Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

సంక్రాంతి సందర్భంగా తప్పక చదవాల్సిన, వినాల్సిన పితృ దేవతా స్తుతి.| Pitru Devata Stotram in Telugu

సంక్రాంతికి పితృదేవతలకు సంబంధం ఉంది. రేపు సంక్రాంతి సందర్భంగా తప్పక చదవాల్సిన, వినాల్సిన పితృ దేవతా స్తుతి.

శ్రాద్ధాదులలో, మహాలయ పక్షాలలో దీనిని పఠించితే పితరుల కృప లభిస్తుంది. పితృదేవతా విజ్ఞానంతో కూడిన ఈ స్తుతి ఇంట్లో ఉంటే చాలు - పితృకృప చేత ఆ యిల్లు ఆనందైశ్వర్య నిలయమవుతుంది. పుష్టికారకమైన ఈ స్తుతి శ్రాద్ధంలో భోక్తల ముందు చదవడం కూడా శ్రేష్ఠం. ఇది 'గరుడ మహాపురాణం' లో

చెప్పబడుతున్నది. ఇందులో అన్ని పితృగణాలు, వాటి విశేష రహస్యాలు చెప్పబడి ఉన్నాయి. దేవతల చేత కూడా ఆరాధింపబడే మహిమాన్వితులు పితృదేవతలు. వారి అనుగ్రహం వలన వంశవృద్ధి, ఐశ్వర్య క్షేమాలు సమకూరుతాయి.

నమస్యేహం పితౄన్ భక్త్యా యే వసన్త్యధిదైవతమ్!

దేవైరపి హి తర్ప్యస్తే యే శ్రాద్ధేయు స్వధోత్తరైః!!


నమస్యేహం పితౄన్ స్వర్గే యే తర్ప్యనే మహర్షిభిః!

శ్రాద్ధెర్మనోమయైర్భక్త్యా భుక్తిముక్తి మభీప్సుభిః!!


నమస్యేహం పితౄస్ సర్గే సిధాః సంతర్పయన్తియాస్!

శ్రాద్ధేషు దివ్యై: సకలైరుపహారైరనుత్తమైః!!


నమస్యేహం పితౄన్ భక్త్యా యోర్చ్యస్తే గుహ్యకైర్దివి!

తన్మయత్వేన వాంఛ యుధ్ధమాత్యన్తికీం పరామ్!!


నమస్యేహం పితౄస్ మర్యై రర్చ్యస్తే భువియే సదా!

శ్రాద్ధేయు శ్రద్ధయాభీష్టలోక పుష్టి ప్రదాయినః!!

నమస్యేహం పితౄస్ యే పై తర్ప్యక్తీరణ్యవాసిభిః!

వన్యైః శ్రాద్ధెర్యతాహారైస్తపో నిర్ధూతకల్మషై!!


నమస్యేహం పితౄస్ విప్రైరైష్ఠికైర్ధర్మచారిభి:!

యే సంయతాత్మ భిర్నిత్యం సంతర్పస్తే సమాధిభిః!!


నమస్యేహం పితౄస్ శ్రాద్ధె: రాజన్యాస్తర్బయన్తియాస్!

కవ్యై శేషైర్విధి వల్లో కద్వయ ఫలప్రదమ్!!


నమస్యేహం పితౄస్ వైశ్యైరర్చ్యస్తే భువియే సదా!

స్వకర్మభి రతైర్నిత్యం పుష్పధూపాన్న వారిభిః!!


నమస్యేహం పితౄస్ శ్రాద్ధే శూద్రెరపి చ భక్తితః!

సంతర్పనే జగత్కృత్స్నం నామ్నా ఖ్యాతాః సుకాలినః!!


నమస్యేహం పితౄస్ శ్రాద్ధే పాతాళే యే మహాసురైః!

సంతర్ప్యస్తే సుధాహారా స్యక్త దర్పమదైః సదా!!


నమస్యేహం పితౄస్ శ్రాద్ధె: అర్బ్యస్తే యే రసాతలేః!

భోగైరశేషైర్విధివన్నాగైః కామానభీప్సుభిః!!

నమస్యేహం పితౄస్ శ్రాధ్ధః సర్చైః సంతర్పితాస్ సదా!

తతైవ విధివన్మహా భోగ సంపత్సమన్వితైః!!


పితౄన్న మస్యే నివసన్తి సాక్షాద్యే దేవలోకేధమహాతలేవా!

తధాన్తరిక్షేచ సురారి పూజ్యాస్తే వై ప్రతీచ్చను మయోపథీతమ్!!


పితౄన్న మస్యే పరమార్థభూతా యే దై విమానే నివసన్త్యమూర్తాః!

యజన్తి యాననమలైర్మనోభి ర్యోగీశ్వరాః క్లేశవిముక్తి హేతూస్!!


పితౄన్న మస్యేదివి యే చ మూర్తాః స్వధాభుజః కామ్య ఫలాభినన్దా!

 ప్రదానశక్తాః సకలేప్సితానాం విముక్తిదా యేనభిసంహితేషు!!


తృప్యను తేస్మిన్సితరః సమస్తా ఇచ్ఛావతాం యే ప్రదిశన్తి కామాస్!

సురత్వమిన్దత్వ మితోధికం వా గజాశ్వరత్నాని మహాగృహాణి!!


సోమస్య యే రశ్మిషు యోర్కబింబే శుక్లా విమానే చ సదావసన్తి!

తృప్యను తేస్మిన్వితరోన్నతోయైర్గనాదినా పుష్టిమతో ప్రజన్తుః!!


యేషాం హుతేగ్నే హవిషాచ తృప్తిర్యే భుంజతే విప్రశరీరసంస్థాః!

యే పిండదానేన ముదం ప్రయాన్తి తృప్యస్తు తేస్మిన్పితరోన్నతోయైః!!

యే ఖడ్గ్మమాం సేన సురైరభీప్లైః కృష్ణస్తిలైర్దివ్య మనోహరైశ్చ!

కాలేన శాకేన మహర్షివర్యైః సంప్రీణతాస్తే ముదమత్రయాస్తు!!


కన్యాన్య శేషాణి చ యాన్యభీష్టాన్యతీవ తేషాం మమ పూజితానాం!

తేషాం చ సాన్నిధ్య మిహాస్తు పుష్పగంధంబు భోజ్యేషు మయాకృతేషు!!


దినే దినే యే ప్రతిగృష్ణాతేర్చాం మాసాన్త పూజ్యా భువి యేష్టకాసు!

యే వత్సరానేభ్యుదయే చ పూజ్యాః ప్రయాస్తు తేమే పితరోత్ర తుష్టిమ్!!


పూజ్యాద్విజానాం కుముదేన్దు భాసో యే క్షత్రియాణాం జ్వలనార్కవర్ణాః!

తథా విశాం యే కనకావదాతా నీల ప్రభాః శూద్రజనస్య యేచ!!


తేస్మిన్సమస్తా మమ పుష్ప గంధధూపాంబు భోజ్యాది నివేదనేన !

తథాగ్ని హోమేన యాన్తి తృప్తిం సదా పితృభ్యః ప్రణతోస్మి తేభ్యః!!


యే దేవ పూర్వాణ్యభితృప్తి హేతో రశ్నన్తి కవ్యాని శుభాహృతాని!

 తృప్తాశ్చ యే భూతిసృజో భవన్తి తృప్యన్తు తేస్మిస్ ప్రణతోస్మి తేభ్యః!!


రక్షాంసి భూతాన్యసురాంస్తథోగ్రాస్ నిర్ణాశయను త్వశివం ప్రజానామ్!

ఆద్యాః సురాణామమరేశ పుజ్యాస్తృప్యన్తు తేస్మిస్ ప్రణతోస్మి తేభ్యః!!

అగ్నిష్వాత్తా బర్హిషద ఆజ్యపాః సోమపాస్తథా!

ప్రస్తుతృప్తిం శ్రాద్ధేస్మిన్ఫితర స్తర్పితా మయా!!


అగ్నిష్వాత్తాః పితృగణాః ప్రాచీం రక్షస్తు మేదిశం!

 తథా బర్హిషదః పాన్తు యామ్యాం మే పితరః సదా!!


ప్రతీచీ మాజ్యపాన ద్వదుదీచీమపి సోమపాః!

రక్షో భూతపిశాచే భ్యస్తథైవాసురదోషతః!!


సర్వతః పితరో రక్షాం కుర్వన్తు మమ నిత్యశః!

విశ్వో విశ్వభుగారాధ్యో ధర్మో ధన్యః శుభాననః!!


భూతిదో భూతికృత్ భూతిః పితౄణాం యే గణానవ!!

కళ్యాణ: కల్యదః కర్తా కల్యః కల్యతరాశ్రయః!

కల్యతా హేతురనఘః షడిమే తే గణాః స్మృతాః!!


వరో వరేణ్యో వరదస్తుష్టిదః పుష్టిదస్తథా!

విశ్వపాతా తథా ధాతా సప్లైతే చగణాః స్మృతాః!!


మహాన్మహాత్మా మహితో మహిమావాన్మహాబలః!

గణాః పంచ తథైవైతే పితౄణం పాపనాశనాః!!


సుఖదో ధనదశ్చానే ధర్మదోన్యశ్చ భూతిదః!

పితౄణాం కథ్యతే చైవ తథా గణ చతుష్టయమ్!!


ఏకత్రింశత్పతృగణా యేర్వ్యాప్త మఖిలం జగత్!

త ఏవాత్ర పితృగణాస్తుష్యను చ మదాహితాత్!!

మార్కండేయ ఉవాచ

ఏవంతు స్తువతస్తస్య తేజసో రాశిర్రుచ్చి తః!

దుర్బభూవ సహసా గగనవ్యాప్తి కారకః!!


తద్ దృష్ట్వా సుమహత్తేజః సమాచ్ఛాద్య స్థితం జగత్!

జానుభ్యామవనీం గత్వా రుచిః స్తోత్రమిదం జగౌ!!


రుచిరువాచ

అర్చితానామమూర్తానాం పితృణాం దీప్త తేజసామ్!

నమస్యామి సదా తేషాం ధ్యానినాం దివ్య చక్షుషామ్!!


ఇంద్రాదీనాంచ నేతారో దక్షమారీచ యోస్తథా!

సప్తర్షీణాం తథాన్యేషాం తాన్నమస్యామి కామదాస్!!


మన్వాదీనాం చ నేతార: సూర్యాచన్ద్ర మసోస్తధా!

తాన్నమస్యామ్యహం సర్వాస్ పితౄణప్యుదధావపి!!


నక్షత్రాణాం గ్రహాణాం చ వాయ్వగ్న్యోర్న భసస్తథా!

ద్యావాపృథివ్యోశ్చ తథా నమస్యామి కృతాంజలిః!!


ప్రజాపతేః కశ్యపాయ సోమాయ వరుణాయ చ!

యోగేశ్వరేభ్యశ్చ సదా నమస్యామి కృతాంజలిః!!


నమో గణేభ్యః సప్తభ్య స్తథాలోకేషు సప్తషు!

స్వాయంభువే నమస్యామి బ్రహ్మణే యోగ చక్రుషే!!


సోమాధారాన్ పితృగణాస్ యోగిమూర్తిధరాం స్తథా!

నమస్యామి తధా సోమం పితరం జగతా మహమ్!!


అగ్నిరూపాం స్తథైవాన్యాన్న మస్యామి పితృనహమ్!

అగ్నీ సోమమయం విశ్వం యత ఏతదశేషతః!!


యే చ తేజసి యే చైతే సోమసూర్యాగ్ని మూర్తయః!

జగత్స్వరూపిణ శ్చైవ తథా బ్రహ్మ స్వరూపిణః!!


తేభ్యోఖిలేభ్యో యోగిభ్యః పితృభ్యో యతమానసః!

నమో నమో నమస్తేస్తు ప్రసిదస్తు స్వధాభుజః!!

మార్కండేయ వువాచ

ఏవం స్తుతాస్తతసేన తేజసోమునిసత్తమాః!

నిశ్చక్రముస్తే పితరో భాసయన్తో దిశోదిశ!!


నివేదనం చ యత్తేన పుష్పగంధానులేపనం!

తద్భూషితానథ స తాన్ దదృశే పురతః స్థితాస్!!


ప్రణిపత్య రుచిర్భక్త్యా పునరేవ కృతాంజలిః!

నమస్తుభ్యం నమస్తుభ్యమిత్యాహ పృధగాద్రుతః!!


స్తోత్రేణానేన నరో యోస్మాం స్తోష్యతి భక్తితః!

తస్య తుష్టావయం భోగానాత్మజం ధ్యానముత్తమమ్!!


ఆయురారోగ్యమర్ధం చ పుత్ర పౌత్రాదికం తధా!

వాంఛది: సతతం స్తవ్యాః స్తోత్రేణానేన వైయతః!!


శ్రాద్ధేషు య ఇమం భక్త్యా త్వస్మత్రీతి కరం స్తవమ్!

పఠిష్యతి ద్విజాన్మానాం భుంజతాం పురతః స్థితః!!


స్తోత్ర శ్రవణ సంప్రీత్యా సన్నిధానే పరే కృతే! |

అస్మాభిరక్షయం శ్రాద్ధం తద్బవిష్యత్యసంశయమ్!!

యస్మిస్ గేహే లిఖిత మేతత్తిష్ఠతి నిత్యదా!

సన్నిధానం కృత్యౌ శ్రాద్ధాత త్రాస్మాకం భవిష్యతి!!


తస్మా దేతత్త్వ యా శ్రాద్ధ విప్రాణాం భుంజతాం పురః!

శ్రవణీయం మహాభాగ అస్మాకం పుష్టి కారకమ్!!

(రుచి ప్రజాపతి చేసిన ఈ స్తోత్రం నిత్యం పఠించవచ్చు)

Famous Posts:

ఈ రాశులవారు జీవితంలో డబ్బు హోదాలతో ఉన్నత స్థితిలో ఉంటారు.


ఈ ఉంగరం ధరిస్తే అన్ని శుభాలే


అదృష్టాన్ని తెచ్చి పెట్టే నవబ్రహ్మ ఆలయం


> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి


100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం


> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం


అందరు తప్పక చదవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం


ఏలినాటి శని బాధలు తప్పించే సూర్యదేవాలయం ఇదే


గోవుతో గృహప్రవేశం ఎందుకు చేయిస్తారో తెలుసా?

Tags: సంక్రాంతి, పితృదేవతలు, అమావాస్య, Pitru Devata, Pitru Devata Stotram, Pitru devata stuti, Sankranthi, Pitru Devata Stotram Telugu

Comments

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు