుకు చేయిస్తారో తెలుసా?


శుక్రవారం ఈ పనులు తప్పకుండ చేయాలి

Lalitha Sahasranamam, lalitha sahasranama bhashyam pdf, sri lalitha sahasranama telugu, lalitha sahasranama bhashyam book, lalitha sahasranama bhashyam in telugu pdf, lalitha sahasranama bhashyam telugu

Comments

Popular Posts