Drop Down Menus

రాశి ప్ర‌కారం ఏ రంగాన్ని ఎంచుకుంటే స‌క్సెస్ అవుతారు | According to Rasi whatever field you choose you will be successful.

రాశి ప్ర‌కారం …ఏ రంగాన్ని ఎంచుకుంటే స‌క్సెస్ అవుతారు.

1. మేషం:-

దశమభావమై - భావనక్షత్రము అశ్వని అయినపుడు ఉద్యోగ మయితే - ఫ్యాక్టరీ, పోలీసు, మిలటరీ, వైద్యరంగము, రైల్వే, పోస్టల్ శాఖలలో జీవనము పొందును. స్వతంత్ర జీవనమైతే ప్రయివేటు వైద్యం, ఇనుము, మందుల షాపు, కొరియర్, కలప వ్యాపారములు చేయును.

భావనక్షత్రం భరణి అయినపుడు ఉద్యోగమయితే, సంగీతరంగము, బట్టల మిల్లులు, భవననిర్మాణము, వాహనములు నడుపుట, వీటియందు జీవనము పొందును.

స్వతంత్ర వృత్తులయినచో, పరిశ్రమ స్థాపించుట, సినిమాధియేటర్, హోటల్, పశువైద్యం, గృహోపయోగ సామాగ్రి, పాలు, రసాయనములు, రత్నముల వ్యాపారము మొదలగు వానివలన జీవించును.

భావనక్షత్రం కృత్తిక అయినచో, ఉద్యోగము సూచింపబడిన, రక్షణశాఖలు, రసాయన కర్మాగారములు, అగ్ని సంబంధ కర్మాగారములు, మొదలగు వాటిలో జీవనము పొందును. స్వతంత్ర జీవనమయినచో టింబర్ డిపో, ఆయుధ తయారీ, భవన నిర్మాణమునకు సామాగ్రి సరఫరా చేయుట ఎలక్ట్రికల్ షాపు మొదలగునవి..

2. వృషభం:-

దశమభావమై, కృత్తిక భావనక్షత్రమైనచో, ఉద్యోగము సూచింపబడితే నగల షాపు, ఫోటోగ్రఫీ, రెడీమేడ్ దుస్తులు, సాంస్కృతిక కార్యక్రమములు నిర్వహించుట. మెడికల్ షాపు మొదలగు శాఖలలో ఉద్యోగము చేయును. స్వతంత్ర జీవనము చేయును.

భావనక్షత్రము రోహిణి అయిన, ఉద్యోగమయితే హోటల్, బేకరీ, లాడ్జి, బట్టలు, ఉన్ని - నూలు, రవాణా, పార్లర్, నూని తయారుచేయు ఫ్యాక్టరీలు, రంగులు తయారు చేయు లేదా అమ్ము షాపులలో ఉద్యోగము చేయును. స్వతంత్ర జీవనమైనచో పై రంగములలోనే జీవనము వ్యాపారము చేయును.

భావ నక్షత్రం మృగశిర అయితే ఎస్టేట్లు, పురుగుల మందుల దుకాణములు, కర్మాగారములు, లాండ్రిలు, పొగాకు సంస్థలు, వ్యవసాయం, సినిమా ధియేటర్, ఆటోమొబైల్, ఇంజనీరింగ్, బ్రాందీ షాపులు, పండ్లు పూల దుకాణములు తోలు వస్తువులు తయారుచేయు ఫ్యాక్టరీ అలంకరణ సామాగ్రి తయారుచేయు ఫ్యాక్టరీలలో ఆయా భావముల ననుసరించి ఉద్యోగ, వ్యాపారములను పొందును.

3. మిధునం:-

దశమభావమై మృగశిర భావ నక్షత్రమైనచో, స్పేర్ పార్టు, ఎలక్ట్రికల్ వస్తువులు, మందులు తయారుచేయుట, బేకరీ, టెలిఫోన్, వైర్లెస్ సమాన్లు తయారు చేయుట మొదలగు వృత్తి వ్యాపారములు చేయును.

భావములు భావ నక్షత్రం ఆరుద్ర అయినచో పుస్తకములు షాపు యాడ్ బిజినెస్ - మెడికల్ షాపు, ఫైనాన్స్, టి.వి. రేడియో షాపులు, పోస్టలు & టెలిగ్రాఫ్, పురుగుమందులు, న్యూస్ పేపరు ఏజెన్సీ, ఇవే కాక రాహువున్న రాశ్యాధిపతి కారకత్వములు, రాహువుతో జేరిన గ్రహముల కారకత్వముల ననుసరించి ఉద్యోగ వ్యాపారములు జేయును.

భావనక్షత్రము పునర్వసు అయినచో, జ్యోతిషం, రచనా వ్యాసంగం. పత్రికా నిర్వహణ, ఇంజనీరింగ్, ఎక్స్పోర్టు, కమిషన్ రంగం, విద్యాబోధన, ఇన్సూరెన్స్, పోస్టల్ శాఖ, రాయబార కార్యాలయాలు, రాజకీయం మొదలగు రంగములలో ఉద్యోగ స్వతంత్ర జీవనములు చేయును.

4. కర్కాటకము :-

దశమభావమై, భావనక్షత్రము పునర్వసు నక్షత్రమైతే, ఫైనాన్స్-దేవాలయం-మత సంబంధ వృత్తులు వైద్యం, నీటి పారుదల శాఖ, బ్యాంకులు షిప్పింగ్ ఏజెన్సీలలో ఉద్యోగ వ్యాపారములు చేయును.

భావనక్షత్రము పుష్యమి అయినచో కార్పోరేషన్ - ఇంజనీర్-పెట్రోలు బంక్ - బ్లడ్ బ్యాంకు అయిలు షాప్, దుప్పట్లు, ఉన్ని షాపులు - త్రవ్వకపు సంస్థలు, కాంట్రాక్టులు మొదలగు శాఖలలో ఉద్యోగ వ్యాపారముల ద్వారా జీవనము గడుపును.

భావనక్షత్రము ఆశ్లేష అయినచో, ప్రింటింగ్ ప్రెస్ కళారంగము లాటరీషాపులు, సినిమా ధియేటర్లలో టిక్కట్లు ఇచ్చుట, రంగులు వేయుట, బట్టల మిల్లులు, సైనో బోర్డులు వ్రాయుట, ట్రావెల్ ఏజెన్సీ నిర్వహించుట మొ||గు ఉద్యోగ వ్యాపారములు చేయును.

5. సింహము:-

దశమభావమై, భావనక్షత్రము మఖ అయినచో, న్యాయవాది, వైద్యుడు, సెక్యూరిటీ ఆఫీసరు ప్రభుత్వ శాఖలలోను, షిప్పింగ్, రసాయనములు, నగలు, షాపులు, గనులు, జర్నలిజం, టైపిస్టు, సి.ఐ.డి., మెరైన్ శాఖలలో ఉద్యోగ స్వతంత్ర జీవనములు పొందును.

భావనక్షత్రము పూర్వఫల్గుణి అయినచో వాహనములు నడుపుట రేడియో- టి.వి. షాపులు, సేల్సుమేన్, ఎలక్ట్రికల్ షాపు, రవాణాశాఖ విద్యాబోధన ఆటో మొబైల్సు, సినిమాహాళ్ళు నడుపుట, మొదలగు శాఖలలో ఉద్యోగ స్వతంత్ర జీవనములు పొందును.

భావనక్షత్రము ఉత్తరఫల్గుణి అయినచో కలెక్టరు ఐ.జి. ప్రభుత్వ శాఖలలో క్రింద స్థాయి నుంచి ప్రమోషనులపై ఉన్నత స్థానమును చేరుకొనుట, జ్యోతిషం, కాంట్రాక్టులు, పెద్ద పెద్ద ఎలక్ట్రికల్ షాపులు, భారీస్థాయిలో హోర్డు వేరు షాపు, స్టీలు ఫ్యాక్టరీ, కోట్లాదిరూపాయాలతో పెద్ద పెద్ద ఇనుపసంబంధ వస్తువుల తయారీ ఫ్యాక్టరీ నిర్వహణ మొదలగు వాటిలో ఉద్యోగ స్వతంత్ర జీవనములు పొందును.

6. కన్య:-

దశమభావమై, భావ నక్షత్రము ఉత్తర ఫల్గుణి అయినచో జ్యోతిష పండితుడు, సాముద్రికము చెప్పుట - రసాయనములు తయారుచేయుట. స్పీకర్లు తయారుచేయుట, కళాశాలయందు లెక్చరర్, రాయబారి, ప్రభుత్వమునందు ఉన్నత పదవులు మొదలగునవి నిర్వహించును.

భావ నక్షత్రం హస్త అయినచో న్యాయవాది, కళాకారుడు, బట్టలషాపు, పొగాకు సంస్థలు, లాండ్రీ, ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్, షిప్పింగ్, నేవీ, చెరువులు మొదలగు జీవన విధానములుండును.

భావనక్షత్రము చిత్త అయినచో, సేల్స్ టాక్స్ డిపార్టుమెంట్, ఎక్కౌంటెంట్, న్యాయాలయములలో గుమాస్తా శాఖలు, ఇంజనీరింగ్, ప్రింటింగ్ ప్రెస్, ఎలక్ట్రికల్ సామాన్లు, నగలషాపులు, న్యాయవాదిత్వము మొదలగునవి జాతకుడు పొందు అవకాశమున్నది.

7. తుల:-

దశమభావమై, భావనక్షత్రము చిత్త అయినచో, ఆటోమొబైల్ స్పేర్పార్ట్స్, టైర్ రీట్రేడింగ్-ఎలక్ట్రికల్ వస్తువులు, నగలవర్తకం, న్యాయస్థానములు, రక్షణ శాఖలు, ఇంజనీర్, సాంస్కృతిక సంస్థలు, మొదలగు వృత్తి వ్యవహారములు జాతకుడు పొందును.

భావనక్షత్రము స్వాతి అయినచో హాస్టల్స్, వైద్య రంగము, ట్రాన్స్పోర్టు ఏజెన్సీ, ఎక్స్-రే పరికరములు, అలంకరణ సామాగ్రి, స్త్రీల వస్తువులు - ఎగ్జిబిషన్లు నిర్వహించుట నూలు మిల్లులు, వాహనములు నడుపుట మున్నగు వ్యాపకములు, రాజకీయ రంగము, గూఢ వ్యవహారములు వీటియందు జీవనము పొందుతాడు.

భావనక్షత్రము విశాఖ అయినచో, ట్రావెల్ ఏజెన్సీ, రియల్ ఎస్టేట్ - నావికుడు - రెవిన్యూ, బ్యాంకులు, ఫైనాన్స్ బట్టల మిల్లులు - షాపులు, చిట్ ఫండ్స్, పిండిమిల్లులు టూరిజం, శాఖలలో జాతకుడు వృత్తి వ్యాపారములు చేయును.

8. వృశ్చికము :-

దశమభావమై, భావనక్షత్రము విశాఖ అయినచో ఎస్టేటు యజమాని - షేర్ మార్కెట్, రసాయనములు, మందలు తయారుచేయుట - భూస్వామి - లాయర్ జడ్జీ - ఇన్సూరెన్స్ అధికారి - కస్టమ్స్ - రక్షణ శాఖలు - గ్రామాధికారి మొదలగు జీవనములుండును.

భావనక్షత్రము అనూరాధ అయినచో బట్టలమిల్లు నూనె, పెట్రోలు - డీజిల్ విక్రయం - ఎరువులు, ఇనుప స్క్రోప్ - కాస్టింగ్ - ఇంజనీరింగ్ - బట్టనేయుట, బ్రాందీ షాపులు, మందుల షాపులు, వీటివలన జీవనము పొందును మరియు వీటికి సంబంధించిన పరిశ్రమలు స్థాపించును.

భావనక్షత్రము జ్యేష్ఠ అయినచో, ప్రింటింగ్ ప్రెస్ - ఎలక్ట్రికల్ యాడ్స్ - వైద్యం - కంప్యూటర్స్ - టి.వి.లు అమ్ముట తయారుచేయుట - బట్టల మిల్లులకు పరికరములు సరఫరా చేయుట మున్నగు జీవనములు పొందడం జరుగుతుంది.

9. ధనస్సు:-

దశమభావమై, భావనక్షత్రము మూల అయినపుడు - విద్యా బోధన-న్యాయవాది, జడ్జి, మంత్రి, ప్రభుత్వ రాయబారులు, మత సంస్థలలో ఉన్నత పదవులు - ఆయుర్వేద వైద్యులు - మందుల షాపు, డిపార్టుమెంటల్ స్టోర్స్ - ఫల - పుష్ప దుకాణములు వీటివలన జీవనము జాతకుడు పొందును.

భావనక్షత్రము పూర్వాషాఢ అయినచో, న్యాయవాది - బ్యాంకులు - ఆడిట్ సంస్థలు, వెల్ఫేర్ ఆఫీసులు, శిశుసంక్షేమ శాఖలు - ప్రభుత్వ వెటర్నరీ డాక్టరు - ఎక్కౌంటెంటు, రెస్టారెంట్ - బస్ సర్వీస్ - ఎక్స్పోర్టు మార్కెటింగ్ మొదలగు జీవనములు జాతకుడు పొందును.

భావనక్షత్రము ఉత్తరాషాఢ అయినచో ఆయుర్వేద వైద్యం, అటార్నీ, బ్యాంకులు - న్యాయవాది - రాయబారి, కస్టమ్స్, జైళ్ళు - ఎక్స్పోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటరు మొదలగు జీవనములు పొందును.

10. మకరము:-

దశమభావమై, భావనక్షత్రము ఉత్తరాషాఢ అయినచో రియల్ ఎస్టేట్ - స్టీలు మెటీరియల్ సప్లై ఇంజనీరింగ్ విడి భాగములు - ప్రాచీన వైద్యం వృద్ధసదనముల నడుపుట - మున్సిపల్ కార్పోరేషన్లు - పబ్లిక్ శానిటేషన్ మొదలగు జీవనములు పొందును.

భావనక్షత్రము శ్రవణమైనచో, గనులు - గ్రానైట్ రాళ్ళు - నూని మిల్లులు పెట్రోలు బంకులు కూల్ డ్రింకుల తయారీ, ఆనకట్టలు, డామ్వద్ద పనులు. - కాలువలు త్రవ్వుట - షిప్ లో పనులు మొదలగు జీవనములు పొందుట జరుగును.

భావనక్షత్రము ధనిష్ఠ అయినపుడు, రక్షణ శాఖలు పెద్ద ఫ్యాక్టరీలు - జూనియర్ ఇంజనీర్ - ప్రభుత్వ విద్యుత్ సంస్థలు -వ్యవసాయం - టీతోటలు - తోలు పరిశ్రమ -మాంస వ్యాపారము మొదలగు వృత్తి వ్యాపారము జీవనముగా పొందుట జరుగును.

11. కుంభము:-

దశమభావమై, ధనిష్ట భావ నక్షత్రమైనచో ఇంజనీరింగ్, రైల్వే - ఎరుపులు - గణితము - ఆర్కెస్ట్రా - జ్యోతిషం - పురావస్తుశాఖ - లైబ్రరీ - ఆస్ట్రో ఫిజిక్స్ - ఫిజిక్స్ - వ్యాయామశాఖ - మెరైన్, రాజకీయం - ఫోటోగ్రఫీ - ఫింగర్ ప్రింట్స్ వివరించుట మొదలగు శాఖలలో జీవనము గడచును.

భావనక్షత్రము శతభిషమైనచో, పరిశోధన, ప్రాచీనగ్రంధ పరిశోధన, హస్త సాముద్రికమునందు విశేష ప్రజ్ఞ- గ్లాస్ వస్తువుల తయారీ, మందులు, రసా యనములు మెంటల్ ఆసుపత్రులు, సెన్సార్ బోర్డ్ - జ్యోతిషం - జైళ్ళు మరియు రాహువు ఉన్న రాశ్యాధిపతి రాహువుతో చేరిన గ్రహముల కారకత్వము ననుసరించి, జాతకుడు ఆయా వృత్తి వ్యాపారములవల్ల జీవనము సాగించును.

భావనక్షత్రము పూర్వాభాద్ర అయినచో సాముద్రికము. జ్యోతిషము ఫైనాన్స్ - బ్యాంకులు - ప్లీడర్లు - మున్సిపాలిటీ - గణాంకశాఖ - పైలట్లు - పిండిమిల్లులు - ప్రాచీన భాషా గ్రంధాలయాలు మున్నగు శాఖలలో జాతకుడు వృత్తి - వ్యాపారాదులు నిర్వహించును.

12. మీనము:-

దశమభావమై, భావనక్షత్రము పూర్వాభాద్ర అయినచో, రాజకీయములలో చురుకైన పాత్ర, దేవస్థానములు - ట్రావెల్ సంస్థలు - రైస్ హోల్ సేల్ - బ్యాంకులు - ప్రొఫెసర్ - కౌన్సిలర్ - జడ్జి - ఉన్నత పదవులు వీటి వల్ల జాతకుని కర్మ నిర్వహించబడును.

భావనక్షత్రము ఉత్తరాభాద్ర అయినచో సిఐడి - రక్షణశాఖలు - రాయబారులు - ప్రభుత్వ వైద్యసంస్థలు - ఇన్సూరెన్స్ - మత్స్యశాఖ - దేవాదాయశాఖయందు ఎగ్జి క్యూటివ్ ఆఫీసర్ - ఇంజనీర్ - రెస్టారెంట్ - డిపార్టుమెంటు స్టోర్స్ క్లబ్లు, ఎక్స్పోర్ట్ - ఇంపోర్టు వ్యాపారము, మొదలగు సంస్థల వల్ల జాతకుని జీవితము గడచును.

భావనక్షత్రము రేవతి అయినచో, జడ్జి, శాసనసభ్యత్వము - ప్రభుత్వ రంగములో పెద్ద ఉద్యోగములు, లాయర్లు, రాయబారులు, కస్టమ్స్ మరియు ఎక్సైజ్ శాఖ, జర్నలిజం, జ్యోతిషం - ఆడిట్ - యాడ్స్ - షేర్ మార్కెట్ - బ్యాంకులు - చిట్ ఫండ్స్ - కొరియర్ - ప్రింటింగ్ - మొదలగు వృత్తి వ్యాపారములవల్ల జాతకుని జీవనము గడచును.

ఇన్ని వృత్తులలోనూ, ప్రతివృత్తిలో స్థాయీ భేదం ఉంటుంది. అత్యున్నత స్థాయి, ఉన్నతస్థాయి మధ్యమస్థాయి, అధమస్థాయి, అధమాధమ స్థాయి ఉంటాయి. ఎంతమేర జాతకుడు స్థాయిని పొందగలడు? అనునది లగ్నము. లగ్నాధిపతిని బట్టి ఉంటుంది. లగ్నములు చర స్థిర ద్విస్వభావములని 3 విధములుగా ఉన్నాయి. చరలగ్నములకు, లగ్నాధిపతి 2-3-6-7-10 భావములకు సంబంధించి, 8వ భావ సంబంధము లేనట్లయిన జాతకుడు అత్యున్నత స్థాయికి లేదా ఉన్నత స్థాయిని పొందును. లగ్నాధి పతికి 2-10 భావసంబంధమున్నచో మధ్యమస్థాయి పొందును. | గ్నాధిపతి 2-10 భావములు మరియు 8వ భావమునకు సంబంధించినచో అధమస్థాయి చెందును. లగ్నాధిపతికి 2-6-10 సంబంధము లేక కేవలము 8వ భావ సంబంధమున్న జాతకుడు అధమాధమస్థాయి పొందును. చరలగ్న జాతకులకు 11వ భావ సంబంధము, పనికి రాదు. కారణమేమనగా చరలగ్నములకు 11వ స్థానము బాధక స్థానమగును. స్థిరలగ్నజాతకులకు 9వ స్థాన సంబంధము, ద్విస్వభావ లగ్న జాతకులకు 7వ స్థానసంబంధము పనికి రాదు మిగిలినందతయూ లగ్న- లగ్నాధిప బల నిర్ణయములో సమానమే.

Related Posts:

ఏ రాశి వారు ఏ మంత్రమును పఠించాలి?

రాశులు ఆకార స్వరూపాలు & లక్షణాలు

రాశి లగ్నాలు - జన్మించిన వారి జాతకుల లక్షణాలు

జాతకచక్రం ద్వారా మీకు ఏ దిక్కు కలసి వస్తుందో తెలుసుకోండి.

Tags: రాశి ఫలాలు, Rasi, Rasi Phalalu, Rasi Field Success, Zodics, Rashulu lakshanalu, Horscope, Rasi Jobs, Rasi Phalalu Telugu

ఇవి కూడా చూడండి
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON