Drop Down Menus

నవగ్రహారాధన - రెమిడీస్ సూర్య దోషం - పరిహారము - శాంతులు | Navagraha Remedies in Telugu | Navagraha Dosha

నవగ్రహారాధన - రెమిడీస్ సూర్య దోషం - పరిహారము - శాంతులు

1.. మీ దగ్గరలో నున్న శివాలయమునకు వెళ్ళి ప్రతి ఆదివారం నవగ్రహాలకు ఉదయం గం|| 6-00 నుండి ఉదయం 7-00 వరకు ప్రదక్షిణము చేయవలెను.

2. 6 ఆదివారములు నవగ్రహములకు 60 ప్రదక్షిణములు చేసి 1.25 కె.జీ. గోధుమలు దానం చేయవలెను.

3. శ్రీకాకుళం జిల్లాలోని అరసవిల్లి దేవస్థానమును ఒక ఆదివారం దర్శించి సూర్య నమస్కారములతో 60 ప్రదక్షిణములు చేయగలరు.

4. 6 ఆదివారములు రోజున 12 చపాతీలు, పేదలకు, సాధువులకు పంచిపెట్ట గలరు.

5. తూర్పుగోదావరి జిల్లా గొల్లలమామిడాడ, పెద్దాపురం దేవస్థానములు దర్శించి గోధుమలు ఎర్రని వస్త్రములో దానం చేయవలెను.

6. కెంపును ఎడమచేతి ఉంగరపు వేలుకి వెండితో ఆదివారం ఉదయం గం 6-00లకు ధరించగలరు. 1.25 కె.జీలు గోధుమలు దానంచేయగలరు.

7. రవి గ్రహ జపము ఒక మారు బ్రాహ్మణుడితో చేయించి గోధుమలు దానం చేయవలెను.

8. నవగ్రహములలో సూర్యగ్రహము వద్ద ఆదివారము ఎర్రరంగు 6 వత్తులతో దీపారాధన చేసి ఎర్రని వస్త్రములు దానం చేయవలెను.

9. 7 ఆదివారములు ఉపవాసము ఉండి చివరి ఆదివారం శివుని అభిషేకము మరియు సూర్యుని అష్టోత్తర పూజ చేయవలెను.

10. తమిళనాడులోని సూర్యనార్ దేవస్థానము దర్శించి సూర్య హోమము చేయించగలరు.

11. విష్ణు దేవాలయముల యందు పేదలకు ఆదివారం అన్నదానం, ప్రసాదము పంచవలెను.

12. రవి ధ్యాన శ్లోకమును (లేదా ఆదిత్య హృదయము ఒక్కసారి) ప్రతి రోజు 60 మార్లు చొప్పున 60 రోజులు పారాయణ చేయవలెను.

13. రవి గాయత్రీ మంత్రమును (లేదా సూర్యాష్టకము ఒకసారి) 6 ఆదివారములు 60మార్లు పారాయణ చేయవలెను.

14. రవి మంత్రమును 40 రోజుల్లో 6 వేల సార్లు జపము చేయవలెను. లేదా ప్రతి రోజు సూర్యాష్టకము పారాయణ చేయగలరు.

15. తీరికలేని వారు కనీసం రవి శ్లోకము 6 మార్లు గాని రవి మంత్రమును 60 మార్లు గాని పారాయణ చేయగలరు. లేదా ప్రతిరోజూ సూర్యనమస్కారములు చేయగలరు.

16. రథసప్తమి రోజున సూర్యాష్టకం 6 మార్లు పారాయణ చేయగలరు.

Famous Posts:

Tags : నవగ్రహారాధన, నవగ్రహ శ్లోకాలు, Navagraha dosham, నవగ్రహ రెమిడీస్, (Navagraha Remedies, Remedy for Navagraha Dosha, Navagraha Remidies Telugu, Navagrahalu

ఇవి కూడా చూడండి
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON