గీతా మాహాత్మ్యము..
కురుక్షేత్రరణరంగములో తాను చేయవలసిన కర్తవ్యాన్ని మరచి దుఃఖితుడైన అర్జునునికి జ్ఞానబోధ చేసి మార్గదర్శనం | చేసిన గ్రంథమే భగవద్గీత. అయితే భగవద్గీత ఐదువేల సంవత్సరాల క్రిందట వచ్చిందని ఎవ్వరూ అనుకోకూడదు.
ఈ విషయాన్ని గీతాచార్యుడే (శ్రీకృష్ణభగవానుడు) చెప్పాడు. తాను ఈ అవ్యయమైన గీతాజ్ఞానాన్ని మొట్టమొదలు సూర్యునికి చెప్పానని, సూర్యుడు మనువుకు చెప్పగా, మనువు ఇక్ష్వాకు మహారాజుకు చెప్పాడు. ఇక్ష్వాకు మహారాజు శ్రీరామచంద్రుని వంశములో పూర్వమువాడు. అంటే భగవద్గీత త్రేతాయుగం నాటి నుండే మానవసమాజంలో లభిస్తున్నదని దీనిని బట్టి తెలుస్తున్నది. త్రేతాద్వాపరయుగాలు గడిచి ఇప్పటికి 20 లక్షల సంవత్సరాలు అయింది. కాబట్టి భగవద్గీత ఇంత పురాతనమైనదని మనం తెలిసికోవాలి. మానవజన్మకు చక్కని మార్గదర్శనియే భగవద్గీత. ఇది జీవితాంతము చక్కని మార్గదర్శనము చేయడమే కాకుండ సమస్త పాపాలకు, సమస్త సమస్యలకు చక్కని ఔషధంగా పని చేస్తుంది. అందుకే గీతామాహాత్మ్యములోని శ్లోకాలు ఈ విధంగా చెబుతున్నాయి :
1. భగవద్గీతలోని ఉపదేశాలను ఎవడైతే చక్కగా అనుసరి జీవితంలోని సకల దుఃఖాల నుండి, క్లేశాల నుండి ముక్తుడౌతాడు. అంతేకాదు. అతడు సమస్త భయా నుండి బయటపడతాడు (భయశోకాది వర్జితః). దీనితో పాటు విష్ణులోకాన్ని పొందుతాడు.
2. భగవద్గీతను ఎవడైతే శ్రద్ధతోను, సావధానంగాను పఠిస్తాడో, అతనిపై కృష్ణానుగ్రహముచే పూర్వపాపఫలాలు ఏమాత్రము ప్రభావాన్ని చూపవు.
గీతాధ్యయన శీలస్య ప్రాణాయామ పరస్య చ |
నైవ సంతిహి పాపాని పునర్జన్మ కృతాని చ ||
3. మనిషి ప్రతిరోజూ స్నానం చేయడం ద్వారా శరీరమాలిన్యాన్ని పోగొట్టుకుంటాడు. కాని పవిత్రమైన గీతాగంగలో ఒక్కమారు స్నానం చేస్తే చాలు సంసార మాలిన్యాన్నే తొలగించుకుంటాడు.
" మలినే మోచనం పుంసాం జలస్నానం దినే దినే |
సకృద్గీతామృతస్నానం సంసారమలనాశనం ||
4. భగవద్గీత సాక్షాత్తుగా శ్రీకృష్ణభగవానుని చేతనే చెప్పబడింది కాబట్టి దీనిని పఠిస్తే వేరొక శాస్త్రాన్ని అధ్యయనం చేయవలసిన అవసరమే లేదు. భగవద్గీత సమస్త వేదవాఙ్మయసారము, నేరుగా శ్రీకృష్ణునిచే ఉపదేశితము కావడమే దానికి కారణము.
గీతా సుగీతా కర్తవ్యా కిం అన్యైః శాస్త్రవిస్తరైః |
యా స్వయం పద్మనాభస్య ముఖపద్మాద్ వినిఃసృతా ॥
5.గంగాజలాన్ని పానం చేసినవాడే ముక్తిని పొందుతున్నప్పుడు గీతామృతాన్ని పానం చేసేవానిని గురించి వేరే చెప్పేదేమున్నది? భగవద్గీత భారతములోని దివ్యామృతము, కృష్ణునిచే ప్రబోధితము అయి యున్నది. దీనిని అధ్యయనం చేసి ఆచరించేవానికి పునర్జమ్మ ఉండబోదు.
భారతామృత సర్వస్వం విష్ణువక్త్రద్వినిసృతం |
గీతాగంగోదకం పీత్వా పునర్జన్మ న విద్యతే ||
6. సర్వోపనిషత్తుల గీతోపనిషద్ (భగవద్గీత) గోవు కాగా, గోపాలుడైన శ్రీకృష్ణుడే ఆ గోవు నుండి పాలను పితికేవాడు కాగా, అర్జునుడు దూడ కాగా శుద్ధభక్తు లైన మహనీయులే ఆ గీతాక్షీ రాన్ని పానం చేస్తున్నారు.
ర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనన్దనః |
పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్ ||
7. గీతాశాస్త్రమే సమస్త ప్రపంచానికీ ఏకైక శాస్త్రం; శ్రీకృష్ణభగవానుడే సమస్త ప్రపంచానికి ఒక్క భగవంతుడు; హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే / హరే రామ హరే రామ రామ రామ హరే హరే అనే అతని నామమే ఏకైక మంత్రము; ఆ దేవదేవుని సేవయే కర్మము.
ఏకం శాస్త్రం దేవకీపుత్ర గీతం ఏకో దేవో దేవకీపుత్ర ఏవ |
ఏకో మంత్రస్తస్య నామానియాని కర్మాప్యేకం తస్య దేవస్య సేవా ||
ఈ గీతామాహాత్మ్యాన్ని శ్రద్ధగా పఠించి, భగవద్గీత యందు శ్రద్ధను పెంచుకొనిన బుద్ధిమంతులైన సుఖశాంతులతో వర్ధిల్లెదరు గాక! ఇహపరాలలో శాశ్వతసుఖాన్ని పొందెదరు గాక!
హరేకృష్ణ !
Famous Posts:
Tags: భగవద్గీత, bhagavad gita pdf, bhagavad gita online, bhagavad gita book, bhagavad gita pdf telugu, bhagavad gita in hindi, bhagavad gita, bhagavad gita chapter 1, bhagavad gita slokas
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment