360 వత్తులను ఎప్పుడు వెలిగించాలి? ఎక్కడ వెలిగించాలి? Importance of 360 Vattulu

360 వత్తులను ఎప్పుడు వెలిగించాలి?

దీపం పరబ్రహ్మ స్వరూపం. ఏ ఇంట్లో అయితే.. నిత్యం ధూపు, దీప, నైవేద్యాది కైంకర్యాలు జరుగుతుంటాయో.. ఆ ఇల్లు అష్టైశ్వర్యాలతో తులతూగుతుంది అనేది ఆర్యోక్తి. నిత్యం ఇంట్లో దీపం వెలిగించడం శుభప్రధం.

కానీ.. సమకాలీన జీవితంలో ప్రతి రోజూ ఎవరూ దీపాన్ని వెలిగించలేరు. అందుకే.. కార్తీక పౌర్ణమినాడు ఓ పద్ధతిని సూచించారు పెద్దలు.

సంవత్సరానికి 365 రోజులు కాబట్టి.. రోజుకు ఒక వత్తి చొప్పున 365 ఒత్తల్ని జత చేసి, వాటిని ఆవు నెయ్యిలో నానబెట్టి.. కార్తీక పౌర్ణమి నాడు ఇంట్లో ఉన్న తులసి చెట్టు దగ్గర కానీ.. లేక దగ్గరలో ఉన్న దేవాలయంలో కానీ వాటితో దీపం వెలిగించాలి.

పుణ్యక్షేత్రాల్లో ఎప్పుడైనా వెలిగించవచ్చు, కార్తికమాసంలో పౌర్ణమినాడు వెలిగించడం శ్రేష్ఠం, అలయాల్లో, దీపోత్సవాల్లో వెలిగించవచ్చు.

ఇంటివద్ద వెలిగించినప్పుడు సాధారణంగా ఏకాదశి. క్షీరాబ్ది ద్వాదశినాడు పౌర్ణమి నాడు  తులసికోట వద్ద వెలిగిస్తారు.

వీలుకానివారు కార్తికమాసంలో ఏదో ఒక రోజున వెలిగించుకోవచ్చు.

360 వత్తులను ముందుగా ఆవునేతిలో తడిపి సిద్ధం చేసుకోవాలి.

మనకు ఉన్న తిథులు మొత్తం 15. నెలకు 30 తిథులు. నెలలు మొత్తం 12. రోజుకు ఒకటి చొప్పున 360 వత్తులు సంవత్సరానికి సంకేతానికి నిలుస్తాయి.

అలా వెలిగించడం వల్ల ఏడాది మొత్తం దీపాలు వెలిగించిన పుణ్యం లభిస్తుందని పెద్దలు చెబుతారు.

Tags: 360 vattulu, 360 వత్తులు , కార్తీక మాసం, Karthika Masam Somavaram, Deepam, karthikamasam

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS