Drop Down Menus

చండీ పారాయణ నియమములు - What are the correct rules for reading chandi parayanam

చండీ పారాయణ నియమములు..

ముందుగా దేవిని తలచి - నమస్కరించి - పారాయణకు ప్రారంభించవలెను. పుస్తకమును ఒడిలో నుంచుకొనరాదు. వ్యాసపీఠముపై లేదా - ముందుగా - బల్లపై నుంచవలెను. గ్రంధమును పూజించి - పారాయణను ప్రారంభింపవలెను.

శ్లోకములను రాగయుక్తముగ చదువరాదు. చదువునప్పుడు తలను ఊపుట- చేతులను త్రిప్పుట చేయరాదు. వేగముగ చదువరాదు. అర్ధజ్ఞానము లేకుండ - శ్లోకపదములను అటునిటు చేయుచు చదువరాదు. అధ్యాయము పూర్తికాకుండ - మధ్యలో - పారయణను - ఆపరాదు. ఒక వేళ  ఆపవలసినచో - ఆ అధ్యాయమును మరల మొదటినుండి చదువవలెను. పుస్తకమును చేతిలో నుంచుకొని చదివిన సగము ఫలితమే వచ్చును.  మనసులో చదువరాదు. మరీ బిగ్గరగా - లేదా- మిక్కిలి నెమ్మదిగ గాని చదువరాదు. వ్రాసి కొని చదువరాదు. వ్యాసాపీటం పైన ఉంచి తప్పులు లేకుండా చదవాలి. 

దుర్గాదేవి పూజ చేయాలి, చండీ నావక్షరి యధాశక్తిన 108 సార్లు కానీ అంత కన్నా ఎక్కువ సార్లు జపం చేయవచ్చు, పారాయణ పూర్తి ఐయ్యాక మళ్ళీ ఒక మాల చండి నావక్షరి జపం చేయాలి.

 నిత్యపారాయణమునకు యంత్రమునందుగానీ, పుస్తకమునందుగానీ లఘుపూజ చేసిన చాలును, పారాయనే దీక్షగా చేసే వారు ఇలా పుస్తకం కి పూజ చేసుకుని ప్రారంభం చేయవచ్చు, హోమావిధానం తో చేసే పద్ధతి నిత్యపారాయణ చేసే సమయంలో అవసరం లేదు అని పెద్దలు చెప్తారు.

లఘుపూజా : పుస్తకే - యంత్రేవా.

సంకల్పము చేసి (ఇక్కడ రాసిన విధంగా సంకల్పం) (నిత్య) పారాయణాంగ లఘుపూజాం చ కరిష్యే. గణపతి - కలశపూజానంతరము. (ఆనవాయితీగా పెట్టుకునే వారికే)

ఓం నమః పిశాచ నివర్తిని! త్రిశూలఖడ్గహస్తే సింహారూఢ। ఏహ్యేహి,

ఆగచ్ఛాగఛ్ఛ, ఇమాంపూజాం గృష్ణాగృహస్వాహా - సప్తశతీ సరస్వత్యై నమః -

ఆవాహయామి.

ఓం హ్రీం చండికాయై నమః - ఆసనం సమర్పయామి.

ఇదే మంత్రముతో అర్ఘ్యం - పాద్యం - ఆచమనీయం - స్నానము వస్త్రం - యజ్ఞోపవీతం - గంధం - ఆభరణాని - అక్షతాన్ - పుష్పాణి - ధూపం - దీపం - నైవేద్యం - తాంబూలం - నీరాజనం - సమర్పయామి.

అధ శాపోద్ధారః -

ఓం హ్రీం క్లీం శ్రీం క్రాం క్రీం చండికేదేవి శాపానుగ్రహం కురు కురు స్వాహా.  (ఏడు మారులు జపించవలయును). 

ఉత్కీలనం : ఓం శ్రీం క్లీం హ్రీం సప్తశతిచండికే ఉత్కీలనం కురుకురుస్వాహా,

ఏం జపేత్. (ఇరువదియొక్క మారులు జపింపవలయును).

మంత్రం

ఐం హ్రీం క్లీo చాముండాయై  విచ్చే 

పారాయణ సంకల్పము:- మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీపరమేశ్వర ప్రీత్యర్ధం శుభే శోభనే ముహూర్తే శ్రీ శివ శివశంభోరాజ్ఞయా (శ్రీ మహావిష్ణో రాజ్ఞయా) ప్రవర్తమానస్య ఆద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే కృష్ణా/గంగా/గోదావర్యోః మధ్యదేశే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ... సంవత్సరే...అయనే. ఋతౌ.. మాసే పక్షే. తిధౌ వాసరే శుభనక్షత్రే శుభయోగేశుభకరణే ఏవం గుణవిశేషణ విశిష్టాయాం శుభతిధౌ సౌభాగ్యవతీ/ శ్రీమతీ/శ్రీమాన్...గోత్రా/గోత్రః..అహం....నామధేయా/నామధేయః-సౌభాగ్యవత్యా:/ శ్రీమత్యాః/ శ్రీమతః... గోత్రాయాః/ గోత్రస్య మమ నామధేయాయాః/ నామధేయస్య పతిపుత్రవత్యాః/ధర్మపత్నీ పుత్రసమేతస్య సకుటుంబాయా:/సకుటుంబస్య- ఉపాత్తదురితక్షయద్వారా శ్రీపరమేశ్వర/ప్రీత్యర్ధం, క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురా రోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్ధం, ధర్మార్ధ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్ధం, ధనకనక వస్తువాహనాది సమృద్ధ్యర్థం పుత్రపౌత్రాభివృద్ధ్యర్థం, సర్వాపదాం నివారణార్ధం, సకల కార్యవిఘ్ననివారణార్ధం, సత్సంతాన సిద్ధ్యర్ధం, పుత్రపుత్రికానాం సర్వతోముఖా భివృద్ధ్యర్ధం, ఇష్టకామ్యార్ధ సిద్ధ్యర్ధం, శ్రీమహాకాళీ శ్రీమహాలక్ష్మీ శ్రీమహాసరస్వతీ స్వరూపిణీ శ్రీదుర్గాంబికా ప్రీత్యర్ధం... శ్రీ.. దుర్గాంబికా ముద్దిశ్య, కల్పోక్త విధానేన యధాశక్తి షోడశోప చార పూజాం కరిష్యే తదంగత్వేన ఆదౌపూజా సమయే నిర్విఘ్న పరిసమాప్త్యర్ధం హరిద్రా గణపతిరూప మహాగణాధిపతి పూజాం కరిష్యే (అక్షతలు నీరు పళ్ళెములో విడువవలెను.)

గణపతి పూజ చేసి ప్రారంభించాలి, గణపతి స్మరణ ద్యానం చేసి దుర్గమ్మ పూజ , నావక్షరి జపం చేసి సంకల్పంతో ప్రారంభించి , పారాయణ మొదలు పెట్టాలి..పూర్తి ఐయ్యాక ఒక మాల చండీనావక్షరి జపం చేసి హారతి ఇవ్వాలి.. అమ్మవారికి ద్యానం అంటే ప్రీతి కనుక కాసేపు అమ్మవారిని ధ్యానించుకోవాలి.. 

ఒక రోజులో పూర్తి చేయగలిగితే ఉత్తమం అలా వీలు పడని వారు 9 రోజులు సమయం అలా నియమించుకుని పారాయణ చేయవచ్చు.

Famous Posts:

కూతురా కోడలా ఎవరు ప్రధానం...?


సాంబ్రాణి ధూపం వేయడం వల్ల కలిగే లాభాలు?


కాకికి అన్నం ఎందుకు పెట్టడం ?


మీకు ఏదైనా సమస్య ఉందా అయితే వెంటనే ఈ స్వామి వారికి ఉత్తరం రాయండి.


సంతానం కోరుకునే వారికీ కచ్చితమైన పరిష్కార మార్గం


మీరు చేసే పూజకు రెట్టింపు ఫలితం రావాలంటే ఇలా చేయండి.


భస్మధారణ అంటే ఏమిటి? దాని వల్ల కలిగే లాభాలు ఏంటి?

Tags: చండీ పారాయణం, Chandi Saptashati, Chandi Parayanam, Durga Saptashati, 

Chandi Parayanam Benefits, chandi parayanam Telugu, Chandi Parayanam Telugu pdf

ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.