Drop Down Menus

మానవులు 100 సంవత్సరాలు జీవించడానికై కొన్ని ఆయుర్వేద మార్గాలు | Some Ayurvedic Ways for Humans to Live 100 Years

మానవులు 100 సంవత్సరాలు జీవించడానికై కొన్ని ఆయుర్వేద మార్గాలు..

నూరేండ్లు జీవించడానికి మార్గాలలో ముఖ్యమైనది ఏమిటంటే, ప్రతిదినం నీరు పుష్కలంగా త్రాగడం, శరీరంలో నీరు తగ్గితే తలతిరగడం వంటి జబ్బులు వస్తాయి. జపానుదేశంలో 'జలచికిత్స' ఆచరిస్తారు.

ప్రతి దినం సూర్యోదయానికి ఒకటిన్నర గంటలు ముందుగా నిద్రలేవాలి. వెంటనే ఒకటి లేక రెండు లీటర్లు కూజాలోని నీటిని గడగడ త్రాగాలి. ఆ పిదప కాలకృత్యాలకు వెళ్లాలి ఇందువలన అన్నవాహిక సాఫీ అవుతుంది. మలబద్దకం ఉండదు. ఆకలి కలుగుతుంది. దీనినే ఆయుర్వేదంలో ఉపపానము అంటారు. దీర్ఘకాలం జీవించడానికి ఇది ఉపకరిస్తుంది.

ఇంకా కొన్ని అలవాట్లు

దీర్ఘకాలం జీవించాలంటే వారానికొకసారి అభ్యంగన స్నానం చేయాలి. ఆముదంతో తల అంటుకొని శరీరానికి నువ్వులనూనెతో మర్దన చేసి వేడినీటిస్నానం చేయాలి. 'తద్దినమునాటి కూటికి, తలగడిగిన నాటి నిద్రకూ సాటి ఉందా?' అని సామెతగూడ ఉన్నది.

మరికొన్ని అలవాట్లు

ముఖము కడుగుకొనునపుడు చల్లని నీటితో 'నస్యకర్మ' ఆచరించవలెను. అనగా అరచేతిలోనికి నీటిని తీసుకొని ముక్కుతో పీల్చి వదలవలెను. ఇట్లు .స్వచ్ఛమైన జలమును ముక్కుతో పీల్చువాడు తీక్షణబుద్ధిగలవాడై గ్రద్దయొక్క దృష్టివంటి దృష్టిగలిగి వుంటాడు. ఆకాలములో వెంట్రుకలు తెల్లబడకుండ నుండును. పడిశము, జలుబు, దగ్గు రావు.

ప్రతి దినము అలవాటుగా నువ్వులనూనెగాని మరొక తైలమునుగాని రెండు బొట్లు ఒక్కొక్కముక్కులో వేసుకొని పీల్చి, గొంతులోకి వచ్చిన దానిని ఉమ్మివేయవలెను. ఇందుచేత కన్నులు, చెవులు, ముక్కు చెడకుండ నుండును, ముఖ్యముగా బట్టతలరాదు. వెంట్రుకలు బాగుగా వృద్ధి పొందును.

గరుత్మంతునివద్దకు సర్పములుచేరలేని విధముగా వ్యాయామముచేయువారికి వ్యాధులు దరిచేరవు. ముసలితనము త్వరగా రానీయదు. ఆసనాలు వేయుట, బస్కీలు తీయుట, కొంతదూరము నడుచుట చేయవలెను.

ఉసిరికాయపచ్చడిని ప్రతిదినము పుచ్చుకొనుట ఆరోగ్యానికి చాల మంచిది. ఉసిరిక భూలోక వాసులకు అమృతమని చెప్పదగును. ఇంద్రియ వృద్ధికర పదార్ధములు :

పాలు, మినుములు, ఉసిరిక - ఇవి శుక్రమును పుట్టిస్తాయి.

చెఱకు, నాగబలి, దూలగొండివిత్తులు, రత్నపురుష - ఇవి శుక్రాన్ని వృద్ధిచేస్తాయి. జాజికాయ, బెండకాయ, చేమదుంపలు మున్నగునవి శుక్రాన్ని స్తంభింపజేస్తాయి.

పెన్నేడు, నేలతాడి, పిల్లితీగలు, పంచదార మున్నగునవి రతియందు ఆనందాన్ని కలిగిస్తాయి.

నిమ్మకాయ, పెద్దదోస, నిమ్మగడ్డి మున్నగునవి శుక్రాన్ని క్షీణింపచేస్తాయి. కనుక ఇట్టి విషయాలు తెలుసుకొని ఆహారం స్వీకరించాలి.

పండ్లు, కూరలు

ఎరుపు రంగుగల పండ్లు, కూరలు దేహంలో రక్త కణాలను ఎక్కువ చేస్తాయి. క్యారట్, బీట్రూటు, యాపిల్ పండు ఇలాంటివి.

ఒక విచిత్రమైన సూత్రం వున్నది. శరీరంలోని ఏ అవయవం మాదిరిగా వున్న పండు తింటే ఆ అవయవానికి ఆరోగ్యం చేకూరుతుందని ఒక సిద్ధాంతం. దీని ప్రకారం :

బాదంకాయ మానవుల కన్నువలె ఉంటుంది. అందుచేత సీమబాదం పప్పులు టే కళ్లకు ఆరోగ్యం. బాదం పప్పులో ఎ విటమిన్ అధికంగా వున్నది.

సీతాఫలం పండ్లు ఊపిరితిత్తులవలె వుంటాయి. ఆ పండు తింటే ఊపిరితిత్తులకు బలం.

యాపిల్పండు గుండెకాయవలె వుంటుంది. దానిని తింటే గుండెకు బలం. బొప్పాయి పండు పొట్టవలె వుంటుంది. దాన్ని తింటే కడుపుకు ఆరోగ్యం. మామిడిపండు తింటే మూత్రపిండములకు ఆరోగ్యం.

కాశ్మీరులో వాల్నట్ అనేకాయలు పండుతాయి. అవి మనిషి మెదడువలె ఉంటాయి. వాటిని తింటే మెదడుకు ఆరోగ్యం.

కాయగూరల గురించి

అరటి ఊచ కూరచేసుకు తింటే మూత్రనాళాల్లో రాళ్లు కరిగిపోతాయి.

వెల్లుల్లి పాయలు నేతితో వేయించుకుతింటే వాతం హరిస్తుంది.

నీరుల్లి గడ్డలు కూరల్లో వేయడంవలన ఆహారం జీర్ణమవుతుంది. కరివేపాకు, మిరియాలు, ఇంగువ, ఉప్పు, కలిపినూరి కుంకుడు గింజంత తింటే జీర్ణక్రియ బాగా జరుగుతుంది.

అమీబియాసిస్ అని ఒక జబ్బు వున్నది. పల్చగా విరేచనం కావడం, విరేచనం కొద్దికొద్దిగా చాలాసార్లు కావడం దీని లక్షణం. లేత వేపాకులు, పసుపు, రెండు మిరియపు గింజలు నూరి వేసుకుంటే ఇది తగ్గుతుంది. అతి మూత్ర వ్యాధికి మందు పచ్చడి పెట్టుకొనే ఉసిరికాయ ముక్కలకు పసుపు కలిపి వేసుకుంటే అతిమూత్రం తగ్గుతుంది. దీన్ని 'నిశామలకి' అనే పేరుతో ఆయుర్వేద మందుగా వాడుతారు.

అధికంగా తుమ్ములు రావడం, ముక్కులు బిగదీసుకుపోవడం, దీనికి మందు ఎలర్జీవల్ల ఇలా వస్తుంది. దీనికి నేతిక్రియ చేయాలి. కొమ్ము చెంబులో మంచినీరు తీసుకొని ఒక ముక్కులోగుండా పోస్తూ మరొక ముక్కులోకుండ వదలాలి. ఇలా వారం రోజులు చేయాలి. పిదప రెండవ వారంలో నీటిలో ఒక చెంచాడు పాలుకలిపి నేతిక్రియ జరపాలి. మూడవ వారంలో నీటిలో ఆరు చుక్కలు తేనెకలిపి నేతిక్రియ చేయాలి. ఇలా మూడు వారాలు చేస్తే ముక్కు సంబంధించిన వ్యాధులు నివారణ అవుతాయి.

ముక్కు దిబ్బడపడి గాలి పీల్చలేనపుడు తులసిఆకురసం ముక్కులో పిండాలి. జలుబు తగ్గడానికిగూడ తులసి ఆకు బాగా పనిచేస్తుంది. టీ త్రాగేవాళ్లు టీలో తులసిరసం పిండుకుని త్రాగితే జలుబు హరిస్తుంది.

రాత్రి నిద్రపట్టకపోతే ఆముదంగాని, చందనాది తైలంగాని అరికాళ్లకు రుద్దుకుంటే నిద్రపడుతుంది.

రక్తపు పోటుకు మందు

రోజూ పరగడుపున ఒక్క అరటిపండు తింటే రక్తపుపోటు తగ్గుతుంది. రోగికి మానసిక విశ్రాంతి కావాలి. అందుకై ఆముదంతో తల అంటుకొని అభ్యంగన స్నానం చేయాలి.

మరొక ప్రక్రియకూడా వున్నది. 'కొండపిండి' అనే మొక్క వున్నది. దీనిని సంస్కృతంలో 'పాషాణభేది' అంటారు. ఈ మొక్క రాళ్లను తొలుచుకుంటూ పైకి వస్తుంది గనుక ఆ పేరు వచ్చింది. దీని పూలు తెల్లగా వుంటాయి. ఆ పూలను తెచ్చి దిండు క్రింద పెట్టుకొని పడుకుంటే, లేదా ఆ పూలను దిండులో కలిపి కుట్టించి దానిపై తలవాల్చి పడుకుంటే రక్తపు పోటు తగ్గుతుంది. మధుమేహవ్యాధికి మందు

షుగర్ వ్యాధికి అత్యుత్తమమైన మందు 'వసంతకుసుమాకరం' దీనికి King of Medicines అని పేరు. ఈ మాత్ర రాత్రి పరుండబోయేముందు ఒకటి వేసుకుంటేచాలు. ఇలా నెలరోజులు వాడి, ఒక నెల విరామమిచ్చి మరల నెలవాడాలి. దీని వలన బలం కూడా వస్తుంది.

ఎండాకాలంలో సూర్యతాపం భరించలేకపోవడం, ఎండలోకి వెళ్లలేకపోవడం -

దీనికి మందు

మిరియాలు లేకుండా బెల్లంతో పానకం చేసుకొని త్రాగడం వలన ఎండ ప్రభావం వుండదు. మరొక మందు ఏమిటంటే పెసలు, పెసరపప్పు (పొట్టుతోసహా) బాగా తినాలి. పెసలు నానవేసి మొలకెత్తిన వాటిని తినాలి.

సుఖ విరేచనం కావడానికి

'నీలతంగేడు' ఆకులు తెచ్చి ఎండబెట్టి వాటితో పచ్చడిచేసుకొని రాత్రిపూట తినాలి. మజ్జిగపోసుకోకూడదు. మరునాడు సుఖ విరేచనమవుతుంది. త్రిఫలచూర్ణం మాత్రలు అమ్ముతారు.. వాటిని రాత్రి రెండు వేసుకొని పడుకుంటే మరునాడు విరేచనమవుతుంది.

'సర్వ వ్యాధినివారణి' వున్నది. నామోషి పడకుండా అమలుపరిస్తే అద్భుతంగా పనిచేస్తుంది.

స్వమూత్ర చికిత్స. సర్వవ్యాధులకూ ఇది పనిచేస్తుంది. థాయిలాండు, జపాను దేశాలలో దీనిని ఎక్కువగా అమలుపరుస్తున్నారు. హర్యానా నాయకుడు దేవీలాలు దీనిద్వారా తామర నయమైనది. చంద్రమండల యాత్రచేసిన నీల్మ్ స్ట్రాంగ్ ఈ చికిత్స అనుదినం పొందుతాడు. మొరార్జీదేశాయి ఆరోగ్య రహస్యమిదే.

స్వమూత్ర చికిత్స ఎలా చేసుకోవాలి ఖాళీ కడుపులోకి తన మూత్రాన్ని రెండు లేక మూడు ఔన్సులు పుచ్చుకోవాలి. ఉదయం 6 గంటలకు, సాయంకాలం 6 గంటలకు పుచ్చుకోవచ్చు. మూత్రంలో మొదటి భాగం, చివరి భాగం వదిలివేసి మధ్యభాగాన్ని పుచ్చుకోవాలి.

దీని వలన ఏఏవ్యాధులు నయమవుతాయి

ఏ వ్యాధులు నయం కావు? అన్నీ నయమవుతాయి. ఉబ్బసం, మధుమేహం, కాన్సరు, చర్మవ్యాధులు అన్నిటికీ ఇదేమందు.

మూత్రముపైన పూయడం వలన

కండ్లకలక, చెవులో చీము, కీళ్లవాపు, గాయములు, తామర, వగైరాలు నయమవుతాయి. అరచేతిలో మూత్రం పోసుకొని రెండు కళ్లనూ దానితో తడపాలి. కీళ్ల నొప్పులకు దూది మూత్రంలో తడిపి కట్టుకట్టాలి. మూత్రమును వేడిచేసి పైన కాపు కాయవచ్చు.

Famous Posts:

Tags: ఆయుర్వేద మార్గాలు, ayurvedam telugu, ayurvedam, mana ayurvedam, ayurvedam telugu pdf, ayurvedam telugu, ayurvedam tips in telugu, ayurvedic medicine

ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

తిరుమల దర్శనం టికెట్స్ ఇతర సేవ టికెట్స్ ప్రస్తుతం ఆగస్టు నెల వరకు బుక్ అయ్యాయి . సెప్టెంబర్ నెలకు జూన్ నెలలో 18వ తేదీన విడుదల చేసే అవకాశం ఉంది

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.