తిరుమలలో శ్రీవారికి చేసే ఈ సేవల గురించి మీకు తెలుసా? దర్శనం ఉంటుందా ఉండదా? Srivari Sevas - Tirumala Tirupati Devasthanams

బుక్ చేసుకోగల సేవలు:

👉 కల్యాణోత్సవం

👉 ఆర్జిత బ్రహ్మోత్సవం

👉 ఊంజల్ సేవ

👉 సహస్ర దీపాలంకార సేవ

ప్రతీ సేవకూ దర్శనం ఉంటుంది.ముందు టిక్కెట్లు బుక్ చేసుకోండి.ఎలా వెళ్ళాలి ? ఎంత సమయం లాంటి వివరాలు ఇప్పుడు మీకు క్రింద చక్కగా వివరించాము జాగ్రత్తగా చదవండి.

అవకాశం ఉన్నంత వరకు ఊంజల్ సేవ బుక్ చేసుకోండి.దర్శనం షుమారుగా గంటలో పూర్తి అవుతుంది. మద్యాహ్నం 11 గంటలకు వెళితే 12 గంటలకు బయటకు వచ్చేసే అవకాశం.

ఊంజల్ సేవ:

ఈ సేవను డోలోత్సవం అని కూడా పిలుస్తారు. ఈ ఆర్జిత సేవ టిక్కెట్ ధర 500/- ఒక్కరికి. 12 సంవత్సరాల లోపు పిల్లలకు టిక్కెట్ అవసరం లేదు.

పురుషులు తప్పనిసరిగా పంచె కట్టుకోవాలి.ఉదయం 10.30 గంటలకు సహస్ర దీపాలంకార సేవ మండపం ప్రక్కనే ఉన్న సుపధం ఎంట్రన్స్ ద్వారా ప్రవేశించిన తర్వాత అక్కడ మీ టిక్కెట్, ఐడీ ప్రూఫ్ తనిఖీ చేసి పంపుతారు.మీరు మహాద్వారం నుండి ముందుగా దర్శనం చేసుకుని మీకు ఉచితం ప్రసాదం తీసుకుని కొంచెం ముందుకు రాగానే కుడి చేతి వైపు అద్దాల మండపం ఉంటుంది. ఆ మండపంలో కూర్చోండి.

స్వామి వారు కళ్యాణోత్సవం అయిన తరువాత షుమారుగా మద్యాహ్నం 2 గంటలకు ఈ అద్దాల మండపం వద్దకు వేంచేస్తారు. ఈ మండపం ముఖ మండపం, అంతరాళం అని రెండు భాగాలుగా నిర్మింపబడింది. అంతరాళమే డోలోత్సవం జరిగే 'అయినా మహల్.' ఈ అంతరాళం మధ్యలో నాలుగు స్తంభాల చతురస్ర మండపం వుంది. అందులో డోలోత్సవానికి అనువుగా గొలుసులు వేలాడదీయబడి ఉంటాయి. ఈ చతురస్ర మండపం చుట్టూ ప్రదక్షిణ మార్గం ఏర్పాటు చేయబడి ఉంటుంది. ఈ చతురస్ర మండపం చుట్టూ వున్న గోడలకు, పై కప్పునకు ఇలా అన్ని మూలల్లో అన్ని వైపులా పెద్ద పెద్దలు అద్దాలు బిగింప బడ్డాయి. ఈ మండపంలో గొలుసుల ద్వారా వేలాడదీసిన డోల (ఊయల)లో వేంచేసి ఊగుతున్న శ్రీస్వామివారి రూపం అద్దాల్లో అన్ని వైపులా స్వామి వారి ప్రతిబింబం కనపడుతూ, భక్తులు శ్రీవారి విశ్వరూపాన్ని చూస్తూ ఓ దివ్యానుభూతికి లోనవుతారు. ఆ అద్భుత దృశ్యం చూడవలసిందే కాని వర్ణించడానికి సాధ్యం కాదు.

ముందుగా అర్చక స్వాములు ఈ సేవలో పాల్గొన్న భక్తులచేత సంకల్పం చేయిస్తారు. పిదప మంగళ వాయిద్యాలు మోగుతుండగా వేదపారాయణలు సాగుతుండగా దేవేరులతో కూడిన స్వామివారు ఊయలలో సొబగుగా ఊగుతారు. ఇలా కొద్ది సేపు ఊగిన తర్వాత స్వామి వారికి పంచకజ్జాయం అనబడే ప్రసాదాన్ని నివేదిస్తారు. (గసగసాలు, జీడిపప్పు, బాదంపప్పు, ఎండుకొబ్బరికోరు, కలకండ, చక్కెర మిశ్రమాన్నే పంచకజ్జాయం అంటారు). నివేదన అయిన వెంటనే నక్షత్ర హారతిని ఇస్తారు. తర్వాత కర్పూర హారతిని కూడ ఇస్తారు. భక్తులు హారతిని కళ్లకద్దుకున్న తర్వాత డోలోత్సవం మీదవున్న శ్రీస్వామివారి చూట్టూ ప్రదక్షిణం చేస్తూ భక్తులు దేవాలయం నుండి  బయటకు వస్తారు. తర్వాత శ్రీస్వామివారు శ్రీ రంగనాయక మండపానికి వేంచేస్తాడు.

సహస్ర దీపాలంకార సేవ :-

ఈ ఆర్జిత సేవ ఖరీదు 500/- ఒకరికి. ఈ టిక్కెట్లు ప్రతీ నెల ఆన్‌లైన్ లో సులభంగా లభిస్తుంది. గుడికి కుడివైపు ఉన్న మండపంలో సాయంత్రం 5 గంటలకు ఈ సేవ మొదలు అవుతుంది. మీరు ముందుగా వెళితే మండపం ఎదురుగా కూర్చుని చూడవచ్చు. ఈ కార్యక్రమం ఆరుబయట జరుగుతుంది. సేవ టిక్కెట్ లేకపోయినా భక్తులు చూడవచ్చు. ఈ సేవ పూర్తి అయిన తర్వాత టిక్కెట్ ఉన్న భక్తులు ప్రక్కనే ఉన్న సుపధం ఎంట్రన్స్ ద్వారా దర్శనానికి పంపుతారు. ఈ సేవ SVBC భక్తి చానల్ లో ప్రతీ రోజూ లైవ్ వస్తుంది.

ఈ ఆర్జిత సేవ జరిపే విధానం :

ప్రతిరోజు కల్యాణోత్సవం,ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం. ఉత్సవాలన్నీ పూర్తి అయిన తర్వాత శ్రీదేవి, భూదేవులతో కూడిన శ్రీమలయప్పస్వామి తిరుచ్చి) ఎక్కి ఆలయ వెలుపల వున్న కొలువు మండపానికి ఛత్రచామర మంగళ వాద్య సమేతంగా తరలివస్తారు. ఆ కొలువు మండపంలో ఆ సమయానికి 1008నేతి వత్తులను వెలిగిస్తారు. ఆ నేతి దీపాల మధ్యలో శ్రీస్వామి వారి తిరుచ్చిని గొలుసులతో వేలాడదీసి ఊపుతారు. మంగళ వాద్యాలు మోగుతుండగా వేదమంత్రాల మధ్య శ్రీస్వామివారు అటు, ఇటు ఊగుతూ ఉండగా శ్రీ స్వామివారిని వేద పండితులు కీర్తిస్తారు.

ఆ తర్వాత రెండు మూడు అన్నమయ్య కీర్తనలు ఆలాపిస్తారు. కీర్తనలు పాడిన తర్వాత భజంత్రీలు మోగు తుండగా శ్రీస్వామివారికి పంచ కజ్జాయం (చక్కెర, గసగసాలు, ఎండు ద్రాక్ష, జీడి పప్పు, బాదం పప్పు కలిపిన పొడి పొడిగా వున్న ప్రసాదం) నివేదన చేసి నక్షత్ర హారతి ఇస్తారు. పిదప కర్పూర హారతి ఇస్తారు.  సహస్ర దీపాలంకార సేవ పూర్తి అయిన వెంటనే శ్రీస్వామివారిని మంగళవాద్యలతో నాలుగు మాఢ వీధులలో ఊరేగించి తిరిగి ఆలయం లోకి తీసుకుని వెళతారు.

ఇక్కడ శ్రీవారి భక్తులందరూ ఓ విషయం గమనించాలి. శ్రీకృష్ణుని జన్మనక్షత్రమైన రోహిణి నక్షత్రం రోజున శ్రీ మలయప్ప స్వామి వారికి బదులుగా శ్రీ రుక్మిణీ సమేత కృష్ణస్వామి, అలాగే రాములవారి జన్మ నక్షత్రమైన పునర్వసు నక్షత్రం రోజున  శ్రీ సీతారామలక్ష్మణులు తిరుచ్చి నెక్కి వచ్చి సహస్రదీపాలంకార సేవలో పాల్గొంటారు.

కళ్యాణోత్సవం :

భక్తులకు సూచనలు..

ఇద్దరికి( దంపతులకు) ప్రవేశం. టిక్కెట్ ఒకటికి 1000/-.ఇవి ఆన్‌లైన్ లేదా లక్కీడిప్ ద్వారా పొందవచ్చు. మగవారు పంచె,కండువా (షర్టు, బనియన్ వేసుకోకూడదు)ఆడవారు సాంప్రదాయ దుస్తులు.

ఈ కళ్యాణోత్సవ టిక్కెట్ ఉన్న దంపతులు ఖచ్చితంగా ఉదయం 10 గంటలకు దేవాలయం ప్రక్కనే ఉన్న సుపధం ఎంట్రన్స్ నుండి లోపలకు వెళ్ళాలి( ఒకవేళ ఓ గంట లేటు అయినా పర్లేదు పంపుతారు కంగారు పడకండి).మీరు మహా ద్వారం (main entrance) నుండి లోపలకు ప్రవేశించ గానే సరాసరి కాకుండా ఎడమవైపున వెళ్తే కళ్యాణోత్సవ మండపం లోకి పంపుతారు. మీరు స్వామి వార్ల ముందు ఉన్న హాలులో కూర్చోవాలి.మీరు లేటుగా వస్తే హాలులో చివరగా కూర్చోవలసి వస్తుంది.మీ ప్రక్కనే ఉన్న స్క్రీన్ మీద చూడవచ్చు.

ఒకవేళ మీకు ఆరోగ్య సమస్య ఉండి నేల మీద కూర్చోవడం కష్టం అయితే ప్రక్కనే ఉన్న గట్టు మీద కూర్చోవచ్చు.

ఈ సేవ మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట మధ్యలో జరుగుతుంది.మీరు దర్శనం చేసుకుని బయటకు వచ్చే సరికి మధ్యాహ్నం 2 గంటలు అవుతుంది. స్వామి దర్శనం జయ విజయుల దగ్గర నుండి మాత్రమే. లడ్డు కౌంటర్ లో మొదటి అంతస్తులో  మీ సేవ టిక్కెట్, ఐడీ చూపించి ప్రసాదం తీసుకుని తప్పనిసరిగా తరిగొండ వెంగమాంబ కేంద్రం లో అన్న ప్రసాదం స్వీకరించండి. దీనితో కళ్యాణోత్సవం ముగిసినట్లే.

తిరుమలలో శ్రీవారి ఆర్జిత బ్రహ్మత్సవం

ఇది రాంభగీచా -1 ప్రక్కనే ఉన్న వైభవోత్సవ మండపంలో జరుగుతుంది.ఆర్జిత బ్రహ్మోత్సవం అంటే బ్రహ్మోత్సవాలకు వెళ్లలేని వారి కోసం స్వామి వారి కొన్ని ఉత్సవ అవతారాలు ఓ వేదిక మీద చూపడమే ఆర్జిత బ్రహ్మోత్సవం.మూడు వాహనాల మీద స్వామి వారిని ఉంచి హారతి ఇస్తారు.

ఆర్జిత రుసుమును చెల్లించిన భక్తుల కోరిక మేరకు ఆలయం బయట వైభవోత్సవ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీమలయప్పస్వామికి ఆర్జిత బ్రహ్మోత్సవం జరుపబడుతుంది. ముఖ్యంగా పెద్ద శేష వాహనం, గరుడ వాహనం, హనుమంత వాహనాలలో స్వామి వారిని వేంచేపు చేయిస్తారు. బ్రహ్మోత్సవానికి సంక్షిప్తంగా నిర్వహించే ఉత్సవం ఇది. కళ్యాణోత్సవానంతరం మాత్రమే ఈ బ్రహ్మోత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవం ప్రతిరోజు జరుగుతుంది.

మీరు సేవ లో పాల్గున్న తరువాత ఎవరికి వారుగా సుపధం ఎంట్రన్స్ నుండి స్వామి వారి దర్శనానికి వెళ్లే అవకాశం కల్పిస్తారు.  ఇతవరకు అది 200/- ఉండేది. ప్రస్తుతం 500/- చేశారు.

రిపోర్టింగ్ టైం మద్యాహ్నం 1.30 నిమిషాలకు.. సేవ మొదలైయే సమయం షుమారు 2.30 గంటలకు..ఓసారి సమయం మీ వద్ద ఉన్న టిక్కెట్ మీద సరి చేసుకోండి.

Click hereతిరుమల కోసం మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.

Tags: Srivari Sevalu, Srivari Arjitha Seva, Tirumala Srivari Sevalu, Arjitha Sevas, Kalyanotsavam, TTD

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS