మీ ఇంటి ఆవరణ ఈశాన్యం వైపు..!!
ఈ ఒక్క మొక్క మీ ఇంట్లో ఉంటె చాలు..దుష్టశక్తుల పరార్
దేవుడు ఉన్నట్టే ఈ ప్రపంచంలో దెయ్యాలు, భూతాలు కూడా ఉన్నాయని నమ్మేవారు ఉన్నారు. ఈ క్రమంలోనే అలాంటి వారు తమ దగ్గరకు దుష్ట శక్తులు రాకుండా తాయత్తులు కట్టుకోవడం, దేవుళ్ల ఫొటోలు దగ్గర ఉంచుకోవడం, ఇతర పనులు చేస్తుంటారు.
అయితే దుష్ట శక్తుల బారిన పడకుండా ఉండేందుకు ఇవే కాదు, ఇంకా కొన్ని రకాల సూచనలు కూడా ఉన్నాయంటున్నారు నిపుణులు. వాటిని పాటిస్తే దుష్ట శక్తులే కాదు, నెగెటివ్ ఎనర్జీ కూడా దగ్గరకు రాదని సెలవిస్తున్నారు. దీంతో అదృష్టం కలసి వస్తుందని పేర్కొంటున్నారు. అలాగే తాము అనుకున్న పనులు నెరవేరుతాయి అని సూచిస్తున్నారు… ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్న ప్రకారం.. అలాంటి సూచనల్లో జిల్లేడు మొక్క కూడా ఒకటి… ఔషధపరంగా ఇది గొప్ప మూలిక. ఇక ఆధ్యాత్మిక పరంగా చూస్తే, దానిలో దేవతాశక్తులను ఆకర్షించే సుగుణం అధికంగా ఉంది.
ఒక తెల్ల జిల్లేడు చెట్టు 12 సం.ల పైగా అవిచ్ఛిన్నంగా పెరిగితే దాని తల్లివేరు గణపతి ఆకారంగా గానీ, ఆంజనేయ ఆకారంగా గానీ దానంతట అది గానే రూపొందుతుంది. దాన్ని శాస్త్రోక్త విధానంగా ఆరాధన చేస్తే ఆయా దేవతల అనుగ్రహం విశేషంగా లభిస్తుంది.
తెల్లజిల్లేడు సూర్య భగవానుడికి గూడా ప్రియమైనదే తెల్ల జిల్లేడును శ్వేతార్కం అంటారు. వృక్షజాతిలో ఈ తెల్ల జిల్లేడు విశిష్టమైంది. ఇందులో విషం ఉంటుందని చాలామంది ఈ మొక్కలకు దూరంగా ఉంటారు. ముఖ్యంగా జిల్లేడు పాలు కళ్ళలో పడితే చూపు పోతుందని భయపడతారు. కానీ గమ్మత్తేమిటంటే ఈ మొక్కలో ఉన్న విషంతో ఆయుర్వేదంలో దివ్యమైన ఔషధాలు తయారుచేస్తున్నారు. జిల్లేడులో రెండు రకాలు ఉంటాయి. వంగపూవు రంగు పూలు పూసే జిల్లేడు ఒకటి, తెల్ల పూల జిల్లేడు మరొకటి. ఇది హేరంబ గణపతికి ప్రతీక. ఈ తెల్ల జిల్లేడును దొరికించుకుంటే మహాశివుడు, విఘ్నాదిపతుల దయ మనమీద ప్రసరిస్తుందట. తెల్ల జిల్లేడు వేళ్ళ మీద గణపతి నివసిస్తాడు. ఈ వేళ్ళు కొన్నిసార్లు ఆకృతిలో సైతం గణేశుని పోలి ఉంటాయి. అందుకే చాలామంది తెల్ల జిల్లేడును పరమ పవిత్రంగా భావించి, తులసి మొక్కలా ఇంట్లో నాటుతారు.
ఈ మొక్క గనుక ఉంటే ధన ధాన్యాలు పుష్కలంగా లభిస్తాయట. ఆలోచనల్లో పరిపక్వత వస్తుందని, ఎవరైనా హాని తలపెట్టినా, దుష్టశక్తులు మీ ఇంటిపైకి వచ్చినా, అలాంటివి దుష్ప్రభావం చూపకుండా, వారి ప్రయోగాలే నశిస్తాయని ప్రతీతి. ఇళ్ళలో జిల్లేడు మొక్కలు ఉండకూడదనేది ఒక అపోహ మాత్రమే. నిజానికి శ్వేతార్కం లేదా తెల్ల జిల్లేడు మొక్క ఇంట్లో ఉంటే ఇక వారికి దారిద్ర్యం అంటే ఏమిటో తెలీదట. జిల్లేడు మొక్కలు అధికంగా ఉన్న ఊళ్ళో పంటలు బాగా పండుతాయంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే జిల్లేడు సిరిసంపదలకు చిహ్నం అని నమ్ముతారు. తెల్ల జిల్లేడు వేళ్ళు గనుక గణపతి రూపాన్ని సంతరించుకుంటే, అది స్వయంభూ శ్వేతార్క గణపతి అన్నమాట. మరి ఈ శ్వేతార్క రూపాన్ని ఎలా పూజించాలి అని సందేహం వస్తుంది కదూ!
ఈ గణపతికి ఎరుపు రంగు ఇష్టం. ఆసనం మీద కుంకుమ వేసి శ్వేతార్క గణపతిని నిలిపి, ఎర్ర వస్త్రం కప్పి, నైవేద్యం సమర్పించి పగడాలు లేదా ఎర్ర రుద్రాక్షలతో పూజించాలి .మందార లాంటి ఎర్రటి పూలు, ఎర్ర చందనంతో పూజ చేయాలి. శ్వేతార్క గణపతిని పూజించిన వారికి వెంటనే గొప్ప ఫలితాలు సాక్షాత్కరిస్తాయని ఎందరో అనుభవపూర్వకంగా చెప్తున్నారు. ఇంకేండుకండీ ఆలస్యం ఇంట్లో తులసి చెట్టును ఎలాగైతే పూజిస్తున్నారో అలాగే తెల్లజిల్లేడు మొక్కను కూడా పెంచుకోండి దుష్టశక్తుల బారినుండి బయటపడండని వేద పండితులు సూచిస్తున్నారు.
Famous Posts:
> హనుమ నామస్మరణం సర్వపాప నివారణం
> స్త్రీల గూర్చి పురుషులు, పురుషుల గూర్చి స్త్రీలు తెలుసుకోవాల్సినవి?
> సూర్యుడి అనుగ్రహాన్ని కోరుతూ ఆదివారాల నోము
> శుక్రవారాల నోముకి ఎంతో ప్రాధాన్యత
శ్వేతర్కం, జిల్లేడు, jilledu, swekthara ganapati, ganapati, gilledu chetu, jilledu chettu uses,