Drop Down Menus

పితృదేవతలకు భోజనం ఎలా అందుతుంది? How do Pitru devathalu receive food?

పితృదేవతలకు భోజనం ఎలా అందుతుంది?

శ్రాద్ధపక్షంలో పితరుల శాంతికోసం బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. దీనివల్ల పితృదేవతలు తృప్తి చెందుతారు. ఈ విషయమై కొన్ని సందేహాలు సహజంగా కలుగుతాయి.

మొదటిది- బ్రాహ్మణునికి ఇచ్చిన భోజనంతో పితృదేవతలు ఎలా తృప్తి చెందుతారు? రెండు- పితృదేవతలు మానవయోనిలోనే ఉండాలనే నియమం లేదు కదా! విభిన్నప్రాణి సంతతికి, విభిన్న ఆహారం ఉంటుంది. ఆయా ప్రాణుల్లో జన్మించిన పితృదేవతలు అన్నం స్వీకరిస్తారా?

ఈ రెండు ప్రశ్నలకూ శాస్త్రాలు స్పష్టమైన వివరణ ఇచ్చాయి. నుృతుని వంశీయులు భక్తిశ్రద్ధలతో బ్రాహ్మణులకు భోజనం సమర్పిస్తే- పితరులు ఏ లోకంలో, ఏ రూపంలో ఉన్నాశ్రాద్ధకర్త ఆహ్వానించి సత్కరించే బ్రాహ్మణుల్లో సూక్ష్మరూపంలో ప్రవేశించి, ఆహారంలోని సూక్ష్మకణాలను గ్రహిస్తారు.

 దీనికి కారణం పితృదేవతలది సూక్ష్మరూపం కావడం. పితరులు దేవయోనిలోకి వెళ్లి ఉంటే, ఆ భోజనం అమృతరూపంలో అందుతుంది. మనుష్య యోనిలోని పితరులకు అన్నంగా, పశుయోనిలోని పితరులకు సంగా, నాగయోనిలోని పితరులకు వాయురూపంలో, యక్షయోని లోని పితరులకు జలంగా అందుతాయి.

పేరు, గోత్రం ఉచ్చరించి భక్తిశ్రద్ధలతో ఆర్పించిన పదార్థం, మంత్రోచ్చారణ ద్వారా పితరులకు ఏ రూపంలో ఉన్నా, అందుతుందని వాయుపురాణం స్పష్టంగా చెప్పింది. జీవుడు వందలాది యోనుల్లో నుండి వెళ్లి ఉండవచ్చు. కాని, వారు శ్రాద్ధకర్మకు ఆహ్వానితులైన బ్రాహ్మణుల్లో గుప్తరూపంలో ఉంటారు. ప్రాణవాయువులా ఆ బ్రాహ్మణులు నడిస్తే వారు నడుస్తారు. కూర్చొంటే కూర్చొంటారు. వారు శ్రాద్ధకాలంలో బ్రాహ్మణులతోటే ఆహారం స్వీకరిస్తారు.

మృతి చెందాక పితృదేవతలు సూక్ష్మశరీరం ధరిస్తారు. అందుచేత ఎవరికీ కనపడరు. అంతేగాక ఒక స్థలంనుంచి మరొకచోటికి, ఒక లోకం నుండి వేరొక లోకానికి వెళ్లడానికి పితృ దేవతలకు ఆటంకం ఉండదు.

Famous Posts:

Tags : పితృదేవతలు, మహాలయ అమావాస్య, భోజనం, pitru devathalu, pitru devata stotram, pitru devatas, pitru devathalu means in telugu

ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.