Drop Down Menus

ఐశ్వర్యం - సుఖసంతోషాలు ప్రసాదించే అమిత శక్తివంతుడు శ్వేతార్క గణపతిని ఎలా పూజించాలి? Swetharka Ganapathi Pooja Vidhanam

ఐశ్వర్యం - సుఖసంతోషాలు ప్రసాదించే శ్వేతార్క గణపతి

శ్వేతార్క మూలం (తెల్ల జిల్లేడు వేరు)లో వినాయకుడు నివశిస్తాడని ప్రతీతి. దీన్ని మనం పొందగలిగి, ఇంట్లో ప్రతిష్టించుకోగలిగితే సుఖసంతోషాలు పొందగలం. కొన్ని తెల్ల జిల్లేడు వేళ్ళు అచ్చం. గణేశుని అకారంలో కనిపిస్తాయి. నేపాల్లో ముఖ్యంగా హిమాలయ ప్రాంతంలో మనకు కనిపించే వివిధ రకాల వనమూలికలలో ఈ శ్వేతార్కం ఒకటి. ఇది రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాలలోనూ మనకు దొరుకుతుంది.

ఈ చెట్టు ఆకులు ఆకుపచ్చగా, పూలు చిన్నవిగా, నీలం రంగుతో ఉంటాయి. అయితే ఇవి చాలా అరుదుగా మాత్రమే దొరుకుతాయి. ఈ శ్వేతార్క మూలాన్ని వెలికి తీసి, మట్టిని కడిగివేసి, వీళ్లలో నానబెట్టి జాగ్రత్తగా పరిశీలించినట్టయితే ఆ వేళ్ల మీద గణపతి ఆకృతి.. కనిపిస్తుందని చెబుతారు. ఈ గణపతిని తంత్రశాస్త్రంలో శ్వేతార్క గణపతి అని అంటారు. 

శ్వేతార్క గణపతిని గురించి ప్రస్తావనలు, వివరణలు మనకు అనేక గ్రంథాలలో కానవస్తాయి. శ్వేతార్క గణపతిని ఇంట్లో ప్రతిష్టించుకునేందుకు సరైన ముహూర్తాన్ని నిర్ణయించుకోవాలి. కుటుంబ పురోహితుల్ని సంప్రదించి, వారి సలహా మేరకు ముహూర్తాన్ని పెట్టించుకోవాలి.

 వినాయక చవితి పండుగ రోజున ఈ శ్వేతార్క గణపతిని ప్రతిష్టించి పూజ చేసుకోవాలి. పుష్యమీ నక్షత్రం ఉన్న ఆదివారం శ్వేతార్క గణపతిని ప్రతిష్టించుకునేందుకు సర్వశ్రేయస్కరం. ఈ రోజును 'రవి పుష్యయోగ' దినంగా పేర్కొంటారు.

శ్వేతార్క మూలానికి వశీకరణ శక్తి ఉంటుందిట, ఏదైనా శుభముహూర్తాన శుచియైన తర్వాత ఆవునెయ్యి, గోరోజనం సిద్ధంగా ఉంచుకుని, ఈ ఆవునెయ్యి గోరోజనంలో శ్వేతార్క మూలాన్ని గంథంలాగా అరగదీసి ఇష్టదైవాన్ని మనసులో ప్రార్థిస్తూ నుదుటి మీద తిలకం వలె ధరిస్తే ఆ తిలకానికి ఉన్న వశీకరణ శక్తి స్వయంగా అనుభవంలోకి వస్తుంది. ఇక శరీర రక్ష కోసం శ్వేతార్క మూలాన్ని చిన్నదిగా తీసుకుని భుజం మీద లేదా కంఠంలో ధరించడం వల్ల ఆరోగ్య రక్ష కలుగుతుంది. భూత ప్రేత పిశాచాల భయం, నరుల దిష్టి వంటి హాని కలగకుండా ఇది కాపాడుతుంది.

శ్వేతార్క గణపతిని పూజా గృహంలో పెట్టుకుని దాని ముందు ప్రతిరోజూ ఓం గం గణపతియే నమ : అని ఒక జపమాల జపించడం వల్ల జీవితంలో ఉన్నతి లభిస్తుంది. ధన ధాన్య సుఖ సౌభాగ్య వృద్ధి కలుగుతుంది. దారిద్య్ర్య నివారణకు తరుణోపాయం శ్వేతార్క గణపతి. జీవితంలో సర్వతోముఖాభివృద్ధి కోసం దిగువ చెప్పిన మంత్రాన్ని ప్రతిరోజూ కనీసం ఒక జపమాల చేయాలి.

మంత్రం:

' ఓం నమో విఘ్నహరాయ గం గణపతయే నమ:

ఈ మంత్రాన్ని 5 జపమాలలు పఠించిన తర్వాత పూజ సామగ్రిని శ్వేతార్క గణపతి సహితంగా ఒక ఎర్రని వస్త్రంలో చుట్టి, గణేశ చతుర్థి రోజున మీ సమీపంలో గణేశాలయంలో దానిని గణేశని చరణాల వద్ద సమర్పించండి. భక్తి పూర్వకంగా నమస్కరించి, శ్వేతార్క మూలాన్ని భస్మం చేసి దానిని తిలకంగా నుదుటి మీద ధారణ చేయడం వల్ల లక్ష్మీ ప్రసన్నం కూడా కలుగుతుంది.

Famous Posts:

శుక్రవారాల నోముకి ఎంతో ప్రాధాన్యత


శివదేవుని సోమవారపు నోము కథ


తీర్థం తీసుకున్న తర్వాత చేతిని తలపై రాసుకుంటే ఏంమవుతుంది?


సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఇన్ని లాభాలు


ఈ రాశులవారు జీవితంలో డబ్బు హోదాలతో ఉన్నత స్థితిలో ఉంటారు


ఈ ఉంగరం ధరిస్తే అన్ని శుభాలే

శ్వేతార్క గణపతి, swetharka ganapati, ganapati, vinayaka, vinayaka chavithi, swetharka ganapati pooja, ganapati stotram

ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.