బృహద్ధర్మపురాణంలో బ్రహ్మదేవుడు చేసిన పితృస్తుతి. ఈ స్తోత్రాన్ని శ్రాద్ధ దినములందే కాక ప్రతిరోజూ ఎవరు చదువుతారో వారికి ఈతిబాధలు ఉండవు. ఎవరైనా వారి పితరుల విషయంలో తప్పుచేసి ఉంటే పశ్చాత్తాపంతో ఈ స్తోత్రము చదివితే ప్రాయశ్చిత్తం కలుగుతుంది. అంతేకాక వారు చదివినవారిని అనుగ్రహిస్తారు. దీనిని ఎవరైతే వారి పుట్టిన రోజునాడు తండ్రికి నమస్కరించి వారి వద్ద చదువుతారో వారికి పితరుల అనుగ్రహం లభిస్తుంది.
బ్రహ్మఉవాచ:
1. నమో పిత్రే జన్మదాత్రే సర్వదేవమయాయ చ;
సుఖదాయ ప్రసన్నాయ సుప్రీతాయ మహాత్మనే
ఎవరివలన ఈ జన్మవచ్చినదో, ఎవరు సకల దేవతా స్వరూపులో, ఎవరి ఆశీస్సులవల్ల సుఖములు కలుగునో అట్టి మహాత్ములైన పితరులకు నమస్కారములు.
2. సర్వ యజ్ఞ స్వరూపాయ స్వర్గాయ పరమేష్ఠినే!
సర్వతీర్థావలోకాయ కరుణాసాగారాయ చ!!
సకల యజ్ఞస్వరూపులై స్వర్గంలో ఉండే దేవతలతో సమాన మైనవారు సకల పుణ్యతీర్ధములకు ఆలవాలమైన కరుణా సముద్రులైన పితరులకు నమస్కారములు.
3. నమో సదా ఆశుతోషాయ శివరూపాయ తే నమః!
సదాపరాధక్షమినే సుఖాయ సుఖదాయ చ!!
సులభంగా సంతోషించి వెంటనే అనుగ్రహించేవారైన శివ రూపులకు నమస్కారము, ఆచరించే తప్పులను ఎల్లవేళలా క్షమిస్తూ సంతోషమూర్తులై సుఖములను కలుగజేసే పితరులకు నమస్కారములు.
4. దుర్లభం మానుషమిదం యేనలబ్ధం మాయా వపుః!
సంభావనీయం ధర్మార్థే తస్మై పిత్రే నమోనమః!!
ధర్మాలు ఆచరించడానికి అవకాశమున్న దుర్లభమైన ఈ మానవ శరీరం ఎవరి వలన లభించినదో ఆ పితృదేవతలకు నమస్కారములు.
5. తీర్థ స్నాన తపో హోమ జపాదీన్ యస్య దర్శనం!
మహా గురోశ్చ గురవే తస్మై పిత్రే నమోనమః!!
ఎవరిని చూసినంతనే అనేక తీర్థస్నానములు, తపస్సులు, హోమాలు, జపములు చేసిన ఫలితం కలుగునో మహా గురు వులకు కూడా గురువులైన పితృదేవతలకు నమస్కారములు.
6. యస్య ప్రణామస్తవనాత్ కోటిశః పితృతర్పణం!
అశ్వమేధ శతైః తుల్యం తస్మై పిత్రే నమోనమః!!
ఎవరిని నమస్కరించినా, తర్పణాదులు చేసినా అవి వందల కొలది అశ్వమేధ యాగములతో సమానమో అటువంటి పితరు లకు నమస్కారములు.
ఫలశ్రుతి:
ఇదం స్తోత్రం పితృః పుణ్యం యః పఠేత్ ప్రయతో నరః ప్రత్యహం ప్రాతురుత్థాయ పితృశ్రాద్ధదినోపి చ స్వజన్మదినమే సాక్షాత్ పితురలే స్థితోపినా న తస్య దుర్లభం కించిత్ సర్వజ్ఞత్వాది వాంఛితం నానాపకర్మకృత్వాపి యఃస్తోతి పితరం సుతః సర్భవం ప్రవిధ్యమైన ప్రాయశ్నితం సుఖీభవేత్ పితృగీతికలైన్నిత్యం సర్వకర్మాణ్య ధార్హతి.
Famous Posts:
> ఈ రాశులవారు జీవితంలో డబ్బు హోదాలతో ఉన్నత స్థితిలో ఉంటారు
> ఈ ఉంగరం ధరిస్తే అన్ని శుభాలే
> అదృష్టాన్ని తెచ్చి పెట్టే నవబ్రహ్మ ఆలయం
> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి
> 100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం
> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం
> అందరు తప్పక చదవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం
> ఏలినాటి శని బాధలు తప్పించే సూర్యదేవాలయం ఇదే
brahma mantra pitra dosh, hanuman mantra for pitra dosh, pitra dosh nivaran stotra pdf, pitru dosha nivarana temple, pitru dosha nivarana mantra in telugu, pitra dosh nivaran mantra, pitru dosha, mahalaya amavasya