శుక్ర మౌఢ్యమి ప్రారంభం
సెప్టెంబర్ 15(2022) నుండి డిసెంబర్ 2(2022) వరకు
శుక్ర మౌడ్యమి 🌗
జ్యోతిష్య శాస్త్రం రెండు రకాల మౌఢ్యమిల గురించి చెబుతోంది. ఒకటి శుక్ర మౌఢ్యమి, మరొకటి గురు మౌఢ్యమి. సెప్టెంబర్ మాసం 15 వ తేదీనుండి డిసెంబర్ 2 వ తేదీ వరకు అనగా 79 రోజులపాటు శుక్ర మౌఢ్యమి ఉంటుంది. మౌఢ్యమినే వాడుక భాషలో మూడం అంటారు.
నవగ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతాయి. భూమి, సూర్యుడు ఒక గ్రహానికి ఒకే వరుసలో ఉన్నప్పుడు ఆ గ్రహం భూమిపై ఉన్నవారికి కనపడదు. దీన్నే అస్తంగత్వం లేదా మూడం అంటారు. గ్రహాలకు రాజు సూర్యుడు అంటే సూర్యుడికి అత్యంత సమీపంలోకి ఏ గ్రహమైనా వస్తే ఆగ్రహం తన శక్తిని కోల్పోతుంది, అలా గురువు సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు గురు మౌఢ్యం, శుక్రడు సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు శుక్ర మౌఢ్యం వస్తుంటాయి. ఆ సమయంలో అవి బలహీనంగా మారిపోతాయి. అందుకే దానికి మూఢం అనే పేరు పెట్టి శుభ కార్యాలకు దూరంగా ఉండమని శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే అన్ని గ్రహాలకు ఈ పరిస్థితి వస్తున్నప్పటికీ ప్రధానంగా శుభ గ్రహాలైన గురువు, శుక్రునకు శక్తి హీనత మాత్రమే దోషంగా పరిగణిస్తుంది జ్యోతిష్య శాస్త్రం.
గురు, శుక్రులు సూర్యుడికి అత్యంత దగ్గరగా ఉన్నప్పుడు మూఢాలుగా పరిగణించి ఆ రోజుల్లో ఎలాంటి శుభ కార్యాలు చేయకూడదు అని చెబుతారు. ఏ శుభ కార్యక్రమానికైనా గురు శుక్రులు బాగుండాలని, శక్తివంతంగా ఉంటే శుభం జరుగుతుందని విశ్వసిస్తారు. మూఢం సమయంలో ఏదైనా శుభకార్యం చేసినా అశుభం జరుగుతుందని. కష్టం కలుగుతుందని, నష్టం వాటిల్లుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
శుక్రమౌఢ్యమి కాలంలో ప్రకృతి సంపద క్షీణిస్తుంది. సముద్రం. ఆటు, పోటులలో మార్పులు వస్తాయి. శుక్రగ్రహ పాలిత ద్వీపాలకు, ప్రదేశాలకు భూకంప ప్రమాదాలు పొంచి ఉంటాయి. స్త్రీల మీద అత్యధికంగా అత్యాచారాలు జరిగే అవకాశాలుంటాయి. శుక్రుడు సంసార జీవితానికి, శృంగార జీవితానికి కారకుడు జాతకంలో శుక్రుడు బల హీనంగా ఉంటే సంసారజీవితం సజావుగా సాగదు. ఇలాంటి వారు ఇంద్రాణీ దేవి స్తోత్రం పారాయణం చేయాలి.
🌑 మూఢంలో చేయతగినవి:
💠 అన్నప్రాసన చేసుకోవచ్చు.
💠 ప్రయాణాలు చేయవచ్చు.
💠 ఇంటి మరమ్మత్తులు చేసుకోవచ్చు.
💠 భూములు కొనుగోలు, అమ్మకాలు, అగ్రిమెంట్లు చేసుకోవచ్చు.
💠 నూతన ఉద్యోగాల్లో చేరవచ్చు. విదేశాల్లో ఉద్యోగం కోసం వెళ్ళవచ్చు.
💠 నూతన వాహనాలు, వస్త్రాలు కొనవచ్చు.
💠 జాతకర్మ,, జాతకం రాయించుకోవడం, నవగ్రహ శాంతులు, జప, హోమాది శాంతులు, గండనక్షత్ర శాంతులు ఉత్సవాలు చేయవచ్చు.
💠 సీమంతం, నామకరణం, అన్నప్రాసనాది కార్యక్రమాలు చేయవచ్చు. గర్భిని స్త్రీలు, బాలింతలు తప్పనిసరి పరిస్థితితులలో ప్రయాణం చేయాల్సి వస్తే శుభ తిథులలో అశ్విని, దేవతి నక్షత్రాలలో శుభ హోరలో భర్తతో కలిసి ప్రయాణం చేస్తే శుక్రదోషం వర్తించదని శాస్త్రం సూచిస్తుంది.
🌑 మూఢంలో చేయకూడనివి
💠 వివాహాది శుభ కార్యాలు జరుపకూడదు.
💠 లగ్నపత్రిక రాసుకోకూడదు. వివాహానికి సంబంధించిన మాటలు కూడా మాట్లాడుకోరారు.
💠 పుట్టు వెంట్రుకలు తీయించరాదు.
💠 గృహ శంకుస్థాపనలు చేయ రాదు.
💠 ఇల్లు మారకూడదు.
💠 ఉపనయనం చేయకూడదు.
💠 యజ్ఞాలు, మంత్రానుష్టానం, విగ్రహా ప్రతిష్టలు, ప్రతాలు చేయకూడదు.
💠 నూతన వధువు ప్రవేశం, నూతన వాహనం కొనుట పనికిరాదు.
💠 బావులు, బోరింగులు, చెరువులు తవ్వించకూడదు
💠 వేదావిధ్యా ఆరంభం, చెవులు కుట్టించుట. నూతన వ్యాపార ఆరంభాలు మొదలగునవి చేయకూడదు.
Famous Posts:
> పంచముఖ ఆంజనేయ స్వామి వారి అవతార కథ
> హనుమ నామస్మరణం సర్వపాప నివారణం
> స్త్రీల గూర్చి పురుషులు, పురుషుల గూర్చి స్త్రీలు తెలుసుకోవాల్సినవి?
> సూర్యుడి అనుగ్రహాన్ని కోరుతూ ఆదివారాల నోము
> శుక్రవారాల నోముకి ఎంతో ప్రాధాన్యత
శుక్ర మౌఢ్యమి, sukra moudyami in 2022 telugu, guru moudyami in 2022, sukra moodam in 2022, moodam in 2022-2023, moudyami dates in 2022, శుక్ర మౌఢ్యమి 2022, moodam in 2022 end date, moodam in 2022 august