"లాల్‌కితాబ్" వివిధ రాశుల వారికి ద్వారా దోష నివారణలు - పరిహారాలు | Lal Kitab Horoscope Prediction - Zodiac Signs
వివిధ రాశుల వారికి "లాల్‌కితాబ్" ద్వారా దోష నివారణలు
"లాల్ కితాబ్' అనేది ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధిచెందిన గ్రంథం. ఇది ఆర్యభట్ట చెప్పిన ఖగోళశాస్త్ర సూత్రాల ఆధారంగా రూపొందిన జ్యోతిష గ్రంథం. కొందరు దీన్ని జ్యోతిషం, హస్తసాముద్రికాల కలగలుపు గ్రంథంగా చెప్తారు. ఇది మాదంటే మాదని పాశ్చాత్యులు, తూర్పు దేశాలవాళ్ళూ వాదించుకోవటం విశేషం. ఏమైనా ఈ గ్రంథం చెప్పే ఉపచార విశేషాలు అన్నివిధాలా సరైనవనీ, ఖచ్చితంగా ఫలితాల్ని చూపిస్తాయని అందరూ అనటం గమనార్హం.
లాల్‌కితాబ్ విశేషంగా నివారణలు తెలియచేసే గ్రంథంగా పేరుపడింది. ఇది ఉత్తర భారతదేశంలో విశేష ప్రాచుర్యంలో ఉంది. లాల్‌కితాబ్‌లో తెలియచేసిన రెమిడీలు చాలావరకు నైతిక ప్రవర్తనను పెంపొందించేవిగా ఉండం గమనార్హం.ఉదాహరణకు 1.అబద్ధము ఆడరాదు.2.పెద్దలపై గౌరవం చూపాలి.3.ఇంట్లోని పెద్దవారి ఆశీస్సులు తీసుకోవాలి.3.స్త్రీలను గౌరవించడం,అసహాయులైన వారిని ఆదరించడం 4.మనతో జీవించే మూగజీవాలకు ఆహారం తినిపించడం 5.తామస గుణాన్ని పెంచే మద్యాదులను ముట్టుకోవద్దని చెపుతుంది. ఇవే సగం రెమిడీలు.
మన ప్రమేయం లేకుండ జరిగే తప్పులకు,తప్పని పరిస్థితులలో చేసే పనులకు, పూర్వజన్మార్జిత పాపఫలితాల నివారణకు ఇందు నివారణలు చెప్పబడ్డాయి. తెలిసి తప్పులు చేస్తూ వాటినుండి బయట పడడానికి నివారణలు ఉండవనే చెప్పాలి. ఇవి వర్తమానంలో భాదపెట్టకపోయినా కొంతకాలానికి,లేదా తరువాత జన్మలోను, లేదా వీరి వారసులపై ఎవ్వరిపైనైనా వీటి ప్రభావం చూపించవచ్చును. అందుకే ఎవ్వరు చేసిన ఖర్మ వారనుభవించవలసిందే అనే నానుడి ఏర్పడింది.
ఈనాడు రెమిడీల పేరుతో అనేక పుస్తకాలు వెలువడుతున్నాయి. వీటిలో లాల్‌కితాబ్ అనుసరించి రెమిడీలు తెలియచేయడం కంటే సులువైనవైన రత్నములు,రుద్రాక్షలు వీటిని గురించి మాత్రమే చర్చిండం జరుగుతోంది. మందుల షాపులో అనేక మందులు ఉండవచ్చును. అయితే రోగనిర్ధారణ చేయకుండా ఆ మందు దేనికి పనిచేస్తుందనే విషయం తెలుసుకోకుండ మందును వాడితే అది ఏ విధంగా పనిచేయదో అదేవిధంగా కారణం తెలుసుకోకుండ చేసే రెమిడీలు నీటి మీద రాతల్లా వ్యర్ధం అవుతాయి. లాల్‌కితాబ్‌ను అనుసరించి జాతక విచారణ చేసి దానికి తగిన రెమిడీలు చేస్తే చక్కని ఫలితాలు కలుగుతాయి.
మేషరాశి వారికి శుభాశీస్సులిచ్చే ఆరాధ్య దేవతలు
కార్తికేయుడు (సుబ్రహ్మణ్య స్వామి), హనుమాన్ పూజ, అర్చనలు చేసినట్లయితే మేషరాశి వారికి ఈ దేవతలు తమ శుభాశీస్సులను అందజేస్తారు.
మేషరాశివారికి 'లాల్ కితాబ్' సూచించే ఉపచారాలు
'లాల్కతాబ్' ప్రకారం మేషరాశి వారికి దోషనివారణ
1. తీయని తందూరీ రొట్టె చేసి ఆవులకు తినిపించాలి.
2. ఎవరివద్దా ఉచితంగా ఏమీ తీసుకోవద్దు.
3. ఎరుపురంగు రుమాలునే ఎప్పుడూ జేబులో ఉంచుకోండి.
4. విధవలైన స్త్రీలకు సాయం చేస్తూ, వారి ఆశీర్వాదాలు పొందడం మేలు.
5. తీపి వస్తువుల వ్యాపారం చేయనే వద్దు. మద్యపానం, మత్తుపదార్థాల వ్యాపారంలో భాగస్వామ్యం పొందవద్దు.
6. సూర్యాస్తమయానికి ముందు గోధుమలు, బెల్లం పిల్లలకు పంచండి. బంగారు ఆభరణాలు ధరించండి.
7. ఎర్రచందనాన్ని, ఎర్ర కందిపప్పును గుళ్ళల్లో పంచండి.
8. ఇంట్లో కాక్టస్ మొక్కలు పెంచండి. ఒకవేళ ఇంట్లో పెరడు లేకుంటే చిన్న గమేళాలోనో, కుండీలోనో పెంచవచ్చు.
పై వాటివల్ల అమంగళ ప్రభావాలు పోయి, జీవితంలో శాంతి సుస్థిరతలు కలుగుతాయి.
వృషభరాశి వారికి శుభాశీస్సులిచ్చే ఆరాధ్య దేవతలు
మహాలక్ష్మి, కుబేర దేవతలు ఈ రాశివారికి మంచిది. ఈ దేవతల పూజలు అనేక శుభస్కరాలు. చేపట్టిన ప్రతి పనిలోనూ ధనలక్ష్మి తోడుంటుంది.
"లాల్ కితాబ్' చెప్పేదోష నివారణలు
1. నేతి దీపాల్ని ప్రతిరోజూ వెలిగించండి.
2. ఆవుకు మేత వెయ్యండి.
3. 10 రోజులపాటు గణపతి పూజలు చేయండి.
4. శనివారం నాడు నువ్వులు లేదా నువ్వుల నూనె దానం చేయండి.
5. చీమలకు చక్కెర, బెల్లం వేయండి.
6. ఏదైనా రుమాలులో వెండి, బియ్యం కట్టుకొని కూడా ఉంచుకోండి.
7. మద్యం ముట్టనే వద్దు.
8. ఓ కుండలో రాగి నాణెం వేసి, నీళ్ళలో వదలండి.
9. ఏదైనా తీపి తిని, తర్వాతే పని ఆరంభించండి.
మిథునరాశి వారికి శుభాశీస్సులిచ్చే ఆరాధ్య దేవతలు
మిధునరాశి వారికి అత్యంత శుభదాయకం కుబేర దేవుడు, విష్ణువు. ఈ ఇద్దరిలో ఒకరు ధనాధిపతి, మరొకరు లక్ష్మీపతి గనుక మీకు అన్ని విధాలా వారి దయ మంచిది.
'లాల్ కితాబ్' చెప్పేదోష నివారణలు
1. ఎడమచేతికి అతుకులేని వెండి కంకణం ధరించండి.
2. నల్ల కుక్కను పెంచుకోండి. దీనివల్ల కేతుగ్రహ ఆగ్రహం పోతుంది.
3. పెసల్ని కొంచెం నాన పెట్టి పక్షులకు వేయండి.
4. ఆకుపచ్చరంగు సీసాలో గంగాజలం పోసి మూత పెట్టి నిర్జన స్థలంలో బుధవారంనాడు వదిలి పెట్టండి.
5. ఆకుపచ్చ రంగు రుమాలు చెంతనే ఉంచుకోండి.
6. రాగి లేదా వెండి ముక్కను పర్సులో పెట్టుకోండి.
7. గోధుమ పిండిని మాత్రలుగా చేసి (చేపలకు వేయండి. వజ్రం ధరించండి.
8. ఇంట్లో రాగి చెంబులో పెసలు పోసి ఉంచుకోండి.
కర్కాటకరాశి వారికి శుభాశీస్సులిచ్చే ఆరాధ్య దేవతలు
శివపార్వతులు, ధనప్రదాత్రి లక్ష్మీదేవిలను మీరు ఉపా సించుట మంచిది. బోళాశంకరుడు మీ కోర్కెల్ని తీర్చే దేవుడైతే, లక్ష్మీదేవి మీకు ఐశ్వర్యాన్ని కలుగజేస్తుంది.
'లాలితాబ్' చెప్పే దోష నివారణలు
1. మీ అమ్మగారు మాట వినండి. అది శిరోధార్యం శ్రేయోదాయకం.
2. మీ గురించిన రహస్యాలు వేటినీ ఎవరితోనూ పంచుకోవద్దు.
3. ఎవరైనా తీర్థయాత్రలకు వెళ్తామంటే ఆపనద్దు.
4. దుర్గాదేవి పూజ చేయండి.
5. ఎవరైనా ఆడపిల్ల పెళ్ళికి అవసరమైన కన్యాదానసామాగ్రిని దానం చేయండి.
6. సూర్యుడికి సంబంధించిన వస్తువుల్ని ధర్మస్థానాలలో దానం చేయండి: లేదా పెట్టించండి.
7. అలాగే రాగి, బెల్లం, ఎర్రచందనం, ఎర్రరంగు పూలు లేదా పొద్దుతిరుగుడు పువ్వు (సూర్యముఖి) లను పంచిపెట్టండి.
8. మీ అమ్మగారి చేతి మీదుగా బియ్యం అందుకుని, దాన్ని మీరు దానం చేయండి.
9. చిన్న వెండి ముక్కను మీ వద్ద ఉంచుకోండి.
10. తెల్ల ఆవు సేవ చేయండి.ఆవుపాలను తాగడం కూడా మంచిది.
సింహరాశి వారికి శుభాశీస్సులిచే ఆరాధ్యదేవతలు
శివపూజ, సూర్య ఆరాధన మంచిది.. శివుడు మీ కోర్కెలు తీరుస్తూ ఉండగా, సూర్యుడు మీ తేజస్సును అందిస్తాడు.
లాల్ కితాబ్ చెప్పే దోష నివారణలు
1. అక్రూట్, కొబ్బరికాయలు, నూనెలు - ఏదైనా ధర్మస్థలంలో దానం ఇవ్వండి.
2. గోధుమ, ఎర్ర కంది పప్పులను సిందూరం రాసిన రాతితో నలగగొట్టి ఎర్రని గుడ్డలో వేసి నీళ్ళల్లో వదిలేయండి.
3. ఒక రాగి నాణాన్ని 11 ఆదివారాల పాటు నీళ్ళల్లో నాన్చండి.
4. మత్స్య మాంసాదులు పూర్తిగా , మానేయండి.
కన్యరాశివారికి శుభాశీస్సులిచ్చే ఆరాధ్య దేవతలు
మీకు లక్ష్మీదేవి, విష్ణువు ఆరాధ్యదేవతలు. శ్రీయంత్రం, కుబేరయంత్రాలను స్థాపించి, పూజలు జరుపుకోవటం మంచిది.
లాల్ కితాబ్ చెప్పే దోష నివారణలు
1. ఆకుపచ్చని వస్తువులు ప్రవహిస్తున్న నదిలో వదలండి. (పచ్చ, ఆకుపచ్చని గుడ్డ, ఆకుకూరలు వంటివి) ఆకుపచ్చని రుమాలును దగ్గర ఉంచుకోండి.
2. పూజ చేస్తున్న స్థానాన్ని మార్చవద్దు.
3. మనీప్లాంట్‌ను ఇంట్లో ఉంచవద్దు. పెంచవద్దు.
4. ఇల్లు, ఆఫీసులో నల్లని రంగు సీసాను పెట్టుకోండి. లేదా నల్లరంగు గోళీలు ఉంచుకోండి. 5. ఒకే రోజు మూడు కుక్కలకు బ్రెడ్, బిస్కెట్లు వేయండి.
6. దుర్గాసప్తశతి పఠించండి.
7. అసభ్య వచనాలు పలుకనే వద్దు.
తులరాశి వారికి శుభాశీస్సులిచ్చే ఆరాధ్య దేవతలు
ఈ ఏడాది మీకు శుభ ఆరాధ్యదేవతలు లక్ష్మీ, కొల్హాపూర్ లక్ష్మీదేవి గణేష్, కుబేరులు. ఈ ఏడాదంతా మీరు ఆ దేవతల్ని పూజించటం మంచిది. ధనదేవత అయిన లక్ష్మి, వృద్ధి-సిద్ధిదాత అయిన గణేష్ కృపాదృష్టి వల్ల మీ సుఖ సౌభాగ్యాలు అధికమవుతాయి. కుబేర పూజవల్ల మీకు సంపద లభిస్తుంది.
'లాల్ కితాబ్' చెప్పేదోష నివారణలు
1. పొట్టు తీసిన ఆవాలను ధర్మస్థానంలో దయ చేయండి.
2. మీ తల్లి దండ్రులు నిర్ణయించిన వివాహమే చేయండి.
3. ఎండిపోయిన పూలు, ఆకుల్ని ఇంటిలో ఉంచండి.
4. అంధులకు భోజనం పెట్టండి, వెన్న, ఆలు (బంగాళదుంప), పెరుగు దానం చేయండి. 5. స్త్రీలను గౌరవించండి.
6. మద్యపానం చేయవద్దు.
7. దైవాన్ని నమ్మి పూజించండి.
వృశ్చికరాశి వారికి .శుభాశీస్సులిచే ఆరాధ్య దేవతలు
మీకు విష్ణువు, అంగారకుడు, భైరవుడు ఆరాధ్య దేవతలు కావటం మీకు శుభకరం. ఈ దేవతల ఉపాసన, పూజలు మీకు శ్రేయస్కరం.
లాల్ కితాబ్ చెప్పే దోష నివారణలు
1. తీపి రొట్టెలను బీదలకు పంచండి.
2. ప్రతి ఉదయం తేనెను కొద్దిగా స్వీకరించండి. దీన్ని మీరు మీ నిత్య అలవాటుగా మార్చుకోండి.
3. తేనెను మీ ఇంట్లో పెద్దలకు కూడా కొద్దిగా ఇవ్వండి.
4. మీ తల్లిదండ్రులను మనస్ఫూర్తిగా గౌరవించండి.
5. కోతులకు శెనగలు, బెల్లం వేయండి.
6. ఎర్ర చీమలకు పంచదార చల్లండి.
7.అంగారక యంత్రాన్ని స్థాపించి పూజించండి. పూజ సమ యంలో సిందూర తిలకధారణ చేయండి.
8. ఎర్రగులాబీ, తేనె, ఎర్ర కందిపప్పులను మంగళవారాలనాడు నీటిలో కలపండి. 9. మంగళవారంనాడు ఉపవాసం చేయండి. ఆంజనేయ పూజచేస్తూ, స్వామికి సిందూరం సమర్పించండి.
ధనుస్సురాశి వారికి భాశీస్సులిచ్చే ఆరాధ్య దేవతలు
మీకు శివుడు, కుబేరుడు ఈ సంవత్సరం ఆరాధ్య ' దేవతలు. ఈ దేవతల పూజాపునస్కారాలు మీకు ఈ సంవత్సరం శ్రేయోదాయకం.
లాల్కితాబ్ చెప్పే దోష నివారణలు
1. నిత్యం మీవద్ద పసుపుపచ్చని రుమాలు ఉంచుకోండి.
2. గంగాజల సేవనం చేయండి.
3. ఎట్టి పరిస్థితులలోను అసత్య సాక్ష్యాలు ఇవ్వకండి.
4. భిక్షకులకు భిక్ష వేయకుండా నిరాశతో వెనుకకు పంపవద్దు.
5. తీర్థయాత్రలు చేయండి.
6. తల్లిదండ్రులను గౌరవించండి.
మకరరాశి వారికి శుభాశీస్సులిచ్చే ఆరాధ్య దేవతలు
శివ, కుబేరులు మీకు ఆరాధ్య దేవతలు. శివ -పంచాష్టకం, శివనామస్మరణ మంచిది. శివ కుబేరు లను నిత్యం పూజిం చటం మీకు లాభదాయకం.
లాల్ కితాబ్ చెప్పే దోష నివారణలు
1. మీరు అవకాశం ఉంటే కోతులకు ఆహారం వేయండి. పాలలో చక్కెర కలిపి ఆ పాలను రావిచెట్టు మీద చల్లండి.
2. అసత్య వచనాలు పూర్తిగా మానండి.
3. మద్యపానం అసలు పనికిరాదు.
4. ప్రవహిస్తున్న నీటిలో పాలు పోయండి.
5. మీ జేబులో బంగారాన్ని కాని, లేదా కేసరిని కాని ఉంచుకోండి.
6. చీమలకు నల్లనువ్వులు కొద్దిగా తీసి కలిపి వేయండి.
7. నలుపు, నీలం రంగు వస్త్రాలను ధరించండి.
8. ఒక్క శనివారంనాడు నల్లనువ్వులు లేదా మినుములను ప్రవహించే నీళ్ళలో వదిలిపెట్టండి.
9. ఒక చిన్న మట్టిపాత్రలో తేనె నింపి నిర్జన ప్రదేశంలో పాతి పెట్టండి.
పైన చెప్పినవాటిలో అన్నిటినీ ఒకేరోజు కాక ఒకరోజు ఒక్కటి మాత్రమే చేయండి.
కుంభరాశి వారికి శుభాశీస్సులిచ్చే ఆరాధ్య దేవతలు
మీకు శివుడు, కాళీమాతలు ఆరాధ్య దేవతలు. వీరి కృపాదృష్టితో మీకు సుఖాలు లభిస్తాయి. తప్పని సరిగా ఈ దైవాలను పూజించండి.
లాల్ కితాబ్ చెప్పే దోష నివారణలు
1. మీ ఇంట్లో పెట్రోలు వగైరా ఇంధనాలను ఎట్టి పరిస్థితుల లోనూ నిల్వ ఉంచవద్దు. 2. మాంసం, మద్యం ముట్టవద్దు.
3. మీవద్ద చిన్న వెండిముక్కను ఉంచుకోండి.
4. రొట్టెల మీద ఆవనూనె రాసి కుక్కలకు వేయండి.
5. ఏదైనా దేవాలయానికి లేదా సత్రానికి ఒక గ్యాస్టవ్ లేదా ఒక గ్యాస్ సిలిండర్ను దానం చేయండి.
6. నువ్వులు, మినుములు, నల్లవస్త్రం, చాకు వంటి వాటిని దానం చేయండి.
7. శనివారం పూట తైలదానం చేయండి.
8. మినపపప్పు ఉడికించి శనివారంనాడు కాకులకు వేయండి.
మీనరాశి వారికి శుభాశీస్సులిచ్చే ఆరాధ్య దేవతలు
విష్ణువు మీకు ఆరాధ్యదైవం. విష్ణుసహస్రనామం పఠించండి. ఇక విష్ణు పూజ, అర్చనలు క్షేమం, శుభకరం.
లాల్ కితాబ్ చెప్పే దోష నివారణలు
1. పసుపురంగు బొట్టును తిలకంగా ధరించండి.
2. అదృష్టాన్ని నమ్మండి.
3. బీదవారికి సాయపడండి.
4. రావిచెట్టుకు పూజ చేయండి.
5. ప్రతి పనిలో మీ శ్రీమతి సలహా ప్రకారం పని చేయండి.
6. వెండి ముక్క ఒకటి దగ్గర ఉంచుకోండి.
7. గంగజలాన్ని ఇంట్లో ఉంచుకోండి.
8. పసుపురంగు పూలను అలంకరించండి. ఇంట్లో ఆ రంగు పూలమొక్కల్ని పెంచండి.
9. ధర్మాన్ని పాటిస్తూ ఉండండి.
10. తప్పుడు సాక్ష్యాలు ఇవ్వవద్దు.
Famous Posts:
Tags: లాల్ కితాబ్ , lal kitab pdf, lal kitab remedies, lal kitab in telugu, lal kitab prediction, lal kitab predictions telugu, lal kitab, lal kitab online, lal kitab original, Zodiac Signs
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment