బొమ్మలకొలువు ఎలా పెట్టాలి? బొమ్మలకొలువు నియమాలు | Dasara Bommala Koluvu Decorations in Telugu

బొమ్మలకొలువు...!!

దేవీ నవరాత్రి ఉత్సవాల సమయంలో మన దేశంలోని అన్ని హైందవ  గృహాలు, దేవాలయాలు ఒక ప్రత్యేక కళను సంతరించుకుంటాయి.

గృహాలలో, ఆలయాలలో బొమ్మలకొలువులు ఏర్పాటు చేస్తారు. కొన్ని ప్రాంతాలలో సంక్రాంతి పండగ సమయంలో కూడా బొమ్మల కొలువులు పెట్టే ఆచారం వుంది.

గృహిణులు తమ వద్ద నున్న బొమ్మలననుసరించి మూడు , ఐదు,ఏడు, తొమ్మిది మెట్లు  వరసలలో బొమ్మల కొలువు పెట్టడం

ఆచారం. 

కొలువు బొమ్మలను పేర్చడంలో కొన్ని నియమాలు , సూత్రాలు వున్నవి. 

భగవంతుడి దశావతారాల సూత్ర ప్రకారం

ఈ సృష్టి పరిణామ క్రమాన్ని మానవుడి అభివృధ్ధి క్రమాన్ని దృష్టిలో పెట్టుకొని క్రింది మెట్టునుండి పై మెట్టువరకు వివిధ వర్ణాల,వివిధ ప్రమాణాలలో బొమ్మలను అమరుస్తారు.

మొదటి మెట్టుమీద 

చిన్న చిన్న ఇళ్ళు , గుడులు , గోపురాలు ,  పొలాలు ,చెట్లు, పూలతీగలు మొదలైన  పచ్చని ప్రకృతితో నిండిన బొమ్మలు పేర్చాలి.

రెండవ మెట్టు :

మీద చేపలు,తాబేలు 

నత్త,  పీత, శంఖు వంటి జలచరాల బొమ్మలు;

మూడు, నాలుగు మెట్ల

పైన  క్రిమి కీటకాలు , భ్రమరాలు;

5 వ మెట్టు

మీద నాలుగుకాళ్ళ

జంతువులు,  పక్షుల బొమ్మలు అమర్చాలి.

6 వ మెట్టు మీద

బుధ్ధిజీవులైన

మానవరూపాల బొమ్మలు;

7వ మెట్టు పైన

 మహనీయులు , మహర్షుల బొమ్మలతో నింపాలి.

8 వ మెట్టు పైన

అష్టదిక్పాలకులు,

నవగ్రహనాయకుల బొమ్మలు,  పంచభూతాల

బొమ్మలు  తీర్చిదిద్దాలి. 

అన్నిటికంటే ఉన్నతమైన 9 వ పై మెట్టు మీద  మొదట  వినాయకుని బొమ్మ  పెట్టి,తరువాత బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను;

లక్ష్మీ, సరస్వతి, పార్వతి దేవీల బొమ్మలను చక్కగా అమర్చాలి.

లక్ష్మీ దేవికి, సరస్వతీ దేవికి మధ్యన పరాశక్తి లేక దుర్గాదేవి దేవి బొమ్మ పెట్టాలి.

ఈవిధంగా సంప్రదాయబధ్ధంగా  బొమ్మలకొలువు  పెట్టి నవరాత్రి ఉత్సవాలలో ముగురమ్మలనూ భక్తితో కొలిచినవారికి సకల సౌభాగ్యాలు సిధ్ధిస్తాయి...స్వస్తీ...

Famous Posts:

మీకు ఏదైనా సమస్య ఉందా అయితే వెంటనే ఈ స్వామి వారికి ఉత్తరం రాయండి


సంతానం కోరుకునే వారికీ కచ్చితమైన పరిష్కార మార్గం


మీరు చేసే పూజకు రెట్టింపు ఫలితం రావాలంటే ఇలా చేయండి.


భస్మధారణ అంటే ఏమిటి? దాని వల్ల కలిగే లాభాలు ఏంటి?


మహాభారతం నుండి నేరచుకోవలసిన 12 ముఖ్యమైన విషయాలు.


భారతీయులు ప్రతి ఒక్కరూ  తెలుసుకోదగినవి అద్భుతమైన దేవాలయలు

బొమ్మలకొలువు, bommala koluvu, bommala koluvu niyamalu, bommala koluvu sankranti, bommala koluvu ott, bommala koluvu trailer, navaratrulu bommala koluvu

Comments