శివ లింగానికి మీరు అభిషేకం చేసి ఉండొచ్చు , కానీ ఆత్మ లింగానికి అభిషేకం చేశారా? How to perform Shiva Linga Abhishekam?
శివ లింగానికి మీరు అభిషేకం చేసి ఉండొచ్చు , కానీ ఆత్మ లింగానికి అభిషేకం చేశారా?
అన్ని లింగాల కంటే ఆత్మ లింగం శక్తివంతమైనది. అటువంటి ఆత్మ లింగానికి ప్రతిరోజూ అభిషేకం చేసే గొప్ప అవకాశాన్ని ఈశ్వరుడు మనకు ఇచ్చాడు..
ఆ ఆత్మ లింగం ఎక్కడ ఉంది అంటే..
మన రొమ్ము మధ్య భాగంలో మనం స్నానం చేసే సమయంలో చెంబులో నీటిని తీసుకుని ఆ నీటిని పైనుండి రొమ్ము మధ్య భాగంలో పడేటట్లు పోయాలి అలా పోసేటప్పుడు..
'ఓం ఆత్మ లింగాయా నమః' లేదా 'ఓం నమః శివాయ' అని మనస్సులో స్మరణ చేయండి అంతే, మనం ఆత్మ లింగానికి అభిషేకం చేసినట్లు అవుతుంది..
ఇలా ప్రతి రోజూ మీరు స్నానం చేసేటప్పుడు అభిషేకం చేయండి.. మీ మనసు పవిత్రం అవుతుంది..మీ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది..
అన్ని సంపదల కన్నా ఆత్మ సంపద మిన్న. డబ్బు బంగారం ఇళ్ళు పొలాలు వీటి అన్నిటి కన్నా జ్ఞాన సంపద అంటే ఆత్మ సంపద గొప్పది మహాగొప్పది. ఎందుకంటే మనం వున్నా లేకున్నా మనతో పాటు వచ్చేది ఆత్మ సంపద. అంటే జ్ఞాన సంపద. అది ఎంతకీ తరగనిది. ఎంత కావాలంటే అంత పెంచుకొగలిగేది ఆత్మ సంపద.
దీనికి ఎలాంటి పన్నులు (Tax) వుండవు. దొంగల భయం కానీ నిప్పుభయం కానీ నీరు భయంకానీ వుండదు లేదు కూడా. అటువంటి ఆత్మ సంపదకు ఖర్చు లేదు శ్రమ అసలేలేదు. నియమాలు అవసరం వుండవు.
అంతటి గొప్పదైన ఆత్మ సంపదకు చేయాల్సిందల్లా ఒకే ఒక్క పని. అదే శ్వాస మీద ధ్యాస.
గొప్ప గొప్ప వారి పుస్తకాలు చదివి అందులోని సారాంశం గ్రహించి గమనించి ఆచరిస్తే చాలు. ఇది ఎవరైనా చేయవచ్చు. ఎక్కడైనా చేయవచ్చు. ఎప్పుడైనా చేయవచ్చు. లాభాలే లాభాలు. పాపాలు పోతాయి. సమస్యలు రావు. రోగాలు వుండవు.
కావున ఆత్మ జ్ఞాన సంపద కన్నా పవిత్రమైనది ఏది ఈ సృష్టిలో లేదు. మరి ఈరోజే మొదలెడదామా! ఇప్పుడే ఇక్కడే ఈ రోజే!..
Tags: Siva, Lord Shiva, Siva Lingam, Siva Abhisekham, Sivarchana
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment