Today Tirumala Darshan Information:

నమస్కారం హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం. టెంపుల్స్ గైడ్ కాల్ సెంటర్. కాల్ సెంటర్ వారికి జీతాలు ఇవ్వాలి కాబట్టి టెంపుల్స్ గైడ్ సభ్యత్వం ఉన్న వారికి మాత్రమే కాల్ చేసే అవకాశం ఉంటుంది. జీవితకాల సభ్యత్వం 100 రూపాయలు మాత్రమే. 8247325819 ఈ నంబర్ కు gpay లేదా ఫోన్ పే చేయగలరు.

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***అరుణాచలంలో కార్తీక మహా దీపం డిసెంబర్ 6న గురువారం సాయంత్రం 4 గంటలకు వెలిగిస్తారు.**చార్ ధామ్ యాత్ర 2022 సమాచారం : అక్టోబర్ 26న గంగోత్రి , 27న కేదార్నాథ్ మరియు గంగోత్రి ఆలయాలు మూసివేస్తారు . చివరిగా బద్రీనాథ్ ఆలయాన్ని నవంబర్ 19న మూసివేస్తారు మరల 6 నెలల తరువాత అక్షయ తృతీయ నాడు చార్ ధామ్ యాత్ర ప్రారంభం అవుతుంది. ** కాణిపాకం ఆలయ నిర్మాణం పూర్తీ అయింది దర్శనాలు జరుగుతున్నాయి.** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు . ** అరుణాచలంలో కార్తీక దీపోత్సవం 10 రోజులు జరుగుతుంది నవంబర్ 27వ తేదీ నుంచి డిసెంబర్ 6వ వరకు. మహాదీపం డిసెంబర్ 6న పెడతారు** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారు శివరాత్రి నాడు భక్తుల రద్దీ అధికంగా ఉండటం వలన ఆ రోజు చెయ్యరు. రాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

పడుకోవాలంటే పాటించే పదహారు సూత్రాలు | Sixteen Sutras to follow to sleep

పడుకోవాలంటే పాటించే పదహారు సూత్రాలు

1. నిర్మానుష్యంగా, నిర్జన  గృహంలో ఒంటరిగా పడుకోవద్దు. దేవాలయం మరియు స్మశాన వాటికలో కూడా పడుకోకూడదు.( మను స్మృతి)

2. పడుకోని ఉన్న వారిని అకస్మాత్తుగా నిద్ర లేపకూడదు.  ( విష్ణు స్మృతి)

3. విద్యార్థి, నౌకర మరియు ద్వారపాలకుడు వీరు అధిక సమయం నిద్రపోతున్నచో  వీరిని మేల్కొలపవచ్చును.( చాణక్య నీతి)

4. ఆరోగ్యవంతులు  ఆయురక్ష కోసం బ్రహ్మా ముహూర్తం లో నిద్ర లేవాలి.

( దేవీ భాగవతము).

5. పూర్తిగా చీకటి గదిలో నిద్రించవద్దు.

( పద్మ పురాణము)

6. తడి పాదము లతో నిద్రించవద్దు..

పొడి పాదాల తో నిద్రించడం వలన లక్ష్మి (ధనం) ప్రాప్తిస్తుంది.( అత్రి స్మృతి)

 విరిగిన పడకపై, ఎంగిలి మొహం తో పడుకోవడం నిషేధం. ( మహాభారతం)

7. నగ్నంగా, వివస్త్రలులై పడుకోకూడదు.( గౌతమ ధర్మ సూత్రం)

8. తూర్పు ముఖంగా తల పెట్టి నిద్రించిన విద్య, 

పశ్చిమ వైపు తల పెట్టి నిద్రించిన ప్రబల చింత,

ఉత్తరము వైపు తల పెట్టి నిద్రించిన హాని,మృత్యువు,ఇంకా 

దక్షిణ ముఖంగా తల పెట్టి నిద్రించినచో ధనము, ఆయువు ప్రాప్తిస్తుంది.

( ఆచార మయూఖ్)

9. పగటిపూట ఎపుడు కూడా నిద్రించవద్దు. కానీ జ్యేష్ఠ మాసంలో  1 ముహూర్తం (48నిమిషాలు) నిద్రిస్తారు.(పగటిపూట నిద్ర రోగహేతువు మరియు ఆయుక్షీణత  కలుగచేస్తుంది)

10. పగటిపూట  సూర్యోదయము  మరియు సూర్యాస్తమయం వరకు పడుకొనే వారు రోగి మరియు దరిద్రులు అవుతారు.

( బ్రహ్మా వైవర్తపురాణం)

11.సూర్యాస్తమయానికి ఒక ప్రహారం (సుమారు మూడు3 గంటల) తరువాత నే పడుకోవాలి.

12. ఎడమవైపు పడుకోవడం వలన  స్వస్థత లభిస్తుంది.

13. దక్షిణ దిశలో పాదములు పెట్టి ఎపుడు నిద్రించకూడదు యముడు మరియు దుష్ట గ్రహము ల  నివాసము వుంటారు..

దక్షిణ దిశలో కాళ్ళు పెట్టడం వలన చెవుల్లో గాలి నిండుతుంది. మెదడుకు రక్త సరఫరా మందగిస్తుంది. మతిమరుపు మృత్యువు  లేదా   అసంఖ్యాకమైన రోగాలు చుట్టుముడుతాయి.

14.గుండెపై చేయి వేసుకుని, చెత్తు యొక్క బీము కింద, కాలుపై కాలు వేసుకుని నిద్రించ రాదు.

15.పడక మీద త్రాగడం- తినడం చేయకూడదు.

16. పడుకొని పుస్తక పఠనం చేయడానికి వీల్లేదు. ( పడుకొని చదవడం వలన నేత్ర జ్యోతి మసకబారుతుంది.)

ఈ పదహారు నియమాలను అనుసరించేవారు యశస్వి,  నిరోగి మరియు దీర్ఘాయుష్మంతుడు అవుతారు.

Famous Posts:

స్త్రీల గూర్చి పురుషులు, పురుషుల గూర్చి స్త్రీలు తెలుసుకోవాల్సినవి?


సూర్యుడి అనుగ్రహాన్ని కోరుతూ ఆదివారాల నోము


శనేశ్వరుడు శనివారాల నోము


శుక్రవారాల నోముకి ఎంతో ప్రాధాన్యత


శివదేవుని సోమవారపు నోము కథ


తీర్థం తీసుకున్న తర్వాత చేతిని తలపై రాసుకుంటే ఏంమవుతుంది?

Tags: నిద్ర, Sleeping, Sleeping Rules, Sleeping Rules Telugu, Nidra Niyamalu, Sleeping Position, Devotional Storys

Comments

Popular Posts