Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

కార్తికమాసములో.. ఆకాశ దీపము పెట్టే సమయములో పఠించవలసిన శ్లోకము | Akasha Deepam Slokam in Karthika Masam

కార్తికమాసములో.. ఆకాశ దీపము పెట్టే సమయములో పఠించవలసిన శ్లోకము

దామోదరాయ నభసి తులాయాండోలయాసహ 

ప్రదీపంతే ప్రయచ్ఛామి నమో అనంతాయ వేధసే ||

తులాయాం తిలతైలేన సాయంకాలే సమాగతే

ఆకాశ దీపం యో దధ్యాత్ మాసమేకం హరింప్రతి |

యాలక్ష్మీ దివసే పుణ్యే దీపావళ్యాశ్చ భూతలే

గవాంగోష్ఠీంచ కార్తిక్యాం సాలక్ష్మీ వరదామమ |

సాయంకాలం దీపము పెట్టే సమయములో పఠించవలసిన శ్లోకములు

శుభం భవతు కళ్యాణీ ఆరోగ్యం ధన సంపదం

మమ శతృ వినాశాయ సాయం జ్యోతిః నమోస్తుతే ||


దీపం జ్యోతిః పరబ్రహ్మ దీపం జ్యోతిః జనార్దన

దీపేన హరతే పాపం సంధ్యా దీపం నమోస్తుతే |


భోః దీపబ్రహ్మ రూపేణ సర్వేషాం హృదిసంస్థితః

అతస్త్వాం స్థాపయామ్యద మదజ్ఞానమపాకురు |

దీపం జ్యోతిః పరబ్రహ్మ దీపం జ్యోతిః నమోనమః

దీపేన హరతే పాపం దీపదేవీ నమోస్తుతే |


దీపం జ్యోతిః పరబ్రహ్మ దీపం సర్వతమోపహం

దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే


సాధ్యం త్రివర్తి సమ్యుక్తం వహ్నినా యోజితాం మయా

గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహం

భక్త్యాదీపం మయాదత్తం గృహాణ పరమేశ్వరీ 

భక్త్యాదీపం ప్రయఛ్ఛామి దేవాయ పరమాత్మనే

ప్రజ్ఞాం ఆయుర్బలం ధైర్యం సంప్రదాయశ్చ వివర్ధనం 

జాతిస్మరత్వం మోక్షస్య దీప దర్శన మాత్రతః 

త్రాహిమాం నరకాదోరాత్ దివ్యజ్యోతిః నమోస్తుతే ||

Tags: Akasha Deepam, Slokam, Karthika Masam, Lord Shiva, Akasha Deepam Slokam

Comments

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు