Today Tirumala Darshan Information:

నమస్కారం హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం. టెంపుల్స్ గైడ్ కాల్ సెంటర్ జనవరి 26వ తేదీ నుంచి ప్రారంభం కాబోతుంది. కాల్ సెంటర్ వారికి జీతాలు ఇవ్వాలి కాబట్టి టెంపుల్స్ గైడ్ సభ్యత్వం ఉన్న వారికి మాత్రమే కాల్ చేసే అవకాశం ఉంటుంది. జీవితకాల సభ్యత్వం 100 రూపాయలు మాత్రమే. 8247325819 ఈ నంబర్ కు gpay లేదా ఫోన్ పే చేయగలరు. మీకు తిరుమల దర్శనం టికెట్స్ లేకపోతే మీరు ఉదయం ఆరు గంటలలోపు తిరుపతిలో ఈ మూడు సెంటర్స్ దగ్గరకు వెళ్లి SSD (SLOTTED SARVADARSHAN )టికెట్స్ పొందవచ్చు. ఇవి తీసుకుంటే మీకు మూడు నుండి నాలుగు గంటలలోపు దర్శనం అవుతుంది(భక్తుల రద్దీని బట్టి) * తప్పనిసరిగా మీ ఆధార్ కార్డు తీసుకుని ప్రతిఒక్కరు క్యూ లైన్లో నిలబడి ఈ టికెట్స్ తీసుకోవాలి. 12 సంవత్సరాల లోపు పిల్లలకు టికెట్ అవసరం లేదు. ఈ టికెట్ లేకుండా సరాసరి కొండమీదకు వెళ్లి దర్శనం చేసుకోవచ్చు గానీ మీకు 15 నుండి 20 గంటల సమయం పట్టవచ్చు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటే ఈ సమయం మరింత పెరిగే అవకాశం ఉంది. కావున భక్తులు SSD టోకెన్ లు తప్పనిసరిగా తీసుకుని వెళ్ళండి.. టిక్కెట్లు ఇచ్చు ప్రదేశాలు :- 1) శ్రీనివాసం - తిరుపతి ఇది బస్టాండ్ ఎదురుగా ఉంటుంది 2) భూదేవి కాంప్లెక్స్ - అలిపిరి శ్రీ బాలాజీ బస్టాండ్ దగ్గర ఉంటుంది 3) గోవింద రాజు సత్రం 2 - తిరుపతి ఇది రైల్వే స్టేషన్ ఆరో నెంబర్ platform బయటకు వెళ్లే గేటు ఎదురుగా ఉంటుంది .. మీరు రూమ్స్ బుక్ చేసుకోకపోతే కొండపైన CRO ఆఫీస్ దగ్గర ఇస్తారు

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***అరుణాచలంలో కార్తీక మహా దీపం డిసెంబర్ 6న గురువారం సాయంత్రం 4 గంటలకు వెలిగిస్తారు.**చార్ ధామ్ యాత్ర 2022 సమాచారం : అక్టోబర్ 26న గంగోత్రి , 27న కేదార్నాథ్ మరియు గంగోత్రి ఆలయాలు మూసివేస్తారు . చివరిగా బద్రీనాథ్ ఆలయాన్ని నవంబర్ 19న మూసివేస్తారు మరల 6 నెలల తరువాత అక్షయ తృతీయ నాడు చార్ ధామ్ యాత్ర ప్రారంభం అవుతుంది. ** కాణిపాకం ఆలయ నిర్మాణం పూర్తీ అయింది దర్శనాలు జరుగుతున్నాయి.** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు . ** అరుణాచలంలో కార్తీక దీపోత్సవం 10 రోజులు జరుగుతుంది నవంబర్ 27వ తేదీ నుంచి డిసెంబర్ 6వ వరకు. మహాదీపం డిసెంబర్ 6న పెడతారు** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారు శివరాత్రి నాడు భక్తుల రద్దీ అధికంగా ఉండటం వలన ఆ రోజు చెయ్యరు. రాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

2023 Mithuna Rasi Phalalu | Gemini Horoscope 2023 - మిథున రాశి ఫలితాలు 2023

2023 Mithuna Rasi Phalalu

శ్రీ శోభకృతు నామ సంవత్సర (ఉగాది) 2023-2024 మిథున రాశి యొక్క ఆదాయం, వ్యయం, రాజపూజ్యం మరియు అవమానం.

మిధునరాశి (Mithuna Rasi phalalu 2023)

మృగ 3,4 పా, ఆర్ద్ర 1,2,3,4 పా, పున 1,2,3 పా

ఆదాయం :- 2, వ్యయం :- 11,

రాజపూజ్యం :- 2 అవమానం:- 4.

ఈ రాశివారికి ఈ సంవత్సరము అన్ని విషయములందు ఆశాజనకముగా ఉన్నను అనూహ్యముగా ఇబ్బందులు కూడ ఏర్పడగలవు. భాగస్వామ్య వ్యాపారములు ఆశాజనకంగా ఉండవు. ఆదాయము మించి ఖర్చులుండును. బంధువర్గ సహకారముతో శుభ ప్రయత్నములు సానుకూలమగును. కోర్టు వ్యవహారములు పరిష్కరించుటకు అధిక ఇబ్బందులనధిగమించవలెను. ఫైనాన్స్ రంగము వారికి ఆర్ధికముగా చాలా బాగుండును. ఉద్యోగుల బదిలీలు జరుగును.

రాజకీయముగా పదవులను పదిలపరచు కొనుటకు తగిన కృషి చేయవలెను. కళాకారులకు ప్రతిభకు తగ్గ గుర్తింపు లభించదు. వ్యవసారంగము ఆశాజనకముగా ఉండును. విద్యార్ధులు ప్రతిభతో  విజయము సాధింతురు. ధార్మిక కార్యక్రమములకు ధనము వెచ్చింతురు. అప్పుడప్పుడు ఆర్ధిక సమస్య లేర్పడును. ఏ పనికైనను గట్టి ప్రయత్నము చేసిన కాని ఫలితము లభించదు. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తప్పనిసరి. నూతన వస్తువులు కొనుగోలు చేయుదురు.

2023 లో మిథునరాశి వారికి అదృష్ట సంఖ్య

మిథున రాశిని పాలించే గ్రహం బుధుడు మరియు మిథునం యొక్క స్థానికులకు అదృష్ట సంఖ్యలు 3 మరియు 6.జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, జాతకం 2023 ప్రకారం 2023 సంవస్త్రానికి సంబంధించిన మొత్తం స్కోరు 7 సంఖ్యగా ఉంటుంది.ఈ విధంగా, ఈ సంవస్త్రం మిథున రాశి వారికి మధ్యస్థం కంటే కొంచెం మెరుగ్గా ఉంటుందని నిరూపించవొచ్చు మరియు ఇది మీకు ప్రయోజనాలను కూడా సృష్టిస్తుంది.

మీ కోసం చాలా సవాళ్ళు ఉంటాయి కానీ ఆ సవాళ్లు మీ వల్ల కాదు కానీ సరైన కారణం లేకుండా ఉంటాయి.అయితే, మీరు మీ తెలివితేటలు మరియు శక్తితో ఈ సవాళ్ళను అధిగామించగలరు.మిథున రాశిఫలం 2023 ఈ సంవస్త్రం మీకు చాలా అవకాశాలను తెస్తుందని మరియు మీరు ఈ అవకాశాలను సమయానికి ముందే పరిగణలోకి తీసుకుంటే మీరు జీవితంలో పురోగమించవొచ్చు.

మిథున రాశి  జ్యోతిష్య పరిహారాలు

  • ప్రతిరోజు ఇంట్లో తయారుచేసిన భోజనం నుండి ఆవు కోసం 1 వ చపాతీని తీసుకోండి.
  • ప్రతి బుధవారం ఆవుకు పచ్చి బచ్చలి కూర, పచ్చి మేత, పచ్చి కూరగాయలతో పాటు సాబూత్ మూంగ్ దాల్ తినిపించండి.
  • శ్రీవిష్ణువుకు అంకితం చేయబడిన శ్రీ విష్ణువు సహస్ర స్తోత్రాన్ని పటించడం వల్ల మీకు మేలు కలుగుతుంది.
  • బుధవారం ఉపవాసం మిమల్ని ఆరోగ్యవంతం చేస్తుంది మరియు మీ వ్యాపారంలో మీకు ప్రక్రియను అందిస్తుంది.
  • నాణ్యమైన పచ్చ రత్నాన్ని ధరించడం వల్ల మీకు ఏంతో కలుగుతుంది.మీరు బుధవారం శుక్ల పక్షంలో ఈ రత్నాన్ని మీ చిటికెనే వేలికి ధరించవొచ్చు.
  • మీరు ఏవైనా ఇబ్బందులు ఎడుర్కొనట్టు అయితే లేదా మీరు అనారోగ్యంతో ఉనట్టు అయితే గజేంద్ర మోక్ష స్తోత్రాన్ని పటించండి లేదా శ్రీ రామ రక్ష స్తోత్రాన్ని పటించండి.

తెలుగు రాశిఫలాలు 2023-2024

Tags: మిథునరాశి ఫలాలు 2023, మిథునరాశి ఫలాలు 2023, 2023 Mithuna Rasi Phalalu, Mithuna rasi 2023 Telugu, Gemini Horoscope 2023, Telugu Rasi Phalalu 2023, Horscope 2023, Rasi Phalalu Telugu

Comments

Popular Posts