బెల్లం నివేదన..!! Jaggery recipe in Telugu - Naivedyam recipe/bellam

బెల్లం నివేదన..!!

ఎన్నో దేవాలయములలో బెల్లం ప్రసాదములనే భగవంతునికి  నివేదన చేస్తారు..పంచదార వాడరు ఎందువల్ల..

చెఱుకు గడలను దంచి రసం తీసి..

అట్టి రసాన్ని బాగుగా కాచి శుద్ది చేసిన తరువాత చెక్కముక్కలు లేక మట్టి పాత్రల యందు పోసి..

గడ్డ కట్టగా వచ్చిన దిమ్మ లేక అచ్చులను..

బెల్లము అంటారని మనకు తెలిసిన విషయమే.

ఈ విధానము సహజ మైనది. శుద్ధమైంది. 

ఇందులొ చెఱకు రసం తప్పా వేరేమి కలుపరు,  శుద్దమైనది.  

అందుచేతనే హరద్రా (  పసుపు గణపతి కి) బెల్లం ముక్కను నివేదిస్తాము. 

నైవేద్యములలొ బెల్లం ఉపయోగించినప్పుడు దోషాలు పోవటానికి మిరియపు గింజను గానీ లవంగ మొగ్గను కానీ వాడుట సహజం.

బెల్లానికి నిలవ దోషం లేదు. 

అందుకే మహానైవేద్యంలో పదార్ధాలమీద కొద్దిగా నెయ్యి వేసి చిన్న బెల్లం ముక్క కూడా వేసి మరీ నైవేద్యం పెడతారు.

నైవేద్యానికి పంచదార పనికిరాదు. 

ఇది నేను పూజ్యుల ప్రవచనంలో విన్నది.

సనాతనమైన దేశీయమైన రైతు పండించిన చెరకు రసంతో తీసిన మధురం బెల్లం..

ప్రాచీనమైన ప్రక్రియ బెల్లంతోనే చేసేవారు.

ఎలాంటి చెడు లేకపోగ ఆరోగ్య రీత్యా మంచిదనే బెల్లాన్నే వాడతారు

శాస్త్రం ప్రకారం బెల్లమునకు ఎంగిలి ఆపాదించబడదు.

అదే మిగతా పదార్థాలు కానీ పళ్లు కానీ కొంత ఉపయోగించిన మిగిలిన భాగం ఉఛ్ఛిష్ఠమగుతుంది.

అంటే దైవ నివేదనకు పనికిరాదు.

అదే బెల్లం విషయం లో వర్తించదు.

అంతే కాక బెల్లం సంపూర్ణ ఆహారం.

ఆంజనేయస్వామి  వారి గుడిలోని తెలిసిన పూజారి గారు నాకు చెప్పారు " పంచదార తయారీలో అభ్యంతరకరమైన  పదార్థాలు  కలుస్తాయి . 

అందువలన  స్వామి వారి పానకం , చెక్కర పొంగలి మరియు అప్పాలు తయారీలో మేము  కేవలం బెల్లం  మాత్రమే  వాడతాం "  అని అన్నారు .

ఓం  నమో  భగవతే  ఆంజనేయాయ మహా బలాయ స్వాహా " .

Famous Posts:

స్త్రీల గూర్చి పురుషులు, పురుషుల గూర్చి స్త్రీలు తెలుసుకోవాల్సినవి?


సూర్యుడి అనుగ్రహాన్ని కోరుతూ ఆదివారాల నోము


శనేశ్వరుడు శనివారాల నోము


శుక్రవారాల నోముకి ఎంతో ప్రాధాన్యత

శివదేవుని సోమవారపు నోము కథ

బెల్లం, bellam, naivedyam, prasadalu, temple, navaratrulu naivedyalu

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS