Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

పెళ్లిలో తాళి కట్టేటప్పుడు మూడు ముళ్ళు విశిష్టత - Three thorns are special when tying thali in marriage

పెళ్ళిలో మూడు ముళ్ళు విశిష్టత..

హిందూ వివాహ సంప్రదాయం లో మాంగల్య ధారణ అనేది చాలా ప్రధానమైన ఘట్టం. మాంగల్యం అంటే మంచిది అని, ధారణ అంటే ధరించటం అని అర్ధం. పెళ్లికూతురి మెడలో పెళ్ళికొడుకు ఒకటి పెళ్లికూతురి తరుపు, రెండొవది పెళ్ళికొడుకు తరుపున, ఇలా రెండు మంగల్యాలను కడతాడు. అంటే మాంగల్యానికి రెండు బిళ్ళలు వ్రేలడతాయి.

ఈ మాంగల్యం రక్షణ, నమ్మకం, మనస్సాక్షికి ప్రతిరూపంగా, జీవితాంతం తోడు నీడగా ఉంటానని పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి అందరి ముందు ప్రమాణం చేస్తున్నాడనటానికి ప్రతీక. ఇంతకీ మూడు ముళ్ళకున్న దైవాంశిక పరమార్థం ఏంటో ఒకసారి తెలుసుకుందాం...

ప్రాచీనుల కాలం నుండి ప్రాచీనులు ‘మూడు' అనే అంకెకు ప్రత్యేక స్థానాన్ని ఇచ్చారు.

దేవుళ్ళకు సంబంధించి:

బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు.

సృష్టి పరంగా :

సృష్టి, స్థితి, లయలు మూడు అని మనకు తెలిసిందే.

ఆధ్యాత్మిక పరంగా :

ఆధి దైవిక, ఆదిభౌతిక, ఆధ్యాత్మిక శాంతులు మూడు.

యాగంలో ప్రత్యేకంగా :

యాగానికి కావలసిన అగ్నులు మూడు.

తాంబూలంలో  :

ఆకు, వక్క, సున్నం ఈ మూడూ తాంబూలంకు ముఖ్యం.

యజ్ఞోపవీతం :

యజ్ఞోపవీతంలోని పోగులు మూడు. ఒక్కో పోగులోని లోపలి పోగులు మూడు. బ్రహ్మ సూత్రంలోని బ్రహ్మ సూత్రంలోని ముడులు మూడు.

మోక్ష్యం కోసం:

ధర్మ, అర్థ, కామ అనే మూడింటితో మోక్షాన్ని పొందటానికి.

మంగలసూత్రపు పేటలు మూడు, ముడులు కూడా మూడు. ఇవి కాక మరొక ముఖ్య విశేష విషయం ఏమిటంటే:

ప్రతీ వ్యక్తికీ మూడు శరీరాలుంటాయి :

స్థూల - సూక్ష్మ - కారణ శరీరాలు. ఇవి కాక మరొక ముఖ్య విశేష విషయం ఏమిటంటే: మాంసం, రక్తం, ఎముకలు - వీటన్నింటినీ కప్పే ఈ కనిపించే శరీరం స్థూల శరీరం. వ్యక్తిని ఆకర్షించేది ఈ శరీరమే(ఒడ్డు, పొడుగు, రంగు మొదలైన వాని ద్వారా) శరీరానికి ఆధారభూతుడైన జీవుడు నివసించే శరీరం సూక్ష్మ శరీరం జీవుడు అనుభవించవలసిన సుఖ దుఖా:లని అనుభవిస్తున్నాడా, లేదా అని సాక్షిభూతంగా పరమాత్మ చూసే శరీరం కూడా ఇదే. పూర్వ జన్మలో చేసిన ఏ పుణ్య పాపాల బాకీని తీర్చుకోవడానికి ఈ శరీరం పుట్టిందో అది కారణ శరీరం. రోగాలూ, నొప్పులూ, బాధలూ, మానసిక శాంతీ, ఆధ్యాత్మిక చింతనా ఏది వచ్చినా అది పూర్వ జన్మ సంస్కార ఫలితమే. అది ఈ శరీరానికి కలుగుతుంది.

విజ్ఞాన శాస్త్రం ప్రకారం ఆరోగ్యవంతునికి ఆరోగ్యవంతుడే పుట్టవలసి ఉన్నా, కారణ శరీరం ద్వారా అనారోగ్యవంతుడు పుట్టవచ్చు. చాలా మంది పుత్రులు తల్లిదండ్రులలాగ ఉండకపోవడానికి ప్రత్యక్షసాక్ష్యం కారణ శరీరం. ఇలా మూడు శరీరాలకు మూడు ముడులు వేస్తాడు వరుడు.

Famous Posts:

ఈ ఉంగరం ధరిస్తే అన్ని శుభాలే


అదృష్టాన్ని తెచ్చి పెట్టే నవబ్రహ్మ ఆలయం


> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి


100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం


> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం


అందరు తప్పక చదవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం


ఏలినాటి శని బాధలు తప్పించే సూర్యదేవాలయం ఇదే


గోవుతో గృహప్రవేశం ఎందుకు చేయిస్తారో తెలుసా?

పెళ్ళి, మూడు ముళ్ళు, మంగళసూత్రం, talibottu, marriage, pelli, tali kattadam, mangala sutram

Comments