Today Tirumala Darshan Information:

నమస్కారం హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం. టెంపుల్స్ గైడ్ కాల్ సెంటర్. కాల్ సెంటర్ వారికి జీతాలు ఇవ్వాలి కాబట్టి టెంపుల్స్ గైడ్ సభ్యత్వం ఉన్న వారికి మాత్రమే కాల్ చేసే అవకాశం ఉంటుంది. జీవితకాల సభ్యత్వం 100 రూపాయలు మాత్రమే. 8247325819 ఈ నంబర్ కు gpay లేదా ఫోన్ పే చేయగలరు.

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***అరుణాచలంలో కార్తీక మహా దీపం డిసెంబర్ 6న గురువారం సాయంత్రం 4 గంటలకు వెలిగిస్తారు.**చార్ ధామ్ యాత్ర 2022 సమాచారం : అక్టోబర్ 26న గంగోత్రి , 27న కేదార్నాథ్ మరియు గంగోత్రి ఆలయాలు మూసివేస్తారు . చివరిగా బద్రీనాథ్ ఆలయాన్ని నవంబర్ 19న మూసివేస్తారు మరల 6 నెలల తరువాత అక్షయ తృతీయ నాడు చార్ ధామ్ యాత్ర ప్రారంభం అవుతుంది. ** కాణిపాకం ఆలయ నిర్మాణం పూర్తీ అయింది దర్శనాలు జరుగుతున్నాయి.** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు . ** అరుణాచలంలో కార్తీక దీపోత్సవం 10 రోజులు జరుగుతుంది నవంబర్ 27వ తేదీ నుంచి డిసెంబర్ 6వ వరకు. మహాదీపం డిసెంబర్ 6న పెడతారు** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారు శివరాత్రి నాడు భక్తుల రద్దీ అధికంగా ఉండటం వలన ఆ రోజు చెయ్యరు. రాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

గాయత్రిలోని 24 శక్తులు - 24 Saktis of Gayatri | GAYATRI MANTRA with Meaning

గాయత్రిలోని 24 శక్తులు

“గయాం త్రాయతి ఇతి గాయత్రి” ప్రాణాలను రక్షించేది గాయత్రి. శక్తి పలురకాలు. కానీ అన్నింటికి మూలమైన శక్తి ఒకటి ఉంది. దానిని ఆత్మశక్తి అని, గాయత్రి అని, బ్రహ్మ సంకల్పం అని, ఇచ్ఛాశక్తి అని అంటారు.

ప్రకృతి పరంగా చూస్తే సంవత్సరానికి 12 అమావాస్యలు, 12 పూర్ణిమలు కలసి 24 వస్తాయి. రోజుకు 24 గంటలు. వీటికి ప్రతీకయే గాయత్రి మంత్రం. ద్వాదశ రాశులలో సంచరించే సూర్యుడు సూర్యవిద్య, అమృత వర్షం కురిపించే చంద్రుడు చంద్ర విద్య కలిపి భూమి మీద చూపే ప్రభావం గాయత్రి.

శ్లో:- ఆదిశక్తి స్తధా బ్రహ్మీ వైష్ణవీ తిచ

వేదమాత దేవమాత విశ్వమాత ఋతంభరా

మందాకిన్య జపాచైవ బుద్ధి సిద్ధి ప్రకీర్తితా

వైదికానిటు నామాని పూర్వోక్తానిచ ద్వాదశ

ఆదిశక్తి, బ్రాహ్మీ, వైష్ణవి, శాంభవి, వేదమాత, దేవమాత, విశ్వమాత, ఋతంభర, మందాకిని, అజప, బుద్ధి, సిద్ధి ఈ పన్నెండు జ్ఞాన పక్షానికి, మస్తిష్కానికి, దక్షిణ మార్గానికి సంబందించిన శక్తులు.

శ్లో:- సావిత్రీ సరస్వతీ జ్ఞేయ లక్ష్మీ దుర్గా తధైవచ

కుండలిని ప్రాణాగ్నిశ్చ భవాని భువనేశ్వరి

అన్నపూర్ణేతి మానాని మహామాయా పయశ్వినీ

త్రిపురా చైవేతి విజ్ఞేయా తాంత్రి కానిచ ద్వాదశ

సావిత్రి, సరస్వతి, లక్ష్మీ, దుర్గ, కుండలిని, ప్రాణాగ్ని, భవాని, భువనేశ్వరి, అన్నపూర్ణ, మహామాయ, పయశ్విని, త్రిపుర, ఈ పన్నెండు తాంత్రికమైనవి. వామ మార్గానికి సంబంధించిన శక్తులు.

దక్షిణ మార్గమంటే జ్ఞాన మార్గం, వామ మార్గం అంటే శక్తి సంచయం. ఈ విధంగా జ్ఞానాన్ని, శక్తిని సంపాదించి ఆధ్యాత్మిక భౌతిక శక్తులలో రెండింటిలోనూ సాధకుడు ఫలితాన్ని పొందుతాడు. గాయత్రి మంత్రంలోని 24 అక్షరాలు ప్రకృతిలోని 24 శక్తులను, మానవ శరీరంలో గల 24 శక్తులను సూచిస్తాయి.

"సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ" జ్ఞానానికి ఒక హద్దంటూ ఉండదు. గాయత్రీమంత్రం, సాధకునికి ఋషిత్వ స్ధాయిని ప్రసాదించి, దేవర్షి స్ధాయికి తీసుకొని పోతుంది. అందుకోసం జ్ఞాన పక్షానికి చెందిన 12 శక్తులను, విజ్ఞాన పక్షానికి చెందిన 12 శక్తులను అందిస్తుంది గాయత్రి.

Famous Posts:

భర్త భార్య మాట వినాలంటే ఏమి చేయాలి ?


వాస్తు ప్రకారం ఈ మార్పులు చేసుకుంటే సంపదలు పెరుగుతాయి.


శివుడు చెప్పిన ‘ఆదివిద్య’లు


శివ గుణాలు లోకానికి సందేశాలు


భార్యలు భర్తల కాళ్లను వత్తాలట ఎందుకో మీకు తెలుసా ?


కూతురా కోడలా ఎవరు ప్రధానం...?


సాంబ్రాణి ధూపం వేయడం వల్ల కలిగే లాభాలు?

gayatri, gayatri mantram, gayatri mantra in telugu, gayatri mantra pdf, original gayatri mantra, gayatri mantra meaning, gayatri mantra benefits, gayatri mantra in sanskrit

Comments

Popular Posts