దసరా రోజున పాలపిట్ట దర్శనం ఎందుకు చేసుకుంటారు? Why do Palapitta darshan on Dussehra day?

పాలపిట్ట దర్శనం ఎందుకు..

విజయదశమిని సమస్త విజయాలకు సంకేతంగా భావిస్తారు. నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని నవదుర్గలుగా పూజించి, దశమి నాడు అపరాజితాదేవిని రాజరాజేశ్వరిగా ఆరాధిస్తారు. దసరా నాడు సీమోల్లంఘనం చేసి (గ్రామశివారు దాటి) ఈశాన్య భాగంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు. శమీవృక్షాన్ని దర్శించి దసరా వేడుకను ఉత్సాహంగా చేసుకుంటారు. తర్వాత పాలపిట్టను దర్శించుకోవడం ఆనవాయితీ.

విజ‌య‌ద‌శ‌మి సంద‌ర్భంగా  ద‌స‌రా రోజున పాల‌పిట్ట‌ను దర్శించుకోవ‌డం వ‌ల్ల‌ అన్నీ శుభాలే క‌లుగుతాయ‌ని పురాణాలు చెబుతున్నాయి. అయితే అస‌లు పాల‌పిట్ట‌ను ఎందుకు ద‌ర్శించుకోవాలి ? దాని వెనుక ఉన్న అస‌లు కార‌ణం ఏమిటి ? అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

పాండ‌వులు అర‌ణ్య‌, అజ్ఞాత వాసాల‌ను ముగించాక విజ‌య‌ద‌శ‌మి రోజు శ‌మీ వృక్షంపై ( జమ్మి చెట్టు) ఉన్న త‌మ ఆయుధాలను తీసుకుని హ‌స్తినాపురం వైపు ప్ర‌యాణానికి ఉద్యుక్తులు కాగా ఆ స‌మ‌యంలో వారు ఎదురుగా వచ్చిన పాల‌పిట్ట‌ను చూస్తారు. అప్పటి నుండి పాండవులకు అన్నీ శుభాలే క‌లుగుతాయి. కురుక్షేత్ర యుద్ధంలో కౌర‌వుల‌పై వారు విజ‌యం సాధిస్తారు.  అప్పటి నుండి ద‌స‌రా రోజున ( విజయదశమి రోజున) పాల‌పిట్ట‌ను చూడ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంద‌ని పురాణాలు చెబుతున్నాయి.

పాల‌పిట్ట సాక్షాత్తూ దేవీ స్వ‌రూప‌మ‌ని, అది ఉత్త‌ర దిక్కు నుంచి వ‌స్తే ఇంకా మంచిద‌ని, శుభాలు, విజ‌యాలు క‌లుగుతాయని పండితులు చెబుతున్నారు.

నీలం, పసుపు రంగుల కలబోతతో ఎంతో అందంగా కనిపించే పాలపిట్టను విజయానికి ప్రతీకగా భావిస్తారు. పాలపిట్టను దర్శించడం వెనుక కొన్ని ఐతిహాసిక కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి. రావణుడితో యుద్ధానికి బయల్దేరిన రాముడికి పాలపిట్ట దర్శనమిచ్చిందని చెబుతారు. అలాగే అజ్ఞాతవాసం ముగించిన పాండవులు విజయదశమి నాడు జమ్మిచెట్టును పూజించి, దానిపై ఉంచిన ఆయుధాలు తీసుకున్న తరుణంలోనూ వారికి పాలపిట్ట దర్శనమిచ్చిందన్న కథ ప్రచారంలో ఉంది.

త్రేతాయుగంలో శ్రీరాముడికి, ద్వాపరంలో పాండవులకు పాలపిట్ట దర్శనం తర్వాతే విజయం లభించిందని విశ్వసిస్తారు. ఈ మేరకు దసరా నాడు విజయోత్సాహానికి సూచకంగా శమీ వృక్షాన్ని పూజించి, సీమోల్లంఘనంతోపాటు పాలపిట్టను చూడాలనే సంప్రదాయం ఏర్పడింది.

పాలపిట్ట,దసరా, palapitta, dasami, devi navaratrulu, vijaya dasami, palapitta, 

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS