ప్రేమతో అమ్మవారి మనసును ఎలా గెలుచుకోవాలి? How to win a mother's heart with love?

ప్రేమతో అమ్మవారి మనసును ఎలా గెలుచుకోవాలి?

నియమ నిష్టలతో చేసుకునే పూజ ఒకటైతే..ప్రేమతో చేసుకున్న పూజ మరొకటి..నా పూజ అమ్మ పైన అమితమైన ప్రేమతో ఉంటుంది కానీ చాలా సులువుగా అమ్మ మనసుని గెలుచుకోవచ్చు..అమ్మవారంటే సాక్షాత్తు మనల్ని కన్న అమ్మ..అమ్మని చూసి ఎప్పుడు భయపడకూడదు..మన అమ్మ దగ్గర ఎంత చదువుతూ ఉంటామో అంతే చనువుతో అమ్మవారి దగ్గర కూడా నడుచుకోవాలి..అమ్మవారిని ఫోటోలో ఒక బొమ్మలా కాకుండా సాక్షాత్తు ఒక ప్రాణం ఉన్న మనిషి మన ముందు ఉంటే ఎలా నడుచుకుంటామో అలానే నడుచుకోవాలి.

అమ్మవారిని ఒక బాధ్యతగా స్వీకరించాలి..కష్టమని అనుకోకుండా రోజూ పొద్దున్న,సాయంత్రం దీపం పెట్టుకోవాలి..అమ్మకు నచ్చిన స్తోత్రాలు పెట్టి అమ్మవారిని వింటూ ఉండమని చెప్పాలి..నిత్యం మీరు "శ్రీ మాత్రే నమః" అనే నామాన్ని మనసులో స్మరించుకుంటూ ఉండాలి..మొదట్లో కొంచెం కష్టంగా ఉన్నా కానీ మీకే తెలియకుండా మనసులో స్మరిస్తూనే ఉంటారు..ఒకవేళ మీ వల్ల కాకపోతే అమ్మవారికి చెప్పండి..అమ్మే మీకు గుర్తు చేస్తూ ఉంటుంది..

నైవేద్యం విషయానికొస్తే ప్రత్యేకించి ఏమీ పెట్టాల్సిన అవసరం లేదు మీరు తింటున్నది అమ్మవారికి ఒక్కసారి చూపించి అమ్మకి సమర్పించి స్వీకరించండి..నా బిడ్డ నన్ను తలుచుకుంటుంది అని అమ్మ మనల్ని చూసి మురిసిపోతుంది..

అమ్మవారికి ఇష్టమైనది అమితమైన ప్రేమ..అమ్మ మీ నుంచి ఆశించేది స్వచ్ఛమైన మనసుని..అమ్మవారు కోరుకునేది ఒక చంటి పిల్ల వలె మనం అమ్మ దగ్గర నడుచుకోవడం..

ఈరోజుల్లో పూజ చేయడం అంటే అమ్మో అంటున్నారు..కానీ మీకు తెలియని విషయం ఏమిటంటే..ఒక్కసారి అమ్మవారి మనస్సు గెలుచుకుంటే..అమ్మ మిమ్మల్ని సింహాసనం పైన కూర్చోబెడుతుంది..కోరుకోవడానికి కోరికే లేకుండా చేస్తుంది..అంతలా మీ మనసును చదివేస్తుంది అమ్మ..మనం చేయాల్సింది నిత్యం అమ్మ అమ్మ అమ్మ అమ్మ అమ్మ అని అమ్మ పాదాలు పట్టుకొని అమితమైన ప్రేమను చూపించడం..అమ్మకి ఏదైతే నచ్చుతుందో అది మన ఇష్టంగా స్వీకరించాలి..నిత్యం అమ్మ గురించే వినడం తెలుసుకోవడం చేస్తూ ఉండాలి..మీరు అమ్మవారికి నచ్చినట్టు ఉంటే అమ్మవారి కరుణా,కృప,దయ,ప్రేమ అన్నీ మీ పైన మీ కుటుంబం పైన ఎప్పుడూ ఉంటాయి..

ఒక్కసారి అమ్మవారి మనసుని గెలుచుకొని చూడండి ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేము అనుభవించి తీరాల్సిందే..

సెప్టెంబర్ 26 నుంచి దేవీ నవరాత్రులు ప్రారంభం అవుతున్నాయి అందరూ తప్పకుండా మీకు తోచిన విధంగా దేవీ నవరాత్రులు జరుపుకుంటారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను..

ఒక విషయం..అమ్మవారు పూజలో ఎప్పుడు ఏ తప్పుని కూడా ఎంచదు..అమ్మవారు కోరుకునేది ఒక్క మీ స్వచ్ఛమైన మనసుని మాత్రమే ఇది గుర్తుంచుకోండి..

Famous Posts:

సూర్యుడి అనుగ్రహాన్ని కోరుతూ ఆదివారాల నోము


శనేశ్వరుడు శనివారాల నోము


శుక్రవారాల నోముకి ఎంతో ప్రాధాన్యత


శివదేవుని సోమవారపు నోము కథ


తీర్థం తీసుకున్న తర్వాత చేతిని తలపై రాసుకుంటే ఏంమవుతుంది?

ammavaru, devi navaratrulu, dasami, navratri 2022 date, navratri, durga, devotional stotrys

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS