Drop Down Menus

Karthika Somavara Vratha Katha Telugu | కార్తీక సోమవార వ్రత మహత్యం వెయ్యి అశ్వమేథయాగాల ఫలం

కార్తీకమాస సోమవారాలు

శివుడికి ప్రీతికరమైన రోజు సోమవారం. అందులోనూ శివకేశవులకు యిష్టమైన కార్తీకమాసంలోని సోవారాలు స్నాన, జపాలు ఆచరించేవారు వెయ్యి అశ్వమేథాల ఫలాన్ని పొందుతారు. కార్తీకమాస సోమవారాల్లో ఆరు రకాల వ్రత విధి ఉంది. అవి ... ఉపవాసం: శక్తి ఉన్నవారు కార్తీక సోమవారం రోజున పగలంతా ఉపవాసంతో (అభోజనం) గడిపి, సాయంకాలం శివుడికి అభిషేకం చేసి, నక్షత్ర దర్శనం తరువాత తులసితీర్థం మాత్రమే సేవించాలి.

ఏకభుక్తం

ఏకభుక్తం అంటే ఒక్కసారి మాత్రమే భోజనం చేయాలన్నమాట. ఉదయం స్నానం చేసి దాన, తపం, జపాలు చేసిన తరువాత మధ్యాహ్నం పూట భోజనం చేసి, రాత్రి శైవతీర్థమో, తులసీ తీర్థమో మాత్రమే తీసుకోవాలి.

నక్తం

పగలు అంతా ఉపవాసం ఉండి, రాత్రి నక్షత్ర దర్శనం తరువాత భోజనం కానీ, ఉపాహారం కానీ స్వీకరించాలి. అయాచితం: భోజనం కోసం తాము ప్రయత్నించకుండా ఎవరైనా పిలిచి పెడితే మాత్రమే భోజనం చేయడం అయాచితం.

స్నానం

పైవాటికి వేటికీ శక్తిలేని వాళ్ళు సమంతరం స్నానం, జపాలు చేసినా చాలు. తిలదానం: మంత్ర, జపవిధులు కూడా తెలియనివాళ్ళు కార్తీక సోమవారం రోజున నువ్వులను దానం చేసినా సరిపోతుంది.

పైన పేర్కొనబడిన వాటిల్లో ఏది చేసినా సోమవార వ్రతం చేసినట్లే అవుతుంది అని పురాణాల ద్వారా తెలుస్తోంది. పరమశివుడి కుమారుడైన కుమారస్వామిని కృత్తికలు పెంచడం వల్ల వారి పేరుతొ ఉన్న కార్తీకమాసం అంటే పరమశివుడికి మహాప్రీతి. గరళకంఠుడైన పరమశివుడు తమోగుణం స్వభావాన్ని చంద్రుడు మాత్రమే హరించగలడు అందుకే ఈ నెలలో సోమవారానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.

కార్తీకమాసంలో పాడ్యమి నుంచి కార్తీక వ్రతం ప్రారంభించాలి. దామోదరుడైన (పద్మనాభుడైన మహావిష్ణువు)ను ఉద్దేశించి దీన్ని చేయాలి. ఈ తులామాసంలో గోష్పాదమంత జలప్రదేశంలో కూడా అనంతశయనుడు అయిన శ్రీమహావిష్ణువు నివశించి ఉంటాడు. నదులు, చెరువులు, బావులు, గుంటలలో స్నానాలు చేసి దేవతలకు, ఋషులకు, పితరులకు తర్పణాలు చేయాలి. త్రేతాయుగం కార్తీక శుద్ధ నవమి రోజున ప్రారంభం అయినట్లు పంచాంగాల ద్వారా తెలుస్తోంది. కార్తీకమాసంలో కృత్తికా నక్షత్రం, గురు గ్రహం, సోమవారం కలిసివస్తే దాన్ని పరమపవిత్రమైన రోజుగా గుర్తించాలి అని వేదం చెబుతుంది.

శ్రీ మహావిష్ణువును నక్షత్ర పురుషుడిగా ఆరాధించే సంప్రదాయం కూడా ఉంది. ఈ నక్షత్ర పురుషుని వర్ణన, విశ్వాంతరాళపు నక్షత్రసీమలను పురుషాకారంగా వర్ణించిన తీరుకు రూపకల్పన అనిపిస్తుంది. నక్షత్ర పురుషునికి కృత్తికలు కటి (నడుము) స్థానంగా, మూలా నక్షత్రం పాదాలుగా, రోహిణి నక్షత్రం తొడలుగా, అశ్విని నక్షత్రం మోకాళ్ళుగా ఉన్నాయి. కాగా పూర్వాషాఢ నక్షత్రం, పురుషాఢ నక్షత్రం, ఫల్గునీ నక్షత్రాలు మర్మస్థానాలుగా, భాద్రపద నక్షత్రాలు భుజాలుగా, రేవతి నక్షత్రం కుక్షిగా, అనూరాధ నక్షత్రం వక్షస్థలంగా, విశాఖ నక్షత్రం ముంజేతులుగా, హస్త చేతులుగా, పునర్వసు నక్షత్రం వేళ్ళుగా, జ్యేష్ఠ కంఠంగా, పుష్యమి నక్షత్రం ముఖంగా, భరణి నక్షత్రం శిరస్సుగా మారిపోయాయి.

Famous Posts:

కార్తీక మాసం 2022 తేదీలు, కార్తీక మాసం యొక్క ప్రాముఖ్యత

కార్తీకమాసంలో ఏ తిథి రోజున ఏం చేయాలి? విధానాలు తెలుసుకుందా..!!

కార్తీక మాసంలో ఇవి తీసుకోకూడదు..

కార్తీక మాసంలో ఈ నాలుగు తప్పకుండా పాటించాలి?

కార్తీక మాసంలో ఉపవాసం చేసేవాళ్ళు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు?

కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద దీపం వెలిగిస్తే ఏమవుతుంది?

Tags : కార్తీక మాసం, సోమవారం, కార్తీకమాసం సోమవారం వ్రతం, karthika masam, somavaram vratam, karthika masam telugu, karthika pournami, karthika masam 2022 end date, karthika masam 2022 start date, karthika somavaram vratam telugu, lord shiva

ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.